Karnataka Wife Smuggled Ganja in Pants, Jail Husband - Sakshi
Sakshi News home page

జైల్లో ఉన్న భర్తకి గంజాయి.. ప​క్కా ప్లాన్‌, చివరిలో అక్కడ దొరికిపోయింది!

Aug 3 2023 2:05 PM | Updated on Aug 3 2023 4:40 PM

Karnataka: Wife Smuggled Ganja In Pants Into Jail For Husband - Sakshi

బెంగళూరు: సాధారణంగా దంపతులు మధ్య అన్యోనత ఉండడం సహజం. ఇక కొందరు భార్యాభర్తలు ఒకరిమీద మరొకరు ఎనలేని ప్రేమను చూపిస్తుంటారు. అడిగిన వెంటనే తెచ్చి ఇవ్వడం, కాదని చెప్పలేకపోవడం, ప్రేమగా తమ తోడుని చూసుకుంటూ ఉంటారు. అయితే భార్యభర్తల మధ్య ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ప్రతీ దానికి ఓ హద్దు ఉంటుంది. దాని దాటితే లేనిపోని చిక్కుల్లో పడా​ల్సి వస్తుంది. తాజాగా ఈ తరహా ఘటనే కలబురగిలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళితే..  జైల్లో ఉన్న భర్త కోసం గంజాయి అందివ్వాలని ఓ భార్య పథకం వేసింది. అనుకన్నట్టే గంజాయి సిద్ధం చేసి ఇవ్వటానికి వెళ్లిన ఆ మహిళ చివరికి తనిఖీల్లో పట్టుబడింది. పట్టణంలోని కేంద్ర కారాగారంలో జాలేంద్రనాథ్‌ కావళెకి అనే వ్యక్తి ఖైదీగా ఉన్నాడు. సోమవారం భర్తను కలవటానికి వచ్చిన భార్య సునీత రెండు జీన్స్‌ ప్యాంట్స్‌ అందజేసింది.భద్రతా సిబ్బంది బ్యాగును పరిశీలించగా గంజాయి లభ్యమైంది. దీంతో ఆమెను అరెస్ట్‌ చేశారు.

చదవండి: అబిడ్స్‌లో బ్యూటీపార్లర్‌ నిర్వాకం.. ఆయిల్‌ పెట్టగానే ఊడిపోయిన మొత్తం జుట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement