‘హానర్‌ 8 ప్రొ’పై భారీ డిస్కౌంట్‌ | Honor 8 Pro To Be Available At Massive Rs 7000 Discount | Sakshi
Sakshi News home page

‘హానర్‌ 8 ప్రొ’పై భారీ డిస్కౌంట్‌

Published Fri, May 11 2018 9:08 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

Honor 8 Pro To Be Available At Massive Rs 7000 Discount - Sakshi

హానర్‌ 8 ప్రొ స్మార్ట్‌ఫోన్‌

న్యూఢిల్లీ : చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హువావే తన సబ్‌బ్రాండ్‌ హానర్‌ నుంచి అద్భుత స్మార్ట్‌ఫోన్ ‘హానర్‌ 8 ప్రొ’ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్‌ కొనుగోలు చేయాలని ఆశించే వారికి ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు గుడ్‌న్యూస్‌ చెప్పాయి. తమ తమ వెబ్‌సైట్లలో నిర్వహించబోయే సేల్స్‌లో హానర్‌ 8 ప్రొ స్మార్ట్‌ఫోన్‌పై భారీగా 7000 రూపాయల డిస్కౌంట్‌ అందించనున్నట్టు తెలిపాయి. మే 13 నుంచి ఈ కంపెనీల సేల్స్‌ ప్రారంభం కాబోతున్నాయి. ఆ సమయంలో హానర్‌ 8 ప్రొ తక్కువగా రూ.22,999కే కొనుగోలు చేసుకోవచ్చు. మిగతా సమయాల్లో హానర్‌ 8 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.29,999గా ఉంది.

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు తమ సేల్స్‌లో భాగంగా హానర్‌ 8 ప్రొ ధరను తగ్గించేస్తున్నాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ ఈ ఫోన్‌ను రూ.29,999కే విక్రయిస్తుండగా.. అమెజాన్‌ ఇప్పటికే హానర్‌ 8 ప్రొను రూ.22,999కు అందుబాటులోకి తెచ్చేసింది. అయితే అమెజాన్‌ తన సమ్మర్‌ సేల్స్‌లో భాగంగా రూ.22,999పైనే 7000 రూపాయల డిస్కౌంట్‌ను అందిస్తుందా..? లేదా ధరను రూ.29,999కు పెంచి ఆ ధరపై డిస్కౌంట్‌ అందిస్తుందా..? అన్నది ఇంకా క్లారిటీ తెలియరాలేదు.  

ఇక హానర్‌ 8 ప్రొ కు సంబంధించిన రివ్యూ చూస్తే, హానర్‌ నుంచి వచ్చిన ఫ్లాగ్‌షిప్‌ కిల్లర్‌ ఫోన్లలో ఇదీ ఒకటి. అంతా కొత్త డిజైన్‌ మాత్రమే కాక, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ కూడా ఈ ఫోన్‌ ప్రత్యేకత. త్వరగా ఛార్జ్‌ చేసే సపోర్టును ఇది కలిగి ఉంది. స్పెషిఫికేషన్ల పరంగా చూసుకుంటే ఈ ఫోన్‌కు 5.7 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఓరియో, 1.8 గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్, కిరిన్‌ 960 ప్రాసెసర్‌, హైబ్రిడ్‌ డ్యూయల్‌ సిమ్‌ సపోర్టు, వెనుకవైపు 12 మెగాపిక్సెల్‌తో డ్యూయల్‌ కెమెరా, 8 మెగాపిక్సెల్‌ సెల్‌పీ కెమెరా, ఫేస్‌ డిటెక్షన్‌, హెచ్‌డీఆర్‌, పనోరమ ఫీచర్లు ఉన్నాయి.

కొత్తతరం నెటిజన్లను ఆకట్టుకోవడానికి, ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోవడానికి ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌షాపింగ్‌ డేస్‌, అమెజాన్‌ సమ్మర్‌ సేల్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకోవడం తమకు వచ్చిన గొప్ప అవకాశమని హువావే కన్జ్యూమర్‌ బిజినెస్‌ గ్రూప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పీ సంజీవ్‌ తెలిపారు. ఈ సేల్స్‌లో భాగంగా పలు హానర్‌ ఫోన్లను డిస్కౌంట్లలో అందుబాటులోకి తెస్తున్నామని, హానర్‌ 9 లైట్‌ 3జీబీ వేరియంట్‌పై ఫ్లిప్‌కార్ట్‌ రూ.1000 డిస్కౌంట్‌ అందించనున్నట్టు పేర్కొన్నారు. 4జీబీ మోడల్‌ ఎక్స్చేంజ్‌ ఆఫర్‌లో రూ.2000 డిస్కౌంట్‌ ఉంది. హానర్‌ 9ఐ స్మార్ట్‌ఫోన్‌పై కూడా రూ.1000 డిస్కౌంట్‌ లభ్యం కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement