huwaei
-
హానర్ లవర్స్‌కు గుడ్ న్యూస్: 200 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌తో రీఎంట్రీ!
Honor 90 Coming Soon చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ మళ్లీ భారత మార్కెట్లో అడుగుపెడుతోంది. తాజా నివేదికల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరులో హానర్ 90 స్మార్ట్‌ఫోన్‌తో భారతీయ యూజర్లను ఆకట్టుకునేందుకు రడీ అవుతోంది. ఇప్పటికే ఇతర మార్కెట్లలో లాంచ్ అయిన హానర్ 90ని ఇక్కడ లాంచ్ చేయనుంది. దీనికి తోడు రియల్మీ మాజీ సీఈవో మాధవ్ సేథ్ హానర్ ఇండియా హెడ్‌కు రానున్నారు. ఇటీవల దుబాయ్ లాంచ్ ఈవెంట్లో మాధవ్ సందడి చేశారు. అలాగే 15 మంది ఉద్యోగులతో పాటు కొంతమంది ఉన్నతాధికారులు Realmeకి గుడ్‌బై చెప్పి ఇప్పటికే HonorTechలో చేరారని ఐఏఎన్ఎస్ నివేదించిన నేపథ్యంలో ఈ వార్తలకు బరింత బలం చేకూరింది. (జియో ఫైబర్ రూ. 398 ప్లాన్, ఆఫర్లేంటో తెలుసా?) ఖచ్చితమైన తేదీ ఇంకా వెల్లడి కానప్పటికీ, టెక్నికల్ గురూజీ గౌరవ్ చౌదరి లీక్ చేసిన వివరాల ప్రకారం హానర్ 90 లాంచ్ సెప్టెంబర్ మధ్యలో ఉంటుందని ధర రూ. 50వేలలోపు ఉంటుందట. అంటే సెగ్మెంట్లో వన్‌ప్లస్ 11ఆర్, ఒప్పో రెనో 10 ప్రో, నథింగ్ ఫోన్ 2 లాంటి స్మార్ట్ఫోన్లకు గట్టి పో వ్వనుందని అంచనా. పీకాక్ బ్లూ, డైమండ్ సిల్వర్, మిడ్నైట్ బ్లాక్ మరియు ఎమరాల్డ్ గ్రీన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా నాలుగు విభిన్న రంగులలో అందుబాటులోకి రానుంది. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు అంచనాలు ఇలా ఉన్నాయి. హానర్ 90 ఫీచర్లు అంచనాలు 6.7 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ఎస్ఓసీ 200+12+2 ఎంపీ ట్రిపుల్ రియర్‌కెమెరా 50ఎంపీ సెల్పీ కెమెరా 5000ఎంఏహెచ్ బ్యాటరీ,66వాట్ ఛార్జింగ్ సపోర్ట్ కాగా కొన్నేళ్ల క్రితం హువావే ఉప-బ్రాండ్‌గా ఉన్న ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్,అమెరికా గూగుల్ సేవలను ఉపయోగించ కుండా హువావేపై ఆంక్షల నేపథ్యంలో పలు సవాళ్లు ఎదుర్కొంది. కానీ హానర్ ఇండియాలో మాత్రం కొత్త ఉత్పత్తులను కొనసాగించింది. Honor Watch ES, Honor Pad 5 వంటి స్మార్ట్‌వాచ్‌లు టాబ్లెట్లపై దృష్టి సారించింది. మరోవైపు ఇండియాలో హానర్ విడుదల చేసిన చివరి స్మార్ట్‌ఫోన్. రూ.10వేల బడ్జెట్ ధరలో హానర్ 9ఏ. -
'చైనా సంస్థ నుంచి డబ్బులు తీసుకొనే బీబీసీ తప్పుడు ప్రచారం'
న్యూఢిల్లీ: చైనాకు చెందిన సంస్థ నుంచి డబ్బులు తీసుకునే ప్రధాని మోదీపై బీబీసీ తప్పుడు డాక్యుమెంటరీని రూపొందించిందని బీజేపీ ఎంపీ, సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలాని ఆరోపించారు. హూవావే సంస్థ నుంచి బీబీసీకి డబ్బులు అందాయని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. Why is #BBC so anti-India? Because it needs money desperately enough to take it from Chinese state linked Huawei (see link) & pursue the latter’s agenda (BBC a fellow traveller, Comrade Jairam?)It’s a simple cash-for-propaganda deal. BBC is up for sale https://t.co/jSySg542pl — Mahesh Jethmalani (@JethmalaniM) January 31, 2023 'బీబీసీ ఎందుకు భారత్‌కు వ్యతిరేకం? ఆ సంస్థకు బాగా డబ్బు అవసరమైంది. చైనాకు చెందిన హువావే సంస్థ ఆ డబ్బును సమకూర్చింది. డబ్బు తీసుకుని కావాలనే బీబీసీ తప్పుడు ప్రచారం చేస్తోంది. బీబీసీ అమ్ముడుపోతోంది.' అని మహేష్ జెఠ్మాలని ట్వీట్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి బ్రిటన్ మేగజీన్ 'ది స్పెక్టేటర్' 2022 ఆగస్టులో ప్రచురించిన ఓ కథనాన్ని కూడా షేర్ చేశారు. బీజేపీ నేత అమిత్ మాలవీయ సైతం బీబీసీ డాక్యుమెంటరీ దురుద్దేశంతో ఉందని ఆరోపించారు. భారత్ వృద్ధికి ఆటంకం కల్గించేందుకే ఇలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. చైనా ప్రభుత్వం అండదండలతో కొన్ని సంస్థలు బీబీసీతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, రెండేళ్లుగా డబ్బులు అందిస్తున్నాయని అన్నారు. ఈ డాక్యుమెంటరీని ప్రతిపక్షాలు కూడా ఉపయోగించుకోవాలని చూస్తున్నాయని పేర్కొన్నారు. కార్తీ చిదంబరం సెటైర్లు.. మరోవైపు బీజేపీ నేతల తీరుపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సెటైర్లు వేశారు. కేంద్రం బీబీసీ డాక్యమెంటరీని బ్యాన్ చేయడం చిన్నపిల్లల మనస్తత్వాన్ని గుర్తు చేస్తోందన్నారు. ఒకవేళ బీజేపీ నేతల దగ్గర బలమైన ఆధారాలుంటే బ్రిటన్‌లో ఆ సంస్థపై ఫిర్యాదు చేయవచ్చు కదా? అని ప్రశ్నించారు. డాక్యుమెంటరీలో వాస్తవం లేదని ప్రభుత్వం భావిస్తే అసలు నిజాలేంటో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయకుండా బ్యాన్ ఎందుకు చేశారని అడిగారు. బీజేపీ నేతలు నిజంగా చైనా గురించి మాట్లాడాలనుకుంటే సరిహద్దులో చొరబాట్లు గురించి చర్చించాలన్నారు. చదవండి: మోదీ బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై సుప్రీంకోర్టులో విచారణ -
5G: ఎయిర్టెల్, జియో కీలక నిర్ణయం: చైనాకు షాక్!
సాక్షి, ముంబై: దేశంలో 5జీ సేవలను అందించేందుకు సంబంధించిన 5G నెట్వర్క్ స్పెక్ట్రమ్ వేలం మూడో రోజు విజయవంతంగా కొనసాగుతోంది. మరోవైపు దేశీయ దిగ్గజ కంపెనీలు ఎయిర్టెల్, జియో చైనా కంపెనీలతో భాగస్వామ్యాన్ని క్యాన్సిల్ చేసుకోవడంతో చైనాకు ఇక తలుపులు మూత పడ్డాయని వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి. అత్యంత వేగవంతమైన 5జీ టెలికం సేవలకవసరమైన స్పెక్ట్రంను కేటాయింపుల వేలంలో టెల్కోలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. రెండో రోజు (బుధవారం) ముగిసేసరికి తొమ్మిది రౌండ్లు పూర్తి కాగా రూ. 1.49 లక్షల కోట్ల విలువ చేసే బిడ్లు వచ్చిన సంగతి తెలిసిందే. వేలం ప్రక్రియ మూడో రోజు నేడు (గురువారం) కూడా కొనసాగనున్నట్లు టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. బుధవారం బిడ్డింగ్ ముగిసే సమయానికి జియో రూ. 82,500 కోట్లకు దాదాపు 46,000 కోట్లతో ఎయిర్టెల్, రూ. 19,000 కోట్లతో వొడాఫోన్ ఐడియా బిడ్డింగ్ చేయగా, కొత్తగా వచ్చిన అదానీ డేటా నెట్వర్క్స్ హై బ్యాండ్ స్పెక్ట్రమ్ కోసం దాదాపు రూ.900-1,000 కోట్లకు బిడ్ చేసింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇచ్చేలా 700 GHz బ్రాండ్‌ను కొనుగోలు చేయగల ఏకైక టెలికాం జియో మాత్రమేనని విశ్లేషకుల అభిప్రాయం. మరోవైపు 5జీ సేవలకు సంబంధించి జియో ఎయిర్టెల్ భాగస్వామ్యాలు విశేషంగా నిలిచాయి. టెలికాం కంపెనీల 5జీ పార్టనర్షిప్స్ జియో, ఎయిర్టెల్ ఫిన్లాండ్కు చెందిన నోకియా, స్వీడన్‌కు చెందిన ఎరిక్సన్, కొరియాకు చెందిన శాంసంగ్‌లకు కాంట్రాక్టుల భాగస్వామ్యాల్ని కుదుర్చుకున్నాయి. తద్వారా 5జీ సేవల విషయంలో చైనా కంపెనీలు,హువావే, జెడ్‌టీఈలకు మన దేశంలో అధికారికంగా తలుపులు మూసేసినట్టైంది. కాగా 5జీసేవలు ఈ ఏడాది అక్టోబర్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 14 తర్వాత ప్రభుత్వం స్పెక్ట్రమ్‌ను ఆయా కంపెనీలకు కేటాయించనుంది. -
ఫోన్లపై వంద శాతం డిస్కౌంట్.. చైనా కంపెనీ వెటకారం!!
గ్లోబల్ మార్కెట్లో అమెరికా వర్సెస్ చైనా వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒక్కో రంగంలో పోటాపోటీ పైచేయితో దూసుకుపోతున్నాయి. అయితే చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు అమెరికా ఆంక్షలు, నిషేధాలకు సైతం వెనుకాడడం లేదు. ఈ తరుణంలో హువాయ్‌పై నిషేధం విధించిన విషయమూ తెలిసిందే. హువాయ్అమెరికా తాజాగా తన వెటకారాన్ని ప్రదర్శిచింది. బ్లాక్ ఫ్రైడ్ పేరుతో ఫోన్లపై 100 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది కంపెనీ. ఇది అమెరికన్లను మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా అంటూ సోమవారం తన ట్విటర్ పేజీలో ఓ పోస్ట్ కూడా చేసింది. అయితే అమెరికా నిషేధాన్ని నిరసిస్తూ ఈ రకంగా హువాయ్ సెటైర్లు వేసింది. Black Friday special! 100% OFF all phones we currently sell in the US.🙃 — HuaweiUSA (@HuaweiUSA) November 22, 2021 ఈ ట్వీట్‌కు విపరీతమైన లైకులు షేర్లు వచ్చాయి. దీంతో హువాయ్ మరో ట్వీట్ ద్వారా స్పందించింది. ఇదంతా జోక్అని, బ్లాక్ ఫ్రైడే సందర్భంగా తమ నుంచి ఎలాంటి అమ్మకాలు అమెరికాలో ఉండబోవని స్పష్టం చేసింది. ఇక నవంబర్ 26న బ్లాక్ ఫ్రైడే సందర్భంగా పలు కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కానీ, హువాయ్ మాత్రం ‘చిప్ ఆంక్షల’ కారణంగా నిషేధం ఎదుర్కొంటూ గమ్మున ఉండిపోయింది. OK, everyone. It's just a joke. We can't sell anything in the USA 😭😭😭 #ReadyWhenYouAre — HuaweiUSA (@HuaweiUSA) November 22, 2021 ఒకప్పుడు హువాయ్ ఉత్పత్తులు అమెరికా మార్కెటింగ్ వల్లే ప్రపంచం మొత్తంలో భారీగా అమ్ముడు పోయేవి. అయితే అమెరికా ఆంక్షలు, నిషేధం తర్వాత నుంచి భారీగా పతనం అవుతూ వస్తోంది. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో 32 శాతం అమ్మకాలు పడిపోగా, మొదటి అర్థభాగంలో 29.4 శాతం క్షీణత కనిపించింది. -
పెద్ద పన్నాగమే పన్నిన చైనా...!
కాలిఫోర్నియా: భారత్‌ను ఎదుర్కొవాలనే కుతంత్రంతో చైనా పలు విషయాల్లో పాకిస్థాన్‌కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో కూడా పాకిస్థాన్‌కు సహాయాన్ని అందించింది. పాకిస్థాన్ పౌరులకు వ్యాక్సిన్ అందించడంలో కూడా చైనా ముందే ఉంది. పాకిస్థాన్ కుటీల రాజకీయాల వల్ల ఆ దేశాన్ని ఫైనాన్షిల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్‌లో భాగంగా పాకిస్థాన్‌ను అమెరికా గ్రే లిస్ట్‌లో పెట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌కు అందించే ఆర్థిక సహాయాన్ని కూడా అమెరికా పూర్తిగా నిలిపివేసింది. దీంతో డ్రాగన్ దేశంతో పాకిస్థాన్ మరింత దగ్గరైంది. చైనాతో చేస్తోన్న దోస్తీ ఇప్పుడు పాకిస్థాన్ కొంపముంచేలా ఉంది. చైనాకు చెందిన టెక్ దిగ్గజం హువావే పాకిస్థాన్ ప్రజలపై నిఘా పెట్టిన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన సున్నితమైన డేటాను హువావే యాక్సెస్ చేసిందని వార్తలు వస్తున్నాయి. హువావే కంపెనీ పాకిస్థాన్ దేశానికి చెందిన వాణిజ్య రహస్యాలను దొంగిలించి పాకిస్తానీయులపై నిఘా పెట్టిందని అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ బిజినెస్ ఎఫిషియెన్సీ సోల్యూషన్స్ ఆరోపించింది. పాకిస్థాన్ ప్రభుత్వం కోసం బిజినెస్ ఎఫిషియెన్సీ సోల్యూషన్స్ ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసింది. సాఫ్ట్వేర్ పూర్తైన తరువాత పాకిస్థాన్ దేశపు సమాచారాన్ని ట్రయల్ రన్ కోసం బీజింగ్‌కు పంపింది. ఇప్పటివరకు హువావే పాకిస్థాన్‌కు చెందిన సమాచారాన్ని తిరిగి ఇవ్వలేదని బిజినెస్ ఎఫిషియెన్సీ సోల్యూషన్స్ ఆరోపించింది. ఈ విషయంపై బిజినెస్ ఎఫిషియెన్సీ సోల్యూషన్స్ కాలిఫోర్నియా కోర్టులో హువావేపై విచారణ చేయాలని ఆరోపించింది. బీఈఎస్ తన పిటిషన్లో పాకిస్థాన్‌కు చెందిన కీలక సమాచారాన్ని హువావే బ్యాక్‌డోర్ ద్వారా గ్రహిస్తుందని పేర్కొంది. చైనా కేవలం పాకిస్థాన్‌పై నిఘా ఉంచిదనుకుంటే పొరపాటే..! మిడిల్ ఈస్ట్ దేశాలపై కూడా చైనా సైబర్ దాడులను చేస్తోందని సైబర్‌సెక్యూరిటీ సంస్థ ఫైర్ఐ వెల్లడించింది. పాకిస్థాన్ కీలక సమాచారం, ఆ దేశ ప్రజల సమాచారాన్ని సేకరించి పూర్తిగా పాకిస్థాన్ దేశాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకునేలా చైనా ప్రయత్నిస్తోంది. -
ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫోన్ మేకర్‌గా రెడ్మీ
-
సంచలనం:యాపిల్‌ను వెనక్కి నెట్టిన షియోమీ
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షియోమీ సంచలనం సృష్టించిది. యాపిల్ కంపెనీని వెనక్కి నెట్టేసి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫోన్ మేకర్‌గా నిలిచింది. ఇక ఈ చైనీస్ మొబైల్ కంపెనీ ఇప్పుడు శాంసంగ్ టాప్ పొజిషన్‌కు ఎర్త్ పెట్టేందుకు సిద్ధమైంది. టెక్నాలజీ మార్కెట్ అనలిస్ట్ canalys నివేదిక ప్రకారం.. 2021 రెండో క్వార్టర్లో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాల ద్వారా షియోమీ రెండో స్థానానికి చేరుకుంది. ఇక మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 19 శాతం షేర్లతో దక్షిణ కొరియా దిగ్గజ కంపెనీ శాంసంగ్ టాప్ పొజిషన్లో ఉండగా, షియోమీ 17 శాతం షేర్ల వద్ద ముగిసింది. సాధారణంగా ఇప్పటిదాకా శాంసంగ్, యాపిల్ల్లో మాత్రమే ఏదో ఒకటి నెంబర్ వన్ పొజిషన్లో ఉంటూ వచ్చేవి. ఫస్ట్ టైం షియోమీ రెండో ప్లేస్‌కు చేరి ఆ సంప్రదాయానికి పుల్‌స్టాప్ పెట్టింది. హువాయ్ పతనం తర్వాత మిగతా ఫోన్ కంపెనీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే ఈ గ్యాప్‌ను పూరించే పోటీలో షియోమీ పైచేయి సాధించింది. లాటిన్ దేశాలకు 300 శాతం కంటే ఎక్కువ, ఆఫ్రికా దేశాలకు 150 శాతం, పశ్చిమ యూరప్ దేశాలకు 50 శాతం షియోమీ ఫోన్ ఎగుమతులు వెళ్లాయి. ఎంఐ11 అల్ట్రా లాంటి ఫోన్ల వల్లే షియోమీ క్రేజ్ పెరిగిందని.. అదే టైంలో ఒప్పో, వివో నుంచి గట్టి పోటీ ఎదురైందని కనాలిస్ నివేదిక వెల్లడించింది. అయినప్పటికీ షియోమీ రెండో స్థానానికి చేరుకోవడం విశేషం. ఇక ఈ ఊపు ఇలాగే కొనసాగితే షియోమీ నెంబర్ వన్ బ్రాండ్‌గా అవతరించేందుకు అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం యాపిల్‌కు 14 శాతం షేర్ ఉండగా, ఒప్పో.. వివోలు చెరో పదిశాతం మార్కెట్‌ను కలిగి ఉన్నాయి. -
Huawei : ఆండ్రాయిడ్ స్థానంలో హర్మోని
వెబ్‌డెస్క్ : ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ హువావే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి మంగళం పాడేందుకు రెడీ అయ్యింది. ఆండ్రాయిడ్ ఓఎస్ స్థానంలో తనదైన స్వంత ఆపరేటింగ్ సిస్టమ్ హర్మోనిని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. క్రమంగా హువావేకు చెందిన స్మార్ట్ఫోన్లు, ట్యాబెట్లు, వేరబుల్ గాడ్జెట్లలో ఆండ్రాయిడ్ స్థానంలో హర్మోని ఓఎస్ తేబోతున్నట్టు ఆ సంస్థ తెలిపింది. ఆండ్రాయిడ్‌పై ఆధారపడలేం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనదైన ముద్ర వేసేందుకు టెక్ జెయింట్ హువావే పకడబ్బంధీగా పావులు కదుపుతోంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి సమాంతరంగా హువావే రూపొందించిన హర్మోనీ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)తో స్మార్ట్ఫోన్లు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హువావే ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్లయిన మేట్ 40, మేట్ X 2లలో రాబోయే మోడల్స్‌ని హర్మోని ఓఎస్‌తో తీసుకువస్తామని ప్రకటించింది. అంతేకాదు క్రమంగా ప్రస్తుతం ఆండ్రాయిడ్ వెర్షన్‌పై ఉన్న ఫోన్లను సైతం హర్మోని ఓఎస్ పరిధిలోకి తెస్తామని చెప్పింది. హువావే పరికరాలపై అమెరికా అభ్యంతరాలు చెప్పడం ప్రారంభించినప్పుడే హువావే సొంత ఓఎస్‌పై దృష్టి పెట్టింది. క్రమంగా అమెరికాకు చెందిన గూగుల్ రూపొందించిన ఆండ్రాయిడ్‌పై ఆధారపడటం తగ్గించాలని నిర్ణయించింది. రాబోయే రోజుల్లో హువావే నుంచి వచ్చే ట్యాబ్స్, వేరబుల్ డివైజెస్, టీవీలు అన్నింటిని హర్మోని ఓఎస్‌తోనే తేవాలని నిర్ణయించింది. ప్రత్యామ్నయం సాధ్యమేనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఆండ్రాయిడ్ హవాకు అడ్డుకట్ట వేయడం ఆపిల్ లాంటి సంస్థలకే సాధ్యం కాలేదు. ఐనప్పటికీ ఆండ్రాయిడ్‌కి ప్రత్యామ్నయంగా ఐఓఎస్ ఒక్కటే మార్కెట్లో నిలబడింది. స్మార్ట్ఫోన్ల మార్కెట్లో ఆండ్రాయిడ్ ఓఎస్ రాజ్యమేలుతోంది. ఆండ్రాయిడ్‌కు ప్రత్యామ్నాయంగా సామ్సంగ్ సంస్థ టైజన్ పేరుతో స్వంత ఓఎస్ డెవలప్చేసినా.. మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో సామ్సంగ్ సైతం ఆండ్రాయిడ్ ఓఎస్‌తోనే ఫోన్లు తెస్తోంది. మరీ హువావే హర్మోని ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఉన్నాయి. -
హువావే కిడ్స్ ఫ్రెండ్లీ టాబ్లెట్ : తక్కువ ధరలో
సాక్షి, ముంబై : చైనా టెక్ కంపెనీ హువావే కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది. మ్యాట్ ప్యాడ్ టీ8 పేరుతో దీన్ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రధానంగా కరోనా కాలంలో ఆన్ లైన్ క్లాసుల కోసం కంప్యూటింగ్ పరికరాన్ని తీసుకొచ్చింది. కొనుగోలుదారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులే లక్ష్యంగా ఈ ట్యాబ్‌ను ఆవిష్కరించింది. రికార్డర్, కెమెరా, మల్టీమీడియా కిడ్స్ పెయింటింగ్ , పేస్ అన్ లాక్ లాంటి ఫీచర్లతో ఇది కిడ్స్ ఫ్రెండ్లీ టాబ్లెట్‌గా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అలాగే ఎక్కువ కాలం పాటు టాబ్లెట్‌ను ఉపయోగిస్తున్నట్లయితే పిల్లల భంగిమను సరిదిద్దేలా హువావే హెచ్చరిక కూడా ఇస్తుందని తెలిపింది. దీంతోపాటు టైమర్ మరియు మల్టీ లేయర్డ్ కంటి రక్షణ ఫీచర్ కూడా ఉందని కంపెనీ పేర్కొంది.12 గంటల బ్యాటరీ బ్యాకప్ ఉంటుందని వెల్లడించింది. అన్ని వైపులా పెద్ద బెజెల్స్‌తో వైఫై, ఎల్టీఈ రెండు వెర్షన్లలో లభ్యం. హువావే మ్యాట్ ప్యాడ్ టీ8 స్పెసిఫికేషన్లు 8 ఇంచుల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే 1280 x 800 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ8768 ప్రాసెసర్ 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 512 జీబీ విస్తరించుకునే అవకాశం. 5 ఎంపీ రియర్ కెమెరా 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ హువావే మ్యాట్‌ప్యాడ్ టీ8 ధర, లభ్యత వైఫై వేరియెంట్ ధర రూ.9,999 ఎల్టీఈ వేరియెంట్ ధర రూ.10,999 సెప్టెంబర్ 14 వరకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ప్రీ-ఆర్డర్ వ్యవధిలో ఎల్టీఈ వేరియంట్‌పై వెయ్యి రూపాయల తగ్గింపును అందిస్తోంది. సెప్టెంబర్ 15 నుంచి కొనుగోలుకు లభ్యం. -
చైనా కంపెనీకి చుక్కెదురు
లండన్ : డ్రాగన్‌కు బ్రిటన్ మంగళవారం భారీ షాక్ ఇచ్చింది. 5జీ నెట్‌వర్క్‌లో చైనా కంపెనీ హువాయికి పరిమిత పాత్ర ఇవ్వాలన్న నిర్ణయం నుంచి బ్రిటన్ ప్రభుత్వం వెనక్కుతగ్గింది. చైనా కంపెనీ హువాయి నుంచి వచ్చే ఏడాది ఆరంభం నుంచి 5జీ పరికరాలను కొనుగోలు చేయరాదని టెలికాం ప్రొవైడర్లను బ్రిటన్ ఆదేశించింది. హువాయి పరికరాల ద్వారా చైనా ప్రభుత్వం బ్రిటన్ నెట్‌వర్క్‌ల్లోకి చొరబడుతుందనే ఆందోళనతో ఇంటెలిజెన్స్ షేరింగ్ ఒప్పందం నుంచి వైదొలుగుతామని అమెరికా హెచ్చరించిన క్రమంలో 5జీ నెట్వర్క్ నుంచి హువాయిని బ్రిటన్ నిషేధించింది. మరోవైపు పాలక కన్జర్వేటివ్ పార్టీలో చైనాను వ్యతిరేకించే రెబెల్స్ నుంచి ప్రధాని బోరిస్ జాన్సన్‌పై ఒత్తిడి ఎదురవుతోంది. చైనా ఇటీవల చేపట్టిన హాంకాంగ్ భద్రతా చట్టం, చైనా ప్రభుత్వంతో హువాయికి ఉన్న సంబంధాల నేపథ్యంలో డ్రాగన్ బ్రిటన్‌లో వ్యతిరేకత మూటకట్టుకుంది. దేశ 5జీ నెట్వర్క్ ప్రక్రియ నుంచి హువాయిని తొలగించాలని కోరుతూ పదిమంది కన్జర్వేటివ్ ఎంపీలు బోరిస్ జాన్సన్‌కు లేఖ రాశారు. మరోవైపు 5జీ ప్రక్రియలో తమపై బ్రిటన్ నిషేధం విధించడం నిరాశపరిచిందని, ఇది రాజకీయ నిర్ణయమని హువాయి వ్యాఖ్యానించింది. చదవండి : టిక్‌టాక్, వీచాట్‌లపై త్వరలోనే కఠిన చర్యలు! -
ఎవరెస్ట్ ఎత్తుపై చైనా అభ్యంతరం
బీజింగ్: ప్రంపచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ హైట్‌పై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. నేపాల్ ప్రభుత్వం ఎవరెస్ట్ ఎత్తును ఎక్కువ చెప్తుందని చైనా ఆరోపించింది. ఈ క్రమంలో పర్వతం హైట్‌ను ఖచ్చితంగా కొలవడం కోసం చైనా ఒక సర్వే బృందాన్ని బుధవారం ఎవరెస్ట్ మీదకు పంపింది. ఆరు దశలుగా పర్వతం హైట్‌ను కొలిచిన చైనా బృందం.. నేపాల్ ప్రభుత్వం చెబుతున్న దాని కంటే పర్వతం ఎత్తు 4 మీటర్లు తక్కువ ఉందని తేల్చింది. ప్రస్తుతం ఎవరెస్ట్ హైట్ 8844. 43 మీటర్లు అని చైనా సర్వే బృందం తెలిపింది. ఇప్పటి వరకు నేపాల్ ప్రభుత్వం ఎవరెస్ట్ ఎత్తును 8,848 మీటర్లుగా చెప్తున్న సంగతి తెలిసిందే. టిబెటన్ భాషలో ఎవరెస్ట్ పర్వతాన్ని చోమో లుంగ్మా పర్వతం అంటారు. ‘ఈ పర్వతం మీద సంభవించే మార్పులు ప్రపంచ భూగర్భ శాస్త్రం, జీవావరణ శాస్త్రం అధ్యయనాలకు కీలకమైనవి. ఇది ప్రజల జీవితాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది’ అని చైనా సహజ వనరుల మంత్రిత్వ శాఖ ఇంజనీర్ చెన్ గ్యాంగ్ అన్నారు. చొమోలుంగ్మా పర్వతం ఎత్తును ఖచ్చితంగా కొలవడం వల్ల హిమాలయాలు, కింగ్హై-టిబెట్ పీఠభూమిలో సంభవించే మార్పులను అధ్యయనం చేయడానికి సహాయపడుతుంది అని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాతావరణ భౌతిక శాస్త్రవేత్త గావో డెంగి చెప్పారు.(మ్యాపుల వివాదం.. నేపాల్ ప్రధానికి షరతులు!) అంతేకాక చైనా టెక్ సంస్థ హువావే, చైనా మొబైల్‌తో కలిసి ఎవరెస్ట్ శిఖరంపై రెండు 5 జీ స్టేషన్లను నిర్మించడానికి ప్రయత్నిస్తుంది. ఇదే గనక సాధ్యమైతే ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించిన 5 జీ బేస్ స్టేషన్లుగా ఇవి నిలుస్తాయని గ్లోబల్ టైమ్స్ తెలిపింది. ఈ సందర్భంగా హువావే ప్రాజెక్ట్ మేనేజర్ జాంగ్ బో మాటట్లాడుతూ.. ‘ఎవరెస్ట్‌పై 6,500 మీటర్ల ఎత్తు.. అత్యంత ఎత్తైన ప్రదేశంగా ఉంటుంది. ఇక్కడే హువావే 5 జీ స్టేషన్‌ను నిర్మించాలని భావిస్తుంది. అయితే సిగ్నల్ 8,848 మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరం వరకు విస్తరించగలదా, లేదా అని పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నం సఫలం అయయ్యేందుకు మేం కృషి చేస్తున్నాం’ అని తెలిపారు. -
బడ్జెట్ ధరలో హువావే స్మార్ట్‌పోన్
బీజింగ్: చైనాకుచెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు హువావే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఎంజాయ్ 10ఈ పేరుతో బడ్జెట్ సెగ్మెంట్ లోఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. భారీ బ్యాటరీ, డ్యుయల్ రియర్ కెమరా లాంటి కీలకఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రెండువేరియంట్లలో చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే భారత్ సహా ఇతర మార్కెట్లలో ఎపుడు లాంచ్ చేసిన స్పష్టత లేదు. హువావే ఎంజాయ్ 10ఈ ఫీచర్లు 6.3 ఇంచుల డిస్ప్లే 600 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 4జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ 512 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 13+2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 3జీబీ ర్యామ్ /64 జీబీ ధర సుమారు రూ.10,309 4జీబీర్యామ్/128 జీబీ స్టోరేజ్ ధర సుమారు రూ.12,375 మిడ్నైట్ బ్లాక్, పెర్ల్ వైట్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్స్‌లో మార్చి 5వ తేదీ నుంచి వినియోగదారులకు లభ్యం కానుంది. -
చైనాలో తగ్గిన ఐఫోన్11 అమ్మకాలు
చైనా: అమెరికా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఆపిల్‌కు చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీల సెగ బాగా తగులుతోంది. ఈ క్రమంలోనే మొబైల్ రంగంలో విప్లవం సృష్టించిన యాపిల్ ఐఫోన్ హువావే రాకతో కాస్త తడబడినట్లు తెలుస్తోంది. శుక్రవారం చైనీస్ మార్కెట్లో విడుదలయిన ఐఫోన్11 అమ్మకాలలో కాస్త వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. చైనా చవక బ్రాండ్లయిన వివో, ఒప్పోలు ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రభావం చూపుతున్నా యాపిల్ అమ్మకాలు పడిపోవడానికి హువావే ముఖ్యకారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, న్యూషిప్‌మెంట్ రిపోర్ట్ 2019 ప్రకారం మొదటి క్వార్టర్లో యాపిల్ అమ్మకాలు చైనాలో 30శాతం మేర తగ్గినట్లు నివేదిక స్పష్టం చేస్తుంది. ప్రస్తుత పరిస్థితులలో యాపిల్ పుంజుకోవాలంటే హోలోగ్రామ్ ఫోన్ లేదా 5జీ నెటవర్క్ అందుబాటులోకి తీసుకొస్తేనే మునపటి మాదిరి అమ్మకాలు కొనసాగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే చైనాలో ఐఫోన్ మందగమనానికి అమెరికా, చైనా వాణిజ్యపరమైన యుద్ధాలు ఒక కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. చైనీయులు లోకల్ బ్రాండయిన హువాయ్‌వైపే మొగ్గు చూపుతున్నారని, అయితే 5జీ వస్తే యాపిల్ అమ్మకాలు పుంజుకోవచ్చని ఆర్థిక నిపుణుడు మిశ్రా తెలిపారు. అయితే చైనా ప్రభుత్వం హువావేనే వాడాలని ఆదేశించడం, సరికొత్త ఫ్యూచర్స్‌తో అలరించడం తదితర పరిణామాలు హువావే పుంజుకోవడానికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలో 30శాతం గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లను చైనా కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. కానీ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ అమ్మకాలలో 16 శాతం క్షీణతను చెనా ఎదుర్కొంటున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. -
హానర్ ఫోన్ పోయింది..ఇస్తే రూ.4 లక్షలు
సామాన్య మానవుడు విలువైన స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకోవడం అంటే చెప్పలేని బాధ. మరి అలాంటిది టెక్ జెయింట్ పొరపాటున స్మార్ట్‌ఫోన్‌ను కోల్పోతే.. ధర పరంగా పెద్దగా బాధపడకపోయినా.. ఇంకా లాంచ్ కావాల్సిన స్మార్ట్‌ఫోన్ మిస్ అయితే మాత్రం కష్టమే. జర్మనీకి చెందిన మొబైల్ మేకర్ హువావే సబ్బ్రాంబ్ హానర్‌కు చెందిన ఉద్యోగి ఇలాంటి ఇబ్బందుల్లోనే చిక్కుకున్నాడు. దీంతో ఆ ఫోన్‌ను తెచ్చి ఇచ్చిన వారికి భారీ ఆఫర్ ప్రకటించింది కంపెనీ. సురక్షితంగా హానర్ మొబైల్ తెచ్చి ఇస్తే.. సుమారు రూ. 4 లక్షల బహుమానం ఇస్తానని ట్విటర్ ద్వారా వెల్లడించింది. హానర్ ఉద్యోగి ఏప్రిల్ 22న జర్మనీలోని మ్యూనిచ్‌కి రైల్లో వెళుతుండగా హానర్ మొబైల్‌ను పోగొట్టుకున్నాడు. దీంతో అప్‌కమింగ్ ప్రోటో టైప్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను తిరిగి ఇవ్వాలని హువావే విజ్ఞప్తి చేసింది.గ్రే ప్రొటక్టివ్ కవర్‌తో ఉన్న హానర్ మొబైల్‌ను సురక్షితంగా రిటన్ చేసిన వారికి 5 వేల యూరోలు (రూ. 4లక్షలు) నజరానా ఇస్తానని హానర్ ట్వీట్‌చేసింది. కాగా మే 21 లండన్‌లో నిర్వహించనున్న ఒక ఈవెంట్లో హానర్ 20సిరీస్‌లో భాగంగా హానర్ 20 ప్రొ, హానర్ 20ఏ, హానర్ 20సీ, హానర్ 20 ఎక్స్ తదితర స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనుంది. పోయిన స్మార్ట్‌ఫోన్ వీటిల్లో ఒకటి కావచ్చని పలు అంచనాలు నెలకొన్నాయి. ⚠️Bitte helft uns ⚠️ Hinweise an de.support@hihonor.com oder jeden Servicemitarbeiter der Deutschen Bahn! 😔🙏 pic.twitter.com/vI5ZjDOlpN — HonorDE (@HonorGermany) April 22, 2019 -
హువావే వై 9.. త్వరలో
చైనాకు స్మార్ట్‌ఫోన్ తయారీదారు హువావే మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. వై సిరీస్‌లో భాగంగా తొలి స్మార్ట్‌ఫోన్‌ను వై 9 పేరుతో జనవరి 10వ తేదీని ఈ విడుదల చేయనుంది. ఇప్పటికే చైనాలో గత ఏడాది తీసుకొచ్చిన వై 9 ఫీచర్లపై అంచనాలు ఈ కింది విధంగా ఉండనున్నాయి. వై 9 ఫీచర్లు 6.5 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే 2340x1080 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆక్టాకోర్ కిరిన్ 710 సాక్ 4జీబీ/6జీబీ ర్యామ్, 64జీబీ/128 స్టోరేజ్ 16+2ఎంపీ డ్యుయల్ రియర్‌కెమెరా 13+2 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000ఎంఏహెచ్ బ్యాటరీ ధర : సుమారు రూ.20వేలు అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ పత్ర్యేకంగా అందుబాటులోకి రానుంది. ప్రీ బుకింగ్ కోసం నోటిఫై మి ఆప్షన్ కనిపిస్తోంది. -
అంతర్జాతీయ పరిణామాలు కీలకం!
న్యూఢిల్లీ: అమెరికా–చైనా వాణిజ్య సంబంధాలు, ఫెడ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు, ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు వంటి పలు కీలక అంతర్జాతీయ అంశాలకు తోడు డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ‘ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను మార్కెట్ ముందుగానే డిస్కౌంట్ చేసింది. నవంబర్ నెలలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్టానికి దిగి వచ్చింది. 2.33 శాతంగా నమోదైంది. మరోవైపు పారిశ్రామిక వృద్ధి రేటు అక్టోబర్‌లో 8.1 శాతం పెరిగి ఏడాది గరిష్టస్థాయికి చేరుకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్బీఐ వైఖరి మారడం అనేది మార్కెట్ వర్గాల్లో ఆశావాదాన్ని నింపింది.’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ అన్నారు. దేశీ అంశాలు పాజిటివ్‌గానే ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ అంశాలు ఏమేరకు ప్రభావం చూపుతాయనే అంశం ఆధారంగానే మార్కెట్ కదలికలు ఉండనున్నాయని పలువురు మార్కెట్ పండితులు విశ్లేషించారు. ఫెడ్ రేట్లు 25 బేసిస్ పాయింట్ల మేర పెరిగే అవకాశం.. ఈవారం మంగళ, బుధవారాల్లో (18–19) అమెరికన్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం జరగనుండగా.. ఫెడ్ ప్రామాణిక వడ్డీ రేట్లు 25 శాతం పెరిగేందుకు అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో ఫెడ్ వైఖరి ఎలా ఉండనుందనే అంశం కూడా ఇదే సమావేశం ద్వారా వెల్లడయ్యే సూచనలు ఉండడంతో దలాల్ స్ట్రీట్ వర్గాలు ప్రధానంగా దృష్టిసారించాయి. మంగళవారం యూఎస్ వాణిజ్య విభాగం భవన అనుమతులు, నవంబర్ గృహ నిర్మాణాలకు సంబంధించి నివేదికను ఇవ్వనుంది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పాలసీ ప్రకటన, బ్యాంక్ ఆఫ్ జపాన్ పాలసీ సమావేశం కూడా ఇదే వారంలో ఉన్నాయి. క్రూడ్ ధరల ప్రభావం.. చైనా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన నేపథ్యంలో ఆ దేశం నుంచి డిమాండ్ తగ్గుతుందనే అంచనాల కారణంగా గతవారంలో ముడిచమురు ధరలు దిద్దుబాటుకు గురైయ్యాయి. ఇదే సమయంలో ఒపెక్ ఉత్పత్తిపై నెలకొన్న పలు అనుమానాలతో గతవారం బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 2.25 శాతం తగ్గి 60.28 డాలర్లకు చేరుకుంది. ‘రష్యా ఉత్పత్తిని తగ్గించనుందనే ప్రకటన, అమెరికా ఎగుమతుల్లో సౌదీ అరేబియా కోత వంటి అంశాల ఆధారంగా చమురు ధరలు రేంజ్ బౌండ్లోనే ఉండేందుకు అవకాశం ఉంది.’ అని ఆనంద్ రాఠీ కమోడిటీస్ విభాగం రీసెర్చ్ హెడ్ రవీంద్ర వీ రావ్ విశ్లేషించారు. ధరలు ఏమాత్రం పడిపోయినా దేశీ మార్కెట్లకు సానుకూలంగా మారునుందన్నారు. 71.30–72.50 శ్రేణిలో రూపాయి.. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేయడం, ఎన్నికల ఫలితాలు, డాలర్ బలపడడం వంటి కారణాలతో గతవారం డాలరుతో రూపాయి మారకం విలువ 109 పైసలు (1.54 శాతం) క్షీణించి 71.89 వద్దకు పడిపోయింది. ఫెడ్ సమావేశాన్ని పరిగణలోనికి తీసుకుని రూపాయి కదలికల శ్రేణి 71.30–72.50 మధ్య ఉండవచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్ డెరివేటివ్స్ హెడ్ అమిత్ గుప్తా అంచనావేశారు. 10,880–10,929 వద్ద నిరోధం.. నిఫ్టీ 10,700 స్థాయి వద్ద నిలవ గలిగితే అక్కడ నుంచి 10,880–10,929 స్థాయి వరకు వెళ్లేందుకు అవకాశం ఉందని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ టెక్నికల్ అనలిస్ట్ చందన్ తపరియా విశ్లేషించారు. ఈ సూచీ కీలక మద్దతు స్థాయి 10,650 వద్ద ఉండగా.. ఈస్థాయిని కోల్పోతే 10,600 తరువాత మద్దతుగా ఉంటుందన్నారు. అమెరికా–చైనా మధ్య సంధిపై ఆశావహంగా ఇన్వెస్టర్లు వాణిజ్య యుద్ధభయాలతో ప్రపంచ మార్కెట్లను బెంబేలెత్తించిన అమెరికా–చైనాల మధ్య చర్చలు ఫలించవచ్చని ఇన్వెస్టర్లలో ఆశాభావం పెరుగుతోంది. వివాదాల పరిష్కారానికి రెండు దేశాల మధ్య కుదిరిన 90 రోజుల సయోధ్య ఒప్పందంపై చర్చలు పురోగమిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. చైనా టెలికం దిగ్గజం హువావే సీఎఫ్‌వో మింగ్ కెనడాలో అరెస్టయినప్పటికీ .. రెండు పక్షాల నుంచి పరస్పరం రెచ్చగొట్టుకునే ప్రకటనలేమీ లేకపోవడం ఇందుకు నిదర్శనమని వారు అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే అమెరికా అధ్యక్షుడు డొనా ల్డ్ ట్రంప్, చైనా ప్రభుత్వం.. ఈ రెండు అంశా లను (టారిఫ్‌లు, మింగ్ అరెస్టు) వేర్వేరుగానే చూస్తున్నట్లుగా స్పష్టమవుతోందని వాణిజ్యవేత్త ఎడ్వర్డ్ అల్డెన్ తెలిపారు. చైనా ఉత్పత్తులపై సుంకాలు రెట్టింపు చేసే ప్రతిపాదనలను ట్రంప్ మార్చి 1 దాకా వాయిదా వేయడం, ప్రతిగా అమెరికాతో వాణిజ్య లోటును భర్తీ చేసుకునేలా చైనా మరిన్ని అమెరికన్ ఉత్పత్తులు దిగుమతి చేసుకునేందుకు అంగీకరించడం తెలిసిందే. -
హువావేకు షాక్ : కీలక అధికారి అరెస్టు
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల సంస్థ హువావే టెక్నాలజీస్ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌వో)ను కెనడా అధికారులు అరెస్ట్ చేశారు. అమెరికా అభ్యర్ధన మేరకు కెనడియన్ అధికారులు హువావే డిప్యూటీ చైర్మన్‌ను అరెస్ట్ చేసిందన్న షాకింగ్ న్యూస్ పరిశ్రమ వర్గాలను విస్మయ పర్చింది. అంతేకాదు సీఎఫ్‌వోను త్వరగా అమెరికాకు రప్పించే చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా విధించే వాణిజ్యపరమైన నిబంధలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఈ అరెస్టు చోటు చేసుకుంది. హువావే బోర్డు డిప్యూటీ చైర్, కంపెనీ వ్యవస్థాపకుడు రెన్ జెంగ్ఫే కుమార్తె మెంగ్ వాంగ్జోను వాంకోవర్‌లో డిసెంబరు1, శనివారం అరెస్టు చేశామని అధికారులు బుధవారం ప్రకటించారు. ఆమె బెయిల్ పిటీషన్‌పై శుక్రవారం విచారణ జరగనుందని న్యాయశాఖ ప్రతినిధి ఇయాన్ మెక్లాయిడ్ వెల్లడించారు. ఇంతకుమించి తాము ఎటువంటి వివరాలను అందించలేమని పేర్కొన్నారు. మరోవైపు ఈ పరిణామాన్ని హువావే, చైనా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇది మానవహక్కులకు తీవ్ర హానికరమైన చర్య అని పేర్కొంది. మెంగ్ ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని, తక్షణమే ఆమెను విడుదల చేయాలని ఒట్టావాలోని చైనీస్ రాయబార కార్యాలయం డిమాండ్ చేసింది. తాము చట్టపరమైన అన్ని నిబంధనలను విధిగా పాటిస్తున్నామని హువావే ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్లో ఒక ప్రకటన జారీ చేసింది. మరోవైపు ఇది అమెరికా చైనా మధ్య నెలకొన్న ట్రేడ్వార్కు సంబంధించి తీవ్రమైన పరిణామంగా వాల్‌స్ట్రీట్ జర్నల్ వ్యాఖ్యానించింది. pic.twitter.com/GRs75WRx6L — Huawei Technologies (@Huawei) December 6, 2018 -
కింగ్ ఆఫ్ స్మార్ట్‌ఫోన్స్ వచ్చేసింది..
మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ మేట్ 20 ప్రొను భారత్‌లో నేడు( నవంబరు27) విడుదల చేసింది. కింగ్ ఆఫ్ స్మార్ట్‌ఫోన్స్‌గా చెబుతున్న హువావే మేట్ 20ప్రొ (హయ్యర్ ఇంటిలిజెన్స్)ను న్యూఢిల్లీలో లాంచ్ చేసింది. ప్రధానంగా తమ డివైస్‌లోని మూడు కెమెరాలు అల్ట్రా వైడ్ యాంగిల్‌తో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌లా పనిచేస్తాయని కంపెనీ తెలిపింది. ఇప్పటికే లండన్‌లో విడుదలైన ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా అమెజాన్‌లో విక్రయించనున్నారు. డిసెంబరు 3 అర్థరాత్రి నుంచి ప్రైమ్ సభ్యులకు, డిసెంబరు 4 అర్థరాత్రి నుంచి సాధారణ సభ్యులకు అందుబాటులో ఉంటుంది. మూడు రంగుల్లో లభ్యం. ధర : రూ.69,990 హువావే మేట్ 20 ప్రొ ఫీచర్లు 6.39 ఇంచ్ క్యూహెచ్డీ ప్లస్ ఓలెడ్ డిస్ప్లే 3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ హువావే కైరిన్ 980 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9.0 పై 6/8 జీబీ ర్యామ్ 128/256 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 40 +20+8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 4200 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్లెస్ చార్జింగ్, సూపర్ చార్జ్ ఇంకా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3డీ ఫేస్ అన్‌లాక్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, డ్యుయల్ స్పీకర్స్ ప్రత్యేక ఫీచర్లుగా ఉన్నాయి. -
హువావే ఫోన్లపై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు దీవావళి సేల్‌తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైపోయాయి. ఇప్పటికే దసరా సీజన్‌ను క్యాష్ చేసుకున్న ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు దివాలీ సేల్‌లో మరోసారి డిస్కౌంట్ ధరలను ఆఫర్ చేస్తున్నాయి. వివిధ గృహోపకరణాలతో పాటు, స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను వెల్లడించాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే దివాలీ ఆఫర్లు ప్రారంభం కాగా, అమెజాన్‌లో రేపటినుంచి (నవంబరు 2, శుక్రవారం) ప్రారంభం కానున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్ పేరుతో నవంబరు 2నుంచి 5వతేదీ వరకు ఈ తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. ముఖ్యంగా హువావే ఫోన్లను భారీ డిస్కౌంట్ అందిస్తోంది. హువావే పీ20ప్రో పై ఏకంగా రూ. 10వేల దాకా తగ్గింపును అందిస్తోంది. దీనికితోడు హెచ్డీఎఫ్సీ కార్డు ద్వారా కోనుగోళ్లపై మరో 10శాతం తగ్గింపు అదనం. హువావే పీ 20 ప్రొ : రూ.10 వేల డిస్కౌంట్‌తో రూ. 54,999కే అందుబాటులో ఉంది. హువావే పీ 20 లైట్: 4వేల రూపాయల తగ్గింపు అనంతరం రూ. 15,999లకు అందుబాటులో ఉంచింది. హువావే నోవా 3: రూ. 5వేల తగ్గింపు అనంతరం రూ.29,999లకే లభ్యం. హువావేనోవా3ఐ: రూ.6009 డిస్కౌంట్. దీని లాంచింగ్ ధర 20,990. హువావే స్మార్ట్ఫోన్లతోపాటు శాంసంగ్, గెలాక్సీ ఏ8+, షావోమి రెడ్ 6 ప్రో, షావోమీ టీవీలపై కూడా డిస్కౌంట్లను ఆపర్ చేస్తోంది. రేపు మధ్యాహ్నం 12గంటలనుంచి అమెజాన్ గ్రేడ్ ఇండియన్ ఫెస్టివ్ సేల్ మొదలువుతుంది. It’s time to start adding products to your wishlist because the biggest celebration yet starts tomorrow! Stay tuned for big deals at the #AmazonGreatIndianFestival Diwali Special. pic.twitter.com/TXjkvkl7up — Amazon.in (@amazonIN) November 1, 2018 -
‘హానర్ 8 ప్రొ’పై భారీ డిస్కౌంట్
న్యూఢిల్లీ : చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హువావే తన సబ్‌బ్రాండ్ హానర్ నుంచి అద్భుత స్మార్ట్‌ఫోన్ ‘హానర్ 8 ప్రొ’ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ కొనుగోలు చేయాలని ఆశించే వారికి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లు గుడ్‌న్యూస్ చెప్పాయి. తమ తమ వెబ్సైట్లలో నిర్వహించబోయే సేల్స్‌లో హానర్ 8 ప్రొ స్మార్ట్‌ఫోన్‌పై భారీగా 7000 రూపాయల డిస్కౌంట్ అందించనున్నట్టు తెలిపాయి. మే 13 నుంచి ఈ కంపెనీల సేల్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఆ సమయంలో హానర్ 8 ప్రొ తక్కువగా రూ.22,999కే కొనుగోలు చేసుకోవచ్చు. మిగతా సమయాల్లో హానర్ 8 ప్రొ స్మార్ట్‌ఫోన్ ధర రూ.29,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లు తమ సేల్స్‌లో భాగంగా హానర్ 8 ప్రొ ధరను తగ్గించేస్తున్నాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌ను రూ.29,999కే విక్రయిస్తుండగా.. అమెజాన్ ఇప్పటికే హానర్ 8 ప్రొను రూ.22,999కు అందుబాటులోకి తెచ్చేసింది. అయితే అమెజాన్ తన సమ్మర్ సేల్స్‌లో భాగంగా రూ.22,999పైనే 7000 రూపాయల డిస్కౌంట్‌ను అందిస్తుందా..? లేదా ధరను రూ.29,999కు పెంచి ఆ ధరపై డిస్కౌంట్ అందిస్తుందా..? అన్నది ఇంకా క్లారిటీ తెలియరాలేదు. ఇక హానర్ 8 ప్రొ కు సంబంధించిన రివ్యూ చూస్తే, హానర్ నుంచి వచ్చిన ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్లలో ఇదీ ఒకటి. అంతా కొత్త డిజైన్ మాత్రమే కాక, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఈ ఫోన్ ప్రత్యేకత. త్వరగా ఛార్జ్ చేసే సపోర్టును ఇది కలిగి ఉంది. స్పెషిఫికేషన్ల పరంగా చూసుకుంటే ఈ ఫోన్‌కు 5.7 అంగుళాల డిస్ప్లే, ఆండ్రాయిడ్ ఓరియో, 1.8 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్, కిరిన్ 960 ప్రాసెసర్, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ సపోర్టు, వెనుకవైపు 12 మెగాపిక్సెల్‌తో డ్యూయల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా, ఫేస్ డిటెక్షన్, హెచ్డీఆర్, పనోరమ ఫీచర్లు ఉన్నాయి. కొత్తతరం నెటిజన్లను ఆకట్టుకోవడానికి, ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోవడానికి ఫ్లిప్‌కార్ట్ బిగ్‌షాపింగ్ డేస్, అమెజాన్ సమ్మర్ సేల్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకోవడం తమకు వచ్చిన గొప్ప అవకాశమని హువావే కన్జ్యూమర్ బిజినెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ పీ సంజీవ్ తెలిపారు. ఈ సేల్స్‌లో భాగంగా పలు హానర్ ఫోన్లను డిస్కౌంట్లలో అందుబాటులోకి తెస్తున్నామని, హానర్ 9 లైట్ 3జీబీ వేరియంట్‌పై ఫ్లిప్‌కార్ట్ రూ.1000 డిస్కౌంట్ అందించనున్నట్టు పేర్కొన్నారు. 4జీబీ మోడల్ ఎక్స్చేంజ్ ఆఫర్లో రూ.2000 డిస్కౌంట్ ఉంది. హానర్ 9ఐ స్మార్ట్‌ఫోన్‌పై కూడా రూ.1000 డిస్కౌంట్ లభ్యం కానుంది. -
అదిరిపోయే ఫీచర్లతో హానర్ 10
హువావే సబ్ బ్రాండు హానర్ గురువారం కొత్త స్మార్ట్‌ఫోన్ హానర్ 10ను చైనాలో లాంచ్ చేసింది. ఐఫోన్ ఎక్స్ మాదిరి నాచ్ డిస్ప్లే డిజైన్‌తో హానర్ 10ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మరికొన్ని రోజుల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్‌గా కూడా కంపెనీ లాంచ్ చేయబోతోంది. బ్లాక్, గ్రే, మిరేజ్ బ్లూ, మిరేజ్ పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర 2,600 సీఎన్‌వై( సుమారు రూ.27,300), టాప్ వేరియంట్ ధర 2,800 సీఎన్‌వై(రూ.29,400)గా కంపెనీ పేర్కొంది. ఇటీవలే హువావే పీ20, పీ20 ప్రొ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. హానర్ 10 స్పెషిఫికేషన్లు... 5.84 అంగుళాల ఫుల్ హెచ్‌డీప్లస్ డిస్ప్లే ఇన్-హౌజ్ కిరిన్ 970 ప్రాసెసర్ 6జీబీ ర్యామ్ 64జీబీ, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లు వెనుకవైపు 16 మెగాపిక్సెల్, 24 మెగాపిక్సెల్ డ్యూయల్ సెన్సార్లు ముందు వైపు 24 మెగాపిక్సెల్ కెమెరా ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 3400 ఎంఏహెచ్ బ్యాటరీ ఫింగర్‌ప్రింట్ సెన్సార్లు -
512జీబీ స్టోరేజ్‌తో ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్
స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమదైన ఫీచర్లతో కస్టమర్లను మరింత ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా చైనాకు చెందిన హువావే కంపెనీ పి20 పేరుతో ఓ స్మార్ట్ ఫోన్ తీసుకొస్తోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఎత్తున్న అంచనాలు వెలువడుతున్నాయి. ట్రిపుల్ రియర్ కెమెరాతో రాబోతుందని ఇప్పటికే కొన్ని రిపోర్టులు పేర్కొనగా.. తాజాగా మరో ఆసక్తికర వార్త ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 512 జీబీ స్టోరేజీ సామర్థ్యం ఉంటుందని తెలుస్తోంది. ఈ స్థాయి స్టోరేజీతో వస్తున్న తొలి ఫోన్ ఇదే. ఇంత వరకు ఈ కంపెనీ గరిష్టంగా 250 జీబీ సామర్థ్యంతోనే స్మార్ట్ఫోన్లు లాంచ్ అవుతూ ఉన్నాయి. 512 జీబీ సామర్థ్యం అంటే కంప్యూటర్ తో సమానం. 6జీబీ ర్యామ్ ఇందులో ఉంటుందని టీనా లిస్టింగ్ రివీల్ చేసింది. త్వరలోనే ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఒకవేళ ఈ స్థాయి స్టోరేజీ సామర్థ్యం, ఫీచర్లతో పి20ని కంపెనీ మార్కెట్లోకి తీసుకొస్తే.. మిగిలిన ప్రధాన కంపెనీలు సైతం ఈ తరహా ఫోన్లను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 512జీబీ స్టోరేజ్‌తో యూజర్లు 4కే వీడియోలను, మూవీలను, బుక్స్‌ను, మ్యూజిక్‌ను రికార్డు చేసుకోవచ్చు. -
డిస్కౌంట్లో ఈ రెండు స్మార్ట్ఫోన్లు
హువావే తన హానర్ బ్రాండులోని రెండు స్మార్ట్ఫోన్లపై పరిమిత కాల వ్యవధిలో డిస్కౌంట్లను ప్రకటించింది. హానర్ 6 ఎక్స్, హానర్ 8 ప్రొలపై అమెజాన్.ఇన్‌లో డిస్కౌంట్లను అందించనున్నట్టు పేర్కొంది. హానర్ 6ఎక్స్ స్మార్ట్‌ఫోన్ 32జీబీ, 64జీబీ వేరియంట్లపై రూ.2000 డిస్కౌంట్ అందించనున్నట్టు పేర్కొనగా.. హానర్ 8 ప్రొ స్మార్ట్‌ఫోన్‌పై రూ.4వేల దాకా డిస్కౌంట్ అందిస్తోంది. మంగళవారం నుంచి డిసెంబర్19 మంగళవారం వరకు ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి. హానర్ 6 ఎక్స్ స్మార్ట్‌ఫోన్ జనవరిలో లాంచ్ అయింది. డిస్కౌంట్ అనంతరం హానర్ 6ఎక్స్ స్మార్ట్‌ఫోన్ 32జీబీ వేరియంట్ రూ.9,999కు అందుబాటులోకి వచ్చింది. ఈ వేరియంట్ ధర అంతకముందు 11,999 రూపాయలుగా ఉండేది. అదేవిధంగా రూ.13,999గా ఉన్న హానర్ 6ఎక్స్ 64జీబీ వేరియంట్ రూ.11,999కు లభ్యమవుతుంది. హానర్ 8 ప్రొ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.25,999కు లభ్యమవుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర 29,999 రూపాయలు. హానర్ 6ఎక్స్, హానర్ 8 ప్రొలపై డిస్కౌంట్లు ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. అంతకముందు కూడా హానర్ ఈ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. -
అద్భుత ఫీచర్లతో ‘నోవా 2ఎస్’
బీజింగ్: హువావే మిడ్ రేంజ్ సెగ్మెంట్లో v సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. భారీ స్క్రీన్, 18:9 బెజెల్ లెస్ డిస్ప్లే, నాలుగు కెమెరాలు(డబుల్ రియర్, సెల్పీ కెమెరా) లాంటి అద్భుత ఫీచర్లతో 'నోవా 2ఎస్' పేరుతో తాజా స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. 4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లలో ఈ డివైస్‌ను అందుబాటులోకి తెచ్చింది. 4జీబీ వేరియంట్ ధర సుమారు రూ.26,300గాను, 6జీబీ ధరను సుమారు రూ.29, 300గాను ఉండనుంది. అంతేకాదు రూ.33,100 ధరలో మరో స్పెషల్ ఎడిషన్‌ను కూడా లాంచ్ చేసింది. త్వరలోనే భారత్‌లోనూ ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తేనుంది. హువావే నోవా 2ఎస్ ఫీచర్లు 6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 4/6 జీబీ ర్యామ్ 64/128 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 16+20 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20+2 మెగాపిక్సెల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు 3340 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ -
మరింత తగ్గనున్న డేటా ధరలు
రిలయన్స్ జియో రాకతో దేశవ్యాప్తంగా డేటా ధరలు ఒక్కసారిగా కిందకి దిగి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐదో జనరేషన్ టెక్నాలజీ కమర్షియల్‌గా లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. 5జీ రాకతో 2020 నాటికి డేటా ధరలు మరింత కిందకి పడిపోనున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప్రాథమిక దశలో ఉన్న 5జీ ఆవిష్కరణ, ఇంటర్నెట్ కనెక్టివిటీకి బూస్ట్‌ని అందిస్తుందని హువావే టెక్నాలజీస్ ప్రకటించింది. అదేవిధంగా తక్కువ ధరల్లోనే సేవలందుతాయని తెలిపింది. ఒక్కసారి 5జీ సర్వీసులు కమర్షియల్‌గా అందుబాటులోకి వచ్చిన తర్వాత, టెల్కోలకు డేటా ప్రొడక్షన్ వ్యయాలు ప్రస్తుతమున్న ఖర్చుల కంటే పదింతలు తగ్గుతాయని హువావే వైర్లెస్ మార్కెటింగ్ డైరెక్టర్ ఇమ్మాన్యూల్ కోయెల్హో అల్వ్స్ చెప్పారు. దీంతో డేటా ఇంకా చౌకగా లభ్యమవుతుందని తెలిపారు. భారత్‌లో ఇప్పటికే డేటా ధరలు ప్రపంచవ్యాప్తంగా కంటే తక్కువగా ఉన్నాయి. జియో రాకతో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 4జీ సర్వీసులను కమర్షియల్‌గా లాంచ్ చేసిన రిలయన్స్ జియో మార్కెట్లో ధరల యుద్ధానికి తెరతీసింది. చాలా తక్కువ ధరలకు డేటాను ఆఫర్ చేయడం ప్రారంభించింది. దీంతో జియోకు పోటీగా ఇతర టెలికాం కంపెనీలు కూడా అదేమాదిరి ధరలు తగ్గించుకుంటూ వెళ్తున్నాయి. రెవెన్యూలు నష్టపోతున్నా.. కస్టమర్లను కాపాడుకోవడానికి టెల్కోలు తమ డేటా ధరలను తగ్గిస్తూ వస్తున్నాయి. 5జీతో ఆపరేటర్ల డేటా ప్రొడక్షన్ ఖర్చులు తగ్గుతాయని తెలిసింది. చౌక ధరల్లో రేట్లను అందించడం ద్వారా కంపెనీలను లాభాల బాటలో నడిపించడానికి కృషిచేస్తుందని ఆశిస్తున్నట్టు టెలికాం వర్గాలు చెబుతున్నాయి. 4జీ కాలంలోనే 5జీ నెట్వర్క్ ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ సన్నాహాలు ప్రారంభమయ్యాయని అల్వ్స్ తెలిపారు. 5జీలో భారత్‌లో ముందంజలో ఉంటుందని, టెక్నాలజీ అభివృద్ధికి రూ.500 కోట్ల ఫండ్‌ను సృష్టించామని, 2020 నాటికి 5జీ సేవలను ఆవిష్కరించడానికి రోడ్‌మ్యాప్ కోసం ఓ హై-లెవల్ కమిటీని నియమించినట్టు ప్రభుత్వం తెలిపింది.