హానర్ ఇండియా భారతీయ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. హానర్ సూపర్ సేల్‌లో తన 8 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 14 తేదీన కేవలం 1 రూపాయికే అందించింది. హానర్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఈ రోజు (మంగళవారం) ఉదయం 11.30 నిమిషాలకు ఈ సూపర్ సేల్ మొదలు కానుందని ప్రకటించింది. స్టాక్ ఉన్నంత వరకే ఈ అవకాశంమని తెలిపింది.
హానర్ 8 ప్రొ వాస్తవ ధర రూ.29,999 అంటే రూ.29,998ల భారీ డిస్కౌంట్ అన్నమాట. హానర్ అధికారిక వెబ్‌సైట్‌లో సూపర్ సేల్ మొదలైన కొన్ని నిమిషాల్లోనే ‘సోల్డ్ అవుట్’ అన్న డైలాగ్ కస‍్టమర్లను వెక్కిరించడం గమనార‍్హం. ఈ స్వల్ప వ్యవధిలో ఎన్ని స్మార్ట్‌ఫోన్లను తమ కస‍్టమర్లకు అందించిందనే లెక్కలను సంస్థ అధికారికంగా ప్రకటించాల్సివుంది.
సూపర్ సేల్ : రూ.1కే హానర్ 8 ప్రొ
Published Tue, Aug 14 2018 11:44 AM | Last Updated on Tue, Aug 14 2018 1:53 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment