న్యూఢిల్లీ: తన నుంచి విడిపోయిన భార్యను పోషించేందుకు ఉద్యోగం సంపాదించుకోవాలని లేదా ఆస్తులు అమ్ముకోవాలని నగర కోర్టు ఓ వ్యక్తిని ఆదేశించింది. విడాకులిచ్చిన భార్యకు నెల రూ.15 వేల చొప్పున చెల్లించాలని ఆదేశిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సదరు వ్యక్తి సెషన్స్ కోర్టులో సవాలు చేశారు. తాను నిరుద్యోగినని, అందువల్ల విడిపోయిన భార్యకు అంత మొత్తం చెల్లించాలని ఆదేశించడం అన్యాయమని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ విజ్ఞప్తిపై విచారణ జరిపిన సెషన్స్ జడ్జి అనురాధ శుక్లా భరద్వాజ్ శుక్రవారం తీర్పు ప్రకటిస్తూ సదరు వ్యక్తి (భర్త) తన సామర్థ్యం, హోదాతో ఇప్పటికే ఉద్యోగం సంపాదించి ఉండవచ్చునని వ్యాఖ్యానించారు. తన భార్యతో సహా, తనపై ఆధారపడిన వారందరినీ పోషించేందుకు ఆస్తులను కూడా అమ్ముకోవచ్చని అన్నారు. భార్యకు రూ.15వేలు చెల్లించాలన్న ట్రయల్ కోర్టు ఆదేశాలు సరైనవేనని జస్టిస్ అనురాధ పేర్కొన్నారు. తన భార్య పెట్టే హింస కారణంగానే తాను ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆ వ్యక్తి పేర్కొనగా, తనకు భరణం చెల్లించాల్సి వస్తుందన్న కారణంతోనే అతడు ఉద్యోగానికి రాజీనామా చేశాడని భార్య కోర్టుకు తెలిపింది.
ఉద్యోగం సంపాదించు లేదా ఆస్తులు అమ్ముకో
Published Fri, Dec 5 2014 11:51 PM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM
Advertisement