అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించండి: చిదంబరం | Chidambaram moves court for protection from arrest in Aircel-Maxis case | Sakshi
Sakshi News home page

అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించండి: చిదంబరం

Published Thu, May 31 2018 4:58 AM | Last Updated on Tue, Jun 4 2019 6:47 PM

Chidambaram moves court for protection from arrest in Aircel-Maxis case - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం బుధవారం ట్రయల్‌కోర్టుతో పాటు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఎయిర్‌సెల్‌–మాక్సిస్, ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), సీబీఐలు అరెస్ట్‌ చేయకుండా రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు చిదంబరం తరఫున సీనియర్‌ లాయర్లు సిబల్, సింఘ్వీలు కోర్టుల్లో పిటిషన్లు వేశారు. చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్‌సెల్‌–మాక్సిస్‌ రూ.3,500 కోట్ల ఒప్పందంలో, ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు రూ.350 కోట్ల విదేశీ పెట్టుబడుల అనుమతుల జారీలో అవకతవకలు జరిగాయని ఆరోపణ. ఈ నేపథ్యంలో ఎయిర్‌సెల్‌–మాక్సిస్‌ కేసులో బుధవారం విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీచేయడంతో చిదంబరం ట్రయల్‌కోర్టును ఆశ్రయించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement