వీడియో పెట్టి ఫేస్ 'బుక్' అయ్యారు.. | Florida Man Brags About Burglary on Facebook, Lands Him in Jail | Sakshi
Sakshi News home page

వీడియో పెట్టి ఫేస్ 'బుక్' అయ్యారు..

Published Fri, Jun 24 2016 7:32 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

వీడియో పెట్టి ఫేస్ 'బుక్' అయ్యారు.. - Sakshi

వీడియో పెట్టి ఫేస్ 'బుక్' అయ్యారు..

ఫ్లోరిడా: దాదాపు 5లక్షల డాలర్లను దొంగతనం చేస్తూ వీడియో తీసుకున్న ఓ దొంగల ముఠా దాన్ని ఫేస్ బుక్ పోస్ట్ చేసి అడ్డంగా దొరికిపోయింది. ఫ్లోరిడాలోని ఓ బంగారపు షాపులో గత నెల 27న దొంగలు పడి అందినకాడికి దోచుకెళ్లారు.  సరదాగా వాళ్లు ఆ దోపిడీని వీడియో తీసుకుని, ఆ తర్వాత ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశారు.

అయితే ఈ  వీడియోను ఫేస్ బుక్ లో చూసిన పోలీసులు దోపిడికి పాల్పడిన ముగ్గురు దొంగలను గుర్తించారు. వారిలో ఇద్దర్ని అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.  కాగా దాదాపు ఏడు నిమిషాల వ్యవధి  ఉన్న ఈ వీడియోను ఇప్పటివరకు మూడు వేల మంది వీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement