childhood friends
-
ఒకరు ధర్మాసనంపై.. మరొకరు బోనులో... ఇద్దరు మిత్రుల కథ!
అది 2015. అమెరికాలో ఫ్లోరిడాకు చెందిన ఆర్థర్ నథానియల్ బూత్ దొంగతనం ఆరోపణలపై అరెస్టయ్యాడు. మియామీ–డేడ్ జడ్జి మిండీ గ్లేజర్ ముందు విచారణకు హాజరయ్యాడు. అతన్ని తేరిపార చూసిన జడ్జి, నువ్వు నౌటిలస్ మిడిల్ స్కూల్లో చదివావు కదా ప్రశ్నించారు. దాంతో ఆమెను గుర్తు పట్టిన బూత్ ఒక్కసారిగా భావోద్వేగంతో రోదించాడు. వాళ్లిద్దరూ చిన్ననాటి మిత్రులు మరి! స్కూలు రోజుల్లో బెస్ట్ ఫ్రెండ్స్. కలిసి ఫుట్ బాల్ ఆడేవాళ్లమని, బూత్ తమ స్కూళ్లోకెల్లా ఉత్తమ బాలుడని మిండీ గుర్తు చేసుకున్నారు. ‘బూత్, నిన్నిక్కడ చూడాల్సి వచ్చినందుకు బాధగా ఉంది’ అంటూ విచారం వ్యక్తం చేశారు. ఇకపై మంచి జీవితం గడుపుతాడని ఆశాభావం వెలిబుచ్చారు. కానీ అలా జరగలేదు. బూత్ చోర జీవితమే కొనసాగిస్తూ వచ్చాడు. నగరమంతటా వరుస దొంగతనాలకు పాల్పడ్డాడు. ప్లంబర్ వేషంలో ఓ వృద్ధుడి ఇంట్లో దూరి బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు. వాటర్ ఇన్స్పెక్టర్గా నటించి ఓ ఇంట్లోంచి నగల పెట్టె దొంగిలించాడు. టైరు మారుస్తున్న మహిళ బంగారు గొలుసు లాక్కున్నాడు. ఇవన్నీ చేస్తూ సీసీ కెమెరాలకు దొరికిపోయాడు. ఎట్టకేలకు అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈసారి కోర్టులో జడ్జిగా చిన్నప్పటి నేస్తం కని్పంచలేదు గానీ అతని అరెస్టుతో నాటి ఉదంతం మరోసారి తెరపైకి వచి్చంది. 2015 నాటి కోర్టు ప్రొసీడింగ్స్ వీడియో వైరల్‌గా మారింది. – వాషింగ్టన్ -
చిన్ననాటి స్నేహితులు చెరో దారిలో నడిచారు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: వాళ్లిద్దరూ చెడ్డీ దోస్తులు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత స్నేహం వారిది. ఇద్దరూ కలిసి పదో తరగతి దాకా చదువుకున్నారు. టెన్త్ పూర్తయ్యాక చెరో దారిలో నడిచారు. అది కూడా వర్గ శత్రువులుగా భావించే నక్సలిజం వైపు ఒకరు వెళ్తే, కేంద్ర పారామిలటరీ బలగాల్లోకి మరొకరు వెళ్లారు. కొన్నేళ్ల తర్వాత ఏడాది తేడాలో ఆ ఇద్దరూ అసువులు బాసారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామం పెద్ద వెంకట్‌రెడ్డి, భూమవ్వల కుమారుడైన సిద్దారెడ్డి, అదే గ్రామానికి చెందిన కంది నాగమణి, శంకరయ్య దంపతుల పెద్ద కొడుకు సిద్దరాములు ఇద్దరూ చిన్ననాటి నుంచీ మంచి స్నేహితులు. స్కూలుకైనా, వాగులో ఈతకైనా, ఆటల్లో అయినా ఇద్దరూ ఇద్దరే. అలాంటి స్నేహితులు నూనూగు మీసాల వయసులో చెరో దారిని ఎంచుకున్నారు. సిద్దారెడ్డి అలి యాస్ సిద్దన్న సమసమాజం కోసమంటూ అప్పటి పీపు ల్స్వార్ ఉద్యమంలో చేరిపోయాడు. తర్వాత కాలంలో ఆ ప్రాంత ఆర్గనైజర్‌గా చురుగ్గా పాల్గొన్న సిద్దారెడ్డి 1998లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందారు. సిద్దారెడ్డి స్నేహితుడు సిద్దరాము లు దేశ రక్షణ తన విధిగా భావించి 1990లో సీఆర్పీఎఫ్ జవా నుగా సెలెక్టయ్యాడు. ఆయన 1997 డిసెంబర్ 14న అస్సాంలోని కొక్రా జిల్లాలో బోడో తీవ్రవాదులు మందుపాతర పేల్చిన ఘటనలో తనువు చాలించాడు. సిద్దారెడ్డి స్తూపం పక్కనే సిద్దరాములు విగ్రహం...చిట్యాల గ్రామంలోకి అడుగుపెట్టగానే ప్రధాన కూడలి వద్ద రోడ్డు పక్కన స్తూపం, దాని పక్కనే విగ్రహం ఉంటాయి. గ్రామంలో సిద్దారెడ్డితో పాటు చనిపోయిన మరికొందరి పేర్లతో అమరవీరు ల స్తూపం నిర్మించారు. కాగా జవాన్ సిద్దరాములు తల్లి కంది నాగమణి తన కొడుకు విగ్రహం పెట్టాలని ఎన్నో ఏళ్లుగా ప్రయ త్నించి.. చివరకు ఏర్పాటు చేసి గతేడాది మార్చి 27న ఆవిష్కరింపజేసింది. ఇద్దరి విగ్రహాలు పక్కపక్కనే ఏర్పాటు చేయడం యా దృచ్ఛికంగా జరిగినా, దోస్తులూ పక్కపక్కనే ఉన్నట్టుంటుంది. -
ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే..
నాటి మా క్లాస్ లీడర్, స్కూల్ కెప్టెన్.. నేడు సీఎం అయ్యారు. మాతో కలిసి ఆడుకున్న, చదువుకున్న, దెబ్బలాడుకున్న, ఆనందం పంచుకున్న వ్యక్తి ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా రాజకీయ పార్టీ స్థాపించి ప్రజల ఆదరాభిమానాలతో అఖండ మెజారిటీ సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మా బాల్య స్నేహితుడు సీఎం కావడం.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) నుంచి 1991లో ప్లస్ 2 పూర్తి చేసుకున్న మాకందరికీ ఎంతో గర్వకారణం. వివిధ దేశాల్లో, వివిధ ప్రాంతాల్లో పలు హోదాల్లో ఉన్న మా మిత్రులంతా ఇదే చర్చించుకుంటున్నారు. మా చిన్ననాటి మిత్రుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్ని విధాలా మేలు జరగాలని ఆశిస్తున్నాం. జగన్ హయాంలో ఏపీ సర్వతోముఖాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. – హైదరాబాద్‌లో వైఎస్ జగన్ బాల్యమిత్రులు సాక్షి, అమరావతి : ‘మాతో కలిసి చదువుకున్న వైఎస్ జగన్‌లో చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు మెండుగా ఉండేవి. హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్)లో ప్లస్ 2 వరకూ ఆయన మాతోపాటే చదువుకున్నారు. క్రీడల్లో చాలా చురుగ్గా పాల్గొనేవారు. క్లాస్ లీడర్‌గా, హౌస్ కెప్టెన్‌గానూ ఉండేవారు. మా లీడరే నేడు ఆంధ్రప్రదేశ్ సీఎం కావడం ఆనందంగా ఉంది. అమెరికా, చైనా తదితర దేశాల్లో ఉన్న పూర్వ మిత్రులు కూడా ఈ అంశాన్ని ఫోన్ ద్వారా పంచుకుని ఆనందించాం. మా ప్లస్ టు 1991లో పూర్తయింది. తర్వాత కూడా జగన్‌తో మా అనుబంధం కొనసాగింది. తర్వాత కాలంలో చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు తదితర కారణాలతో దూరప్రాంతాలకు వెళ్లడం, ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటం వల్ల ఎక్కువగా కలవలేకపోయాం. జగన్ విద్యార్థిగా, విద్యార్థి నాయకుడిగా అందరితో చాలా చనువుగా ఉండేవారు’ అని నాటి హెచ్‌పీఎస్ విద్యార్థులు ‘సాక్షి’తో తమ ఆనందం పంచుకున్నారు. స్టూడెంట్ లీడర్.. వైఎస్ జగన్ మా అందరికీ స్కూల్లో నాయకుడు. ఆయన నాగార్జున హౌజ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తే.. నేను డెప్యూటీ హెడ్‌బాయ్‌గా పనిచేశాను. నాకంత పని ఉండేది కాదు. కానీ, హౌజ్ కెప్టెన్ అనేది అత్యంత కీలకం. ఆ కీలక బాధ్యతలను జగన్ చాలా సులభంగా నిర్వర్తించేవారు. ప్లానింగ్, కో–ఆర్డినేషన్, ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా ఉండేది. – సుమంత్, సినీ నటుడు ఆనందాన్ని చెప్పడానికి మాటల్లేవు నా పేరు వరప్రసాద్. నేను హైదరాబాద్‌లో హెచ్ఆర్, లేబర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాను. మా బాల్య మిత్రుడు సీఎం అవుతున్నందుకు మా ఆనందాన్ని చెప్పడానికి మాటలు లేవు. నేను, జగన్ ప్లస్ టు వరకూ కలిసే చదువుకున్నాం. తర్వాత ఆయన డిగ్రీ వేరే కళాశాలలో చేరినా నిజాం కళాశాలలో ఉన్న మా వద్దకు తరచూ వచ్చేవారు. అందువల్ల మా స్నేహం కొనసాగింది. ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్నప్పుడు మాత్రం వెళ్లి కలిశాను. చాలా ఆనందంగా, ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ అనుభూతి మాటలకందనిది. మా బాల్య స్నేహితుడు సీఎం అవుతున్నారని తేలిపోవడంతో చాలామంది ఫోన్ చేసి ఒకరికొకరం అభినందనలు చెప్పుకున్నాం. జగన్ సీఎం అవుతున్న సందర్భంగా ఇప్పుడు మళ్లీ ఇక్కడ మా స్నేహితురాలు భావన సంతోషంతో గెట్ టు గెదర్‌కు మిత్రులను ఆహ్వానించారు. దూరదృష్టి ఉన్న జగన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. – వరప్రసాద్, హైదరాబాద్ ఆంధ్ర ప్రజలకు ధన్యవాదాలు నా పేరు భావన. నేను హైదరాబాద్‌లో బంగారు నగల వ్యాపార సంస్థ నిర్వహిస్తున్నాను. గతంలో మా స్కూల్ నుంచే మా సీనియర్ కిరణ్ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మాతో కలిసి చదువుకున్న స్నేహితుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం మాకెంతో గర్వంగా, ఆనందంగా ఉంది. జగన్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మా ధన్యవాదాలు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన లాగే జగన్ కూడా అందరి ఆదరాభిమానాలు చూరగొనాలని ఆశిస్తున్నా. – భావన, హైదరాబాద్. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ముక్కుసూటిగా మాట్లాడేవారు క్లాస్ లీడర్‌గా, హౌస్ కెప్టెన్‌గా జగన్ ఏ అంశంపై అయినా ముక్కుసూటిగా మాట్లాడేవారు. అందరితో మంచి సంబంధాలు కలిగి ఉండేవారు. అందువల్లే ఆయనంటే అందరికీ అభిమానం. ఇప్పుడు ఇలాగే రాష్ట్ర ప్రజలందరి అభిమానం సంపాదించి ముఖ్యమంత్రి అయ్యారు. ఇది మాకు గర్వించే అంశం. కొన్ని రోజుల తర్వాత వీలు చూసుకుని అందరం వెళ్లి కలిసి తీపి గుర్తులు పంచుకుని వస్తాం. –హర్ష, హైదరాబాద్ ఇది మాకు చారిత్రాత్మక రోజు నా పేరు సుధీర్. నేను హెచ్‌పీఎస్‌లో నాగార్జున హౌస్‌లో ఉండేవాడిని. మా హౌస్‌కు, స్కూల్ ఫుట్‌బాల్ టీమ్‌కు కెప్టెన్ జగనే. ఫుట్‌బాల్‌లో షీల్డు కూడా సాధించారు. జగన్‌లో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయని మేం అప్పట్లోనే గుర్తించాం. జగన్ ముఖ్యమంత్రి అయిన ఈ రోజు మాకు చారిత్రాత్మకమైన రోజు. జగన్‌కు శుభాభినందనలు. – సుధీర్, హైదరాబాద్ ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలి మా దగ్గర చదువుకున్న జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం ఆయనకు చదువు చెప్పిన గురువుగా నాకెంతో గర్వంగా ఉంది. జగన్ 12వ తరగతిలో ఎస్వీడబ్ల్యూ కెప్టెన్‌గా విద్యార్థులకు ఎన్నో విషయాల్లో మార్గదర్శిగా ఉండేవారు. ఇంతటి అఖండ ఘనవిజయాన్ని సాధించిన జగన్‌కు శుభాభినందనలు. జగన్ నిబద్ధతకు, క్రమశిక్షణకు మేమెంతగానో గర్విస్తున్నాం. రాష్ట్రానికి సుపరిపాలన అందించాలని, భావితరాలకు స్ఫూర్తివంతమైన నాయకుడిగా ఉండాలని కోరుకుంటున్నా. జగన్ ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తున్నా. – చంద్రశేఖర్, మ్యాథమెటిక్స్ టీచర్ రియల్ లీడర్ జగన్ నేను జగన్‌కు ఏడాది జూనియర్. క్లాస్ లీడర్‌గా, హౌస్ కెప్టెన్‌గా జగన్ మార్గదర్శకత్వం వహించిన తీరు చూసి మంచి నాయకత్వ లక్షణాలున్నాయని గుర్తించాం. పదేళ్లు ప్రజల కోసం పోరాటం చేసి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నికై రియల్ లీడర్ అని చాటుకున్నారు. ఇది మాకెంతో ఆనందదాయకం. ఇది మాకు ప్రత్యేకంగా గుర్తుండిపోయే రోజు. – ఎన్.రమేష్, హైదరాబాద్ పదేళ్ల పోరాటం,ప్రజల అభిమానం ఫలితమిది ఇంతటి ఘనవిజయం సాధించిన నా చిన్ననాటి మిత్రుడు జగన్‌కు అభినందనలు. పదేళ్ల పోరాటం, ప్రజల అభిమానంతోనే జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నా. జగన్‌కు ఉన్న పట్టుదల, క్రమశిక్షణ, దూరదృష్టి ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతాయని సంపూర్ణ విశ్వాసం ఉంది. – డాక్టర్ శివరామ్, హైదరాబాద్ ఆపదొస్తే ఆయనే గుర్తొస్తారు జగన్‌లో గొప్ప నాయకత్వ లక్షణాలు చూసేవాళ్లం. మాకేదైనా ఆపద వస్తే ఆయనే గుర్తొస్తారు. సాదాసీదాగా ఉంటూ అందరినీ కలుపుకుని వెళ్లేవారు. అప్పుడే అనుకునే వాళ్లం.. జగన్ గొప్ప నాయకుడు అవుతారని. ఏపీ ప్రజల మద్దతుతో జగన్ సీఎం అవుతుండటం మాకెంతో సంతోషకరం. వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలోనే జగన్ సైతం మైనార్టీలకు మంచి చేస్తారన్న నమ్మకం ఉంది. – అమీర్ అలీ ఖాన్, మేనేజింగ్ ఎడిటర్, సియాసత్ పత్రిక -
పాదయాత్రలో స్నేహాగీతం..!
-
ముంబైసే ఆయా మేరా దోస్త్
సాక్షి, హైదరాబాద్: వారిద్దరు బాల్యమిత్రులు. పుట్టింది మొదలు 20 ఏళ్ల వయసు వరకు ఇరువురు సికింద్రాబాద్ మోండా మార్కెట్లో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేవారు. ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం రావడంతో బాల్యమిత్రుల్లో ఒకరు కుటుంబంతో సహా మకాం మార్చారు. అప్పట్లో ఫోన్ల సదుపాయం లేని కారణంగా స్నేహబంధం దూరమైంది. 40 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం వీరిద్దరిని తిరిగి ఫేస్బుక్ దగ్గర చేసింది. సోమవారం రాత్రి ఇరువురు మిత్రులు శంషాబాద్ విమానాశ్రయంలో కలుసుకున్నారు. ఇందులో ఒకరు రిటైర్డు ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి కాగా ఇంకొకరు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి టి.పద్మారావుగౌడ్. మోండాలోని టకారాబస్తీలో మంత్రి పద్మారావు పుట్టి పెరిగారు. ముంబై నుంచి కొన్నేళ్ల క్రితం ఒక క్రిస్టియన్ కుటుంబం నగరానికి వలస వచ్చింది. మోండా మార్కెట్లో స్థిరపడిన ఆ కుటుంబంలో జన్మించిన వ్యక్తి జాకబ్ విక్టర్. పద్మారావుగౌడ్, జాకబ్‌విక్టర్ ఇరువురు బాల్యమిత్రులు. 20 ఏళ్ల వయసులో జాకబ్ విక్టర్‌కు ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం రావడంతో కుటుంబం ముంబైకి తరలివెళ్లింది. నాలుగు దశాబ్దాలుగా ఇరువురు కలుసుకోలేకపోయారు. ఫేస్బుక్ చూస్తుండగా... ఎయిర్‌ఫోర్స్‌లో పదవీ విరమణ చేసిన జాకబ్ విక్టర్ కొద్దిరోజుల క్రితం ఫేస్బుక్ పరిశీలిస్తుండగా మంత్రి పద్మారావు ఫొటోలు కనిపించాయి. సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. ఎక్సైజ్ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పద్మారావుగౌడ్ తన బాల్యమిత్రుడేనని గుర్తించిన జాకబ్‌విక్టర్ అందులోని ఫోన్‌నెంబర్‌కు కాల్చేశాడు. ఫోన్ రిసీవ్ చేసుకున్న మంత్రి పీఆర్ఓ కలకోట వెంకటేశ్ జాకబ్ ముంబై నుంచి ఫోన్ చేసిన విషయాన్ని మంత్రికి చేరవేశారు. బాల్యమిత్రుడి ఆచూకీ లభించడంతో హర్షం వ్యక్తం చేసిన పద్మారావుగౌడ్ హైదరాబాద్ రావాల్సిందిగా జాకబ్ విక్టర్‌ను ఆహ్వానించారు. స్వయంగా మంత్రి స్వాగతం... సోమవారం రాత్రి ముంబై నుంచి నగరానికి చేరుకున్న జాకబ్ విక్టర్‌కు మంత్రి పద్మారావు స్వయంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి స్వాగతం పలికారు. టకారాబస్తీలోని మంత్రి నివాసంలో బసచేసిన జాకబ్ విక్టర్ మంగళవారం మంత్రి పద్మారావుతోపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సికింద్రాబాద్ టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లతో బాల్యం నాటి ముచ్చట్లను ఇరువురు పంచుకున్నారు. -
క్యాన్సర్‌ను జయించిన ప్రేమ
వాషింగ్టన్ : ప్రాణాలు హరించే క్యాన్సర్ వ్యాధి వారి ప్రేమకు అడ్డుకాలేదు. ప్రమాదకర వ్యాధి భారిన పడి, ఎన్ని రోజులు జీవిస్తాడో తెలియని తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడిని పెద్దల సమక్షంలో వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది. తనకు మాత్రం చివరి క్షణం వరకూ ప్రేయసితో మధుర క్షణాలు గడపాలనుకుంటున్నట్లు క్యాన్సర్ బాధితుడు చెప్పడం చూపరులను కంటతడి పెట్టించింది. అమెరికాకు చెందిన డస్టిన్ స్నైడర్(19) , సీరా సివేరియో(19)లు చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. ఈ క్రమంలో వీరి స్నేహం ప్రేమగా మారింది. అయితే జూన్ 2016లో పుట్టినరోజు నాడు తన కుమారుడికి ప్రమాదకర క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు తెలియగానే షాక్‌కు గురయ్యామని స్నైడర్ తల్లి కసాండ్రా ఫాండా కన్నీటి పర్యంతమయ్యారు. కాలేయ క్యాన్సర్ కు చికిత్స చేయించినా ప్రయోజనం లేకపోయిందట. కుమారుడు స్నైడర్ కేవలం కొన్నిరోజులే బతుకుతాడని డాక్టర్లు ఆమెకు చెప్పారు. ఈ బాధాకర విషయాన్ని కుమారుడికి చెప్పగా.. తన మనసులో మాటను బయటపెట్టాడు. చిన్ననాటి స్నేహితురాలు సీరా సివేరియోను వివాహం చేసుకోవాలన్నది తన చివరి కోరికగా తల్లికి చెప్పాడు. కొన్ని రోజుల కిందట తన మనసులో మాటను ప్రేయసి సివేరియోకు చెప్పాడు. ఆమెను ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని, అయితే తాను కేవలం కొద్దిరోజులు మాత్రమే బతుకుతానని వివరించాడు. కానీ బతికిన కొన్ని రోజులు నీతోనే సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నట్లు కళ్లల్లో నీటి సుడులు తిరుగుతుండగా చెప్పాడు. ఆమె స్నైడర్ తో ప్రేమపెళ్లికి ఒప్పుకుంది. గో ఫండ్ పేజ్ ద్వారా పెళ్లి ఏర్పాట్లకు కావలసిన విరాళాలు సేకరించారు. జనవరి 28న కొందరు సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. ప్రేయసి సివేరియో మాట్లాడుతూ.. నా స్నేహితుడు స్నైడర్ చివరిక్షణం వరకూ సంతోషంగా ఉండేలా చేసుకుంటాను. అతడికి చివరిక్షణాలు అద్భుతక్షణాలుగా మారాలని మేం ప్రయత్నిస్తున్నాం. మా పెళ్లి బట్టల కోసం షాపింగ్ కూడా చేశాం. పెళ్లికి సిద్ధంగా ఉన్నానని వివరించింది. -
అమ్మ స్నేహితుల మద్దతు ఎవరికంటే..
చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు రోజురోజుకు మద్దతు పెరుగుతుండగా.. అన్నా డీఎంకే చీఫ్ శశికళ వర్గానికి షాకుల మీద షాకులతో ఆందోళన కలిగిస్తోంది. శశికళ పేరు వింటనే జయలలిత బంధువులు మండిపడుతుండగా.. అమ్మ చిన్ననాటి స్నేహితుల నుంచి కూడా ఆమెకు మద్దతు కరువైంది. అమ్మ చిన్ననాటి స్నేహితులు, క్లాస్మేట్స్.. శశికళను కాదని పన్నీరు సెల్వంకు మద్దతు ప్రకటించిడం విశేషం. సెల్వంపై జయలలితకు పూర్తి విశ్వాసం ఉందని, అందుకే రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశారని చెబుతున్నారు. అన్నా డీఎంకేలో ఏర్పడ్డ ప్రస్తుత పరిస్థితులు బాధాకరమని అన్నారు. జయలలిత పన్నీరు సెల్వం వంటి వారిని రాజకీయ వారసుడిగా ప్రకటించి ఉండాల్సిందని ఆమె స్నేహితురాలు శ్రీమతి అయ్యంగార్ అభిప్రాయపడ్డారు. జయలలితకు చిన్ననాటి స్నేహితులను శశికళ దూరం చేసిందని, ఆమెను కలవనీయకుండా చేసిందని చాందిని పంకజ్ బులానీ చెప్పారు. ఆమె ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్నారు. తాను డెలివరీ అయినపుడు జయలలిత ఆస్పత్రికి వచ్చి పరామర్శించారని, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయానని చెప్పారు. కనీసం జయలలితను చూసే అవకాశం కూడా తమకు శశికళ ఇవ్వలేదని ఆరోపించారు. ఓసారి జయలలితను కలిసేందుకు పన్నీరు సెల్వం అపాయింట్మెంట్ ఇచ్చారని, అయితే శశికళ మనుషులు తమను అడ్డుకున్నారని చెప్పారు. తమ స్నేహితులెవరూ జయలలితను కలవకుండా శశికళ దూరం చేశారని మండిపడ్డారు. పన్నీరు సెల్వం చాలా గౌరవనీయ వ్యక్తని, చివరిసారి జయలలితతో కలసి తాము భోజనం చేసినపుడు ఆయన అక్కడే ఉన్నారని చెప్పారు. జయలలిత ఆశయాలను పన్నీరు సెల్వం నెరవేరుస్తారనే నమ్మకముందని బాదర్ సయీద్ చెప్పారు. తొలుత అన్నాడీఎంకేలో పనిచేసిన సయీద్ తర్వాత ఆప్‌లో చేరారు. సంబంధిత వార్తలు చదవండి గవర్నర్ నిర్ణయం లేటు..ఎవరికి చేటు? ఎవరికి సీటు? పోయెస్ గార్డెన్ వెలవెల పన్నీర్‌కే 95 శాతం మద్దతు! గోల్డెన్ బే రిసార్ట్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఎత్తుకు పైఎత్తు నేను ముఖ్యమంత్రి కావడం ఖాయం -
అపూర్వ కలయిక
మధుర క్షణాలను నెమరేసుకున్న బాల్య మిత్రులు చదివిన పాఠశాలలో 25 ఏళ్ల తరువాత సంబరాలు గురువులకు సన్మానాలు, జ్ఞాపికలు గంగాధరనెల్లూరు : ఇరవై ఐదేళ్ల కిందట వారంతా కలిసి ఒకే పాఠశాలలో చదివారు. తరువాత ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. నేడు (శనివారం) మళ్లీ అదే పాఠశాలలో కలుసుకున్నారు. ఆనాటి జ్ఙాపకాలు నెమరువేసుకున్నారు. మరుపురాని మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. గురువుల్ని సన్మానించి పాదాభివందనం చేశారు. ఈ అపూర్వ కలయిక గంగాధరనెల్లూరు మండలంలోని తూగుండ్రం జెడ్పీ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. 1988-89లో విద్యార్థులు శనివారం కలుసుకుని సంబరాలు చేసుకోవడంలో సెల్కాన్ మొబైల్స్ అధినేత వై గురుస్వామినాయుడు, బృం దం ప్రధాన భూమిక పోషించింది. రిటైర్డ్ హెడ్మాస్టర్ దొరైరాజ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా తిరుపతికి చెందిన మేడసాని మోహన్ హాజరయ్యారు. మాతృభాషా దినోత్సవం రోజున పూర్వ విద్యార్థులు తమ గురువుల్ని సన్మానించాలని నిర్ణయించుకోవడం అభినందనీయమని మేడసాని మోహన్ అభినందించారు. భారతీయ సంస్కృతిలో గురువులకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. దీన్ని తూచా తప్పకుండా పాటిం చిన విద్యార్థులు ఆదర్శప్రాయులని కొనియాడారు. ప్రతి ఒక్కరు మాతృభాషపై మక్కువ పెంచుకోవాలని కోరారు. దేశభాషలందు తెలుగులెస్స అనే నానుడిని నిజం చేయాలన్నారు. రిటైర్డ్ హెడ్మాస్టర్, టీచర్లు మాట్లాడుతూ గురుశిష్యుల బంధం గొప్పదని, దీన్ని విస్మరించకుండా పూర్వ విద్యార్థులు గురువుల్ని ఆహ్వానించి సన్మానించడం గొప్ప విశేషమన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్య అవసరమన్నారు. విద్య ప్రాధాన్యాన్ని తెలుసుకుని ప్రస్తుత విద్యార్థులు విద్యనభ్యసించాలన్నారు. పూర్వ విద్యార్థులు ఈ సందర్భంగా 20 మంది గురువుల్ని సన్మానించారు. జ్ఙాపికలు బహూకరించారు. 80 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు చెప్పులు, పెన్నులు, పంపిణీ చేశారు. చాలా ఆనందంగా ఉంది అప్పటి గురువుల్ని, విద్యార్థుల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తూగుం డ్రం జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాం . గురువుల్ని సన్మానించడం అదృష్టంగా భావి స్తున్నాం. గురువుల్ని సన్మానించాలని స్నేహితులతో కలసి చర్చించాం. అందరూ సహకరించి విజయవంతం చేశారు. చదువుకున్న పాఠశాల కు ఏదో ఒక విధంగా సాయం అందిస్తాం. ప్రతి సంవత్సరం 10 వతరగతి విద్యార్థులకు 50 వేల రూపాయలు బహుమానంగా ఇస్తాం. ప్ర తి ఒక్కరు చదువుకోవాలి. అప్పట్లో ఎంతో కష్టపడి చదువుకున్నాం. విద్యతో అభివృద్ధి సాధిం చవచ్చు. - సెల్కాన్ మొబైల్స్ అధినేత వై.గురు -
మరణంలోనూ వీడని స్నేహం
ఇద్దరు ఆప్తమిత్రుల హఠాన్మరణం ఒకరి మృతిని తట్టుకోలేక మరొకరు.. హైదరాబాద్, న్యూస్‌లైన్: వారివురు బాల్య స్నేహితులు. పుట్టి పెరిగింది మొదలు వారి పిల్లలకు వివాహాలు చేసి తాతయ్యలు అయ్యేంత వరకు పక్కపక్క నివాసాల్లో ఉంటున్నారు. మంగళవారం ఉదయం ఒకరు అనారోగ్యంతో మృతి చెందగా, దీన్ని తట్టుకోలేక మిత్రుడి మృతదేహం వద్దే మరొకరు కుప్పకూలి చనిపోయారు. ఈ సంఘటన సికింద్రాబాద్, అడ్డగుట్ట డివిజన్ తుకారాంగేట్‌లో మంగళవారం చోటుచేసుకుంది. తుకారాంగేట్ ప్రాంతంలోని గడ్డమీదిబస్తీకి చెందిన కె.నర్సింగరావు (65), భగవాన్(62) చిన్ననాటి మిత్రులు. బస్తీలో పక్కపక్కన్నే ఇరువురి నివాసాలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి ప్రాణం. రైల్వేలో ఉద్యోగం చేసిన నర్సింగరావు.. ఇటీవల పదవీ విరమణ చేశారు. భగవాన్ అదే ప్రాంతంలో మిర్చిబండి పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. వృత్తిరీత్య బిజీగా ఉన్నా నిత్యం వారివురు కలసి మాట్లాడుకోనిదే సంతృప్తి చెందరు. కొంతకాలంగా ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న నర్సింగరావును చూసి భగవాన్ ఆందోళనకు గురవుతుండేవారు.మంగళవారం ఉదయం గుండెపోటుతో నర్సింగరావు మృతిచెందారు. ఈ వార్త తెలుసుకొని అక్కడికి చేరుకున్న భగవాన్ తన బాల్య మిత్రుడు విగతజీవిగా పడి ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయారు. స్నేహితుడి మృతదేహంపై పడి రోదిస్తుండగా.. అదే సమయంలో గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తుండగానే తుదిశ్వాస విడిచారు. ఆరు దశాబ్దాలుగా మిత్రులుగా బస్తీవాసులకు సుపరిచితులైన వీరు ఒకేమారు తుదిశ్వాస విడవడం స్థానికంగా విషాదాన్ని నింపింది.