అత్యచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు కొడుకు నారాయణ్ సాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అత్యచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు కొడుకు నారాయణ్ సాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గుజరాత్, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా తూర్పు, పశ్చిమ ఢిల్లీలో అనుమానిత ప్రాంతాల్లో తనికీ చేశారు.
ఈ నెల 6న సూరత్లో నారాయణ్పై అత్యాచారం కేసు నమోదు కాగానే అతను పరారయ్యాడు. 2001-2005 మధ్య నారాయణ్ తనను అత్యాచారం చేశాడని 30 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేసింది. సూరత్లో నివసిస్తున్న ఇద్దరు సోదరీమణులు వేర్వేరు పోలీసు స్టేషన్లలో ఆశారాం, నారాయణ్పై అత్యాచారం కేసులు దాఖలు చేశారు. ఆశారాంను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు.