Narayan Sai
-
4 గంటల భేటీకి రూ. 5 లక్షలు.. జైలులో కలుసుకోనున్న ఆశారాం-నారాయణ్
సూరత్: మైనర్ విద్యార్థినిపై అత్యాచారం కేసులో 11 ఏళ్లుగా జైల్లోనే ఉంటున్న ప్రవచనకర్త ఆశారాం ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. ఇటీవలే ఆయనకు కోర్టు ఆదేశాలతో మహారాష్ట్రలో చికిత్స అందించారు. కాగా గుజరాత్ హైకోర్టు అనుమతితో ఆయన తన కుమారుడు నారాయణ్ సాయిని జోధ్‌పూర్ జైలులో కలుసుకోనున్నారు. అయితే ఇందుకోసం ఆశారాం కుమారుడు రూ.5 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.ఆశారాం కుమారుడు నారాయణ్ సాయి గుజరాత్‌లోని సూరత్ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్నాడు. కొన్ని షరతులతో తన తండ్రి ఆశారాంను 4 గంటల పాటు కలిసేందుకు గుజరాత్ హైకోర్టు నారాయణ్ సాయికి అనుమతినిచ్చింది. ఈ భేటీలో ఆశారాం, నారాయణ్ మినహా కుటుంబ సభ్యులెవరూ ఉండరు. శుక్రవారం గుజరాత్ హైకోర్టులో నారాయణ్ సాయి పిటిషన్‌పై విచారణ జరిగింది. నారాయణ్ సాయి అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో సూరత్‌లోని లాజ్‌పూర్ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్నాడు. తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని, ఆయనను కలవాలని అనుకుంటున్నానని నారాయణ్‌సాయి తన పిటిషన్లో పేర్కొన్నాడు.మైనర్‌పై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడిన ఆశారాం దాదాపు 11 ఏళ్లుగా జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉంటున్నాడు. ఈ కాలంలో తండ్రీ కొడుకులు ఎప్పుడూ కలుసుకోలేదు. పెరోల్ కోసం ఆశారాం పలుమార్లు కోరినప్పటికీ మంజూరు కాలేదు. కాగా గుజరాత్ హైకోర్టు తన ఆదేశాలలో నారాయణ్ సాయిను అసిస్టెంట్ పోలీస్ కమిషనర్, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్ల పర్యవేక్షణలో విమానంలో జోధ్‌పూర్ జైలుకు పంపాలని పేర్కొంది. నాలుగు గంటల పాటు జైలులో ఉన్న తన తండ్రిని నారాయణ్ సాయి కలుసుకోనున్నాడు. ఇందుకోసం ఆయన సూరత్‌లోని పోలీస్ స్టేషన్‌లోని ప్రభుత్వ ఖజానాకు రూ.5 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.ఇది కూడా చదవండి: కేసుల పరిష్కారానికి గడువు పెట్టలేం -
ఎనిమిది మంది శిష్యురాళ్లతో సంబంధముంది: నారాయణ్‌సాయి అంగీకారం
సూరత్: అత్యాచారం ఆరోపణలను ఎదుర్కొంటున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు కుమారుడు నారాయణ్ సాయి(40) తమ ఆశ్రమంలోని ఎనిమిది మంది మహిళలతో తనకు సంబంధమున్నట్టుగా అంగీకరించారు. తనపై అత్యాచారం ఆరోపణలు చేసిన సూరత్ యువతితోనూ శారీరక సంబంధముందని ఒప్పుకున్నారు. అయితే తనపై మోపిన అత్యాచారం ఆరోపణలను తోసిపుచ్చారు. ఆమె సమ్మతితోనే శారీరకంగా కలిసినట్టు ఆయన సూరత్ పోలీసుల విచారణలో వెల్లడించారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆశారాం బాపు, అతడి కుమారుడు నారాయణ్ సాయిలపై అత్యాచారం, లైంగిక వేధింపులు తదితర అభియోగాల కింద సూరత్ పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిందే. 2002-2005 మధ్యకాలంలో తాను సూరత్ ఆశ్రమంలో ఉన్నప్పుడు సాయి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని చెల్లి ఫిర్యాదు చేయగా, 1997-2006 మధ్యకాలంలో ఆశారాం తనపై అత్యాచారం జరిపాడని అక్క ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పరారైన సాయి 58 రోజులపాటు తప్పించుకు తిరిగారు. ఎట్టకేలకు ఆయన్ను ఈ నెల 4న హర్యానాలోని కురుక్షేత్ర సమీపంలో ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం సూరత్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. -
ఆశారాం బాపు తనయుడు అరెస్ట్
సూరత్ అత్యాచారం కేసులో నిందితుడు, ఆశారాం బాపు కుమారుడు నారాయణ సాయిని అరెస్ట్ చేసినట్లు న్యూఢిల్లీ పోలీసులు బుధవారం ఇక్కడ వెల్లడించారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని, ఈ రోజు మధ్యాహ్నం 2.00 గంటలకు రోహిణి కోర్టులో నారాయణ సాయిని హాజరు పరుస్తామని తెలిపారు. న్యూఢిల్లీ- హర్యానా సరిహద్దుల్లో నారాయణ సాయితో అతడి స్నేహితులతో ఉండగా న్యూఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. గత 58 రోజులుగా తప్పించుకు తిరుగుతున్న నారాయణ సాయిని గుజరాత్, పంజాబ్, ఢిల్లీ పోలీసుల సంయుక్తంగా నిర్వహించిన గాలింపు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేసినట్లు వివరించారు. 2001- 2005 మధ్య కాలంలో ఆశారాం బాపు కుమారుడు నారాయణసాయి తనపై పలు సార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళ గుజరాత్‌లోని సూరత్ నగరంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే 2000 సంవత్సరంలో ఆశారాం బాపు ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న తమపై బాపు ఆయన కుమారుడు నారాయణ సాయి అత్యాచారం చేశారని గుజరాత్‌కు చెందిన ఇద్దరు సోదరిమణులు స్థానిక పోలీసు స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. దాంతో నారాయణ సాయిని వెంటనే అరెస్ట్ చేయాలని నవంబర్ 24న పోలీసులను గుజరాత్ హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దాంతో నిందితుడు నారాయణ సాయిని అరెస్ట్ చేసేందుకు గుజరాత్ పోలీసులు న్యూఢిల్లీ, పంజాబ్ పోలీసుల సహాయం తీసుకున్నారు. -
నారాయణ్ సాయి ఆశ్రమంపై పోలీసుల దాడులు
సాక్షి ముంబై: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసారామ్ బాపూజీ కుమారుడు నారాయణ్ సాయికు చెందిన విరార్‌లోని ఆశ్రమంపై శుక్రవారం రాత్రి గుజరాత్ పోలీసులు దాడులు చేశారు. పరారీలో ఉన్న నారాయణ్ సాయి ఆచూకీ దొరక్కపోవడంతో ఏమైనా వివరాలు తెలుస్తాయా అనే కోణంలో ఈ ఆశ్రమంలో గాలింపు చర్యలు చేపట్టారు. విరార్‌లోని కుంభార్ పాడా గ్రామంలో ఆశ్రమం నిర్వహిస్తున్న నారాయణ్ సాయి తరచూ ఇక్కడకు వస్తుంటాడని గుజరాత్ పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ మేరకు విరార్ పోలీసుల సహాయంతో ఆశ్రమంపై చర్యలు చేపట్టారు. కానీ ఆశ్రమంలో కార్మికులు తప్పా ఇంకెవ్వరు దొరకలేదు. సూరత్ పట్టణంలో ఇద్దరు ఇక్కాచెల్లెళ్లు ఆసారామ్ బాపు, నారాయణ్ సాయిపై జహాంగీర్పుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదుచేశారు. -
నారాయణ్ సాయి కోసం గుజరాత్ పోలీసుల గాలింపు
అత్యాచారం కేసులో అరెస్టయిన వివాదాస్పద మతగురువు ఆశారాం బాపు కుమారుడు నారాయణ్ సాయి కోసం గుజరాత్ పోలీసులు బీహార్‌లోని దర్భాంగా జిల్లాలో గల ఆశ్రమంపై దాడి చేశారు. అతడి అనుచరుడొకరు ఢిల్లీలో దొరికాడు గానీ, నారాయణ్ సాయి మాత్రం ఇంకా దొరకలేదు. ముగ్గురు సభ్యులతో కూడిన గుజరాత్ పోలీసు బృందం బీహార్ పోలీసులతో కలిసి అరియారి గ్రామంలో గల ఆశ్రమంపై దాడి చేసింది గానీ నారాయణ్ సాయి అక్కడ లేరు. టీనేజి యువతిపై అత్యాచారం చేసిన కేసులో 72 ఏళ్ల ఆశారాం బాపు ప్రస్తుతం జోధ్‌పూర్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. కాగా, అతడితో పాటు నారాయణ్ సాయిపై మరో కొత్త కేసు నమోదైంది. సూరత్‌లో ఇద్దరు అక్కా చెల్లెళ్లపై లైంగిక దాడి జరగడంతో వీరిపై కేసు నమోదైంది. అహ్మదాబాద్ ఆశ్రమంలో అక్కపై ఆశారాం బాపు, చెల్లెలిపై సూరత్ ఆశ్రమంలో నారాయణ్ సాయి అత్యాచారం చేశారని తెలిపారు. -
ఆశారాం కొడుకు కోసం ఢిల్లీలో గాలింపు
అత్యచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు కొడుకు నారాయణ్ సాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గుజరాత్, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా తూర్పు, పశ్చిమ ఢిల్లీలో అనుమానిత ప్రాంతాల్లో తనికీ చేశారు. ఈ నెల 6న సూరత్‌లో నారాయణ్‌పై అత్యాచారం కేసు నమోదు కాగానే అతను పరారయ్యాడు. 2001-2005 మధ్య నారాయణ్ తనను అత్యాచారం చేశాడని 30 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేసింది. సూరత్‌లో నివసిస్తున్న ఇద్దరు సోదరీమణులు వేర్వేరు పోలీసు స్టేషన్లలో ఆశారాం, నారాయణ్‌పై అత్యాచారం కేసులు దాఖలు చేశారు. ఆశారాంను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. -
ఆశారాంతోపాటు కుమారుడిపై లైంగిక వేధింపుల కేసు!
వివాదస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు, ఆయన కుమారుడు నారాయణ సాయిపై తాజాగా లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తమను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ ఇద్దరు యువతులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మైనర్ బాలికపై లైంగిక దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలపై అశారాం బాపును రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో అరెస్ట్ చేసిన జైలులో ఉంచిన సంగతి తెలిసిందే. ఇద్దరు యువతుల ఫిర్యాదు మేరకు అశారాం,నారాయణ సాయిలపై కేసు నమోదు చేశామని సూరత్ పోలీస్ కమిషనర్ రాకేశ్ అస్థానా తెలిపారు. బాధితురాల్లిద్దరూ కూడా అక్కాచెల్లెల్లని పోలీసులు తెలిపారు. నారాయణ సాయి పై సూరత్ లోని జహంగీర్ పూరాలో, ఆహ్మదాబాద్ లో అశారాంపై కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నారాయణ్ స్వామిని పోలీసులు త్వరలో విచారించనున్నారు. 2001 నుంచి 2006 మధ్య కాలంలో తమపై లైంగిక దాడులు చేశారని ఫిర్యాదులో తెలిపారు.