టాప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఫొటోలు లీక్‌.. హల్‌చల్‌! | Huawei Mate 9 photos leaked | Sakshi
Sakshi News home page

టాప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఫొటోలు లీక్‌.. హల్‌చల్‌!

Published Mon, Oct 24 2016 1:49 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

టాప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఫొటోలు లీక్‌.. హల్‌చల్‌! - Sakshi

టాప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఫొటోలు లీక్‌.. హల్‌చల్‌!

ప్రముఖ కంపెనీ హువాయ్‌ తన ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌ అయిన మేట్‌-9 స్మార్ట్‌ఫోన్‌ను వచ్చేనెల 3న జర్మనీలో ఆవిష్కరించబోతున్నది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో లీకైన మేట్‌-9 ఫొటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. పర్పుల్‌ కలర్‌లో ఫోన్‌ డిజైన్‌ అట్రాక్టివ్‌గా ఉండి నెటిజన్లను ఆకట్టుకుంటున్నది.

ప్రముఖ టిప్‌స్టార్‌ అయిన ఎవాన్‌ బ్లాస్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ ఫొటోలను షేర్‌ చేసుకున్నారు. ప్రతిష్టాత్మకంగా మార్కెట్‌లోకి వస్తున్న ఈ ఫోన్‌ ధర 480 నుంచి 705 డాలర్ల (సుమారు రూ. 32 వేల నుంచి రూ. 47వేల) మధ్య ఉండొచ్చునని భావిస్తున్నారు. హువాయ్‌ నుంచి ఈ కలర్‌ వేరియంట్‌లో ఫోన్‌ రావడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ఇందులో డుయెల్‌ కెమెరా సెటప్‌ కూడా ఉందని లీకైన ఫొటోలను బట్టి తెలుస్తోంది. దీంతోపాటు ఈ కంపెనీ మేట్‌-9 ప్రో మోడల్‌ను కూడా విడుదల చేయబోతున్నది.

మేట్‌ 9 ఫీచర్లు ఇవి..
డిస్‌ప్లే: 5.9 అంగుళాలు (1920x1080 రిజల్యూషన్‌)
4జీబీ లేదా 6 జీబీ ర్యామ్‌
ఇంటర్నల్‌ స్టోరేజ్‌: 256 జీబీ
ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 7.0 నౌగట్‌
ముందు కెమెరా: 12 మెగాపిక్వెల్‌
వెనుక కెమెరా: 20 మెగాపిక్సెల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement