మధుర క్షణాలను నెమరేసుకున్న బాల్య మిత్రులు
చదివిన పాఠశాలలో 25 ఏళ్ల తరువాత సంబరాలు
గురువులకు సన్మానాలు, జ్ఞాపికలు
గంగాధరనెల్లూరు : ఇరవై ఐదేళ్ల కిందట వారంతా కలిసి ఒకే పాఠశాలలో చదివారు. తరువాత ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. నేడు (శనివారం) మళ్లీ అదే పాఠశాలలో కలుసుకున్నారు. ఆనాటి జ్ఙాపకాలు నెమరువేసుకున్నారు. మరుపురాని మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. గురువుల్ని సన్మానించి పాదాభివందనం చేశారు. ఈ అపూర్వ కలయిక గంగాధరనెల్లూరు మండలంలోని తూగుండ్రం జెడ్పీ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. 1988-89లో విద్యార్థులు శనివారం కలుసుకుని సంబరాలు చేసుకోవడంలో సెల్‌కాన్ మొబైల్స్ అధినేత వై గురుస్వామినాయుడు, బృం దం ప్రధాన భూమిక పోషించింది. రిటైర్డ్ హెడ్మాస్టర్ దొరైరాజ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా తిరుపతికి చెందిన మేడసాని మోహన్ హాజరయ్యారు. మాతృభాషా దినోత్సవం రోజున పూర్వ విద్యార్థులు తమ గురువుల్ని సన్మానించాలని నిర్ణయించుకోవడం అభినందనీయమని మేడసాని మోహన్ అభినందించారు.
భారతీయ సంస్కృతిలో గురువులకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. దీన్ని తూచా తప్పకుండా పాటిం చిన విద్యార్థులు ఆదర్శప్రాయులని కొనియాడారు. ప్రతి ఒక్కరు మాతృభాషపై మక్కువ పెంచుకోవాలని కోరారు. దేశభాషలందు తెలుగులెస్స అనే నానుడిని నిజం చేయాలన్నారు. రిటైర్డ్ హెడ్‌మాస్టర్, టీచర్లు మాట్లాడుతూ గురుశిష్యుల బంధం గొప్పదని, దీన్ని విస్మరించకుండా పూర్వ విద్యార్థులు గురువుల్ని ఆహ్వానించి సన్మానించడం గొప్ప విశేషమన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్య అవసరమన్నారు. విద్య ప్రాధాన్యాన్ని తెలుసుకుని ప్రస్తుత విద్యార్థులు విద్యనభ్యసించాలన్నారు. పూర్వ విద్యార్థులు ఈ సందర్భంగా 20 మంది గురువుల్ని సన్మానించారు. జ్ఙాపికలు బహూకరించారు. 80 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు చెప్పులు, పెన్నులు, పంపిణీ చేశారు.
చాలా ఆనందంగా ఉంది
అప్పటి గురువుల్ని, విద్యార్థుల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తూగుం డ్రం జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాం . గురువుల్ని సన్మానించడం అదృష్టంగా భావి స్తున్నాం. గురువుల్ని సన్మానించాలని స్నేహితులతో కలసి చర్చించాం. అందరూ సహకరించి విజయవంతం చేశారు. చదువుకున్న పాఠశాల కు ఏదో ఒక విధంగా సాయం అందిస్తాం. ప్రతి సంవత్సరం 10 వతరగతి విద్యార్థులకు 50 వేల రూపాయలు బహుమానంగా ఇస్తాం. ప్ర తి ఒక్కరు చదువుకోవాలి. అప్పట్లో ఎంతో కష్టపడి చదువుకున్నాం. విద్యతో అభివృద్ధి సాధిం చవచ్చు. - సెల్‌కాన్ మొబైల్స్ అధినేత వై.గురు
అపూర్వ కలయిక
Published Sun, Feb 22 2015 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM
Advertisement
Advertisement