
ఢిల్లీ: చంద్రబాబుకు ఇంటి భోజనం అందుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. జైలులో ప్రత్యేక గది కేటాయించారని తెలిపారు. ప్రతిరోజు మూడుసార్లు ముగ్గురు డాక్టర్లు చెక్ అప్ చేస్తున్నారని వెల్లడించారు. 8 మంది పోలీసులు కాపలాగా ఉంటున్నారని స్పష్టం చేశారు. నేరాలకు తగిన శిక్ష అనుభవించేందుకు చంద్రబాబు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ట్వీట్ చేశారు.
నెలరోజులు జైలులో ఉండేసరికి పూర్తి విశ్రాంతితో చంద్రబాబు గారు కిలో బరువు పెరిగారు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా పోయాయని సంతోషంగా ఉన్నారని జైలు అధికారులే చెప్పారు. స్కామ్స్ లో బెయిల్ రాకపోయేసరికి అలజడి సృష్టించేందుకు దుష్ప్రచారం చేస్తున్నట్లు రుజువైంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 14, 2023
ఎన్నాళ్ళీ తెలుగు డ్రామాల… pic.twitter.com/FvpkwM5kEE
'నెలరోజులు జైలులో ఉండేసరికి పూర్తి విశ్రాంతితో చంద్రబాబు గారు కిలో బరువు పెరిగారు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా దూరమై సంతోషంగా ఉన్నారని జైలు అధికారులే చెప్పారు. స్కామ్స్ లో బెయిల్ రాకపోయేసరికి అలజడి సృష్టించేందుకు దుష్ప్రచారం చేస్తున్నట్లు రుజువైంది. ఎన్నాళ్లీ తెలుగుదేశం పార్టీ డ్రామాలు' అంటూ విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: మరి ఇంత నీచంగా డ్రామాలు ఆడతారా?