ఓ వ్యక్తి ఎలాంటి కారణం లేకుండా మనుషులను చంపడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఎందుకు? ఏమిటీ అనే కారణాలతో సంబంధం లేకుండా దారుణాలకు ఒడిగట్టాడు. దొరకననే ధైర్యమా లేక టైం పాస్‌కి అలా చేశాడో తెలియదు. చివరికీ ప్రజలంతా అతడ్ని చంపేయాలని తీర్మానించారు. అప్పుడైనా మార్పు వచ్చిందో లేదో గానీ అకారణంగా అమాయకులు ప్రాణాలు బలిగ్నొ దుర్మార్గుడిగా నిలిచిపోయాడు.
వివరాల్లోకెళ్తే..ఓ వ్యక్తి కామిక్ బుక్‌లో ఉండే జోకర్‌లా వేషం ధరించి టోక్యలోని ఓ రైలులో మారణకాండకు తెగబడ్డాడు. విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 70 ఏళ్ల వృద్ధిడితో సహా దాదాపు 12 మంది వ్యక్తులను నిర్ధాక్షిణ్యంగా చంపేశాడు. ఆ దారుణం 2021లో జరిగింది. ఐతే ఆ టైంలో ఆ ఘటనకు పాల్పడిన వ్యక్తి ఎవ్వరో తెలియక పోలీసులు తలపట్టుకున్నారు. ఎందువల్ల ఇలా చేశాడని ఎంతలా ఆరా తీసినా? ఎవరా వ్యక్తి? అనేది ఓ మిస్టరీలా మిగిలిపోయింది.
ఐతే చేసిన పాపం వదిలిపెట్టదు కదా. ఎట్టకేలకు పోలీసులు శతవిధాల చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యి ఆగంతకుడిని పట్టించేలా చేసింది. పోలీసులు ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తిని క్యోటా హట్టోరి(26)గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి..కోర్టు ముందు హాజరుపర్చారు. విచారణలో తాను ప్రజలు చంపాలనుకున్నట్లు ఒప్పుకున్నాడు కూడా. దీంతో కోర్టు అతడికి 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దొరక్కూడదని చేసిన ఏ చిన్న నేరమైన ఏదో రూపంలో దోషిగా నిలబెట్టేస్తుంది. ఇక ఆ సమయంలో నువ్వు బాధపడినా ప్రయోజనం ఉండదు.
(చదవండి: ఓ వ్యక్తి 'మానవశునకం'గా రూపాంతరం.. కుక్కలా వీధుల్లో సంచరిస్తూ..)
Comments
Please login to add a commentAdd a comment