ఎనిమిది మంది శిష్యురాళ్లతో సంబంధముంది: నారాయణ్‌సాయి అంగీకారం | physical relationships with eight of his female disciples:Asaram Bapu's son Narayan Sai | Sakshi
Sakshi News home page

ఎనిమిది మంది శిష్యురాళ్లతో సంబంధముంది: నారాయణ్‌సాయి అంగీకారం

Published Wed, Dec 11 2013 9:54 PM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM

physical relationships with eight of his female disciples:Asaram Bapu's son Narayan Sai

సూరత్: అత్యాచారం ఆరోపణలను ఎదుర్కొంటున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు కుమారుడు నారాయణ్ సాయి(40) తమ ఆశ్రమంలోని ఎనిమిది మంది మహిళలతో తనకు సంబంధమున్నట్టుగా అంగీకరించారు. తనపై అత్యాచారం ఆరోపణలు చేసిన సూరత్ యువతితోనూ శారీరక సంబంధముందని ఒప్పుకున్నారు. అయితే తనపై మోపిన అత్యాచారం ఆరోపణలను తోసిపుచ్చారు. ఆమె సమ్మతితోనే శారీరకంగా కలిసినట్టు ఆయన సూరత్ పోలీసుల విచారణలో వెల్లడించారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆశారాం బాపు, అతడి కుమారుడు నారాయణ్ సాయిలపై అత్యాచారం, లైంగిక వేధింపులు తదితర అభియోగాల కింద సూరత్ పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిందే.

 

2002-2005 మధ్యకాలంలో తాను సూరత్ ఆశ్రమంలో ఉన్నప్పుడు సాయి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని చెల్లి ఫిర్యాదు చేయగా, 1997-2006 మధ్యకాలంలో ఆశారాం తనపై అత్యాచారం జరిపాడని అక్క ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పరారైన సాయి 58 రోజులపాటు తప్పించుకు తిరిగారు. ఎట్టకేలకు ఆయన్ను ఈ నెల 4న హర్యానాలోని కురుక్షేత్ర సమీపంలో ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం సూరత్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement