
ప్రతీకాత్మక చిత్రం
కాలిఫోర్నియా : అమెరికాలో ఓ దొంగ వింతగా ప్రవర్తించి పోలీసులకి అడ్డంగా దొరికిపోయాడు. ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లిన యువకుడు.. అదే ఇంట్లో గాఢ నిద్రలో ఉన్న యువతి పక్కగా నగ్నంగా నిద్రపోయాడు. ఈ వింత ఘటన నార్త్ కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దొంగను అరెస్ట్ చేశారు. వివరాలు.. చికో స్టేట్ యూనివర్సీటీకి చెందిన 21 ఏళ్ల విద్యార్థిని నార్త్ కాలిఫోర్నియలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటుంది. ఈ నెల 9న అర్థరాత్రి ఓ యువకుడు ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు అన్ని దొంగిలించాడు.
అనంతరం బెడ్‌రూంలోకి వెళ్లి గాఢ నిద్రలో ఉన్న యువతి పక్కన నగ్నంగా నిద్రపోయాడు. ఉదయం నిద్రలేచిన యువతి నగ్నంగా ఉన్న యువకుడిని చూసి గట్టిగా అరిచింది. దీంతో యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చికో పోలీసులు విచారణ చేపట్టి యువకున్ని అరెస్ట్ చేశారు. సీసీ కెమెరాల ద్వారా యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడని, కానీ నగ్నంగా ఎందుకు నిద్రపోయాడో ఇంతవరకూ తెలపడం లేదని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment