festive sale
-
పేరుకుపోతున్న వాహన నిల్వలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డీలర్ల వద్ద ప్యాసింజర్ వాహన నిల్వలు పోగవడం సహజం. ప్రస్తుతం ఉన్న 80–85 రోజుల ఇన్వెంటరీ(గోదాముల్లో అమ్ముడవకుండా ఉన్న నిల్వలు) స్థాయి ఆందోళన కలిగిస్తోందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) చెబుతోంది. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 7.9 లక్షల యూనిట్ల ప్యాసింజర్ వాహనాల నిల్వలు పేరుకుపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అవగతమవుతోంది.డీలర్ల వద్ద పోగైన వాహనాల విలువ ఏకంగా రూ.79,000 కోట్లు అని ఎఫ్ఏడీఏ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే సెప్టెంబర్ నెలలో ప్యాసింజర్ వాహనాల రిటైల్ విక్రయాలు 19 శాతం క్షీణించి 2,75,681 యూనిట్లకు వచ్చి చేరాయి. టూవీలర్స్ అమ్మకాలు 8 శాతం తగ్గి 12,04,259 యూనిట్లుగా ఉంది. త్రిచక్ర వాహనాలు స్వల్పంగా పెరిగి 1,06,524 యూనిట్లు నమోదయ్యాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు 10 శాతం పడిపోయి 74,324 యూనిట్లకు వచ్చి చేరాయి. ట్రాక్టర్లు 15 శాతం దూసుకెళ్లి 74,324 యూనిట్లను తాకాయి. ఇక అన్ని విభాగాల్లో కలిపి రిజిస్ట్రేషన్స్ 18,99,192 నుంచి 9 శాతం క్షీణించి 17,23,330 యూనిట్లకు పడిపోయాయి. ఇది చివరి అవకాశం..‘భారీ వర్షపాతం, మందగించిన ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని మరింత తీవ్రతరం చేశాయి. గణేష్ చతుర్థి, ఓనం వంటి పండుగలు ప్రారంభమైనప్పటికీ పరిశ్రమ పనితీరు చాలా వరకు నిలిచిపోయిందని డీలర్లు పేర్కొన్నారు’ అని ఫెడరేషన్ ప్రెసిడెంట్ సి.ఎస్.విఘ్నేశ్వర్ తెలిపారు. మరింత ఆలస్యం కాకముందే మార్కెట్ పునరుద్ధరణకు మద్దతు ఇవ్వడానికి తయారీ సంస్థలకు ఇది చివరి అవకాశం అని అన్నారు. అదనపు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోకుండా నిరోధించడానికి డీలర్ సమ్మతి, వాస్తవ పూచీకత్తు ఆధారంగా మాత్రమే కఠినమైన ఛానల్ ఫండింగ్ విధానాలను తప్పనిసరి చేస్తూ బ్యాంకులకు సలహా జారీ చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్‌ను ఫెడరేషన్ కోరిందన్నారు. ఇదీ చదవండి: ‘పెయిడ్ ట్వీట్’ అంటూ వ్యాఖ్యలుడీలర్లు, తయారీ సంస్థలు పండుగలకు ఎక్కువ అమ్మకాలు ఉంటాయని భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ మార్కెట్లలో సానుకూల నగదు ప్రవాహం, మెరుగైన వ్యవసాయ పరిస్థితులు డిమాండ్‌ను పెంచుతాయని ఆశించినప్పటికీ ఆశించినమేర ఫలితం లేదని ఫెడరేషన్ తెలిపింది. అదనపు ఇన్వెంటరీని క్లియర్ చేయడానికి, 2024–25 ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలానికి సానుకూల వృద్ధి పథాన్ని నడపడానికి అక్టోబర్ నెల చాలా అవసరమని పేర్కొంది. ఊహించిన విక్రయాలు కార్యరూపం దాల్చకపోతే కొత్త సంవత్సరంలోకి వెళ్లే క్రమంలో డీలర్లతోపాటు తయారీ సంస్థలను కూడా కష్టతర పరిస్థితి ఎదురవుతుందని చెప్పింది. -
ప్లేస్ ఏదైనా, క్లాస్ ఏదైనా.. విస్తారా బంపర్ ఆఫర్ ఉందిగా!
సాక్షి, ముంబై: టాటా యాజమాన్యంలోని ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా ఎయిర్ లైన్స్ తమ ప్రయాణికులకు తక్కువ ధరల్లో విమాన టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశీయ, అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో 4 రోజుల ఫెస్టివ్ సేల్‌ను ప్రకటించింది. ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్ అనే మూడు క్యాబిన్ తరగతులకు ఈ సేల్ ఛార్జీలపై తగ్గింపులను అందిస్తుంది. అక్టోబర్ 17, 2022 నుంచి అక్టోబర్ 20, 2022 వరకు జరిగే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్లపై అక్టోబర్ 23, 2022 నుంచి మార్చి 31, 2023 వరకు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. దేశీయంగా అన్ని చార్జీలు కలుకుపుని 1499లకే విమాన టికెట్‌ను అందిస్తోంది. వన్-వేలో అన్నీ కలిపిన దేశీయ ఛార్జీలు ఎకానమీకి రూ. 1,499, ప్రీమియం ఎకానమీకి రూ. 2,999, బిజినెస్ క్లాస్‌కు రూ. 8,999 (సౌకర్యపు రుసుములు వర్తిస్తాయి) నుండి ప్రారంభమవుతాయి. ఇక అంతర్జాతీయ రూట్లలో, అన్నీ కలిపిన రిటర్న్ ఛార్జీలు ఎకానమీకి రూ. 14,149, ప్రీమియం ఎకానమీకి రూ. 18,499, బిజినెస్ క్లాస్‌కు రూ. 42,499 నుండి ప్రారంభం. ఇటీవలి కాలంలో విమాన ప్రయాణానికి డిమాండ్ పెరగడం చాలా ప్రోత్సాహకరంగా ఉందని, ఈ పండుగ సందర్భంగా తమ కస్టమర్లకు సంతోష కరమైన క్షణాలను ఎంజాయ్ చేసి, ఆ జ్ఞాపకాలను గుర్తుంచుకునేలా చేయడమే తమ లక్క్ష్యమని విస్తారా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ దీపక్ రజావత్ తెలిపారు. అత్యుత్తమ సేవలను అందించే ఎయిర్‌లైన్ విస్తారా కస్టమర్ల ఇష్టమైన ఎంపికగా కొనసాగుతుందనే విశ్వాసాన్ని ప్రకటించారు. Let your travel plans take flight with the Festive Sale! Enjoy discounted fares across different cabin classes on our international network. Book until 20-Oct-22 for travel between 23-Oct-22 and 31-Mar-23: https://t.co/rbWxAfgtNJ pic.twitter.com/Zs8ASBibng — Vistara (@airvistara) October 18, 2022 Travelling home for the festive season? Enjoy discounted fares across different cabin classes on our domestic network. Book now for travel between 23-Oct-22 and 31-Mar-23: https://t.co/rbWxAfgtNJ pic.twitter.com/oMhYkA5WQU — Vistara (@airvistara) October 17, 2022 -
మీషో మెగా బ్లాక్‌బస్టర్ సేల్: ఒక్కరోజులోనే....
సాక్షి,ముంబై:పండుగ సీజన్సేల్లో ఫ్యాషన్ రీటైలర్ ‘మీషో’ భారీ అమ్మకాలను నమోదు చేసింది. మొదటి రోజే 88 లక్షల ఆర్డర్లను సాధించింది. దీంతో మీషో అమ్మకాలు 80 శాతం పెరిగాయి.ఒక రోజులో కంపెనీ సాధించిన రికార్డ్ సేల్ అని మీషో తెలిపింది. సాఫ్ట్‌బ్యాంక్ నిధులఅందించే ఆన్లైన్ రిటైలర్మీషో తన ఐదు రోజుల హాలిడే సేల్‌లో మొదటి రోజు దాదాపు 87.6 లక్షల ఆర్డర్లు వచ్చాయని, అమ్మకాలు 80శాతం పెరిగాయని శనివారం వెల్లడించింది. ముఖ్యంగా టైర్ 2, 3 , 4 నగరాల్లో మొదటి రోజు దాదాపు 85శాతం ఆర్డర్లు లభించాయని మీషో ఒక ప్రకటనలో నివేదించింది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపడం సంతోషంగా ఉందని తెలిపింది. చీరల నుండి అనలాగ్ వాచ్‌లు, జ్యువెలరీ సెట్లు, మొబైల్ కేసులు, కవర్లు, బ్లూటూత్ హెడ్ఫోన్లు, ఛాపర్లు, పీలర్లను రికార్డ్ వాల్యూమ్లలో కొనుగోలు చేశారని కంపెనీ తెలిపింది. ఫ్యాషన్, బ్యూటీ, వ్యక్తిగత సంరక్షణ, కిచెన్,ఎలక్ట్రానిక్ ఉపకరణాలు లాంటివి తొలి రోజు అత్యధికంగా అమ్ముడైన కేటగిరీలుగా ఉన్నాయట. -
మింత్రా ధమాకా సేల్: టాప్ బ్రాండ్స్‌పై 80 శాతం డిస్కౌంట్
సాక్షి,ముంబై: ఆన్లైన్ ఫ్యాషన్ రీటైలర్ మింత్రా కూడా ఫెస్టివ్ సేల్‌ను ప్రారంభిస్తోంది. బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ సేల్ 2022 డిస్కౌంట్సేల్ రేపు (సెప్టెంబరు 23 నుంచి) షురూ కానుంది. ఈ సందర్భంగా టాప్ బ్రాండ్స్‌పై 80 శాతం దాకా తగ్గింపు అందించనుంది. ముఖ్యంగా హెచ్ అండ్ ఎం, లిబాస్, రెడ్ టేప్,గినీ అండ్ జాయ్, మస్త్ అండ్ హార్బర్ ప్యూమా, నైక్ ఉత్పత్తులపై గొప్ప తగ్గింపును అందిస్తోంది. సెప్టెంబరు 23 నుంచి పలు ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిటైలర్లు సంస్థల్లో పండుగ సీజన్ సేల్కు తెర తీయనున్నసంగతి తెలిసిందే. ఎందుకంటే కోవిడ్ తర్వాత ఈ సంవత్సరం అమ్మకాలు మెరుగ్గా ఉంటాయని రిటైలర్లు భావిస్తున్నారు. అందుకే డిస్కౌంట్, డీల్స్ అంటూ కస్టమర్లను ఊరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మింత్రా బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ సేల్‌ను లాంచ్ చేయనుంది. తద్వారా 60 లక్షల ప్రత్యేక కస్టమర్లను ఆకర్షించాలని భావిస్తోంది. మింత్రా బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ గ్రాండ్ ఓపెనింగ్ అర్ధరాత్రి 2 గంటలకు ప్రారంభమవుతుంది. కస్టమర్లకు 6వేలకు పైగా బ్రాండ్లను అందుబాటులో ఉంచుతోంది. మహిళలు, పురుషులు, పిల్లలు, ప్లస్ సైజ్ దుస్తులపై భారీ డీల్స్ అందిస్తోంది. అలాగే ప్యూమా కిడ్స్ వేర్‌పై కనీసం 60 శాతం తగ్గింపును అందిస్తోంది. ప్యూమా, నైక్ స్పోర్ట్స్ షూస్, క్యాజువల్ షూలను 50శాతం వరకు తగ్గింపుతో అందిస్తోంది. ఇంకా MAC, Lakme, Maybelline ఉత్పత్తులపై 15-40శాతం డిస్కౌంట్ లభ్యం. ఇంకా రెడ్ టేప్ షూస్‌పై 80 శాతం వరకు తగ్గింపును ఇస్తోంది. -
బీభత్సం: తొలి వారంలోనే రూ.32వేల కోట్లు..!
దసరా ఫెస్టివల్ సీజన్ ఈ కామర్స్ కంపెనీలకు వరంగా మారింది. ప్రముఖ కన్సెల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ ప్రకారం..ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లు ఫెస్టివల్ సేల్స్ ప్రారంభించిన మొదటి వారంలోనే వేలకోట్లలో అమ్మకాలు జరిపినట్లు పేర్కొంది. ఫ్లిప్ కార్ట్ అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 10 వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహించింది. అమెజాన్ అక్టోబర్ 4 నుంచి గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ నెల రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సందర్భంగా దసరా ఫెస్టివల్ సీజన్ లో ఈ రెండు సంస్థలు అమ్మకాలు ఏ విధంగా జరిపిందనే విషయాలపై రెడ్‌సీర్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్ ఆఫర్లు ప్రకటించడంతో భారీ కొనుగోళ్లు జరిపినట్లు వెల్లడించింది. మొదటి వారంలోనే 4.6 బిలియన్ డాలర్లు (32 వేల కోట్ల రూపాయలు) కోట్లు అమ్మకాలు జరిగాయని, ప్రతి గంటకు రూ. 68 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ అమ్మకాలు జరిగినట్లు రిపోర్ట్‌లో పేర్కొంది. ఇది వార్షిక ప్రాతిపదికన 32 శాతం వృద్ధిని నమోదు చేసింది. అమ్మకాల్లో ఫ్లిప్ కార్ట్ ముందంజ ఈ సంవత్సరం అమెజాన్ కంటే ఫ్లిప్‌కార్ట్ అమ్మకాలు ఎక్కువ జరిపినట్లు తేలింది. పండుగ సేల్స్‌లో ఫ్లిప్ కార్ట్ మార్కెట్ వాటా 64 శాతానికి దగ్గరగా ఉండగా..అమెజాన్ వాటా తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఇక కరోనా కారణంగా గతేడాది కొనుగోళ్లు తగ్గినా.. ఈ ఏడాది మాత్రం పెరిగాయి. దీంతో టైర్ -2, టైర్ -3 నగరాల నుండి పెద్ద సంఖ్యలో కొత్త కస్టమర్లు చేరగా..వారిలో టైర్ -2 కస్టమర్లలో 61 శాతం మంది కొత్త కస్టమర్లేనని తెలిపింది. ఇక గతేడాది ప్రతి కస్టమర్ కొనుగోలుకు సగటు స్థూల వస్తువుల విలువ రూ.4980 ఉండగా ఈ ఏడాదిలో రూ .5034 కి పెరిగినట్లు రెడ్‌సీర్ కన్సల్టింగ్ అసోసియేట్ పార్ట్నర్ ఉజ్వల్ చౌదరి తెలిపారు. చదవండి: 'బిగ్ దివాళీ సేల్',మీ కోసం బోలెడు ఆఫర్లు ఉన్నాయ్! -
అమెజాన్ దివాలీ సేల్, డిస్కౌంట్ ఆఫర్లు
సాక్షి, ముంబై : ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ దీపావళి పండుగ సందర్భంగా మరోసారి డిస్కౌంట్ అఫర్లను తీసుకువచ్చింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2020 అమ్మకాలను 'గిఫ్టింగ్ హ్యాపీనెస్ డేస్' పేరుతో ప్రారంభించింది. ఈ సేల్ ద్వారా ప్రముఖ మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్ఫోన్లు, టీవీలపై తగ్గింపు ధరలు ఆఫర్ చేస్తోంది. అమెజాన్ సీటీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకులతో సహా పలు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. రుపే కార్డు వినియోగదారులు కూడా ఈ ఆఫర్‌కు అర్హులు. ప్రైమ్ డే సేల్ (అక్టోబరు 29)మంచి శుభారంభాన్నిచ్చిందని అమెజాన్ ప్రకటించింది. నేటినుంచి (అక్టోబరు 30) - నవంబర్ 4 తో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ముగుస్తుంది. మరోవైపు ఈవారంలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి అమ్మకాలను చేపట్టాలని చూస్తోంది. అన్ని రకాల ఉత్పత్తులపై నేరుగా డిస్కౌంట్ మాత్రమే కాకుండా పలు బెనిఫిట్స్ ఆఫర్ చేస్తోంది. సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించే వారు నేరుగానే రూ.1,500 వరకు తగ్గింపు పొందొచ్చు. రుపేకార్డు 10 శాతం తక్షణ తగ్గింపు ఆఫర్ కూడా లభ్యం. దీంతోపాటు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటివి కూడా పొందొచ్చు. దీపావళి ప్రత్యేక అమ్మకం సందర్భంగా ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్ 11 రూ. 49,999 కే విక్రయిస్తోంది. దీని ఎంఆర్పి రూ .64,900. అలాగే ఐఫోన్ 11 కొనుగోలుపై 16,400 రూపాయల ఎక్జ్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. అమెజాన్ దీపావళి సేల్ 2020 ఆఫర్లు స్మార్ట్ఫోన్లు - 40శాతం వరకు తగ్గింపు ల్యాప్‌టాప్‌లు - రూ .2,000 వరకు తగ్గింపు టీవీలపై- 40 శాతం వరకు తగ్గింపు కెమెరాలు - కనిష్టంగా 35 శాతం ఆఫర్ ఉపకరణాలు - కనిష్టంగా 45శాతం తగ్గింపు ఫ్యాషన్ - 70శాతం ఆఫ్ కిరాణా సామాగ్రిపై రూ .1 డీల్స్ -
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్: 5 రోజుల్లో 22,000 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దసరా, దీపావళి పండుగల సీజన్లో ఈ-కామర్స్ కంపెనీల టేకాఫ్ అదిరింది. ఫెస్టివల్ సేల్స్‌లో భాగంగా అక్టోబరు 15-19 మధ్య జరిగిన అమ్మకాలు ఏకంగా రూ.22,000 కోట్లు నమోదయ్యాయి. పలు బ్రాండ్లు, విక్రేతలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి ఈ-కామర్స్ కంపెనీల ద్వారా జరిపిన అమ్మకాలపై రెడ్‌సీర్ కన్సల్టింగ్ నివేదిక ప్రకారం.. గతేడాదితో పోలిస్తే ఈ సీజన్లో తొలి అయిదు రోజుల విక్రయాలు గణనీయంగా జరిగాయి. అందుబాటు ధరలో ఉత్పత్తులు, మొబైల్స్ విభాగం మెరుగైన పనితీరు, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో బలమైన వృద్ధి వంటి అంశాలు లాక్డౌన్ తదనంతరం బ్రాండ్స్, విక్రేతల రికవరీకి కారణమయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ సీజన్లో ఈ–కామర్స్ సంస్థలు దాదాపు రెండింతల సేల్స్‌తో రూ.51,590 కోట్ల విలువైన వ్యాపారం చేసే అవకాశం ఉంది. గత సీజన్లో ఇది రూ.28,500 కోట్లు. లక్షలాది మంది విక్రేతలతో.. కంపెనీలు అధిక వ్యాపారం చేసేది ఈ ఫెస్టివల్ సీజన్లోనే. ఈ సమయంలో ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నందున ఇందుకు తగ్గట్టుగా సామర్థ్యం పెంపునకు ఈ-కామర్స్ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడి చేశాయని రెడ్‌సీర్ వెల్లడించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అక్టోబరు 16న ప్రారంభమైంది. నెలరోజుల పాటు ఇది సాగనుంది. తొలి 48 గంటల్లో దేశవ్యాప్తంగా 1.1 లక్షల మంది విక్రేతలు ఆర్డర్లను స్వీకరించారని అమెజాన్ తెలిపింది. వీరిలో చిన్న పట్టణాల నుంచి అత్యధిక సెల్లర్స్ ఉన్నారని వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అక్టోబరు 16-21 మధ్య, స్నాప్‌డీల్ తొలి సేల్ 16-20 మధ్య జరిగింది. మింత్రా బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ అక్టోబరు 16-22 మధ్య నిర్వహిస్తోంది. 80 శాతం మంది కస్టమర్లు స్థానిక, ప్రాంతీయ బ్రాండ్లను, 20 శాతం మంది అంతర్జాతీయ బ్రాండ్లను ఎంచుకున్నారని స్నాప్‌డీల్ తెలిపింది. గతేడాది ఇది 65:35 శాతంగా ఉందని వివరించింది. టాప్–5 నగరాల వెలుపల ఉన్న విక్రేతలు 70 శాతం ఆర్డర్లను స్వీకరించారని స్నాప్‌డీల్ వెల్లడించింది. ఆ రెండు కంపెనీలు.. 1.5 కోట్ల స్మార్ట్ఫోన్ల విక్రయం! పండుగల సీజన్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సుమారు1.5 కోట్ల యూనిట్లస్మార్ట్‌ఫోన్లను విక్రయించనున్నాయని పరిశోధన సంస్థ టెక్ఆర్క్ వెల్లడించింది. అక్టోబరు–డిసెంబరు కాలంలో అమ్ముడయ్యే మొత్తం యూనిట్లలో ఇది 36.58 శాతమని తెలిపింది. టెక్ఆర్క్ ప్రకారం.. 2020లో దేశవ్యాప్తంగా 12.8 కోట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడు కానున్నాయి. ఇందులో 4.1 కోట్ల యూనిట్లు అక్టోబరు డిసెంబరులో కస్టమర్ల చేతుల్లోకి వెళ్లనున్నాయి. శామ్సంగ్, రియల్మీ ఎక్కువ ప్రయోజనం పొందనున్నాయి. మొబైల్ మార్కె ట్లో తిరిగి రంగ ప్రవేశం చేసిన మైక్రోమ్యాక్స్ వృద్ధి నమోదు చేయనుంది. -
విస్తారా పండుగ సేల్: 48 గంటలే..
సాక్షి, న్యూఢిల్లీ: విస్తారా విమానయాన సంస్థ దీపావళి పండుగ సేల్‌ను ప్రకటించింది. దేశీయ నెట్ వర్క్‌లో 48 గంటల సేల్ ఆఫర్‌ను ప్రారంభించింది. ఈ రోజు (అక్టోబర్ 10వ తేదీ, గురువారం) నుంచి 11వ తేదీ అర్ధరాత్రి వరకు ఈ డిస్కౌంట్ సేల్ అందుబాటులో ఉంటుంది. అంటే 48 గంటలు మాత్రమే ఈ సేల్ లభ్యమవుతుంది. ఎకానమీ, ప్రీమియమ్ ఎకానమీ, బిజినెస్ అన్ని క్లాస్‌లకు ఈ సేల్ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ప్రధాన మార్గాల్లో ఢిల్లీ - ముంబై, ముంబై - బెంగళూరు, ముంబై - గోవా, ఢిల్లీ - చెన్నై, ఢిల్లీ - బెంగళూరు ఉన్నాయి. కొత్త డెస్టినేషన్లు జోద్పూర్, ఉదయ్‌పూర్, పాట్నా, ఇండోర్ వంటి నగరాలకు కూడా ఈ సేల్ వర్తిస్తుంది. ప్రధానంగా జమ్మూ-శ్రీనగర్ మార్గంలో1199 లకే(ఎకానమీ క్లాస్) టికెట్ ను అందిస్తోంది. వివిధ మార్గాల్లో ప్రీమియం ఎకానమీ రూ. 6 2,699 , బిజినెస్ క్లాస్ టికెట్ రూ. 6,999 నుంచి ప్రారంభం. ఈ ఆఫర్లో ఎన్ని టికెట్లను ఆఫర్ చేస్తున్నదీ కంపెనీ ప్రకటించలేదు గానీ, ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ కింద టికెట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొంది. ఈ ఆఫర్లో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు అక్టోబర్ 10వ తేదీ నుంచి 2020 మార్చి 28వ తేదీ వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. పండుగ సీజన్‌ను మరింత ఆనందంగా మలించేందుకు, అలాగే తమ వ్యాపార అభివృద్ధికి ఈ డిస్కౌంట్ సేల్ దోహదం చేస్తుందన్న విశ్వాసాన్ని విస్తారా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సంజీవ్ కపూర్ వ్యక్తం చేశారు. Announcing Vistara’s Festive Season Sale with fares starting at ₹1,199 all-in for travel until 28th March 2020. Book your tickets today. Hurry, limited seats available. https://t.co/TbAEPrGMYJ pic.twitter.com/dLgZxDtNpB — Vistara (@airvistara) October 10, 2019 -
ఫెస్టివ్ సేల్ : దుమ్ము లేపిన అమ్మకాలు
సాక్షి, ముంబై : పండుగ సీజన్లో భారతీయ వినియోగదారులు స్మార్ట్ఫోన్ల కొనుగోళ్లలో దుమ్ము లేపారు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఈ సీజన్ మొదటి రోజు రికార్డు స్థాయిలో అమ్మకాలు సాధించినట్టు తెలుస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ. 750 కోట్ల విలువైన ప్రీమియం స్మార్ట్ఫోన్లను విక్రయించినట్టు తెలిపింది. కేవలం 36 గంటల్లో ఈ రికార్డ్ సేల్‌ను నమోదు చేసినట్టు ప్రకటించింది. అమెజాన్: బిగ్ బిలియన్ డేస్ అమ్మకం మొదటి రోజున రెండు రెట్లు వృద్ధిని సాధించినట్లు వాల్‌మార్ట్ సొంతమైన ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ప్రీమియం బ్రాండ్లైన వన్‌ప్లస్, శాంసంగ్, యాపిల్ స్మార్ట్ఫోన్ల అమ్మకాలతో 36 గంటల్లో 750 కోట్ల రూపాయలకు మించి సాధించినట్టు తెలిపింది. తమకు ఇదే అతిపెద్ద ప్రారంభ రోజు అమ్మకాలని అమెజాన్ గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ తెలిపారు. బ్యూటీ అండ్ ఫ్యాషన్ రంగంలో 5 రెట్ల వృద్ధినీ, గ్రాసరీస్ అమ్మకాల్లో ఏకంగా 7 రెట్ల వృద్ధిని సాధించినట్టు వెల్లడించారు. ప్రధానంగా తమకొత్త కస్టమర్లలో 91శాతం, టైర్ 2, 3 పట్టణాలదేనని పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్: ఫ్లిప్‌కార్ట్‌లో దాదాపు ఇదే స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రెండురెట్ల ఎక్కువ అమ్మకాలను సాధించింది. ఫ్యాషన్, బ్యూటీ, ఫర్నిచర్ సంబంధిత విక్రయాలు బాగా వున్నాయని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ కృష్ణమూర్తి తెలిపారు. మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు రెండో రోజు పుంజుకోనున్నాయని చెప్పారు. ఇది ఇలా వుంటే ఈ ఫెస్టివ్ సీజన్ అమ్మకాల్లో మొత్తం మీద రెండు సంస్థలు 5 బిలియన్ డాలర్లకుమించి ఆదాయాన్ని ఆర్జించే అవకాశం వుందని తాజా రిపోర్టుల అంచనా. స్నాప్‌డీల్, క్లబ్ ఫ్యాక్టరీ లాంటి సంస్థలు కూడా ఇదే జోష్‌ను కొనసాగిస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండుగ అమ్మకాలు అక్టోబర్ 4 న ముగియనున్నాయి. కాగా ఈ కామర్స్ సంస్థ పండుగ అమ్మకాల సమయంలో వాస్తవ మార్కెట్ ధరపై కాకుండా రాయితీ ధర అమ్మకాలతో జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి భారీగా నష్టాన్ని కలిగిస్తున్నాయని ట్రేడర్స్ బాడీ సీఐఐటీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. -
ఈ కామర్స్ దిగ్గజాలకు షాక్ : అమ్మకాలు నిషేధించండి
సాక్షి, ముంబై : ఒకవైపు రానున్న ఫెస్టివ్ సీజన్ సందర్భంగా అమెజాన్, ప్లిప్‌కార్ట్ లాంటి దిగ్గజాలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు అఫర్లతో సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఈ కామర్స్ దిగ్గజాలకు షాకిచ్చేలా ఇండియన్ ట్రేడర్ బాడీ కేంద్రానికి సంచలన ప్రతిపాదనలు చేసింది. రానున్న పండుగల సందర్భంగా ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివ్ సేల్స్‌ను నిషేధించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటి) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. భారీ డిస్కౌంట్ల పేరుతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)నిబంధనలను అతిక్రమిస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఈ మేరకు వాణిజ్య మంత్రికి శుక్రవారం ఒక లేఖ రాసింది. రానున్న దసరా, దీపావళి, క్రిస్మస్ సందర్భంగా ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు పండుగల సమయంలో భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నిర్వహిచే ఫెస్టివల్ సేల్‌ను నిషేధించాలని సియాట్ కోరింది. ఇవి ప్రకటిస్తున్న భారీ ఆఫర్లు సాధారణ ట్రేడర్లను దెబ్బతీస్తున్నాయని పేర్కొంది. 10-80 శాతం దాకా భారీ తగ్గింపులను అందించడం ద్వారా, ఈ కంపెనీలు ధరలను స్పష్టంగా ప్రభావితం చేస్తున్నాయని వాదించింది. కాగా ఈ పండుగ సీజన్లో వాల్‌మార్ట్ నేతృత్వంలోని ఫ్లిప్‌కార్ట్ సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్ 4 వరకు వరుసగా ఆరు రోజుల పాటు డిస్కౌంట్ సేల్ అందిస్తోంది. అమెజాన్ కూడా తేదీలు ప్రకటించాల్సి ఉంది. -
విస్తారా ఫెస్టివ్ ‘24 గంటల’ సేల్
సాక్షి,ముంబై: ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా మరోసారి డిస్కౌంట్ సేల్ ప్రకటించింది. 24గంటల విక్రయాలు పేరుతో ఈ ఫెస్టివ్ సేల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ఆఫర్‌ను 13వ తేదీ గురువారం అర్థరాత్రిదాకా పొడిగించినట్టు ట్విటర్లో షేర్ చేసింది. ఈ ఆఫర్లో విమాన టికెట్లు రూ.999లకే (అన్ని చార్జీలు కలిపి) ప్రారంభం కానున్నాయని తెలిపింది. తద్వారా 80శాతం డిస్కౌంట్ పొందవచ్చని వెల్లడించింది. మొత్తం అన్ని క్లాసెస్ (ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్) టికెట్లపై తమ తాజా ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించింది. పరిమితమైన టికెట్ లుమాత్రమే అందుబాటులో ఉన్నాయని ఫస్ట్ కం ఫస్ట్ సెర్వ్ ప్రకారం టికెట్లు కేటాయించబడతాయని పేర్కొంది. నేడు (డిసెంబరు 12 బుధవారం) మధ్యాహ్నం 12:01 గంటలకు ప్రారంభమై రేపు ముగియనుంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా డిసెంబరు 27, ఏప్రిల్ 10 మధ్య కాలంలో ప్రయాణించాల్సి ఉంటుంది. Announcing Vistara’s Festive Sale, fares starting at ₹ 999/- all inclusive. Book your tickets today and save up to 80%! Hurry, limited seats available.https://t.co/Q2yV0VIIcO pic.twitter.com/uI5sCI5I54 — Vistara (@airvistara) December 11, 2018 Sale extended till 13th Dec midnight! Book your tickets under Vistara’s Festive Sale and save up to 80%, with fares starting at ₹ 999/- all inclusive. Hurry, limited seats available. https://t.co/CuUtpBSVra pic.twitter.com/UftmocKLE7 — Vistara (@airvistara) December 12, 2018 -
హువావే ఫోన్లపై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు దీవావళి సేల్‌తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైపోయాయి. ఇప్పటికే దసరా సీజన్‌ను క్యాష్ చేసుకున్న ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు దివాలీ సేల్‌లో మరోసారి డిస్కౌంట్ ధరలను ఆఫర్ చేస్తున్నాయి. వివిధ గృహోపకరణాలతో పాటు, స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను వెల్లడించాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే దివాలీ ఆఫర్లు ప్రారంభం కాగా, అమెజాన్‌లో రేపటినుంచి (నవంబరు 2, శుక్రవారం) ప్రారంభం కానున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్ పేరుతో నవంబరు 2నుంచి 5వతేదీ వరకు ఈ తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. ముఖ్యంగా హువావే ఫోన్లను భారీ డిస్కౌంట్ అందిస్తోంది. హువావే పీ20ప్రో పై ఏకంగా రూ. 10వేల దాకా తగ్గింపును అందిస్తోంది. దీనికితోడు హెచ్డీఎఫ్సీ కార్డు ద్వారా కోనుగోళ్లపై మరో 10శాతం తగ్గింపు అదనం. హువావే పీ 20 ప్రొ : రూ.10 వేల డిస్కౌంట్‌తో రూ. 54,999కే అందుబాటులో ఉంది. హువావే పీ 20 లైట్: 4వేల రూపాయల తగ్గింపు అనంతరం రూ. 15,999లకు అందుబాటులో ఉంచింది. హువావే నోవా 3: రూ. 5వేల తగ్గింపు అనంతరం రూ.29,999లకే లభ్యం. హువావేనోవా3ఐ: రూ.6009 డిస్కౌంట్. దీని లాంచింగ్ ధర 20,990. హువావే స్మార్ట్ఫోన్లతోపాటు శాంసంగ్, గెలాక్సీ ఏ8+, షావోమి రెడ్ 6 ప్రో, షావోమీ టీవీలపై కూడా డిస్కౌంట్లను ఆపర్ చేస్తోంది. రేపు మధ్యాహ్నం 12గంటలనుంచి అమెజాన్ గ్రేడ్ ఇండియన్ ఫెస్టివ్ సేల్ మొదలువుతుంది. It’s time to start adding products to your wishlist because the biggest celebration yet starts tomorrow! Stay tuned for big deals at the #AmazonGreatIndianFestival Diwali Special. pic.twitter.com/TXjkvkl7up — Amazon.in (@amazonIN) November 1, 2018 -
ఇండిగో బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : బడ్జెట్ ఎయిర్‌లైనర్ ఇండిగో విమాన ప్రయాణీకులకు తీపికబురు అందించింది. తన విమానాల్లో పరిమిత కాలానికి రూ 999కు వన్‌వే జర్నీని అందిస్తూ సోమవారం నుంచి మూడు రోజుల పాటు పది లక్షల ప్రమోషనల్ సీట్లను అమ్మకానికి ఉంచింది. సోమవారం నుంచి నాలుగు రోజుల ఫెస్టివ్ సేల్ కింద టికెట్లు బుక్ చేసుకునే వారు ఈనెల 18 నుంచి వచ్చే ఏడాది మార్చి 30 వరకూ ప్రయాణ వ్యవధిలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ కింద మొబైల్ వ్యాలెట్ మొబిక్విక్ ద్వారా బుక్ చేసుకునేవారికి రూ 600 సూపర్ క్యాష్ అమౌంట్‌ను ఇండిగో ఆఫర్ చేస్తోంది. సెప్టెంబర్ 3 నుంచి 6 వరకూ తాము ప్రకటించిన నాలుగు రోజుల ఫెస్టివ్ సేల్ ఆఫర్లో రూ 999 నుంచి విమాన చార్జీలు అందుబాటులో ఉంటాయని, కస్టమర్లకు ఇది మంచి అవకాశమని ఇండిగో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విలియం బౌల్టర్ చెప్పారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇండిగో ఈ తరహా ఆఫర్లతో వర్కింగ్ క్యాపిటల్‌ను సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. 160 విమానాలు కలిగి ఉన్న ఇండిగో రోజుకు ఎనిమిది అంతర్జాతీయ, 52 దేశీయ గమ్యస్ధానాలకు ప్రయాణీకులను చేరవేస్తోంది. -
పండుగ సీజన్లో ఈ-కామర్స్ దిగ్గజాల షాక్
న్యూఢిల్లీ : పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకుని భారీగా ప్రకటనలు ఇచ్చేసుకునే ఉత్పత్తిదారులకు ఈ-కామర్స్ దిగ్గజాలు స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ షాకిచ్చాయి. దీపావళికి ముందు తమ ప్లాట్‌ఫామ్‌పై ప్రొడక్ట్ ప్రకటన ఇచ్చేవారికి భారీగా రేట్లను పెంచేశాయి.అక్టోబర్ 2 నుంచి 6వ తేదీ వరకు జరుగబోయే 'అన్‌బాక్స్ దీపావళి సేల్స్' ప్రోగ్రామ్ కింద అన్ని రకాల ఉత్పత్తులపై కాస్ట్ ఫర్ క్లిక్(సీపీఏ)లను స్నాప్‌డీల్ రెట్టింపు చేసింది. అదేవిధంగా ఫ్లిప్‌కార్ట్ సైతం ప్రొడక్ట్ లిస్టింగ్ యాడ్(పీఎల్ఏ) రేట్లను 50 శాతం పెంచేసింది. 'బిగ్ బిలియన్ డే సేల్' కింద లైఫ్‌స్టైల్, గృహోపకరణాలు, మొబైల్స్, ఎలక్ట్రానిక్ వంటి వస్తువులకు ఈ ప్రకటన ఖర్చులు భారం పడనుంది.మరో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మాత్రం తాను నిర్వహించబోయే 'గ్రేట్ ఇండియన్ సేల్' నేపథ్యంలో ప్రకటన రేట్లలో ఎలాంటి మార్పులు చేపట్టలేదు.పెద్ద ఉత్పత్తుల బ్రాండులు తమ అడ్వర్టైజింగ్లను కోసం భారీ మొత్తంలో ఖర్చుచేసైనా సరే మీడియా ద్వారా ప్రకటనలు ఇచ్చేసుకుంటారని,కానీ చిన్న వర్తకులపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పండుగ సీజన్లో ఉండే రద్దీకి అనుకూలంగా ఈ రేట్లను పెంచామని, టీవీ, ఇతర మీడియాలు కూడా ఈ సమయంలో ప్రకటన రేట్లను పెంచుతాయని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ రామకృష్ణ చెప్పారు. ప్రకటనదారులు దానికి సన్నద్దమయ్యే ఉంటారని పేర్కొన్నారు.