పవన్‌ నువ్వెంత.. నీ బతుకెంత? | Minister Roja Fires On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ నువ్వెంత.. నీ బతుకెంత?

Published Mon, Sep 18 2023 5:23 AM | Last Updated on Mon, Sep 18 2023 5:02 PM

Minister Roja Fires on Pawan Kalyan - Sakshi

సాక్షి, అమరావతి: ప్యాకేజీ కోసం కన్న తల్లిని దుర్భాషలాడిన వ్యక్తుల దగ్గర పవన్‌కళ్యాణ్‌ బానిసలా బతుకుతున్నారని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. అవినీతి కేసులో జైలులో ఉన్న చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని.. సొంత కార్యకర్తలు, సొంత సామాజికవర్గాన్ని అమ్మేసిన పవన్‌ను ‘నువ్వెంత? నీ బతుకెంత?’.. అంటూ ఆగ్రహంతో ప్రశ్నించారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌­సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆమె మీడి­యాతో మాట్లాడుతూ దేశ చరిత్రలో పవన్‌లాంటి సిగ్గులేని రాజకీయ నాయకుడిని ఎవరూ చూసి ఉండరన్నారు. ప్రజలకిచ్చిన మాట కోసం ఢిల్లీని ఢీకొట్టి.. ప్రతిపక్ష నేతగా.. ముఖ్యమంత్రిగా జగన్‌ తనను తాను నిరూపించుకుంటే.. పవన్‌ మాత్రం పార్టీ పెట్టి దశాబ్దం గడిచినా ఇప్పటికీ అందరి జెండాలు మోసే కూలీగానే మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..

ఆరోగ్యశ్రీలో నీ పిచ్చి కుదురుస్తాం..
జనసేన పోటీచేసిన 136 స్థానాల్లో 120 చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. నీ స్థాయికి తగ్గట్టు నువ్వు మాట్లాడాలి పవన్‌. అసలు నువ్వు ఒక్క దానిలోనైనా సక్సెస్‌ అయ్యావా? చదువులో, ఫ్యామి­లీలో, కొడుకుగా, భర్తగా, రాజకీయ నాయకుడిగా అన్నింట్లోనూ ఫెల్యూర్‌. నీ తల్లిని తిట్టిన వాళ్లతో అంటకాగుతున్నావు.. త్వరలోనే ఆరోగ్యశ్రీ కింద నీ పిచ్చి కుదురుస్తాం. ఇక అమిత్‌ షా దగ్గరకెళ్లి ఏమని ఫిర్యాదు చేస్తావు? నీ మీద చెప్పులు, రాళ్లు వేయించిన చంద్రబాబుతో నేను పొత్తు పెట్టు­కున్నా.. మీరూ రండి.. అని చెప్తావా? మోడీని, ఆయన భార్యను, తల్లిని తిట్టించిన టీడీపీతో కలుద్దామని పిలుస్తావా? ఎన్నికల్లో సొంతంగా పది మంది అభ్యర్థులను  నిలపలేని వ్యక్తి యుద్ధానికి సిద్ధమనడం హాస్యాస్పదంగా ఉంది.

బ్రాహ్మణి బ్రహ్మాస్త్రం తుస్సుమంది..
చంద్రబాబు అరెస్టును ప్రజలు  పట్టించుకోక­పోవడంతో పచ్చ బ్యాచ్‌కు పిచ్చెక్కిపోతోంది. లోకేశ్, భువనేశ్వరి, బాలకృష్ణ, పవన్‌ విఫలమ­వ­డంతో బ్రహ్మాస్త్రంగా బ్రాహ్మణిని తీసుకొచ్చారు. రాజకీ­య పరిజ్ఞానం లేకుండా మాట్లాడిన బ్రహ్మాస్త్రం తుస్సుమంది. చంద్రబాబును డైరె­క్టుగా ఎలా అరెస్టు చేశారని బ్రాహ్మణి అంటోంది. సాక్ష్యా­ధారాలతో దొరికిన దొంగను జైలుకు పంపుతారు కానీ.. జైలర్‌ సినిమాకు పంపు­తా­రా? అలాగే, దేవాన్షుకి దయచేసి బాబు రిమాండ్‌ రిపోర్ట్‌ చూపించొద్దు. వాళ్ల తాత ఎంతపెద్ద దొంగో తెలిస్తే అసహ్యించుకునే పరిస్థితి వస్తుంది.

మీ మామ(చంద్రబాబు)  గురించి మీ తాత ఎన్టీఆర్‌ చివరి క్షణాల్లో విడు­దల చేసిన వీడియో చూడు. చంద్రబాబు గొడ్డు­కన్నా హీనం.. గాడ్సే కన్నా ఘోరం అని స్వయంగా ఎన్టీఆర్‌ విల­పించారు. మీ మామ నిరప­రా­ధని మీ దగ్గర ఆధారాలుంటే మీడి­యాలో కాదు కోర్టుల్లో చూపి­ం­చాలి. ఇక స్కిల్‌ స్కాంలో లోకేశ్, అచ్చెన్నాయు­డుతో పాటు పాత్రధారులందరూ జైలుకెళ్లక­త­ప్పదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement