ఢిల్లీ లిక్కర్ కేసు: సీబీఐ ఛార్జ్‌షీట్‌పై విచారణ వాయిదా | delhi liquor case: trial court hearings postpones september 11 over cbi charge sheet | Sakshi
Sakshi News home page

ఢిల్లీ లిక్కర్ కేసు: సీబీఐ ఛార్జ్‌షీట్‌పై విచారణ వాయిదా

Published Wed, Aug 28 2024 1:15 PM | Last Updated on Wed, Aug 28 2024 1:37 PM

delhi liquor case: trial court hearings postpones september 11 over cbi charge sheet

ఢిల్లి: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో  దర్యాప్తు సంస్థ సీబీఐ ఛార్జ్‌షీట్‌పై విచారణను ఢిల్లీ రౌస్‌ అవెన్యూ ట్రయల్ కోర్టు వేసింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై విచారణను సెప్టెంబర్‌ 11 తేదీకి వాయిదా వేసినట్లు న్యాయమూర్తి కావేరి భవేజా తెలిపారు. 

బుధవారం ట్రయల్ కోర్టు చేపట్టిన విచారణకు ఎమ్మెల్సీ కవిత, మనీష్‌ సిసోడియా, ఇతర నిందితులు వర్చువల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కొన్ని డాక్యుమెంట్స్ సరిగా లేవని, కోర్టు రికార్డుల నుంచి బెస్ట్ క్వాలిటీతో ఉ‍న్న పత్రాలను ఇవ్వాలని నిందితుల న్యాయవాదులు కోర్టును కోరారు. సెప్టెంబర్ 4 లోపు డిఫెన్స్ లాయర్లు అడుగుతున్న డాక్యుమెంట్లను వారికి అందజేయాలని జడ్జి కావేరి భావేజా అదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement