పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాన్ లాహోర్‌లో తన నివాసంలో పీటీఐ నేతలతో సమామేశం నిర్వహించిన తదనంతరం పాక్ ఆర్మీ గురించి సంచలన వ్యాఖ్యలతో వరుస ట్వీట్లు చేశారు. పాక్‌లోని శక్తిమంతమైన సైనిక స్థాపన తనను పదేళ్ల పాటు జైల్లో ఉంచేందుకు ప్లాన్ చేస్తోందన్నారు. ప్రస్తుతం లండన్ ప్లాన్ ముగిసింది కాబట్టి ఆ దిశగా పావులు కదుపుతోందన్నారు. వారు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుని శిక్షలు అమలు చేసే దుశ్చర్యకు పాల్పడుతున్నారు.
తన భార్యని జైల్లో పెట్టి తనను అవమానపాలు చేసే యోచనలో కూడా ఉన్నట్లు తెలిపారు. దేశద్రోహం వంటి బలమైన చట్టాలను ఉపయోగించి పదేళ్ల వరకు జైల్లో మగ్గిపోయేలా చేసేందుకు పాక్ ఆర్మీ కుట్ర పన్నుతోందని ట్వీట్ చేశారు. అంతేగాదు ఆ సమయంలో ప్రజాస్పందన రాకుండా జాగ్రత్త పడేలా రెండు కీలకమైన పనులు కూడా చేస్తారని అన్నారు. అందులో.. ఒకటి ఉద్దేశపూర్వకంగా తన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) కార్యకర్తలు, సాధారణ పౌరుల గొంతును అణిచివేసేలా హింసాత్మక దాడి, రెండోది మీడియాను నియంత్రించడం అని చెప్పుకొచ్చారు.
అలాగే అరెస్టు చేసే ముందే ఇంటర్నెట్ సేవలను నిలిపేసి, సోషల్ మీడియాను నిషేధించడం వంటివి చేస్తారు. ప్రజలు భయబ్రాంతులకు లోనయ్యేలా పోలీసులు ఇళ్లలోకి చొరబడి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి దారుణాలకు పాల్పడతారంటూ ఆర్మీపై ఆరోపణలు చేశారు ఖాన్. అలాగే ఈ సందర్భంగా పాక్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..తన చివరి రక్తపు బొట్టు వరకు హకీకీ ఆజాదీ కోసం పోరాడతానని, క్రూరమైన మోసాలకు బానిసలవ్వడం కంటే మరణమే ఉత్తమమని అన్నారు. అయినా మనం చేసే ఇల్లా హ ఇల్లాల్లాహ్ అని ప్రతిజ్ఞను గుర్తుపెట్టుకోవాలని ప్రజలకు సందేశం ఇచ్చారు.
మనం కేవలం అల్లాకు తప్ప మరెవరికి తలవంచం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రజలను కోరారు. ఇలాంటి అన్యాయపూరితమైన చట్టాలు దేశంలో ఎక్కువ కాలంపాటు మనుగడ సాగించలేవని చెప్పారు. కాగా ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పాక్ ఒక్కసారిగా హింసాత్మకంగా మారిపోయింది. ఈ ఘటనలో పీటీఐ కార్యకర్తలు, పౌరులు తోసహ సుమారు 40 మంది దాక పాక్ ఆర్మీ చేతిలో మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.
(చదవండి: యువతి బంగీ జంప్! తాడు తెగడంతో..)
Comments
Please login to add a commentAdd a comment