trial court
-
ఒకరు ధర్మాసనంపై.. మరొకరు బోనులో... ఇద్దరు మిత్రుల కథ!
అది 2015. అమెరికాలో ఫ్లోరిడాకు చెందిన ఆర్థర్ నథానియల్ బూత్ దొంగతనం ఆరోపణలపై అరెస్టయ్యాడు. మియామీ–డేడ్ జడ్జి మిండీ గ్లేజర్ ముందు విచారణకు హాజరయ్యాడు. అతన్ని తేరిపార చూసిన జడ్జి, నువ్వు నౌటిలస్ మిడిల్ స్కూల్లో చదివావు కదా ప్రశ్నించారు. దాంతో ఆమెను గుర్తు పట్టిన బూత్ ఒక్కసారిగా భావోద్వేగంతో రోదించాడు. వాళ్లిద్దరూ చిన్ననాటి మిత్రులు మరి! స్కూలు రోజుల్లో బెస్ట్ ఫ్రెండ్స్. కలిసి ఫుట్ బాల్ ఆడేవాళ్లమని, బూత్ తమ స్కూళ్లోకెల్లా ఉత్తమ బాలుడని మిండీ గుర్తు చేసుకున్నారు. ‘బూత్, నిన్నిక్కడ చూడాల్సి వచ్చినందుకు బాధగా ఉంది’ అంటూ విచారం వ్యక్తం చేశారు. ఇకపై మంచి జీవితం గడుపుతాడని ఆశాభావం వెలిబుచ్చారు. కానీ అలా జరగలేదు. బూత్ చోర జీవితమే కొనసాగిస్తూ వచ్చాడు. నగరమంతటా వరుస దొంగతనాలకు పాల్పడ్డాడు. ప్లంబర్ వేషంలో ఓ వృద్ధుడి ఇంట్లో దూరి బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు. వాటర్ ఇన్స్పెక్టర్గా నటించి ఓ ఇంట్లోంచి నగల పెట్టె దొంగిలించాడు. టైరు మారుస్తున్న మహిళ బంగారు గొలుసు లాక్కున్నాడు. ఇవన్నీ చేస్తూ సీసీ కెమెరాలకు దొరికిపోయాడు. ఎట్టకేలకు అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈసారి కోర్టులో జడ్జిగా చిన్నప్పటి నేస్తం కని్పంచలేదు గానీ అతని అరెస్టుతో నాటి ఉదంతం మరోసారి తెరపైకి వచి్చంది. 2015 నాటి కోర్టు ప్రొసీడింగ్స్ వీడియో వైరల్‌గా మారింది. – వాషింగ్టన్ -
ఢిల్లీ లిక్కర్ కేసు: సీబీఐ ఛార్జ్‌షీట్‌పై విచారణ వాయిదా
ఢిల్లి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు సంస్థ సీబీఐ ఛార్జ్‌షీట్‌పై విచారణను ఢిల్లీ రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టు వేసింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై విచారణను సెప్టెంబర్ 11 తేదీకి వాయిదా వేసినట్లు న్యాయమూర్తి కావేరి భవేజా తెలిపారు. బుధవారం ట్రయల్ కోర్టు చేపట్టిన విచారణకు ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా, ఇతర నిందితులు వర్చువల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కొన్ని డాక్యుమెంట్స్ సరిగా లేవని, కోర్టు రికార్డుల నుంచి బెస్ట్ క్వాలిటీతో ఉన్న పత్రాలను ఇవ్వాలని నిందితుల న్యాయవాదులు కోర్టును కోరారు. సెప్టెంబర్ 4 లోపు డిఫెన్స్ లాయర్లు అడుగుతున్న డాక్యుమెంట్లను వారికి అందజేయాలని జడ్జి కావేరి భావేజా అదేశించారు. -
భర్తకు జీవిత ఖైదు సరైందే
సాక్షి, హైదరాబాద్: భార్య హత్య కేసులో భర్తకు ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించడం సరైందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ‘మృతిరాలితో అప్పీలెంట్ (భాస్కర్)కు వివాహం జరిగి నాలుగు నెలలే అయ్యింది. ఆమె మంటల్లో కాలిపోతున్నప్పుడు గదిలో నిందితుడు ఉన్నాడని సాకు‡్ష్యలు చెబుతున్నారు. ఆ మంటలను ఆర్పేందుకు అతను ఎలాంటి చర్యలు చేపట్టలేదు. భర్తకు వ్యతిరేకంగా మృతురాలు తప్పుడు వాంగ్మూలం ఇచ్చిందనడానికి ఎలాంటి కారణాలు లేవు. ట్రయల్ కోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదు’ అని హైకోర్టు తీర్పునిచ్చింది. 2012లో జరిగిన హత్య కేసులో అప్పీలెంట్‌కు జీవిత ఖైదు సరైందేనని 2015లో తేల్చిచెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన పెద్దింటి భాస్కర్‌కు మృతురాలితో 2012, ఏప్రిల్ 25న వివాహం జరిగింది. వివాహం తర్వాత నెల పాటు దంపతులు భార్య తల్లిగారింట్లోనే ఉన్నారు. 2012, జూలై 15న రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రించారు. అయితే తనకు పీడకలలు వస్తున్నాయని, తల్లి వద్ద నిద్రిస్తానని భాస్కర్‌ను కోరింది. అందుకు నిరాకరించి దుర్భాషలాడుతూ ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. కాలిన గాయాలతో ఆమె చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆసుపత్రిలో మృతురాలు మేజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా భాస్కర్‌ను ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించింది.బాధితురాలి మానసిక స్థితి బాగానే ఉంది... 2015, ఏప్రిల్ 17న రంగారెడ్డి జిల్లా కోర్టు తనకు యావజ్జీవ శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పెద్దింటి భాస్కర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.సురేందర్, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ జితేందర్‌రావు వీరమల్ల వాదనలు వినిపించారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మృతురాలి తల్లి కూడా నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వలేదని, పథకం ప్రకారం హత్య చేశాడని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం... బాధితురాలి నుంచి మేజిస్ట్రేట్ వాంగ్మూలం తీసుకునేముందు ఆమె మానసిక పరిస్థితి బాగానే ఉందని డాక్టరు ధ్రువీకరించారని పేర్కొంది. మరణ వాంగ్మూలం ఆధారంగా శిక్ష విధించవచ్చని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను ప్రస్తావిస్తూ అప్పీలును కొట్టివేసింది. -
CJI D Y Chandrachud: బెయిల్ అర్జీలపై ‘సేఫ్ గేమ్’ వద్దు
బెంగళూరు: బెయిల్ అర్జీల విషయంలో ట్రయల్ కోర్టుల జడ్జీలు ‘సేఫ్ గేమ్’ ఆడుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. అనుమానాస్పదం అనే పేరు చెప్పి ప్రతి కేసులోనూ బెయిల్ తిరస్కరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఆదివారం బెంగళూరులో బెర్క్లే సెంటర్ 11వ వార్షిక సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ట్రయల్ కోర్టులు ప్రతి బెయిల్ పిటిషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలి. కానీ అనుమానాస్పదం పేరిట అర్జీలను ట్రయల్ కోర్టుల జడ్జీలు కొట్టేస్తున్నారు. ఇలాంటి సేఫ్‌గేమ్ పనికిరాదు. బెయిల్ అర్జీలపై ఇంగిత జ్ఞానంతో ఆలోచించాలి. కేసు ప్రాముఖ్యతను బట్టి తుది నిర్ణయం తీసుకోవాలి. అంతేగానీ పై కోర్టుకు వదిలేయకూడదు. ఎందుకంటే వాళ్లంతా హైకోర్టు గడపతొక్కుతున్నారు. అక్కడా బెయిల్ దొరక్కపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. అనవసరంగా అరెస్ట్ అయిన వాళ్లు కూడా సుప్రీంకోర్టు దాకా రావాల్సిన పరిస్థితి! ఇలాంటి కేసులన్నీ అంత దూరం రావడం సరికాదు’’ అన్నారు. వాతావరణ మార్పులు మహిళలు, చిన్నారులు, దివ్యాంగులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని సీజేఐ అన్నారు. ‘‘వాతావరణ మార్పులతో వలసలు పెరుగుతున్నాయి. ప్రజలకు నాణ్యమైన జీవితం కరువవుతోంది. ఆహార కొరతతో చిన్నారులు, ఇతర సమస్యలతో మహిళలు బాధ పడుతున్నారు. ఇబ్బందుల కొలిమిలో కాలిపోతున్నారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. -
ఢిల్లీ లిక్కర్ కేసు: కేజ్రీవాల్‌పై ఈడీ సప్లిమెంటరీ చార్జిషీట్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టైన ముఖ్యంమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీట్‌ను ఢిల్లీ ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. లిక్కర్ కేసులో ఈడీ 7వ సప్లిమెంటరీ చార్జి షీట్ దాఖలు చేసింది. తాజా ఛార్జ్ షీట్లో కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీలపై ఈడీ అభియోగాలు మోపింది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా జూలై 12వ తేదీకి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది.మరోవైపు.. తనను సీబీఐ అరెస్ట్ చేయటం, మూడు రోజుల కస్టడీకి తీసుకోవటంపై అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసింది. దీంతో పాటు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇక.. ఈ రెండు పిటిషన్లపై జూలై 17న విచారణ జరగనుంది. -
ఇక సీబీఐ వంతు!
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను బుధవారం సీబీఐ అరెస్టు చేసే అవకాశం కని్పస్తోంది. సీబీఐ వర్గాలు మంగళవారం తిహార్ జైల్లో ఆయనను విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్నాయి. బుధవారం ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టనున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సీబీఐ చర్య ప్రధాని మోదీ కక్షసాధింపులో భాగమేనని ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ ఆరోపించారు. అందుకే కేజ్రీవాల్‌ను తప్పుడు కేసులో ఇరికించారన్నారు.ఢిల్లీ హైకోర్టులో నిరాశేమనీ లాండరింగ్ కేసులో బెయిల్ విషయంలో కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశే ఎదురయ్యింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్‌పై మధ్యంతర స్టే ఎత్తివేతకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం నిరాకరించింది. ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరును సవాలు చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సుధీర్‌కుమార్ జైన్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. వాదనలకు ఈడీకి ట్రయల్ కోర్టు సమయమివ్వలేదని ఆక్షేపించింది.కేజ్రీవాల్ ప్రమేయంపై సమర్పించిన పత్రాలను, సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకోవడంలో, క్షుణ్నంగా పరిశీలించడంలో విఫలమైందని స్పష్టంచేసింది.కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరుపై పూర్తిస్థాయిలో వాదనలు వినిపించడానికి ఈడీకి తగిన సమయమిచ్చి ఉండాల్సిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బెయిల్ ఉత్తర్వుపై స్టేను రద్దు చేయడం లేదని తేచ్చిచెప్పారు. కేజ్రీవాల్‌కు ఈ నెల 20న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.దీన్ని వ్యతిరేకిస్తూ ఈడీ ఆ మర్నాడే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దాంతో బెయిల్‌పై మధ్యంతర స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ ఊరట దక్కలేదు. దాంతో ఆయన కనీసం మరిన్ని రోజులపాటు తిహార్ జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ.. రిలీజ్‌పై స్టే
న్యూఢిల్లీ, సాక్షి: న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురు దెబ్బ తగిలింది. లిక్కర్ కేసులో ఆయన రెగ్యులర్ బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. దీంతో కాసేపట్లో జైలు నుంచి విడుదల కావాల్సిన ఆయన.. బయటకు రాకుండా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. లిక్కర్ కేసులో ట్రయల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం ఉదయం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అత్యవసరంగా పిటిషన్‌ను విచారించాలని కోరింది. దీంతో పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. తాము విచారణ జరిపేంతవరకు కేజ్రీవాల్ రిలీజ్‌ను నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. మరికాసేపట్లో ఈ పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి.లిక్కర్ కుంభకోణంలో నగదు అక్రమ చలామణి అభియోగాలను ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్‌కు నిన్న పెద్ద ఊరట లభించింది. ఢిల్లీ స్పెషల్ కోర్టు గురువారం సాయంత్రం ఆయనకు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష వ్యక్తిగత బాండు సమర్పించిన తర్వాత ఆయన్ని విడుదల చేయవచ్చని న్యాయమూర్తి న్యాయ్ బిందు ఆదేశించింది. అలాగే.. తీర్పుపై పైకోర్టులో అప్పీలు దాఖలు చేయడానికి వీలుగా దానిని 48 గంటలపాటు పక్కనపెట్టాలని ఈడీ చేసిన వినతిని న్యాయమూర్తి తోసిపుచ్చారు.