మనకు తెలిసినవారు ఎవరైనా జైలుకు వెళ్లారనే వార్త వినిపిస్తే, ముందుగా మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ప్రపంచంలో 200 సంవత్సరాల క్రితం నిర్మితమైన జైలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఈ జైలులో దెయ్యాలు ఉన్నాయని స్థానికులు చెబుతుంటారు. ఈస్టర్న్ స్టేట్ పెనిటెన్షియరీ ప్రపంచంలోనే మొదటి జైలుగా పరిగణిస్తారు. ప్రమాదకరమైన ఖైదీల కోసం ఈ జైలును నిర్మించారు. జైళ్ల నిర్మాణానికి ఈ జైలు నమూనాగా నిలిచింది.
అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియా నగరంలో ఈ జైలు నిర్మితమయ్యింది. 1829లో నిర్మించిన ఈ జైలులో 1971 వరకు కార్యకలాపాలు కొనసాగాయి. మొదట్లో ఈ జైలును 250 మంది ఖైదీల కోసం మాత్రమే నిర్మించారు. ఐదు దశాబ్దాల్లో జైలులోని సంఖ్య 1000కు పైగా పెరిగింది. ఆ తర్వాత జైల్లో ఖైదీల కష్టాలు ఎక్కువయ్యాయి. 1900లలో ఈ జైలులో టీబీ వంటి ప్రాణాంతక వ్యాధి వ్యాపించింది. దీంతో చాలా మంది ఖైదీలు చనిపోయారు.
చలికాలంలో ఈ జైలులో ఉష్ణోగ్రతలు మైనస్‌కు పడిపోవడంతో చలికి ఖైదీలు వణికిపోయేవారు. ఖైదీల సంఖ్య పెరిగిన నేపధ్యంలో జైలు అధికారులను మరిన్ని సెల్‌లను నిర్మించవలసి వచ్చింది. వీటిలో కొన్ని భూగర్భంలో నిర్మితమయ్యాయి. జైలులో 1961లో జరిగిన ఒక సంఘటన సంచలనం రేకెత్తించింది. జైలులోని 800 మందికి పైగా ఖైదీలు జైలు గార్డులు తమను హింసించారని ఆరోపిస్తూ వారిపై దాడి చేశారు.
ఈ జైలులో కరుడుగట్టిన నేరస్తులు కూడా ఉండేవారు. వీరిలో చికాగో గ్యాంగ్‌స్టర్ అల్ కాపోన్ పేరు కూడా వినిపిస్తుంది. కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఈ జైలు 1971లో మూసివేశారు. అయితే 1994లో హిస్టరీ టూరిజం కోసం జైలు తిరిగి తెరిచారు. ఇప్పుడు ఈ జైలు ఆసక్తికర పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. నేటికీ ఈ జైలు నుంచి వింత శబ్దాలు వస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు.
ఇది కూడా చదవండి: మూగజీవిపై ప్రేమ అంటే ఇదే..!
Comments
Please login to add a commentAdd a comment