
ఢిల్లీ : లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా శనివారం జైలు నుంచి బయటికి వచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను చూసేందుకుగాను మధుర రోడ్‌లోని తన నివాసానికి వెళ్లారు. భార్యను చూసేందుకు కోర్టు సిసోడియాకు 6 గంటల పాటు ప్రత్యేక అనుమతిచ్చింది. అయితే ఈ ఆరు గంటల్లో మీడియాతో మాట్లాడవద్దని, ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు చేయరాదని షరతు విధించింది.
సిసోడియా భార్య మల్టీపుల్ స్క్లిరోసిస్‌తో బాధపడుతున్నారు. జూన్‌లో కూడా సిసోడియా తన భార్యను చూసేందుకు కోర్టు అనుమతితో జైలు నుంచి ఇంటికి వచ్చారు. అయితే అప్పుడు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో సిసోడియా భార్యను చూడకుండానే జైలుకు వెనుదిరిగారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టయిన సిసోడియా అప్పటి నుంచి తీహార్ జైలులోనే రిమాండ్‌లో ఉంటున్నారు. ఆయన బెయిల్ పిటిషన్లను కోర్టులు పలుమార్లు రిజెక్ట్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment