చండీగఢ్:ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్)చీఫ్,ఢిల్లీమాజీసీఎం అరవింద్‌కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.ఆదివారం(సెప్టెంబర్29)హర్యానాలో జరిగిన బహిరంగసభలో కేజ్రీవాల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ‘జైలులో నన్ను మానసికంగా,శారీరకంగా చిత్రహింసలు పెట్టేందుకు ప్రయత్నించారు.నేను షుగర్ పేషేంట్‌ను.నాకు రోజుకు నాలుగు ఇన్సులిన్ ఇంజెలిక్షన్లు అవసరం. జైలులో నాకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు అందకుండా చేశారు.అయితే వారికి తెలియని విషయం ఏంటంటే.వాళ్లు నన్ను ఏమీ చేయలేరు.ఎందుకంటే నేను హర్యానా బిడ్డను’అని కేజ్రీవాల్ అన్నారు.
లిక్కర్ స్కామ్ కేసులో ఐదు నెలలు జైలులో గడిపిన తర్వాత కేజ్రీవాల్‌కు సుపప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన సెప్టెంబర్ 13న తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు.ఢిల్లీ ప్రజలు మళ్లీ ఆమ్‌ఆద్మీపార్టీకి అధికారం ఇస్తేనే తాను సీఎం పదవి తీసుకుంటానని తెలిపారు.
ఇదీ చదవండి: సభా వేదికపై ఖర్గేకు అస్వస్థత
Comments
Please login to add a commentAdd a comment