
పెంపుడు జంతువులంటే చాలామందికి ఇష్టం. వాటిని యజమానులు తాము ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకు వెళ్తుంటారు. అంత వరకు ఓకే గానీ..కొన్ని ప్రదేశాలకు వెళ్లేటప్పుడూ వాటి భద్రతను కూడా దృష్టిలో పెట్టుకోవడం అత్యంత ముఖ్యం. అదే సమయంలో అక్కడుండే ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యతను కూడా గుర్తించుకోవాలి. ఇవేం పట్టకుండా ఓ కుక్క యజమాని ఏదో రకంగా రైలుని క్యాచ్ చేయబోయి..పాపం ఆ మూగప్రాణి ప్రాణాల మీదకి తెచ్చిపెట్టాడు.
అసలేం జరిగిందంటే..ఓ యజమాని తన కుక్క తోపాటు రైలు ఎక్కాలన్న తొందరలో ఉన్నాడు. అయితే అప్పటికే ఫ్లాట్‌ఫాంపై రైలు కదిలిపోతోంది. ఏదో రకంగా ఆ కదులుతున్న రైలుని ఎక్కాలని యత్నిస్తున్నాడు. అయితే తనతో ఉన్న కుక్క ఎందుకనో ఎక్కేందుకు ప్రయత్నించలేదు. రైలు కదిలిపోతుండటంతో ఎక్కేందుకు భయపడిందో ఏమో గానీ ఎంతలా యజమాని అదిలించినా అది రైలు ఎక్కేందుకు జంప్ చేయలేదు.
ఆ యజమాని ఆ కుక్కల హడావిడి నడుమ అనూహ్యంగా ఆ కుక్క రైలుకి-ఫ్లాట్‌ఫాంకి మధ్యన పడిపోయింది. ఇక అంతే అక్కడ ఉన్న ఇతర ప్రయాణికులు, యజమాని అందరూ ఆ కుక్క ఎలా ఉందో? ఏంటో? అని ఊపిరిబిగపెట్టి చూస్తున్నారు. ఓ పక్కన రైలు వేగంగా వెళ్లిపోతుంది. అదృష్టవశాత్తు ఆ కుక్క ప్రాణాలతో బయటపడింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు మాత్రం ఆ కుక్క సేఫ్టీ కూడా చూసుకోవాలి గదా అని మండిపడుతూ పోస్టులు పెట్టారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
(చదవండి: పాపం ఆ సీఈవో.. ‘శరీరం’ చెప్పేది వినలేదు! ఆఖరికి ఇలా..)