సూరత్: మైనర్ విద్యార్థినిపై అత్యాచారం కేసులో 11 ఏళ్లుగా జైల్లోనే ఉంటున్న ప్రవచనకర్త ఆశారాం ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. ఇటీవలే ఆయనకు కోర్టు ఆదేశాలతో మహారాష్ట్రలో చికిత్స అందించారు. కాగా గుజరాత్ హైకోర్టు అనుమతితో ఆయన తన కుమారుడు నారాయణ్ సాయిని జోధ్‌పూర్ జైలులో కలుసుకోనున్నారు. అయితే ఇందుకోసం ఆశారాం కుమారుడు రూ.5 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
ఆశారాం కుమారుడు నారాయణ్ సాయి గుజరాత్‌లోని సూరత్ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్నాడు. కొన్ని షరతులతో తన తండ్రి ఆశారాంను 4 గంటల పాటు కలిసేందుకు గుజరాత్ హైకోర్టు నారాయణ్ సాయికి అనుమతినిచ్చింది. ఈ భేటీలో ఆశారాం, నారాయణ్ మినహా కుటుంబ సభ్యులెవరూ ఉండరు. శుక్రవారం గుజరాత్ హైకోర్టులో నారాయణ్ సాయి పిటిషన్‌పై విచారణ జరిగింది. నారాయణ్ సాయి అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో సూరత్‌లోని లాజ్‌పూర్ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్నాడు. తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని, ఆయనను కలవాలని అనుకుంటున్నానని నారాయణ్‌సాయి తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.
మైనర్‌పై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడిన ఆశారాం దాదాపు 11 ఏళ్లుగా జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉంటున్నాడు. ఈ కాలంలో తండ్రీ కొడుకులు ఎప్పుడూ కలుసుకోలేదు. పెరోల్ కోసం ఆశారాం పలుమార్లు కోరినప్పటికీ మంజూరు కాలేదు. కాగా గుజరాత్ హైకోర్టు తన ఆదేశాలలో నారాయణ్ సాయిను అసిస్టెంట్ పోలీస్ కమిషనర్, ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్ల పర్యవేక్షణలో విమానంలో జోధ్‌పూర్ జైలుకు పంపాలని పేర్కొంది. నాలుగు గంటల పాటు జైలులో ఉన్న తన తండ్రిని నారాయణ్ సాయి కలుసుకోనున్నాడు. ఇందుకోసం ఆయన సూరత్‌లోని పోలీస్ స్టేషన్‌లోని ప్రభుత్వ ఖజానాకు రూ.5 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: కేసుల పరిష్కారానికి గడువు పెట్టలేం
Comments
Please login to add a commentAdd a comment