ఈ క్రమంలో.. విచారణకు ఆటంకం కలిగించరాదని, సాక్షుల్ని ప్రభావితం చేయకూడదని కేజ్రీవాల్‌పై ఆంక్షలు విధించింది ట్రయల్ కోర్టు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోర్టుకు హాజరై విచారణకు సహకరించాలని ఆదేశించింది. అయితే ఈ ఉదయం కేజ్రీవాల్ విడుదల నేపథ్యంలో.. నీటి సంక్షోభంపై పోరాటం చేద్దామని ఉత్సాహంతో ఉన్న ఆప్ శ్రేణులకు ఆయన రిలీజ్‌పై స్టే ఢిల్లీ హైకోర్టు స్టే విధించడంతో ఒక్కసారిగా ఢీలా పడిపోయింది.ఈడీ వాదనల్ని పట్టించుకోని కోర్టుకేసులో సహనిందితులు పొందిన డబ్బుతో కేజ్రీవాల్‌కు సంబంధం ఉందని ఈడీ వాదించింది. 2021 నవంబరు 7న కేజ్రీవాల్ గోవాలోని గ్రాండ్హయత్ హోటల్లో బస చేసినప్పుడు ఆయన తరఫున రూ.లక్ష బిల్లును చెల్లించిన చరణ్‌ప్రీత్ సింగ్ కూడా సహ నిందితుడేనని తెలిపింది. వేర్వేరు మార్గాల ద్వారా చరణ్‌ప్రీత్‌కు రూ.45 కోట్లు అందినట్లు ఆరోపించింది. కేజ్రీవాల్‌కు ఎన్నిసార్లు సమన్లు ఇచ్చినా ఉద్దేశపూర్వకంగా వాటిని పట్టించుకోలేదని, తొమ్మిదిసార్లు అలా జరిగినా తాము అరెస్టు చేయలేదని తెలిపింది.ఇక.. సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్లు అందాయని ఆరోపించినా దానికి ఆధారాలు లేవని, కొందరి వాంగ్మూలాల ఆధారంగానే కేసు నడుస్తోందని కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే ట్రయల్‌కోర్టు ఆ వాదనల్ని పరిగణనలోకి తీసుకోలేదు. -
కవితకు దక్కని ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. తన అరెస్టు అక్రమమంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లాలని సూచించింది. కేసులో రాజకీయ నేత ప్రమేయం ఉన్న కారణంగా చట్టబద్ధమైన పరిష్కారాలు దాటవేయలేమని వ్యాఖ్యానించింది. పిటిషన్లో లేవనెత్తిన రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలు మాత్రమే విచారిస్తామని స్పష్టం చేసింది. కవిత పిటిషన్ శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ బేలా ఎం. త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు ప్రారంభిస్తూ.. హైకోర్టుకు వెళ్లాలని సూచించొద్దని, అనుకూలమైనా, ప్రతికూలమైనా సుప్రీంకోర్టు నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఏం జరుగుతోందో గమనించాలని, కవితకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా లేదని, ఒక అప్రూవర్ ఇచ్చిన స్టేట్మెంట్ కారణంగా అరెస్టు చేశారని, ఇలా చేయడం కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకమని చెప్పారు. అయితే, బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా సూచించారు. దీంతో, హేమంత్ సోరెన్ కేసులో ట్రయల్ కోర్టులో ఏమైందో చూశామని, ఇది జరిగే పని కాదని సిబల్ పేర్కొన్నారు. రాజకీయ వ్యక్తి ప్రమేయం ఉన్నందున చట్టబద్ధమైన పరిష్కారాలు దాటవేయలేమని «బెంచ్ అభిప్రాయపడిందని జస్టిస్ సంజీవ్‌ఖన్నా తెలిపారు. ఒకసారి సాక్షిగా, మరోసారి నిందితురాలిగా కవితకు సమన్లు జారీ చేశారని సిబల్ చెప్పగా, అయినప్పటికీ ఆర్టీకల్ 32 ప్రకారం బెయిల్ ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించిన అంశాలు లేవనెత్తిన కారణంగా ఇప్పటికే విచారణలో ఉన్న విజయ్ మదన్‌లాల్ కేసుకు జత చేస్తామని పేర్కొంది. దీనిపై ఈడీకి నోటీసులు జారీ చేస్తూ ఆరు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఆ తర్వాత రెండు వారాల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని పేర్కొంది. ‘నోటీసులు జారీ చేస్తున్నాం. ట్రయల్ కోర్టు లేదా ఇతర మార్గాల ద్వారా పరిష్కారానికి పిటిషనర్‌కు స్వేచ్ఛ కల్పింస్తున్నాం. బెయిల్ అప్లికేషన్‌ను ట్రయల్ కోర్టు త్వరితంగా పరిష్కరించాలి’అని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా సిబల్ వ్యాఖ్యల్ని గమనించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా భావోద్వేగాలకు గురికావొద్దని సూచించారు. కోర్టు ఆదేశాల అనంతరం ఇది స్వర్ణయుగం కాదన్న సిబల్ వ్యాఖ్యలకు జస్టిస్ ఖన్నా స్పందిస్తూ.. వేచి చూద్దామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు విజయ్ మదన్‌లాల్ కేసు విచారణను జూలైలో చేపట్టనుంది. ఈ నేపథ్యలో ఇదే కేసుకు కవిత పిటిషన్ జత చేయడంతో తదుపరి విచారణ జూలైలోనే జరగనుంది. నేటితో ముగియనున్న కస్టడీ కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఈడీ కస్టడీ ఆదేశాలు శనివారంతో ముగియనున్నా యి. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు కవితను కోర్టులో ప్రవేశపెట్టనున్నా రు. కాగా, ఈడీ కస్టడీలో ఉన్న కవితతో శుక్రవారం సాయంత్రం ఆమె కుమారుడు ఆర్య, మరదలు అఖిల, స్నేహితురాలు వినూత ములాఖత్ అయ్యారు. మరోవైపు, ఈడీ అధికారులు ఆరో రోజూ కవితను సుదీర్ఘంగా విచారించారు. -
స్విచ్‌బోర్డ్‌లో రూ. 15 కోట్ల గోల్కొండ వజ్రం
కోల్‌కతా: సత్యజిత్ రే దర్శకత్వంలో 1979లో వచ్చిన ‘జోయ్ బాబా ఫెలూనాథ్’ అనే బెంగాలీ సినిమాలో అత్యంత ఖరీదైన వజ్రం దుర్గామాత అధిష్టించిన సింహం బొమ్మ నోటిలో చాలాకాలం తర్వాత దొరుకుతుంది. మిస్టరీ వీడిపోతుంది. అలాంటి సంఘటనే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగింది. ఇక్కడ కరెంటు స్విచ్‌బోర్డులో రూ.15 కోట్ల విలువైన 32 క్యారెట్ల బరువైన గోల్కొండ వజ్రం దొరికింది. అసలు విషయమేమి టంటే.. ప్రణబ్ కుమార్ రాయ్ అనే వ్యక్తి వద్ద ఈ వజ్రం ఉండేది. 2002లో దాని నాణ్యత, ధర తెల్సుకునేందుకు ఇంద్రజిత్ తపాదార్ అనే వజ్రాల మధ్యవర్తిని సంప్రదించాడు. 2002 జూన్‌లో ఇంద్రజిత్ మరొకడిని తీసుకొని ప్రణబ్ ఇంటికి వచ్చాడు. వారిద్దరూ కలిసి ప్రణబ్‌ను పిస్తోల్‌తో బెదిరించి వజ్రంతో ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదులో పోలీసులు రంగంలోకి దిగారు. ఇంద్రజిత్ ఇంట్లో గాలింపు చేపట్టారు. వజ్రం ఆచూకీ దొరకలేదు. మరోవైపు తనకేమీ తెలియదని ఇంద్రజిత్ బుకాయించాడు. వజ్రం కచి్చతంగా అతడి ఇంట్లోనే ఉంటుందున్న నమ్మకంతో పోలీసులు అన్వేషణ కొనసాగించారు. అయినాదొరకలేదు. చిట్టచివరకు చాలా రోజుల తర్వాత అదే ఇంట్లో మెట్ల కింద కరెంటు స్విచ్‌బోర్డు లోపలున్న చిన్న సొరంగంలో వజ్రం లభ్యమైంది. నిందితుడు ఇంద్రజిత్‌కు ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఇంకోవైపు వజ్రం యజమాని ప్రణబ్ కుమారేనా కాదా అనే దానిపై న్యాయ వివాదం కొనసాగింది. ఆ వజ్రం అసలు సొంతదారు అతడేనని సిటీ సెషన్స్ కోర్టు గతవారం తీర్పునిచి్చంది. వజ్రం రూపురేఖలు మార్చొద్దని, ఇందుకోసం రూ.2 కోట్ల విలువైన బాండ్ సమర్పించాలని ప్రణబ్‌ను ఆదేశించింది. ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్, షాజహాన్ వజ్రాలు సైతం గోల్కొండ ప్రాంతానికి చెందినవే. -
వర్చువల్ న్యాయం
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘న్యాయం పొందటం ఇప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకోవడంపై ఆధారపడి ఉంది’’ – 2021లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైరవుతూ జస్టిస్ ఎస్ఏ బాబ్డే చేసిన వ్యాఖ్యలివి. అందుకు తగ్గట్టే కరోనా మహమ్మారి రూపంలో ఎదురైన సవాలును వర్చువల్ విధానంలో అధిగమించింది సుప్రీంకోర్టు. వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా విచారణలు కొనసాగించాలని 2020 మార్చిలో కీలక నిర్ణయం తీసుకోవడం ద్వారా అప్పటి సీజేఐ జస్టిస్ బాబ్డే ఇందుకు బాటలు వేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ దాన్ని వ్యవస్థీకృత రూపంలో ముందుకు తీసుకెళ్లి విచారణ ప్రక్రియను కొత్తపుంతలు తొక్కించారు. సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలిచి చూపించారు. దీన్ని హైకోర్టులు, దిగువ స్థాయి కోర్టులు కూడా అందిపుచ్చుకోవడంతో సామాన్యునికి న్యాయం అందే ప్రక్రియ కరోనా వేళ కూడా నిరాఘాటంగా కొనసాగింది. ఎప్పటికప్పుడు సూచనలు కరోనా వల్ల రెండేళ్లు వర్చువల్ విధానంలో సాగిన సుప్రీంకోర్టు ఈ నెల 4 నుంచి మళ్లీ భౌతిక రూపంలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ప్రధాన కేసుల విచారణలు, వాదోపవాదాలను ఇంతకాలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన న్యాయమూర్తులు కరోనా తీవ్రత తగ్గి, ఆంక్షలు సడలటంతో భౌతిక విచారణలు మొదలు పెట్టారు. ఈ రెండేళ్ల కాలంలో వర్చువల్ విధానంలో న్యాయ సేవలందటంలో ఎలాంటి ఆటంకాలూ తలెత్తకుండా చూడటంలో సీజేఐ జస్టిస్ రమణ చురుకైన పాత్ర పోషించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వాడుకోవడం ద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ వచ్చారు. కోర్టు రోజువారీ వ్యవహారాలు, విచారణల్లో ఇబ్బందులు రాకుండా ఈ–కమిటీని అప్రమత్తం చేస్తూ, దాని సలహాలు, సూచనలు పకడ్బందీగా అమలయ్యేలా సీజేఐ చేసిన సూచనలు సత్ఫలితాలనిచ్చాయి. లఖీంపూర్‌ఖేరి ఘటన, పెగసస్ వంటి కీలక కేసుల విచారణలు వర్చువల్‌గానే సాగాయి. 2020 మార్చిలో మొదలు కరోనా నేపథ్యంలో 2020 మార్చి 23 నుంచి సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలకు తెర తీసింది. నాటి సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే సూచనల మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతత్వంలోని సుప్రీంకోర్టు ఈ–కమిటీ వర్చువల్ విచారణలకు ఆదేశాలు జారీ చేసింది. అదే బాటలో హైకోర్టులు, దిగువ స్థాయి కోర్టులు కూడా వీడియో కాన్ఫరెన్స్ విచారణ పద్ధతినే అవలంబించాయి. వర్చువల్ విచారణలు ప్రారంభమైన నెల రోజులకే సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ రమణ ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. కరోనా సమయంలో కోర్టు ప్రాంగణంలోనే డెస్క్‌టాప్‌లు ఏర్పాటు చేసి కవరేజీకి మీడియాను కూడా అనుమతించారు. కరోనా కేసులు పెరుగుతన్న నేపథ్యంలో మీడియాకు యాప్‌ను కూడా రూపొందించారు. తాను జర్నలిస్టుగా ఉన్న సమయంలోని ఇబ్బందులను ఆ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. విచారణలకు వాడుతున్న యాప్‌లోని ఇబ్బందులను గుర్తించి సిస్కో వెబ్ఎక్స్ను వాడకంలోకి తెచ్చారు. జస్టిస్ రమణ సూచనల మేరకు దానిలోని లోపాలను సరిదిద్ది మెరుగు పరిచారు. వర్చువల్ విచారణలో ఇలాంటి పలు ఇబ్బందులను ఈ–కమిటీ ఆధ్వర్యంలో సీజేఐ సూచనల మేరకు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వచ్చారు. విచారణలను పూర్తిగా ప్రత్యక్ష ప్రసారం చేయాలని కూడా సీజేఐ అభిప్రాయపడ్డారు. లాయర్లకు దిశానిర్దేశం వర్చువల్ విచారణల్లో లాయర్లు తమ మొబైల్ ఫోన్ల ద్వారా పాల్గొనడాన్ని జస్టిస్ రమణ తీవ్రంగా ఆక్షేపించారు. దీనివల్ల లాయర్లు సరిగా కనిపించపోవడమే గాక విచారణకు ఆటంకం వస్తోందన్నారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేస్తూ డెస్క్‌టాప్ కొనుక్కోలేరా అని లాయర్లను ప్రశ్నించారు. వారి వస్త్రధారణ విషయంలోనూ పలు సందర్భాల్లో సూచనలు చేశారు. రెండేళ్లలో రికార్డు 2020 మార్చి 23 నుంచి 2022 మార్చి 14 వరకు రెండేళ్లలో సుప్రీంకోర్టు ఏకంగా 2,18,891 కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. ప్రపంచం మొత్తంలో మన సుప్రీంకోర్టు మాత్రమే కరోనా సమయంలో ఇన్ని కేసులు విచారించిందని కేంద్ర న్యాయ మంత్రి ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. దేశంలోని 24 హైకోర్టులు కూడా కరోనా వేళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 61,02,859 కేసులను విచారించాయి. దేశవ్యాప్తంగా జిల్లా కోర్టులు కరోనా వేళ 1,23,29,917 కేసులను విచారించాయి! -
పరువు హత్య కేసులో సంచలన తీర్పు: ఉరే సరి
సాక్షి ప్రతినిధి, చెన్నై: కులాలు వేరైనా మనసులు కలిశాయి. పెద్దలు అంగీకరిచకపోవడంతో రహస్య వివాహం చేసుకున్నారు. అహం దెబ్బతినడంతో ఇరు కుటుంబాల వారూ కూడబలుక్కుని ఆ జంటను అతి కిరాతకంగా హతమార్చారు. నేరం రుజువుకావడంతో ఒకరికి ఉరిశిక్ష, రిటైర్డ్ డీఎస్పీ, ఇన్స్పెక్టర్ సహా 12 మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ న్యాయస్థానం శుక్రవారం తీర్పు చెప్పింది. చదవండి: తల్లికి మధురమైన గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ కేసు వివరాలు కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలోని కుప్పందత్తానికి చెందిన స్వామికన్ను కుమారుడు మురుగేశన్ (25) బీఈ కెమికల్ ఇంజినీరింగ్ చేశాడు. దళితుడైన మురుగేశన్ అదే ప్రాంతంలో మరో సామాజిక వర్గానికి చెందిన దురైస్వామి కుమార్తె కన్నగి (22) ప్రేమించుకున్నారు. వేర్వేరు కులాలు కావడంతో ఇరు కుటుంబాల వారు వీరి ప్రేమను అంగీకరించలేదు. దీంతో 2003 మే 5వ తేదీ కడలూరు రిజిస్ట్రార్ కార్యాలయంలో రహస్య వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా ఎవరిళ్లలో వారు వేర్వేరుగా గడిపేవారు. ఓ దశలో ఇరువురు ఇంటి నుంచి పారిపోయారు. మురుగేశన్ తన భార్య కన్నగిని విళుపురం జిల్లాలోని బంధువుల ఇంట్లో ఉంచి కడలూరు జిల్లాల్లోని తన బంధువుల ఇంటిలో ఉండేవాడు. మురుగేశన్ బాబాయ్ అయ్యాస్వామి సహకారంతో కన్నగి తల్లిదండ్రులు 2003 జూలై 8వ తేదీ ఇద్దరినీ ఇంటికి తెచ్చుకున్నారు. చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన ఆ తరువాత మరికొందరితో కలిసి మురుగేశన్, కన్నగిలను కుప్పందత్తం గ్రామ శ్మశానికి తీసుకెళ్లి ముక్కు, చెవుల ద్వారా విషాన్ని ప్రవేశపెట్టి హతమార్చారు. వారిద్దరి శవాలను అదే శ్మశానంలో తగులబెట్టారు. మురుగేశన్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దారుణాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేశారు. అయితే మీడియాలో మార్మోగిపోవడంతో కేసు నమోదు చేసి ఇరుపక్షాలకు చెందిన నలుగురిని అరెస్ట్ చేశారు. జాతివిధ్వేషాలతో జరిగిన హత్యలు కావడంతో పలువురి డిమాండ్ మేరకు 2004లో ఈ కేసు విచారణ సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. అప్పటి విరుదాచలం ఇన్స్పెక్టర్ చెల్లముత్తు, సబ్ ఇన్స్పెక్టర్ తమిళ్‌మారన్ సహా 15 మందిని నిందితులుగా చేర్చి చార్జిషీటు దాఖలు చేసింది. మొత్తం 81 మంది సాక్షులను విచారించగా వీరిలో సెల్వరాజ్ అనే సాక్షి ఆత్మహత్య చేసుకున్నాడు. కడలూరు జిల్లా ఎస్సీ ఎస్టీ విభాగం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఉత్తమ్‌రాజా ఈ కేసుపై శుక్రవారం తీర్పు చెప్పారు. కన్నగి అన్న మరుదుపాండికి ఉరిశిక్ష, తండ్రి దురైస్వామి, ఇరుపక్షాల బంధువులు రంగస్వామి, కందవేలు, జ్యోతి, వెంకటేశన్, మణి, ధనవేల్, అంజాపులి, రామదాస్, చిన్నదురై, తమిళ్‌మారన్, అప్పటి సీఐ చెల్లముత్తు, (ప్రస్తుతం విశ్రాంత డీఎస్పీ), ఎస్ఐ తమిళ్‌మారన్ (సీఐగా సస్పెన్షన్) సహా మొత్తం 12 మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. వీరిలో కన్నగి తండ్రి దురైస్వామి సహా ఐదుగురికి రెండు యావజ్జీవ శిక్షలు పడ్డాయి. 15 మంది నిందితుల్లో మురుగేశన్ తరఫు అయ్యాస్వామి, గుణశేఖరన్‌లను నిర్దోషులుగా విడిచిపెట్టారు. -
కేరళ పిటిషన్‌ను తొసిపుచ్చిన సుప్రీంకోర్టు
తిరువనంతపురం: మలయాళ నటుడు దిలీప్ కుమార్‌తో పాటు మరి కొంతమంది లైంగిక వేధింపులు, అపహరణ కేసుల విచారణను బదిలీ చేయాలని కేరళ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. జస్టీస్ ఏఎం నేతృత్వంలోని ఖాన్విల్కర్ ధర్మాసనం ట్రయల్ జడ్జిపై పక్షపాత ఆరోపణలు చేయడం అనవసరమని కేరళ హైకోర్టుతో అంగీకరించారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది జి ప్రకాష్ ‘బాధితురాలిపై ప్రాసిక్యూషన్, పక్షపాత సంఘటనల కారణంగా ఈ కేసు విచారణ దెబ్బతిందని, న్యాయమైన విచారణ పొందడం బాధితురాలి హక్కు’ అని ఆయన ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘విచారణ నేపథ్యంలో బాధితురాలిని పరీక్షించే సమయంలో ఈ కేసులో 5వ నిందితుడు తన ఫోన్లో కోర్టు హాల్ చిత్రాలను తీశాడు. అదే విధంగా బాధితురాలైన సదరు మహిళ కోర్టుకు వస్తున్న కారు ఫొటోలు కూడా తీశాడు. అయితే ప్రాసిక్యూషన్ వారు ఈ అంశాలను ట్రయల్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ట్రయల్ కోర్టు ఈ విషయంలో మౌనం వహించింది. దీనిని భారత ఆధారాల చట్ట ఉల్లంఘనగా నిర్వహించబడుతోందని’ రాష్ట్ర ప్రభుత్వం తన పటిషన్లో సుప్రీంకు నొక్కి చెప్పింది. అంతేగాక ఈ కేసు క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు 40 మంది డిఫెన్స్ న్యాయదులు హాజరయ్యారని ప్రభుత్వం తెలిపింది. కోర్టు హాల్లో పెద్ద సంఖ్యలో న్యాయవాదులను అనుమతించిన కారణంగా బాధితురాలిని ప్రశ్నించడంలో నైతిక స్వభాన్ని ప్రశ్నించినప్పటికి లైంగిక వేధింపుల వివరాలపై ప్రశ్నించకుండా విచారణను అడ్డుకోవడంలో ట్రయల్ కోర్టు న్యాయమూర్తి విఫలమ్యారని ప్రభుత్వం పేర్కొంది. చెప్పాలంటే ఒక దశలో ట్రయల్ జడ్జి స్పష్టమైన కారణం లేకుండానే ఆందోళన చేందారని, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్యాప్తు సంస్థకు వ్యతిరేకంగా అనవసర వ్యాఖ్యలు చేసినట్లు రాష్ట్ర ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఎర్నాకుళంలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసు విచారణను వెంటనే నిలిపివేయాలని రాష్ట్రం సుప్రీంకోర్టును కోరింది. అయితే ఈ కేసులో బాధితురాలైన మహిళ కారులో కొచ్చి వెళ్తుండగా ఆమెను బంధించి నటుడు దిలీప్‌తో పాటు కొంతమంది వ్యక్తులు ఆమెపై లైంగిక వేధింపులకు తెగబడినట్లు కేరళ పోలీసులు తెలిపారు. అంతేగాక ఈ ఘటన సమయంలో నిందితులు ఘటనకు సంబంధించి తమ ఫోన్లో వీడియోలు, ఫొటోలు కూడా తీశారని, ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా నటుడు దీలిప్‌ను బాధితురాలు ఆరోపించడంతో అరెస్టు చేసినట్లు కేరళ పోలీసులు పేర్కొన్నారు. -
ఉరి వాయిదాపై హైకోర్టుకు కేంద్రం
న్యూఢిల్లీ: ‘నిర్భయ’దోషుల ఉరి అమలును నిరవధిక వాయిదా వేస్తూ ఢిల్లీలోని ట్రయల్ కోర్టు చెప్పిన తీర్పును కేంద్రం ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. అత్యవసరంగా విచారించాలంటూ శనివారం పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్ ఈ పిటిషన్‌ను ఆదివారం విచారిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి నలుగురు దోషులకు, జైళ్ల శాఖ డీజీ, తీహార్జైలు అధికారులకు కూడా నోటీసులు పంపించారు. ఉరిని వాయిదా వేస్తున్నట్లు ట్రయల్‌కోర్టు శుక్రవారం తీర్పునివ్వగా, శనివారమే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హైకోర్టును చేరింది. ట్రయల్ కోర్టు తమ పరిధిని మించి తీర్పునిచ్చిందని పిటిషన్లో పేర్కొంది. కేంద్రం తరఫునవాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దోషులకు ఉన్న అన్ని చట్టపరమైన అవకాశాలు ఉపయోగించుకొనేందుకు తగిన సమయం ఇచ్చామని, అయితే వారు ఉద్దేశపూర్వకంగానే విచారణ ఆలస్యమయ్యేలా పిటిషన్లు దాఖలు చేస్తున్నారని తెలిపారు. ఇది న్యాయ వ్యవస్థను అవమానపర్చడమేనని పేర్కొన్నారు. దోషులకు ఉరి వాయిదా పడడంపై నిర్భయ తల్లి ఆశా దేవి స్పందిస్తూ.. దోషులకు మరణశిక్ష పడేవరకూ తన పోరాటం ఆగదని చెప్పారు. తిరస్కరించిన రాష్ట్రపతి ‘నిర్భయ’కేసులో దోషి వినయ్‌కుమార్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి కోవింద్ తిరస్కరించారు. ఇప్పటికే వినయ్ కుమార్ శర్మ, అక్షయ్‌ల క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీకోర్టు కొట్టేసింది. -
ఇదేమైనా జోక్ అనుకుంటున్నారా?
న్యూఢిల్లీ: వీడియో కాన్ఫరెన్స్‌కు అంతరాయం కలగడంతో జార్ఖండ్‌లోని ఓ ట్రయల్ కోర్టు కేసు విచారణను వాట్సాప్ కాల్ ద్వారా నిర్వహించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కేసుల విచారణను జోక్ అనుకుంటున్నారా? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. జార్ఖండ్ మాజీ మంత్రి యోగేంద్ర సావో, ఆయన భార్య నిర్మలా దేవీలపై 2016లో జార్ఖండ్‌లో అల్లర్లు రెచ్చగొట్టినట్లు కేసు నమోదయింది. ఈ కేసులో హజారీబాగ్ ట్రయల్ కోర్టు జడ్జి నిందితుల్ని భోపాల్ కోర్టులో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. ఇంటర్నెట్ సమస్య తో వీడియో కాన్ఫరెన్స్‌కు అంతరాయం కలగడంతో వాట్సాప్ కాల్ ద్వారా విచారణ చేపట్టి నిందితులపై అభియోగాలు నమోదుచేశారు. దీన్ని సవాలు చేస్తూ సావో, నిర్మల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ ఎస్ బాబ్డే, జస్టిస్ ఎల్ఎన్ రావుల ధర్మాసనం స్పందిస్తూ..‘అసలు జార్ఖండ్‌లో ఏం జరుగుతోంది? ఇలాంటి పద్ధతులను అనుమతించకూడదు. ఇదేం రకమైన విచారణ? అని జార్ఖండ్ ప్రభుత్వ న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. -
అరెస్ట్ నుంచి రక్షణ కల్పించండి: చిదంబరం
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం బుధవారం ట్రయల్‌కోర్టుతో పాటు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఎయిర్‌సెల్–మాక్సిస్, ఐఎన్ఎక్స్ మీడియా కేసులకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐలు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు చిదంబరం తరఫున సీనియర్ లాయర్లు సిబల్, సింఘ్వీలు కోర్టుల్లో పిటిషన్లు వేశారు. చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్‌సెల్–మాక్సిస్ రూ.3,500 కోట్ల ఒప్పందంలో, ఐఎన్ఎక్స్ మీడియాకు రూ.350 కోట్ల విదేశీ పెట్టుబడుల అనుమతుల జారీలో అవకతవకలు జరిగాయని ఆరోపణ. ఈ నేపథ్యంలో ఎయిర్‌సెల్–మాక్సిస్ కేసులో బుధవారం విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీచేయడంతో చిదంబరం ట్రయల్‌కోర్టును ఆశ్రయించారు. -
ప్రొఫెసర్ సాయిబాబా కేసును రోజూ విచారించండి
ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: నక్సల్స్ తో సంబంధాల ఆరోపణలపై అరెస్టయిన ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కేసును ప్రతిరోజూ విచారించాలని మహారాష్ట్రలోని విచారణ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. సాయిబాబా బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సోమవారం జస్టిస్ జేఎస్ ఖేహర్, సీ నాగప్పన్‌ల ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. నెల రోజుల్లోపు ప్రాసిక్యూషన్ వారు ఇచ్చిన 8 ప్రధాన సాక్ష్యాలను పరిశీలించాలని గడ్చిరోలిలోని ట్రయల్ కోర్టుకు సూచించింది. వీటిని పరిశీలించాకే బెయిల్ మంజూరును పరిగణలోకి తీసుకుంటామంది. సాయిబాబా సహా నిందితులందరూ విచారణకు సహకరించాలని ఆదేశించింది. తదుపరి విచారణ తేదీ అయిన ఏప్రిల్ 4లోగా సంబంధిత వివరాలు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం వేసిన కౌంటర్, అదనపు అఫిడవిట్లను అధ్యయనం చేశామని, సాయిబాబా న్యాయవాది వాదనలను విన్నామని ధర్మాసనం తెలిపింది. -
వేధింపుల కేసులో యువకుడికి జైలు శిక్ష రద్దు
న్యూఢిల్లీ: యువతిని వేధించాడనే ఆరోపణలపై ట్రయల్ కోర్టు విధించిన ఒక సంవత్సరం జైలు శిక్ష నుంచి యువకునికి విముక్తి కలిగిస్తూ సెషన్స్ కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. నిందితుడిపై వచ్చిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది, అతనిపై చేసిన ఆరోపణల్లో వాస్తవికతను కోర్టు సందేహించింది. ఆరోపణలు చేస్తున్న యువతి, విచారణాధికారులు వాస్తవాన్ని మరుగుపరిచేందుకు ప్రయత్నించినట్లు కోర్టు గుర్తించిందని న్యాయమూర్తి తెలిపారు. ఈ మేరకు జహంగిర్ పురి నివాసి అనిల్ కుమార్‌ను శిక్ష నుంచి తప్పిస్తూ సెషన్స్ కోర్ట్ జడ్జి మనురాయ్ సేథీ తీర్పునిచ్చారు. ఫిర్యాదు చేసిన యువతి ఆరోపణలలో వైరుధ్యాలున్నాయని, దీంతో ఆరోపణల్లో వాస్తవికతపై సందేహం కలుగుతున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఈ కేసులో నమోదు చేసిన ప్రాసిక్యూషన్ సాక్ష్యాలతోపాటు ప్రాసిక్యూషన్ కథనాలు కూడా సందేహాస్పదంగా ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. బాధితురాలు ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన వాంగ్మూలానికి, వైద్య పరీక్షల నివేదికకు పొంతన లేదని కోర్టు తెలిపింది. సంశయ లాభం కింద అనిల్ శిక్షను రద్దు చేస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. -
ఉద్యోగం సంపాదించు లేదా ఆస్తులు అమ్ముకో
న్యూఢిల్లీ: తన నుంచి విడిపోయిన భార్యను పోషించేందుకు ఉద్యోగం సంపాదించుకోవాలని లేదా ఆస్తులు అమ్ముకోవాలని నగర కోర్టు ఓ వ్యక్తిని ఆదేశించింది. విడాకులిచ్చిన భార్యకు నెల రూ.15 వేల చొప్పున చెల్లించాలని ఆదేశిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సదరు వ్యక్తి సెషన్స్ కోర్టులో సవాలు చేశారు. తాను నిరుద్యోగినని, అందువల్ల విడిపోయిన భార్యకు అంత మొత్తం చెల్లించాలని ఆదేశించడం అన్యాయమని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విజ్ఞప్తిపై విచారణ జరిపిన సెషన్స్ జడ్జి అనురాధ శుక్లా భరద్వాజ్ శుక్రవారం తీర్పు ప్రకటిస్తూ సదరు వ్యక్తి (భర్త) తన సామర్థ్యం, హోదాతో ఇప్పటికే ఉద్యోగం సంపాదించి ఉండవచ్చునని వ్యాఖ్యానించారు. తన భార్యతో సహా, తనపై ఆధారపడిన వారందరినీ పోషించేందుకు ఆస్తులను కూడా అమ్ముకోవచ్చని అన్నారు. భార్యకు రూ.15వేలు చెల్లించాలన్న ట్రయల్ కోర్టు ఆదేశాలు సరైనవేనని జస్టిస్ అనురాధ పేర్కొన్నారు. తన భార్య పెట్టే హింస కారణంగానే తాను ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆ వ్యక్తి పేర్కొనగా, తనకు భరణం చెల్లించాల్సి వస్తుందన్న కారణంతోనే అతడు ఉద్యోగానికి రాజీనామా చేశాడని భార్య కోర్టుకు తెలిపింది. -
‘డ్రంకెన్ డ్రైవింగ్ కేసులను ఉపేక్షించేది లేదు’
న్యూఢిల్లీ : తాగిన మైకంలో డ్రైవింగ్ చేసిన వ్యక్తికి నాలుగురోజులపాటు జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు చెప్పిన తీర్పును వాయిదా వే యాలని వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఇలాంటి కేసుల వల్ల సమాజం తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని, ఇలాంటి కేసులను ఉపేక్షించేది లేదని పేర్కొంది. డ్రంకెన్ డ్రైవ్ కేసులో శిక్షపడిన ఢిల్లీకి చెందిన సంజీవ్ దువా వేసిన పిటిషన్‌పై అదనపు సెషన్స్ జడ్జి గిరీష్ కతాపియా పై విధంగా స్పందించారు. తాగి డ్రైవ్ చేయడాన్ని ట్రయల్ కోర్టు తీవ్రంగా పరిగణించి నిందితుడికి ఆర్థికపరమైన జరిమానా కూడా విధించిందని, అయినప్పటికీ నేర తీవ్రతను అర్థం చేసుకొన్నట్లు లేదని జడ్జి వ్యాఖ్యానించారు. ఆర్థిక పరమైన జరిమానా విధించడం వల్ల ఇలాంటి చర్యలు పునరావృతం కావని పేర్కొన్నారు. అదేవిధంగా నిందితుడు చేసింది తప్పుగా భావించడం లేదని, ఇతడికి శిక్ష అమలు చేయకుంటే, సమాజానికి తప్పుడు సంకేతం వెళుతోందని తెలిపారు. తాగి డ్రైవింగ్ చేసిన సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయని, దీని వల్ల పలువురు మరణాలు, అంగవైకల్యం బారిన పడుతున్నారని చెప్పారు. ట్రయల్ కోర్టు ఎదుట దువా నేరం అంగీకరించాడు. ఈ మేరకు 4 రోజుల జైలు, రూ. 3,600 జరిమానా విధించిందని తెలిపారు. అక్టోబర్ 9, 2014 సాయంత్రం తాగిన మైకంలో కారు డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ సమయంలో అనుమతికి మించి 23 రెట్లు అల్కాహాల్ తాగినట్లు బ్రీతింగ్ అనలైజర్ టెస్టులో తేలింది. కారు కూడా నిందితుడి సొంతానిది కాదు, అనుమతించబడిన డ్రైవింగ్ లెసైన్స్ లేదు. ఇన్సూరెన్స్ పత్రాలు, పర్యావరణ అనుమతి పత్రాలు లేవు. ఈ మేరకు పోలీసులు మోటార్ వెహికిల్ యాక్టు కింద కేసు నమోదు చేశారు. దీని ప్రకారం మొదటిసారి నిందితుడు తప్పు చేస్తే సుమారు ఆర్నెళ్ల జైలు శిక్ష విధించాల్సి ఉంటోంది. కానీ, మెజిస్ట్రేట్ సాధారణ శిక్ష మాత్రమే విధించారు. ఈ విషయాలను పరిశీలించిన కోర్టు పిటిషనర్ విజ్ఞప్తిని నిరాకరించింది. దువాను కస్టడీకి తీసుకొని నాలుగు రోజుల జైలు శిక్షను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. -
నిత్యానందకు అరెస్టు వారంట్లు
బెంగళూరు: కోర్టులో విచారణకు గైర్హాజరు కావటంపై ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు సోమవారం నాన్‌బెయిలబుల్ అరెస్టు వారంట్లు జారీ అయ్యాయి. లైంగిక ఆరోపణల కేసుకు సంబంధించిన విచారణ సోమవారం రామనగర కోర్టులో జరిగింది. తాను ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉండటం వల్ల కోర్టుకు హాజరు కాలేకపోతున్నట్లు నిత్యానంద తరుఫు న్యాయవాది ద్వారా తెలిపారు. దీనిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిత్యానందను అరెస్టు చేసి ఆగస్టు 7న కోర్టులో హాజరు పరచాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. -
కోల్గేట్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు
ఢిల్లీ హైకోర్టుకు సుప్రీం ఆదేశం ఎస్‌పీపీగా గోపాల సుబ్రమణియం నియూమకానికి సీజేఐ మొగ్గు న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటారుుంపు కుంభకోణం కేసుల విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయూలని సుప్రీంకోర్టు శుక్రవారం ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది. సీబీఐ, ఈడీల దర్యాప్తు నేపథ్యంలో ఉత్పన్నమయ్యే కేసులను పరిష్కరించేందుకు వీలుగా వారంలోగా ప్రత్యేక జడ్జి పేరును ప్రకటించాలని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. దేశ రాజధానిలోని ప్రత్యేక కోర్టు ముందు విచారణ కార్యకలాపాల నిర్వహణ నిమిత్తం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎస్పీపీ)గా ప్రముఖ న్యాయవాదిని నియమించాలని కూడా చీఫ్ జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని సుప్రీం బెంచ్ నిర్ణరుుంచింది. ఢిల్లీ అత్యున్నత న్యాయ విభాగానికి చెందిన ఓ అధికారిని ప్రత్యేక జడ్జిగా నియమించేందుకు చీఫ్ జస్టిస్ నుంచి ఉత్తర్వులు పొందాల్సిందిగా సూచిస్తూ.. ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు లేఖ రాయూల్సిందిగా సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ను ఆదేశిస్తున్నట్టు తెలిపింది. ఎస్‌పీపీని ఏకగ్రీవంగా ఎంపిక చేసేందుకు వీలుగా అందరూ కలిసి సంప్రదింపులు జరపాలని సూచించింది. ఇందుకోసం స్వేచ్ఛాయుతమైన న్యాయ ధృక్పథం, నిజారుుతీ కలిగిన వ్యక్తి కావాలనే ఆకాంక్ష వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. తమ తొలి ప్రాధాన్యతగా సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రమణియం పేరును ప్రస్తావించింది. ఈ బాధ్యతలు స్వీకరించేందుకు ఆయన్ను ఒప్పించాల్సిన అవసరం ఉందంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించే విషయంలో సుబ్రమణియం పేరును కేంద్రం పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆయన్నే బొగ్గు కుంభకోణం కేసులకు సంబంధించి ఎస్‌పీపీగా నియమించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొగ్గు చూపడం విశేషం. -
అభియోగాలు నమోదైతే అనర్హతే!
న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే నేర చరితులపై లా కమిషన్ తనదైన శైలిలో కఠిన వైఖరి అవలంబించింది. అభ్యర్థుల నేర చరిత్ర, అఫిడవిట్లలో పొందుపరిచే సమాచారం విషయంలో కఠినంగా వ్యవహరిస్తేనే తప్ప రాజకీయాల్లోకి నేరస్తులు ప్రవేశించకుండా జాగ్రత్త పడడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. గరిష్టంగా ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం శిక్షపడే కేసుల్లో ఒక వ్యక్తిపై కోర్టు అభియోగాలు నమోదు చేస్తే.. సదరు వ్యక్తిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆరేళ్లపాటు అనర్హత వేటు వేయాల్సిందేనని ఉద్ఘాటించింది. దోష నిర్ధారణ జరిగే వరకు వేచి చూసేధోరణిని కమిషన్ తప్పుబట్టింది. విచారణలో జరుగుతున్న కాలహరణం, దోష నిర్ధారణకు సుదీర్ఘ సమయం పడుతుండడం వంటివి రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకునే నేరస్తులకు వరంగా మారుతున్నాయని తేల్చిచెప్పిన కమిషన్, ఈ క్రమంలో అభియోగాలు నమోదైన వెంటనే సదరు వక్తులపై అనర్హత వేటు వేయాలని సూచించింది. అదేవిధంగా అఫిడవిట్లలో తప్పుడు సమాచా రం ఇచ్చే అభ్యర్థులకు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కనీసం రెండేళ్లకు తక్కువ కాకుండా కఠిన శిక్ష విధించాలని పేర్కొంది. ఈ మేరకు ఎన్నికల సంస్కరణలపై లా కమిషన్ తన సిఫార్సులను సుప్రీంకోర్టుకు సమర్పించింది. కమిషన్ చేసిన కీలక సిఫార్సులు.. - ఎన్నికల నామినేషన్‌ను పరిశీలించే సమయానికి కచ్చితంగా ఏడాది ముందు నమోదైన అభియోగాల ఆధారంగా సదరు అభ్యర్థిపై అనర్హత వేటు వేయరాదు. - అభియోగాలపై విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు సదరు వ్యక్తిని విడుదల చేసే వరకు లేదా ఆరేళ్ల వరకు అనర్హత కొనసాగించాలి. - సిట్టింగ్ ఎంపీ/ఎమ్మెల్యేలపై నమోదయ్యే అభియోగాలపై ఏడాదిలోగా విచారణను పూర్తి చేయాలి, రోజువారీ విచారణ చేపట్టాలి. అయితే, సీఆర్పీసీ సెక్షన్ 173 ప్రకారం పోలీసులు నమోదు చేసే అభియోగాల ఆధారంగా అప్పటికప్పుడే అనర్హత వేటు వేయడం సమంజసం కాదు. - అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చేవారిని అవినీతికి పాల్పడినట్టుగా భావించి రెండేళ్లకు తగ్గకుండా శిక్ష విధించాలి. -
పుణే బస్ డ్రైవర్ మరణశిక్ష వాయిదా
ముంబై: పుణే బస్ డ్రైవర్ మరణ శిక్షను బాంబే హైకోర్టు వాయిదా వే సింది. అధికారుల మీద కోపంతో బస్సును అడ్డదిడ్డంగా నడిపి తొమ్మిది మంది మృతికి, 37 మంది గాయాలపాలు కావడానికి కారకుడైన సంతోష్ మానేకు ట్రయల్ కోర్టు ఏప్రిల్ 8న మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. తనకు విధించిన శిక్షపై మానే వాదనను ట్రయల్ కోర్టు వినలేదన్న కారణంతో మానేకు విధించిన మరణ శిక్షను హైకోర్టు వాయిదా వేసింది. ట్రయల్ కోర్టు విధించిన శిక్షను ఖరారు చేసే సందర్భంలో న్యాయమూర్తి పీవీ హర్దాస్, పీఎన్ దేశ్‌ముఖ్‌లతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. మానే వాదనను కూడా వినాల్సిన అవసరాన్ని న్యాయస్థానం గుర్తించాలని పేర్కొంది. కేసును మళ్లీ ట్రయల్ కోర్టుకే బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. మానే తరఫు వాదనను కూడా వినాలని ట్రయల్ కోర్టుకు సూచిందింది. మానేను అక్టోబర్ 15న ట్రయల్ కోర్టులో హాజరుపర్చాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఆయన తరఫు వాదన కూడా విన్న తర్వాత న్యాయమూర్తి శిక్షను విధించాలని పేర్కొంది.