Honor 8 Pro
-
సూపర్ సేల్ : రూ.1కే హానర్ 8 ప్రొ
హానర్ ఇండియా భారతీయ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. హానర్ సూపర్ సేల్‌లో తన 8 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 14 తేదీన కేవలం 1 రూపాయికే అందించింది. హానర్ ఆన్లైన్ స్టోర్ ద్వారా ఈ రోజు (మంగళవారం) ఉదయం 11.30 నిమిషాలకు ఈ సూపర్ సేల్ మొదలు కానుందని ప్రకటించింది. స్టాక్ ఉన్నంత వరకే ఈ అవకాశంమని తెలిపింది. హానర్ 8 ప్రొ వాస్తవ ధర రూ.29,999 అంటే రూ.29,998ల భారీ డిస్కౌంట్ అన్నమాట. హానర్ అధికారిక వెబ్సైట్లో సూపర్ సేల్ మొదలైన కొన్ని నిమిషాల్లోనే ‘సోల్డ్ అవుట్’ అన్న డైలాగ్ కస్టమర్లను వెక్కిరించడం గమనార్హం. ఈ స్వల్ప వ్యవధిలో ఎన్ని స్మార్ట్ఫోన్లను తమ కస్టమర్లకు అందించిందనే లెక్కలను సంస్థ అధికారికంగా ప్రకటించాల్సివుంది. -
‘హానర్ 8 ప్రొ’పై భారీ డిస్కౌంట్
న్యూఢిల్లీ : చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హువావే తన సబ్‌బ్రాండ్ హానర్ నుంచి అద్భుత స్మార్ట్‌ఫోన్ ‘హానర్ 8 ప్రొ’ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ కొనుగోలు చేయాలని ఆశించే వారికి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లు గుడ్‌న్యూస్ చెప్పాయి. తమ తమ వెబ్సైట్లలో నిర్వహించబోయే సేల్స్‌లో హానర్ 8 ప్రొ స్మార్ట్‌ఫోన్‌పై భారీగా 7000 రూపాయల డిస్కౌంట్ అందించనున్నట్టు తెలిపాయి. మే 13 నుంచి ఈ కంపెనీల సేల్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఆ సమయంలో హానర్ 8 ప్రొ తక్కువగా రూ.22,999కే కొనుగోలు చేసుకోవచ్చు. మిగతా సమయాల్లో హానర్ 8 ప్రొ స్మార్ట్‌ఫోన్ ధర రూ.29,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లు తమ సేల్స్‌లో భాగంగా హానర్ 8 ప్రొ ధరను తగ్గించేస్తున్నాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌ను రూ.29,999కే విక్రయిస్తుండగా.. అమెజాన్ ఇప్పటికే హానర్ 8 ప్రొను రూ.22,999కు అందుబాటులోకి తెచ్చేసింది. అయితే అమెజాన్ తన సమ్మర్ సేల్స్‌లో భాగంగా రూ.22,999పైనే 7000 రూపాయల డిస్కౌంట్‌ను అందిస్తుందా..? లేదా ధరను రూ.29,999కు పెంచి ఆ ధరపై డిస్కౌంట్ అందిస్తుందా..? అన్నది ఇంకా క్లారిటీ తెలియరాలేదు. ఇక హానర్ 8 ప్రొ కు సంబంధించిన రివ్యూ చూస్తే, హానర్ నుంచి వచ్చిన ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్లలో ఇదీ ఒకటి. అంతా కొత్త డిజైన్ మాత్రమే కాక, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఈ ఫోన్ ప్రత్యేకత. త్వరగా ఛార్జ్ చేసే సపోర్టును ఇది కలిగి ఉంది. స్పెషిఫికేషన్ల పరంగా చూసుకుంటే ఈ ఫోన్‌కు 5.7 అంగుళాల డిస్ప్లే, ఆండ్రాయిడ్ ఓరియో, 1.8 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్, కిరిన్ 960 ప్రాసెసర్, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ సపోర్టు, వెనుకవైపు 12 మెగాపిక్సెల్‌తో డ్యూయల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా, ఫేస్ డిటెక్షన్, హెచ్డీఆర్, పనోరమ ఫీచర్లు ఉన్నాయి. కొత్తతరం నెటిజన్లను ఆకట్టుకోవడానికి, ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోవడానికి ఫ్లిప్‌కార్ట్ బిగ్‌షాపింగ్ డేస్, అమెజాన్ సమ్మర్ సేల్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకోవడం తమకు వచ్చిన గొప్ప అవకాశమని హువావే కన్జ్యూమర్ బిజినెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ పీ సంజీవ్ తెలిపారు. ఈ సేల్స్‌లో భాగంగా పలు హానర్ ఫోన్లను డిస్కౌంట్లలో అందుబాటులోకి తెస్తున్నామని, హానర్ 9 లైట్ 3జీబీ వేరియంట్‌పై ఫ్లిప్‌కార్ట్ రూ.1000 డిస్కౌంట్ అందించనున్నట్టు పేర్కొన్నారు. 4జీబీ మోడల్ ఎక్స్చేంజ్ ఆఫర్లో రూ.2000 డిస్కౌంట్ ఉంది. హానర్ 9ఐ స్మార్ట్‌ఫోన్‌పై కూడా రూ.1000 డిస్కౌంట్ లభ్యం కానుంది. -
డిస్కౌంట్లో ఈ రెండు స్మార్ట్ఫోన్లు
హువావే తన హానర్ బ్రాండులోని రెండు స్మార్ట్ఫోన్లపై పరిమిత కాల వ్యవధిలో డిస్కౌంట్లను ప్రకటించింది. హానర్ 6 ఎక్స్, హానర్ 8 ప్రొలపై అమెజాన్.ఇన్‌లో డిస్కౌంట్లను అందించనున్నట్టు పేర్కొంది. హానర్ 6ఎక్స్ స్మార్ట్‌ఫోన్ 32జీబీ, 64జీబీ వేరియంట్లపై రూ.2000 డిస్కౌంట్ అందించనున్నట్టు పేర్కొనగా.. హానర్ 8 ప్రొ స్మార్ట్‌ఫోన్‌పై రూ.4వేల దాకా డిస్కౌంట్ అందిస్తోంది. మంగళవారం నుంచి డిసెంబర్19 మంగళవారం వరకు ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి. హానర్ 6 ఎక్స్ స్మార్ట్‌ఫోన్ జనవరిలో లాంచ్ అయింది. డిస్కౌంట్ అనంతరం హానర్ 6ఎక్స్ స్మార్ట్‌ఫోన్ 32జీబీ వేరియంట్ రూ.9,999కు అందుబాటులోకి వచ్చింది. ఈ వేరియంట్ ధర అంతకముందు 11,999 రూపాయలుగా ఉండేది. అదేవిధంగా రూ.13,999గా ఉన్న హానర్ 6ఎక్స్ 64జీబీ వేరియంట్ రూ.11,999కు లభ్యమవుతుంది. హానర్ 8 ప్రొ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.25,999కు లభ్యమవుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర 29,999 రూపాయలు. హానర్ 6ఎక్స్, హానర్ 8 ప్రొలపై డిస్కౌంట్లు ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. అంతకముందు కూడా హానర్ ఈ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. -
మార్కెట్లోకి ‘హానర్ 8 ప్రొ’ స్మార్ట్‌ఫోన్
ధర రూ.29,999 న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘హువావే’ సబ్‌బ్రాండ్ హానర్ తాజాగా ‘హానర్ 8 ప్రొ’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.29,999గా ఉంది. ఆండ్రాయిడ్ నుగోట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.7 అంగుళాల క్యూహెచ్డీ స్క్రీన్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. ‘హానర్ 8 ప్రొ’ స్మార్ట్ఫోన్లు కస్టమర్లకు అమెజాన్ ఇండియాలో మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉండనున్నాయి. వీటిని ప్రైమ్ యూజర్లు జూలై 10 నుంచి, ఇతరులు జూలై 13 నుంచి కొనుగోలు చేయవచ్చు.