డిస్కౌంట్‌లో ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు | Honor 6X, Honor 8 Pro Get Limited Period Discounts on Amazon India | Sakshi
Sakshi News home page

డిస్కౌంట్‌లో ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు

Published Wed, Dec 13 2017 8:19 PM | Last Updated on Wed, Dec 13 2017 8:19 PM

Honor 6X, Honor 8 Pro Get Limited Period Discounts on Amazon India - Sakshi

హువావే తన హానర్‌ బ్రాండులోని రెండు స్మార్ట్‌ఫోన్లపై పరిమిత కాల వ్యవధిలో డిస్కౌంట్లను ప్రకటించింది. హానర్‌ 6 ఎక్స్‌, హానర్‌ 8 ప్రొలపై అమెజాన్‌.ఇన్‌లో డిస్కౌంట్లను అందించనున్నట్టు పేర్కొంది. హానర్‌ 6ఎక్స్‌  స్మార్ట్‌ఫోన్‌ 32జీబీ, 64జీబీ వేరియంట్లపై రూ.2000 డిస్కౌంట్‌ అందించనున్నట్టు పేర్కొనగా.. హానర్‌ 8 ప్రొ స్మార్ట్‌ఫోన్‌పై రూ.4వేల దాకా డిస్కౌంట్‌ అందిస్తోంది. మంగళవారం నుంచి డిసెంబర్‌19 మంగళవారం వరకు ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి. హానర్‌ 6 ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ జనవరిలో లాంచ్‌ అయింది.

డిస్కౌంట్‌ అనంతరం హానర్‌ 6ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ 32జీబీ వేరియంట్‌ రూ.9,999కు అందుబాటులోకి వచ్చింది. ఈ వేరియంట్‌ ధర అంతకముందు 11,999 రూపాయలుగా ఉండేది. అదేవిధంగా రూ.13,999గా ఉన్న హానర్‌ 6ఎక్స్‌ 64జీబీ వేరియంట్‌ రూ.11,999కు లభ్యమవుతుంది. హానర్‌ 8 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.25,999కు లభ్యమవుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర 29,999 రూపాయలు. హానర్‌ 6ఎక్స్‌, హానర్‌ 8 ప్రొలపై డిస్కౌంట్లు ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. అంతకముందు కూడా హానర్‌ ఈ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement