అది 2015. అమెరికాలో ఫ్లోరిడాకు చెందిన ఆర్థర్ నథానియల్ బూత్ దొంగతనం ఆరోపణలపై అరెస్టయ్యాడు. మియామీ–డేడ్ జడ్జి మిండీ గ్లేజర్ ముందు విచారణకు హాజరయ్యాడు. అతన్ని తేరిపార చూసిన జడ్జి, నువ్వు నౌటిలస్ మిడిల్ స్కూల్‌లో చదివావు కదా ప్రశ్నించారు. దాంతో ఆమెను గుర్తు పట్టిన బూత్ ఒక్కసారిగా భావోద్వేగంతో రోదించాడు. వాళ్లిద్దరూ చిన్ననాటి మిత్రులు మరి!
స్కూలు రోజుల్లో బెస్ట్ ఫ్రెండ్స్. కలిసి ఫుట్ బాల్ ఆడేవాళ్లమని, బూత్ తమ స్కూళ్లోకెల్లా ఉత్తమ బాలుడని మిండీ గుర్తు చేసుకున్నారు. ‘బూత్, నిన్నిక్కడ చూడాల్సి వచ్చినందుకు బాధగా ఉంది’ అంటూ విచారం వ్యక్తం చేశారు. ఇకపై మంచి జీవితం గడుపుతాడని ఆశాభావం వెలిబుచ్చారు. కానీ అలా జరగలేదు. బూత్ చోర జీవితమే కొనసాగిస్తూ వచ్చాడు.
నగరమంతటా వరుస దొంగతనాలకు పాల్పడ్డాడు. ప్లంబర్ వేషంలో ఓ వృద్ధుడి ఇంట్లో దూరి బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు. వాటర్ ఇన్‌స్పెక్టర్‌గా నటించి ఓ ఇంట్లోంచి నగల పెట్టె దొంగిలించాడు. టైరు మారుస్తున్న మహిళ బంగారు గొలుసు లాక్కున్నాడు. ఇవన్నీ చేస్తూ సీసీ కెమెరాలకు దొరికిపోయాడు. ఎట్టకేలకు అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈసారి కోర్టులో జడ్జిగా చిన్నప్పటి నేస్తం కని్పంచలేదు గానీ అతని అరెస్టుతో నాటి ఉదంతం మరోసారి తెరపైకి వచి్చంది. 2015 నాటి కోర్టు ప్రొసీడింగ్స్ వీడియో వైరల్‌గా మారింది.
– వాషింగ్టన్
Comments
Please login to add a commentAdd a comment