హువావే ఫోన్లపై భారీ తగ్గింపు  | Amazon Great Indian Festival Sale Discounts on Huawei  Mobiles | Sakshi
Sakshi News home page

అమెజాన్‌ ఫెస్టివ్‌ సేల్‌: హువావే ఫోన్లపై భారీ తగ్గింపు 

Published Thu, Nov 1 2018 1:38 PM | Last Updated on Thu, Nov 1 2018 2:01 PM

Amazon Great Indian Festival Sale Discounts on Huawei  Mobiles - Sakshi

సాక్షి, ముంబై:  ప్రముఖ ఈ  కామర్స్‌ సంస్థలు  దీవావళి  సేల్‌తో వినియోగదారులను  ఆకట్టుకునేందుకు  సిద్ధమైపోయాయి. ఇప్పటికే దసరా సీజన్‌ను క్యాష్‌ చేసుకున్న ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ సంస్థలు దివాలీ సేల్‌లో మరోసారి డిస్కౌంట్‌ ధరలను ఆఫర్‌  చేస్తున్నాయి. వివిధ గృహోపకరణాలతో పాటు, స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను వెల్లడించాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే దివాలీ ఆఫర్లు ప్రారంభం కాగా, అమెజాన్‌లో రేపటినుంచి (నవంబరు 2, శుక్రవారం) ప్రారంభం కానున్నాయి. 

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివ్‌ సేల్‌ పేరుతో నవంబరు 2నుంచి 5వతేదీ వరకు ఈ తగ్గింపు ధరలను ఆఫర్‌ చేస్తోంది. ముఖ్యంగా హువావే ఫోన్లను భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది. హువావే పీ20ప్రో పై ఏకంగా రూ. 10వేల దాకా తగ్గింపును అందిస్తోంది.  దీనికితోడు హెచ్‌డీఎఫ్‌సీ  కార్డు ద్వారా  కోనుగోళ్లపై మరో 10శాతం తగ్గింపు అదనం. 

హువావే పీ 20 ప్రొ :  రూ.10 వేల  డిస్కౌంట్‌తో రూ. 54,999కే  అందుబాటులో ఉంది.
హువావే పీ 20 లైట్‌: 4వేల రూపాయల తగ్గింపు  అనంతరం రూ. 15,999లకు అందుబాటులో ఉంచింది.
హువావే నోవా 3: రూ. 5వేల తగ్గింపు అనంతరం రూ.29,999లకే లభ‍్యం.
హువావేనోవా3ఐ: రూ.6009 డిస్కౌంట్‌. దీని లాంచింగ్‌ ధర 20,990. 

హువావే స్మార్ట్‌ఫోన్లతోపాటు శాంసంగ్‌, గెలాక్సీ ఏ8+, షావోమి రెడ్‌ 6 ప్రో, షావోమీ టీవీలపై కూడా డిస్కౌంట్లను ఆపర్‌ చేస్తోంది. రేపు మధ్యాహ్నం 12గంటలనుంచి అమెజాన్‌ గ్రేడ్‌ ఇండియన్‌  ఫెస్టివ్‌ సేల్‌ మొదలువుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement