burglary
-
ఒకరు ధర్మాసనంపై.. మరొకరు బోనులో... ఇద్దరు మిత్రుల కథ!
అది 2015. అమెరికాలో ఫ్లోరిడాకు చెందిన ఆర్థర్ నథానియల్ బూత్ దొంగతనం ఆరోపణలపై అరెస్టయ్యాడు. మియామీ–డేడ్ జడ్జి మిండీ గ్లేజర్ ముందు విచారణకు హాజరయ్యాడు. అతన్ని తేరిపార చూసిన జడ్జి, నువ్వు నౌటిలస్ మిడిల్ స్కూల్లో చదివావు కదా ప్రశ్నించారు. దాంతో ఆమెను గుర్తు పట్టిన బూత్ ఒక్కసారిగా భావోద్వేగంతో రోదించాడు. వాళ్లిద్దరూ చిన్ననాటి మిత్రులు మరి! స్కూలు రోజుల్లో బెస్ట్ ఫ్రెండ్స్. కలిసి ఫుట్ బాల్ ఆడేవాళ్లమని, బూత్ తమ స్కూళ్లోకెల్లా ఉత్తమ బాలుడని మిండీ గుర్తు చేసుకున్నారు. ‘బూత్, నిన్నిక్కడ చూడాల్సి వచ్చినందుకు బాధగా ఉంది’ అంటూ విచారం వ్యక్తం చేశారు. ఇకపై మంచి జీవితం గడుపుతాడని ఆశాభావం వెలిబుచ్చారు. కానీ అలా జరగలేదు. బూత్ చోర జీవితమే కొనసాగిస్తూ వచ్చాడు. నగరమంతటా వరుస దొంగతనాలకు పాల్పడ్డాడు. ప్లంబర్ వేషంలో ఓ వృద్ధుడి ఇంట్లో దూరి బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు. వాటర్ ఇన్స్పెక్టర్గా నటించి ఓ ఇంట్లోంచి నగల పెట్టె దొంగిలించాడు. టైరు మారుస్తున్న మహిళ బంగారు గొలుసు లాక్కున్నాడు. ఇవన్నీ చేస్తూ సీసీ కెమెరాలకు దొరికిపోయాడు. ఎట్టకేలకు అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈసారి కోర్టులో జడ్జిగా చిన్నప్పటి నేస్తం కని్పంచలేదు గానీ అతని అరెస్టుతో నాటి ఉదంతం మరోసారి తెరపైకి వచి్చంది. 2015 నాటి కోర్టు ప్రొసీడింగ్స్ వీడియో వైరల్‌గా మారింది. – వాషింగ్టన్ -
కలెక్టర్ ఇంట్లో చోరీ.. ల్యాప్ టాప్ మాయం
సాక్షి, కరీంనగర్: బదిలీపై మరోచోటికి వెళ్లేందుకు సామాన్లు సర్దుకున్న కలెక్టర్ ఇంట్లో చోరీ జరిగింది. ఎన్నికల వేళ బదిలీ అయి అసలే టెన్షన్ లో ఉన్న కరీంనగర్ కలెక్టర్ గోపీ ఇంట్లో దొంగలు పడ్డారు. ల్యాప్ టాప్ తో పాటు కలెక్టర్ కు చెందిన పలు డాక్యుమెంట్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు సీసీ టీపీ ఫుటేజ్ లో బయటపడింది. ఎన్నికల సంఘం తీసుకున్న చర్యల్లో భాగంగా కరీంనగర్ కలెక్టర్ గోపీ బదిలీ అయిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన హైదరాబాద్ లో రిపోర్ట్ చేయాలి. దీని కోసం తన సామాన్లన్నింటిని రెడీ చేసుకుని ఆయన హాయిగా బెడ్ రూమ్ లో నిద్రపోతున్నారు. అర్ధరాత్రి టైమ్ లో దొంగలు వెనుకవైపు గోడ నుంచి కలెక్టర్ బంగ్లా లోపలికి ఎంటర్ అయ్యారు. ఇంట్లో ముందు రూమ్ లో ఉంచిన కలెక్టర్ ల్యాప్ టాప్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉన్న బ్యాగు, మరికొన్ని వస్తువులు దొంగిలించారు. దొంగలే వస్తువులు చోరీ చేసినట్టు సీసీ టీవీలో రికార్ట్ అయింది. ఇరవై నాలుగు గంటలు పోలీసు పహారాలో ఉండే కలెక్టర్ బంగ్లాలో దొంగలు పడడం సంచలనంగా మారింది. చోరీపై కలెక్టర్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మంత్రి బొత్స పీఏ ఇంట్లో చోరీ
విజయనగరం క్రైమ్: రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ పీఏ కమలాకర్ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది. దీనికి సంబంధించి వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక ఉడాకాలనీ ఫేజ్ –3, ఇంటినంబర్ 177లో నివాసముంటున్న మంత్రి బొత్స సత్యనారాయణ పర్సనల్ అసిస్టెంట్ కమలాకర్ వృత్తిరీత్యా విజయవాడ వెళ్లారు. ఆయన సతీమణి అమెరికా పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతం ఇంట్లో కమలాకర్ కుమార్తె, అల్లుడు మాత్రమే ఉంటున్నారు. ఆయన కుమార్తె డాక్టర్ మౌనిక విశాఖ రైల్వేఆస్పత్రిలో వైద్యురాలిగా, అల్లుడు గజపతినగరంలో వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం కమలాకర్ కుమార్తె విశాఖ, అల్లుడు గజపతినగరం వృత్తిరీత్యా వెళ్లారు. శుక్రవారం ఉదయం వారిద్దరూ ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపులు తెరిచి ఇల్లంతా చిందరవందరగా ఉండడాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారమందించారు. దీంతో ఎస్పీ ఎం.దీపిక ఆదేశాలతో క్లూస్ టీమ్, ఫింగర్ ఫ్రింట్స్ ఇన్చార్జ్ డీఎస్పీ టి.త్రినాథ్, సీసీఎస్, వన్‌టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరించారు. ఈ చోరీ సంఘటనలో లక్ష నగదు, రెండు తులాల బంగారం, సుమారు కిలో వెండి వస్తువులు పోయినట్లు గుర్తించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ సీఐ బి.వెంకటరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. (క్లిక్: జర్మనీ అమ్మాయి.. వైజాగ్ అబ్బాయి.. పెళ్లేమో అమెరికాలో) -
హైదరాబాద్: మోస్ట్ వాంటెడ్ దొంగ.. ఆఖరికి ఓ చిన్న తప్పుతో..
సాక్షి, హైదరాబాద్: ‘ఎంత పెద్ద నేరస్తుడైనా ఎక్కడో ఒకచోట చిన్న పొరపాటైనా చేస్తాడు లేదా క్లూ అయినా వదులుతాడని’ పోలీసులు చెబుతుంటారు. ఆఖరికి ఇదే నిజమైంది. ఏడేళ్లుగా మూడు కమిషనరేట్ల పోలీసులను ముప్పుతిప్పులు పెడుతున్న మోస్ట్ వాంటెడ్ దొంగ.. ఆఖరికి ఓ చిన్న పొరపాటుతో పోలీసులకు దొరికిపోయాడు. జిల్లెల్లగూడలోని ఓ ఇంట్లో బంగారం, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ను చోరీ చేసిన గజదొంగ సయ్యద్ సాహిల్... ఆ ఫోన్‌ను తన బావమరిదికి బహుమతిగా ఇచ్చాడు. అది చోరీ ఫోన్ అని తెలియక అతను దాన్ని వినియోగించడం మొదలు పెట్టాడు. అప్పటికే ఫోన్ చోరీ జరిగిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. దాని ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నంబర్‌ను పోలీసులు ట్రాకింగ్‌లో పెట్టారు. సాంకేతిక సాక్ష్యాలను సేకరించిన మీర్‌పేట పోలీసులు.. శనివారం బాలాపూర్ క్రాస్ రోడ్డులో రెక్కీ చేస్తున్న సాహిల్‌ను మాటువేసి పట్టుకున్నారు. వనస్థలిపురం మీర్‌పేట ఇన్స్పెక్టర్ ఎం మహేందర్ రెడ్డి, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డిలతో కలిసి ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. ఆరేళ్లుగా అన్నదమ్ముల ఆటలు.. చాంద్రాయణగుట్ట షాహీన్‌నగర్‌కు చెందిన సయ్యద్ మొహమ్మద్, సయ్యద్ సాహిల్‌లు అన్నదమ్ములు. ఆరేళ్లుగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీసులకు చిక్కకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. 2015లో గోల్కొండ పీఎస్ పరిధిలో వీరిపై తొలి కేసు నమోదయింది. అప్పట్నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 33, సైబరాబాద్‌లో 8, రాచకొండ కమిషనరేట్‌లో 9 వీరిపై మొత్తం 50 కేసులున్నాయి. గతంలో వీరిని మీర్‌పేట, గోల్కొండ, లంగర్‌హౌస్, బంజారాహిల్స్, ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, నార్సింగి, రాయదుర్గం, రాజేంద్రనగర్, కొత్తూరు పీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. గతేడాది డిసెంబర్లో జైలు నుంచి విడుదలైన సయ్యద్ సాహిల్.. మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టాడు. గడిచిన మూడు నెలల్లో సాహిల్ బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో, మీర్‌పేటలో ఏడు చోరీలకు పాల్పడ్డాడు. చదవండి: జ్వరం గోలీకి ధరల సెగ! రాత్రి 7 నుంచి 11 గంటల మధ్యే చోరీలు.. చోరీ చేయడంలో సాహిల్ స్టైలే వేరు. ఉదయం పూట బైక్ మీద రెక్కీ నిర్వహించి, రాత్రి 7 నుంచి 11 గంటల మధ్య మాత్రమే దొంగతనాలు చేస్తుంటాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంపిక చేసుకొని, రాత్రి వేళలో వెంట తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్, ఇనుప రాడ్‌తో ఇంటి ప్రధాన ద్వారాన్ని తెరుస్తాడు. ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలు, నగదు ఎలక్ట్రానిక్ వస్తువులతో పరారవుతాడు. చోరీ చేసిన సొత్తులో కొంత భాగం ఇంట్లో దాచిపెట్టుకోగా.. మిగిలిన దాన్ని బంగారం దుకాణాలు, పాన్ బ్రోకర్లు, మణప్పురం ఫైనాన్స్ వంటి వాటిల్లో తాకట్టు పెడతాడు. ఇలా చిక్కిపోయాడు.. బాలాపూర్ క్రాస్‌రోడ్స్‌లో శనివారం ఉదయం అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న మీర్‌పేట సీఐ మహేందర్ రెడ్డి, డీఐ శేఖర్ రంగంలోకి దిగారు. సాహిల్‌ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. మొహమ్మద్ పరారీలో ఉన్నాడు. నిందితుడి నుంచి 81.2 తులాల బంగారం, 2.45 తులాల వెండి ఆభరణాలతో పాటు ల్యాప్‌టాప్, బైక్, స్క్రూ డ్రైవర్, ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నారు. -
ఈ ఖైదీ మామూలోడు కాదండోయ్.. వయసు 26.. వందకు పైగా కేసులు
సాక్షి, ఆరిలోవ (విశాఖ తూర్పు): తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్..పోలీసులకు ముచ్చెమటలు పట్టించే గజ దొంగ..వయసు కేవలం 26..వందకు పైగా కేసులు...రెండు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఎట్టకేలకు 2020లో విశాఖ పోలీసులకు చిక్కాడు. కోర్టు శిక్ష విధించింది. 2022 జూన్ 8 నుంచి విశాఖ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. కట్ చేస్తే మళ్లీ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారాడు. అనకాపల్లి కోర్టుకు వాయిదా కోసం వెళ్లి తిరిగి సెంట్రల్ జైలుకు తీసుకొచ్చిన ఎస్కార్ట్ పోలీసులు కన్ను కప్పి పరారయ్యాడు. ఇది చిత్తూరు ఖైదీ కథ.. చిత్తూరు జిల్లా వడ్డిపల్లి గ్రామానికి చెందిన బత్తుల ప్రభాకర్ రెండు రాష్ట్రాల్లో 100కి పైగా చోరీ కేసుల్లో నిందితుడు. చిత్తూరు జిల్లాతో పాటు విశాఖ, పశ్చమ గోదావరి జిల్లాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. తాళాలు వేసిన ఇళ్లను దోచుకోవడం ప్రభాకర్‌కు వెన్నతోపెట్టిన విద్య. అందుకే ఇళ్లల్లోకి వెళ్లి బంగారం, నగదు, విలువైన వస్తువులు పట్టుకుపోయినా ఎవ్వరి కంటా పడేవాడుకాదు. ఇలా కొన్నేళ్లపాటు తనకు ఎదురులేకుండా పోయింది. రెండు రాష్ట్రాల పోలీసులకు కొరకురాని కొయ్యగా తయారయ్యాడు. 2020 నుంచి శిక్ష అనుభవిస్తూ... ప్రభాకర్ 2020లో విశాఖ పోలీసులు ఎట్టకేలకు ప్రభాకర్‌ను అరెస్టు చేశారు. 2020 సెప్టెంబరు 8 నుంచి విశాఖ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. శిక్ష అనుభవిస్తూనే రిమాండ్ ముద్దాయిగా కోర్టు వాయిదాలకు ఎస్కార్ట్ పోలీసులు హాజరుపరుస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 23న ప్రభాకర్‌ను అనకాపల్లి కోర్టుకు తీసుకువెళ్లి తిరిగి రాత్రి 8 గంటలకు విశాఖ సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. ఎస్కార్ట్ వాహనం దిగి పరారయ్యాడు. చీకటి కావడంతో పోలీసులు ఆయన వెంట పరిగెత్తినా దొరకలేదు. దీంతో మరో కేసు ప్రభాకర్‌పై నమోదైంది. చదవండి: ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఎఫెక్ట్..పెరిగిన టిఫిన్ ధరలు -
వైరల్: దొంగతనానికి వచ్చి.. ఆకలేయడంతో వంటగదిలో కిచిడీ వండుతూ..
గువాహటి: రోజురోజుకీ దొంగతనం కేసులు ఎక్కువైపోతున్నాయి. తాళం వేసి ఉన్న ఇళ్లు కంట పడితే చాలు ఖాళీ చేసేస్తున్నారు. అయితే దొంగతనానికి వచ్చిన వారు చప్పుడు చేయకుండా సైలెంట్‌గా పని కానిచేస్తారు. కానీ ఓ దొంగ మాత్రం కన్నం వేసిన ఇంట్లో వంట వండుకుంటూ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఈ విచిత్ర ఘటన అస్సాం రాష్ట్రంలోని గువాహటిలో చోటుచేసుకుంది. ఈ దొంగతనానికి సంబంధించి పోలీసులు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హెంగెరాబారి ప్రాంతంలోని ఓ ఇంటికి తాళం వేసి ఉండటంతో విలువైన వస్తువులు దొంగిలించేందుకు దొంగ లోపలికి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ మూటగట్టాడు. అయితే ఇంతలోనే దొంగకు ఆకలి వేయడంతో కిచెన్‌లోకి వెళ్లి కిచిడీ వండుకోవటం మొదలుపెట్టాడు. కానీ వంట చేసే సమయంలో సౌండ్స్ రావడం అతని కొంప ముంచింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో వంటింటి నుంచి శబ్దాలు రావడం పక్కింటి వారికి అనుమానం కలిగించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు తాపీగా కిచిడీ వండుకుంటున్న దొంగను పట్టుకున్నారు. చదవండి: వైరల్ వీడియో: ప్యాంట్‌పై బురద, ఊగిపోతూ ఏం చేసిందంటే.. కాగా ఈ దొంగతనం ఘటన సోమవారం చోటుచేసుకోగా ఈ విషయాన్ని అస్సాం పోలీసులు చమత్కారంగా ట్వీట్ చేశారు. ‘కిచిడీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ, దొంగతనం చేసే సమయంలో కిచిడీ వండటం ఆరోగ్యానికి హానికరం. దొంగను అరెస్ట్ చేశాం. గువాహటి పోలీసులు అతనికి వేడి వేడి భోజనం అందిస్తున్నారు" అంటూ ట్వీట్ చేశారు. పోలీసులు చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. చదవండి: RIP Magawa: ‘చిట్టి హీరో’ అస్తమయం The curious case of a cereal burglar! Despite its many health benefits, turns out, cooking Khichdi during a burglary attempt can be injurious to your well being. The burglar has been arrested and @GuwahatiPol is serving him some hot meals. pic.twitter.com/ehLKIgqcZr — Assam Police (@assampolice) January 11, 2022 -
35 ఏళ్లుగా.. 500 దొంగతనాలు.. రూ.5 కోట్లతో ఎంజాయ్
భువనేశ్వర్: మూడు దశాబ్దల నుంచి వందల కొద్ది దొంగతనాలు చేశాడు.. దోపిడీ చేసిన సొమ్ముతో.. విలాసవంతమైన జీవితం గడపడానికి అలవాటుపడ్డ ఓ దొంగను ఒడిశా పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. క్రౌబర్ మ్యాన్‌గా ప్రసిద్ధి చెందిన సదరు వ్యక్తి 35 ఏళ్లుగా దొంగతనాలకు పాల్పడుతూ.. సుమారు ఐదు కోట్ల రూపాయల సొమ్ము దోపిడీ చేశాడు. పోలీసులకు చిక్కడం.. జైలుకు వెళ్లడం.. విడుదలయ్యాక మళ్లి దొంగతనాలు చేయడం అతడికి పరిపాటిగా మారింది. ఈ క్రమంలో సోమవారం మరోసారి అరెస్ట్ అయ్యాడు. ఒడిశాకు చెందిన హేమంత్ దాస్ ‘క్రౌబర్ మ్యాన్’గా ప్రసిద్ధి చెందాడు. అతడు 1986 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇప్పటి వరకు 500 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు. మొత్తం 4-5 కోట్ల రూపాయలు దోచుకున్నాడు. దోపిడీ చేసిన సొమ్ముతో విలాసవంతమైన జీవితం గడిపేవాడు. (చదవండి: 30 ఏళ్ల నేర చరిత్ర 160 చోరీలు, 22 సార్లు అరెస్టు.. ఇది మనోడి ట్రాక్ రికార్డ్) హేమంత్ దాస్ భువనేశ్వర్‌లోని బీజేబీ కాలేజీలో చదువుతుండగా.. మొదటి సారి 1980లో ఓ వివాదంలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లాడు. అక్కడ అతడికి ఓ దొంగతో పరిచయం ఏర్పడింది. అతడి వద్ద నుంచి దొంగతనాలకు సంబంధించి మెలకువలు నేర్చుకున్నాడు హేమంత్ దాస్. 1986 నుంచి, హేమంత్ ఒక ప్రొఫెషనల్ దొంగగా మారాడు. అతను ఒడిశాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక దొంగతనాలకు పాల్పడ్డాడు. ఒక్క భువనేశ్వర్‌లో మాత్రమే 100పైగా దొంగతనాలు చేశాడు. మొత్తం 500కి పైగా కేసులలో అతని ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు. (చదవండి: భారీ చోరీ.. ఆనందంతో దొంగకు గుండెపోటు) ప్రస్తుతం కటక్‌లో చోరీకి పాల్పడుతుండగా హేమంత్ దాస్‌ని అరెస్టు చేశారు. అంతకుముందు, 2018 లో భువనేశ్వర్‌లో స్పెషల్ స్క్వాడ్ అతనిని అరెస్టు చేసింది. పోలీసుల ప్రకారం, 2020లో పూరీలో జరిగిన రెండు దొంగతనాల కేసులకు సంబంధించి మరోసారి అరెస్టయ్యాడు. ఈ సంవత్సరం జూలైలో విడుదలయ్యాడు. తాజాగా మరోసారి అరెస్ట్ అయ్యాడు ఈ సందర్భంగా భువనేశ్వర్ డీసీపీ మాట్లాడుతూ, "హేమంత్ ఎక్కువగా నగదును దొంగిలించేవాడు. గ్యాంగ్‌టక్, సిమ్లా, జమ్మూ కశ్మీర్‌తో సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎంజాయ్ చేయడానికి వెళ్లేవాడు. ప్రజల ఇళ్లలోకి చొరబడేందుకు అతను సాధారణ సాధనాన్ని ఉపయోగించినందున అతడిని 'క్రౌబర్ మ్యాన్' అని పిలుస్తారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన మరికొన్ని చోరీ కేసుల్లో హేమంత్ ప్రమేయం ఉందో తెలుసుకునేందుకు అతడిని విచారిస్తున్నామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. చదవండి: బతుకు ఆగం జేసిన బొమ్మ తుపాకీ! 30 ఏళ్లు జైల్లో.. -
దొంగతనానికి వెళ్లి యువతి పక్కన నగ్నంగా...
కాలిఫోర్నియా : అమెరికాలో ఓ దొంగ వింతగా ప్రవర్తించి పోలీసులకి అడ్డంగా దొరికిపోయాడు. ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లిన యువకుడు.. అదే ఇంట్లో గాఢ నిద్రలో ఉన్న యువతి పక్కగా నగ్నంగా నిద్రపోయాడు. ఈ వింత ఘటన నార్త్ కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దొంగను అరెస్ట్ చేశారు. వివరాలు.. చికో స్టేట్ యూనివర్సీటీకి చెందిన 21 ఏళ్ల విద్యార్థిని నార్త్ కాలిఫోర్నియలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. ఈ నెల 9న అర్థరాత్రి ఓ యువకుడు ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు అన్ని దొంగిలించాడు. అనంతరం బెడ్రూంలోకి వెళ్లి గాఢ నిద్రలో ఉన్న యువతి పక్కన నగ్నంగా నిద్రపోయాడు. ఉదయం నిద్రలేచిన యువతి నగ్నంగా ఉన్న యువకుడిని చూసి గట్టిగా అరిచింది. దీంతో యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చికో పోలీసులు విచారణ చేపట్టి యువకున్ని అరెస్ట్ చేశారు. సీసీ కెమెరాల ద్వారా యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడని, కానీ నగ్నంగా ఎందుకు నిద్రపోయాడో ఇంతవరకూ తెలపడం లేదని పోలీసులు పేర్కొన్నారు. -
అతను పెద్ద టిక్‌టాక్ స్టార్.. కానీ అరెస్టయ్యాడు!
ముంబై: అభిమాన్యు గుప్తా.. స్థానికంగా టిక్‌టాక్‌లో పెద్ద స్టార్. అతనికి టిక్‌టాక్‌లో 9.18 లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు. రోజుకో షార్ట్ వీడియో పెట్టనిదే అతను నిద్రపోడు. కానీ, అతన్ని ముంబై పోలీసులు ఇటీవల ఆకస్మికంగా అరెస్టు చేశారు. అరెస్టు చేయడమే కాదు.. తీరిక వేళల్లో టిక్‌టాక్ వీడియోలు చేసి.. అలరించే అభిమాన్యు అసలు గుట్టు ఏంటో రట్టు చేశారు. అసలు రాత్రివేళలో చోరకళను అనుసరిస్తూ.. ఇళ్లకు కన్నంవేస్తూ.. భారీగా లూటీ చేస్తాడని, ఉదయం మాత్రం బుద్ధిమంతుడిగా షార్ట్ వీడియోలు చేసి.. జనాలను అలరిస్తాడని పోలీసులు వెల్లడించారు. అతడిపై ఇప్పటికే నాలుగు ఐదు దొంగతనం కేసులు ఉన్నాయని తెలిపారు. జనవరి 19న తమ ఇంట్లో చోరీ జరిగిందని, 150 గ్రాముల బంగారం, మొబైల్ ఫోన్ మొత్తం రూ. 4.75 లక్షల విలువైన సొత్తు అపహరణ గురైందని ఓ వృద్ధ దంపతుల జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆ దంపతులు ఉండే భవనంలో అమర్చిన సీసీటీవీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. మొదట చూసిన సీసీటీవీ దృశ్యాల్లో అంత స్పష్టంగా దొంగ ఎవరన్నది కనిపించలేదు. దీంతో మరింత లోతుగా ఆ దృశ్యాలను పరిశీలించి.. మానవ అవగాహనతో విశ్లేషించగా.. అసలు దొంగ అభిమాన్యు గుప్తానని తేలింది. దీంతో గత నెల 28న కుర్లాలో అతన్ని అరెస్టు చేసి.. పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. మొదట విచారణలో అతడు దొంగలించిన సొత్తు ఏమైందన్నది తెలియలేదు. కానీ, రోజుల తరబడి విచారించగా.. దొంగలించిన సొమ్మును తన స్నేహితులకు ఇచ్చానని, దొంగతనం చేసిన మాట వాస్తవమేనని అంగీకరించాడు. దీంతో, అతని స్నేహితుడి వద్ద నుంచి బంగారం, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఇవి తన భార్య నగలు, అభరణాలని, కొన్నిరోజుల వరకు భద్రపరచాలని తనకు ఇచ్చాడని అభిమాన్యు స్నేహితుడు పోలీసులకు చెప్పుకొచ్చాడు. అభిమాన్యు గుప్తా వరుసగా దొంగతనాలకు పాల్పడుతూ వస్తున్నాడని, అతని మీద నాలుగు నుంచి ఐదు కేసులు ఉన్నాయని పోలీసు అధికారి హరి బిరాదర్ తెలిపారు. -
కడుపుబ్బ నవ్విస్తున్న దొంగల వీడియో.. రికార్డ్ వ్యూస్!
బీజింగ్: ఇద్దరు దొంగలు చోరీ కోసం వెళ్లి విఫలమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తోంది. చివరికి నాటకీయ పరిస్థిత్తుల్లో దొంగలు అక్కడి నుంచి బయటపడ్డారు. చైనాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులు స్వయంగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. షాంఘైలో ఫిబ్రవరి 14న అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు చోరికి వెళ్లారు. మాస్కులు ధరించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న దొంగలు చోరీ యత్నం చేయకముందే తీవ్ర ఇబ్బందులపాలు కావడం నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తోంది. గ్లాస్ డోర్ పగలకొట్టేందుకు తొలుత ఓ దొంగ ఇటుకలతో కొట్టాడు. చోరీకి వచ్చిన రెండో వ్యక్తి ఇటుకను తీసుకుని గ్లాస్ డోరు వైపు బలంగా విసరగా మొదటి దొంగకి గట్టిగా తాకడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తన పొరపాటు గమనించిన రెండో వ్యక్తి తన పార్ట్నర్ను అక్కడినుంచి పక్కకు తీసుకెళ్లాడు. 'ఇలాంటి దొంగలున్నంత కాలం పోలీసులు ఓవర్ టైమ్ డ్యూటీ చేయాల్సిన పనిలేదంటూ' షాంఘై పోలీసులు కామెంట్ చేస్తూ సీసీటీవీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా 24 గంటలు గడవకముందే కోటిన్నర మంది నెటిజన్లు వీక్షించారు. రికార్డ్ వ్యూస్ వచ్చిన దొంగల వీడియో.. -
కడుపుబ్బ నవ్విస్తున్న దొంగల వీడియో
-
వీడియో పెట్టి ఫేస్ 'బుక్' అయ్యారు..
ఫ్లోరిడా: దాదాపు 5లక్షల డాలర్లను దొంగతనం చేస్తూ వీడియో తీసుకున్న ఓ దొంగల ముఠా దాన్ని ఫేస్ బుక్ పోస్ట్ చేసి అడ్డంగా దొరికిపోయింది. ఫ్లోరిడాలోని ఓ బంగారపు షాపులో గత నెల 27న దొంగలు పడి అందినకాడికి దోచుకెళ్లారు. సరదాగా వాళ్లు ఆ దోపిడీని వీడియో తీసుకుని, ఆ తర్వాత ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశారు. అయితే ఈ వీడియోను ఫేస్ బుక్ లో చూసిన పోలీసులు దోపిడికి పాల్పడిన ముగ్గురు దొంగలను గుర్తించారు. వారిలో ఇద్దర్ని అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. కాగా దాదాపు ఏడు నిమిషాల వ్యవధి ఉన్న ఈ వీడియోను ఇప్పటివరకు మూడు వేల మంది వీక్షించారు. -
ఇంట్లో నిఘా
- రఘునాథపల్లి ఘటనతో అప్రమత్తమైన ప్రజలు - పోలీసుల సూచనలతో జాగ్రత్త చర్యలు - సీసీ కెమెరాల ఏర్పాటుకు శ్రీకారం నర్సంపేట : జిల్లాలో జరుగుతున్న చోరీలు, దోపిడీలు పోలీసులకు సవాల్‌గా మారాయి. రఘునాథపల్లిలో దొంగలు దోపిడీ చేయడమేగాక ముగ్గురిని హత్య చేసిన సంఘటన రాష్ట్రస్థాయిలో సంచలనం సృష్టించింది.ఈ ఘటన తర్వాత జిల్లా ప్రజల్లో భయాందోళన మొదలైంది. దొంగల భయంతో కంటి మీద కునుకు లేకుండాపోతోంది. దుకాణ సముదాయాలు, నివాసాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు పదేపదే చెబుతున్నా... వ్యాపారులు, బడా వ్యక్తులు ఇన్నాళ్లూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. రఘనాథపల్లిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించిన నేపథ్యంలో పలువురు సొంత నిఘాపై దృష్టిసారించారు. సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకుంటే దొంగలను గుర్తించడంతోపాటు చోరీ జరిగిన సొత్తు రికవరీ అయ్యే అవకాశం ఉండడం తో.. ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. కొందరు బడా వ్యక్తులు ఇంట్లో, దుకాణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అందుబాటులోకి నిఘా నేత్రాలు.. లక్షలు వెచ్చించి ఇళ్లు నిర్మించుకుంటున్న వారు రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. సుమారు రూ.20 వేలు వెచ్చిస్తే వుూడు కెమెరాల తో నిఘా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండటం తో ఇప్పుడిప్పుడే పలువురు కెమెరాల కొనుగోలు పై ఆసక్తి చూపుతున్నారు. నర్సంపేటలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో రెండు నెల లుగా పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వారి సూచనలతో చాలావుంది గృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సీసీ కెమెరాలతోపాటు ఇంటి తలుపులను తాకగానే మోగే అలారం, విద్యుత్తు ఫెన్సింగ్‌నూ ఏర్పాటు చేసుకుంటే వుంచిదని.. తద్వారా 50 శాతం మేర చోరీలు తగ్గుతాయుని పోలీసులు సూచిస్తున్నారు. అంతర్ జిల్లా ముఠా సంచరిస్తోందా.. ? జిల్లాలో చిన్నచిన్న దొంగతనాలు సాధారణం కా గా రెండు రోజుల క్రితం రఘునాథపల్లిలో హోటల్లో జరిగిన సంఘటనలో ముగ్గురి ప్రాణాలు కోల్పోవడం చూస్తే పార్థీ ముఠా సంచరిస్తున్నట్లు అనువూనాలు కలుగుతున్నాయి. ఈ హోటల్ యజమాని నర్సింహులు తండ్రి చనిపోవడంతో గురువారం జరిగిన ఐదో రోజు కార్యక్రమానికి కుటుంబీకులంతా తాళం వేసి రఘునాథపల్లిలోని ఇంటికి వెళ్లిపోయారు. రాత్రయ్యాక హోటల్‌కు చేరుకున్నారు. అయితే దోపిడీ దొంగలు పగలు హోటల్‌కు తాళం వేసి ఉండడం చూసి దోపిడీకి వ చ్చి ఉంటారని, లోపల వృద్ధులు, చిన్నారులు ఉండడంతో దాడికి పాల్పడి ఉంటారని తెలుస్తోంది. దీన్నిబట్టి పగలు రెక్కీ నిర్వహించి రాత్రి దోపిడీకి పాల్పడుతున్నట్లు అర్థమవుతోంది. -
శంషాబాద్‌లో భారీ దోపిడీ
-
శంషాబాద్‌లో భారీ దోపిడీ
శంషాబాద్ మండలం పెద గోల్కొండ వద్ద భారీదోపిడీ జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తొమ్మిది మంది సభ్యులున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్చల్ సృష్టించింది. నిద్రపోతున్నవాళ్లను లేపి, కుటుంబ పెద్దను బంధించి, కత్తులు చూపించి ఇంట్లోని నగలు, నగదు మొత్తం దోచుకెళ్లారు. నలుగురు దొంగలు బయటే కాపలా ఉండగా, మరో ఐదుగురు మాత్రం ముసుగులతో లోపలకు ప్రవేశించారు. ఇంట్లో ఉన్నవాళ్లను కత్తులతో బెదిరించి, దాదాపు 50 తులాల వరకు బంగారం, వెండి తీసుకెళ్లారు. దాంతో పాటు ఇంట్లో ఉన్న బీరువాలు, కప్‌బోర్డులు కూడా పగలగొట్టి.. లోపలున్న దాదాపు 50 వేల రూపాయల నగదు కూడా ఎత్తుకెళ్లారు. వరుసగా జరుగుతున్న దోపిడీలు ఈ ప్రాంతవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. దొంగలు మారణాయుధాలు తీసుకుని రావడం, చంపుతామని బెదిరించడంతో బాధితులు ముందుగానే తమ వద్ద ఉన్న సొత్తు అంతటినీ అప్పగించేశారు. కొసమెరుపు: దొంగలు తాము తీసుకెళ్లిన బంగారం నిజమైనదో కాదో తెలుసుకోడానికి గీటురాళ్లు కూడా వెంట తెచ్చుకున్నారు. పెద గోల్కొండలోని ఇంటినుంచి తీసుకెళ్లిన నగల్లో ఓ వడ్డాణం బంగారంది కాదని తెలియడంతో వాళ్లు దాన్ని ఊరి శివార్లలో పారేసి వెళ్లిపోయారు!! -
ఔనా..! చోరీ చేశారా..
ఈపూరు, న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ప్రముఖ బంగారు ఆభరణాల దుకాణంలో జరిగిన భారీ చోరీ కేసులో మండల కేంద్రం ఈపూరుకు చెందిన ఇద్దరు యువకులు నిందితులని ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న ఇక్కడి ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. అంతటి భారీ చోరీ చేసింది మా ఊరి యువకులా అంటూ వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. టాటా ఎంటర్‌ప్రైజస్‌కు చెందిన హైదరాబాద్ పంజాగుట్టలోని తనిష్క్ జువెలర్స్‌లో శుక్రవారం అర్ధరాత్రి సుమారు 23 కోట్లరూపాయల విలువైన బంగారు ఆభరణాలు దొంగలపాలయ్యాయి. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే ఈ చోరీని తానే చేశానంటూ కిరణ్‌కుమార్ అనే యువకుడు ప్రకటించడంతో పోలీసులు ఖంగుతిన్నారు. ఈపూరుకు చెందిన కిరణ్‌కుమార్ మరొకరితో కలిసి ఈ చోరీకి పాల్పడ్టట్టు వార్తలు వెలువడడంతో ఆ గ్రామ ప్రజలు ఒకింత కలవరపాటుకు గురయ్యారు. నిన్న, మొన్నటి వరకు గ్రామస్తులతో కలిసి తిరిగిన భూమన కిరణ్‌కుమార్, గంటినపాటి ఆనంద్‌లు చోరీ కేసులో కీలకపాత్ర పోషించారంటే నమ్మలేకపోతున్నామని అంటున్నారు. పిలిస్తేనే పలికే వారిద్దరు భారీ దొంగతనానికి ఒడిగట్టడానికి ఎలాంటి కారణాలు దారితీసివుంటాయనే దిశగా గ్రామస్తులు చర్చించుకోవడం మొదలు పెట్టారు. ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లారు.. ఈపూరు మాలపాడుకు చెందిన యువకులు భూమన కిరణ్‌కుమార్, గంటినపాటి ఆనంద్‌లు ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లారు. పెయింటర్‌గా పనిచేసే కిరణ్‌కుమార్‌ను ఇక్కడ అంతా వివాదరహితుడిగా చెపుతున్నారు. తల్లి అన్నపూర్ణమ్మ కూరగాయలు అమ్ము తుంటారు. తల్లిదండ్రుల ఐదుగురు సంతానంలో పెద్ద కుమారుడు రవీంద్ర గుంటూరులోని సిమ్స్‌లో పని చేస్తున్నారు. రెండో కుమారుడు రాజు హైదరాబాద్‌లో పెయింటర్‌గా జీవిస్తున్నారు. మూడో కుమారుడు ఆశోక్చక్రవర్తి మాచర్లలోని ప్రభుత్వ వైద్యశాలలో కాంట్రాక్టు ఉద్యోగి కాగా, ఐదవ కుమారుడు ప్రదీప్‌కుమార్ ఇంటి వద్దనే ఉంటున్నారు. నాల్గవ కుమారుడైన కిరణ్‌కుమార్ తనిష్క్ జువెలర్స్‌లో భారీ చోరీ చేయడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏనాడూ ఈపూరు పోలీసు స్టేషన్ మెట్లు కూడా ఎక్కలేదంటున్నారు. అతని బంధువు ఆనంద్ జనవరి 1న హైదరాబాద్ వెళ్ళినట్టు చెబుతున్నారు. అయితే ఆనంద్‌కు మతిస్థిమితం సరిగా ఉండదని చెపుతున్నారు. వికలాంగుడైన ఆనంద్ చోరీ కేసులో ఉండడాన్ని నమ్మలేకపోతున్నామని అంటున్నారు. ఆనంద్ తండ్రి శామ్యూల్ తాపీ మేస్త్రీగా పని చేస్తున్నారు. స్థానికంగా మిర్చిబస్తాలు మోసే కూలీగా పనిచేసిన కిరణ్ తండ్రి 2011లో పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యునిగా గెలుపొందారు. ఆ తరువాత గుండెపోటుతో మరణించారు. టీడీపీలో కలకలం ‘తనిష్క్’ జువెలర్స్‌లో చోరీకి పాల్పడి పోలీసుల ఎదుటకొచ్చిన భూమన కిరణ్‌కుమార్ వ్యవహారం జిల్లా టీడీపీ శ్రేణుల్లో కలకలానికి దారితీసింది. వినుకొండ నియోజకవర్గం మండల కేంద్రం ఈపూరుకు చెందిన కిరణ్ స్థానికంగా టీడీపీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్నాడు. అతని తండ్రి 2011లో టీడీపీ తరఫున పంచాయతీ వార్డు సభ్యునిగా పనిచేస్తూ గుండెపోటుతో మరణించారు. ప్రస్తు తం కిరణ్ మేనమామ కూడా ఆ పార్టీ తరఫున క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమపార్టీకి చెందిన కార్యకర్త భారీ చోరీ కేసులో నిందితుడవడంపై నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటి కే జిల్లాలో సీనియర్ టీడీపీ నేతలు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో పాటు అదే పార్టీకి చెందిన పలువురు నేతలు క్రిమినల్ కేసుల్లో ఉండడం, రానున్న ఎన్నికల్లో ఓటింగ్‌ను దెబ్బతీసే అంశాలుగా పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. తాజాగా, దోపిడీ కేసులో ప్రధాన నేరస్తునిగా ప్రకటించుకున్న కిరణ్.. నేటి రాజకీయాల్లో తాను దగ్గరగా చూసిన నేతల అవినీతి, దోపిడీని ప్రస్తావించడం టీడీపీ నేతలకు మరింత షాక్‌నిస్తోంది. -
ఉద్యోగాలు సాఫ్ట్... మనుషులు హార్డ్!
ఒకప్పుడు చేతినిండా సంపాదన.. విలాసవంతమైన కార్లలో తిరగడం, వారానికి ఐదు రోజులే పనిచేయడం, ఆ పైన హాయిగా రెండు రోజుల పాటు ఫుల్లు జోష్!! విలాసాలు ఎక్కువయ్యేకొద్దీ సంపాదన సరిపోదు. దాంతో ఏదోలా అదనపు సంపాదన కోసం ప్రయత్నాలు మొదలుపెడతారు. ముందుగా గుర్తుకొచ్చేది చిన్న చిన్న ఆన్లైన్ మోసాలు లేదా మరీ అవసరాలు ఎక్కువైన పక్షంలో దొంగతనాలకు పాల్పడటం. ఇదీ కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల తీరు. పబ్బుల్లో తిరగడంతో పాటు కొంతమందయితే డ్రగ్స్‌కు కూడా అలవాటు పడుతున్న వైనాలు ఇటీవలి కాలంలో బాగా బయటపడుతున్నాయి. సెల్ఫోన్ల చోరీ నుంచి మోటారు సైకిళ్ల దొంగతనాలు, చివరకు ఇళ్లల్లో దోపిడీలకూ పాల్పడుతున్నారు. చదువుకున్నారన్న మాటే గానీ, ఆ పెద్ద పెద్ద చదువులు వాళ్ల వ్యక్తిత్వ వికాసానికి ఏమాత్రం ఉపయోగపడకపోగా.. అవసరాలను రోజురోజుకూ పెంచేసి, వక్రమార్గాలు పట్టిస్తోంది. ఇలాంటి సంఘటనలు హైదరాబాద్‌లో గతంలో కొన్ని వెలుగుచూశాయి. ఓ యువకుడైతే వరుసగా కేవలం స్మార్ట్ఫోన్లను మాత్రమే దొంగిలిస్తూ.. వాటిని మళ్లీ నల్లబజారులో అమ్మేసి ఆ డబ్బుతో తమ్ముడిని ఎంబీఏ చదివించి, చెల్లెలికి పెళ్లి చేసి, భర్త చనిపోయిన అక్కతో ఓ చిన్న వ్యాపారం పెట్టించి, ఆమెకు స్కూటర్ కొనిచ్చి, తాను మొత్తం కుటుంబంతో కలిసి తిరగడానికి ఓ స్కోడా కారు కూడా కొనుక్కున్నాడు. ఆబిడ్స్ - కోఠి - సుల్తాన్ బజార్.. ఇలా కేవలం రద్దీ ప్రాంతాలు మాత్రమే అతడి కార్యక్షేత్రాలు. బస్సుల్లో గానీ, రోడ్ల మీదగానీ ప్రమత్తంగా ఉండే వాళ్ల నుంచి చాకచక్యంగా స్మార్ట్ఫోన్లు కొట్టేయడం, వెంటనే సిమ్‌కార్డు తీసేసి జాగ్రత్తగా వాటిని ఎవరికీ దొరక్కుండా నల్లబజారులో అమ్మేసి సొమ్ము చేసుకునేవాడు. మొదట్లో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసినా.. తర్వాత అందులో సంపాదన ఏమాత్రం సరిపోకపోవడంతో ఇలాంటి దొంగతనాలకు పాల్పడ్డాడు. తాజాగా దేశ రాజధానిలో కూడా ఇలాంటి తతంగం ఒకటి బయటపడింది. ఓ కంప్యూటర్ ఇంజనీరు, ఇద్దరు రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో సహా ఆరుగురు కలిసి ఓ వ్యాపారిని దోచుకోగా, వాళ్లను పోలీసులు పట్టుకున్నారు. రషీద్ (29), పునీత్ (31), మహ్మద్ షఫీక్ (26), దనీష్ (28), మహేందర్ యాదవ్ (22), అశుతోష్ (28) అనే ఈ ఆరుగురూ రాజధాని ఢిల్లీ వదిలిపెట్టి పారిపోడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు పసిగట్టి, వాళ్లు దాగున్న చోటు గాలించి పట్టుకుని మరీ అరెస్టుచేశారు. ఈనెల 22వ తేదీన వీళ్లంతా కలిసి దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ -౩ ప్రాంతంలో గల అశోక్ కుమార్ రకియాన్ అనే వ్యాపారి ఇంటికి వెళ్లారు. తుపాకి చూపించి ఆయన్ను బెదిరించి, లక్షలాది రూపాయల విలువైన నగలు, 10 లక్షల రూపాయల నగదు దోచుకున్నారు. పోలీసులకు పట్టుబడిన తర్వాత మొదట మొరాయించినా, తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి మొత్తం కక్కేశారు. తమ కుటుంబ అవసరాలకు సరిపడ సంపాదన లేకపోవడంతో తామందరికీ దొంగతనాలు అలవాటైపోయాయని, అందుకే ఈసారి కూడా అలాగే చేశామని చెప్పేశారు. తమ దగ్గర కత్తులు, నాటు తుపాకులు ఉన్నాయని, వాటిని ఎప్పుడూ తీసుకెళ్తుంటామని.. దొంగతనాల సమయంలో ఎవరైనా మరీ మొండికేస్తే వాటిని ఉపయోగించడానికి కూడా వెనకాడబోమని చెప్పారు. వీళ్లలో అశుతోష్ కంప్యూటర్ ఇంజనీర్ కాగా, రషీద్, పునీత్ అనేవాళ్లు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు. వీళ్ల దగ్గర ఆయుధాలతో పాటు వారు దోచుకున్న నగలు, నగదు మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
నూతక్కిలో చోరీ: రూ.2 లక్షల నగదు మాయం
మంగళగిరి మండలం నూతక్కి గ్రామంలో గత అర్థరాత్రి ఓ ఇంట్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. దాంతో బాధితులు ఆదివారం మంగళగిరి పోలీసులను ఆశ్రయించారు. రూ.2 లక్షల నగదు, 10 సవర్ల బంగారంతోపాటు యూఎస్ డాలర్లను దొంగలు అపహరించుకుని పోయారని బాధితులు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.