ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టైన ముఖ్యంమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీట్‌ను ఢిల్లీ ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. లిక్కర్ కేసులో ఈడీ 7వ సప్లిమెంటరీ చార్జి షీట్ దాఖలు చేసింది. తాజా ఛార్జ్ షీట్‌లో కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీలపై ఈడీ అభియోగాలు మోపింది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా జూలై 12వ తేదీకి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది.
మరోవైపు.. తనను సీబీఐ అరెస్ట్ చేయటం, మూడు రోజుల కస్టడీకి తీసుకోవటంపై అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసింది. దీంతో పాటు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇక.. ఈ రెండు పిటిషన్లపై జూలై 17న విచారణ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment