కోల్‌కతా: మమత ఆరోపణలు వాస్తవమేనని ఆప్ పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల్లోపు విపక్ష ఇండియా కూటమి నేతలందరినీ ఏదోలా జైలుపాలు చేయాలని మోదీ సర్కారు కుట్ర చేస్తోందని ఆ పార్టీ నేత రాఘవ్ ఛద్దా ఆరోపించారు. తొలుత తమ అధినేత కేజ్రీవాల్‌ను అరెస్టు చేయజూస్తోందన్నారు. 2014 నుంచి దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన కేసుల్లో ఏకంగా 95 శాతం విపక్ష నేతలపైనే కావడం మోదీ సర్కారు కక్షపూరిత వైఖరిని అద్దం పడుతోందని ధ్వజమెత్తారు.
‘‘ఇండియా కూటమి ఆవిర్భావంతో బీజేపీ వణికిపోతోంది. అందుకే విపక్ష కూటమిలోని అగ్ర నేతలందరినీ లక్ష్యంగా చేసుకుందని మాకు విశ్వసనీయ వర్గాల నుంచి ఇప్పటికే సమాచారం అందింది. ‘‘కేజ్రీవాల్ తర్వాత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీలను అరెస్టు చేయడం మోదీ సర్కారు లక్ష్యం. వారి తర్వాత జాబితాలో కేరళ సీఎం పినరయ్ విజయన్, తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్, శివసేన, ఎన్సీపీల అగ్ర నేతలున్నారు’’ అని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment