super sale
-
స్మార్ట్ బజార్ ఫుల్ పైసా వసూల్ సేల్
సాక్షి, హైదరాబాద్: సరికొత్త ఆఫర్లతో స్మార్ట్ బజార్ ఫుల్ పైసా వసూల్ సేల్ మళ్లీ వచ్చినట్టు సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సేల్ ఈనెల 21 నుంచి 26 వరకు అన్ని స్మార్ట్ బజార్, స్మార్ట్ సూపర్ స్టోర్, స్మార్ట్ పాయింట్ స్టోర్స్‌లలో అందుబాటులో ఉంటుందని తెలిపింది. ప్యాకేజ్డ్ ఫుడ్, గృహోపకరణాలు, వ్యక్తిగ తమైన, కిచెన్‌కు సంబంధించిన వస్తువులపై అద్భుతమైన డిస్కౌంట్లను ఇస్తున్నట్టు వివరించింది. బిస్కెట్లు, కూల్ డ్రింక్స్, షాంపూలు, సబ్బులు, టూత్‌పేస్ట్ వంటివి 50 శాతం డిస్కౌంట్‌కే లభిస్తున్నాయని వెల్లడించింది. అలాగే మహిళలు, పురుషులు, చిన్నపిల్లల బట్టలపై 50 శాతం డిస్కౌంట్ వంటి మరెన్నో ఆఫర్లు ఉన్నట్టు పేర్కొంది. -
ఎస్బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఏకంగా 50 శాతం తగ్గింపు!
దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన వినియోగదారులకు శుభవార్త అందించింది. ఈ కామర్స్ వ్యాపార సంస్థలకు దీటుగా ప్రత్యేకంగా 'యోనో సూపర్ సేవింగ్ డేస్' పేరుతో సరికొత్త సేల్ తీసుకొచ్చినట్లు ప్రకటించింది. ఈ సేల్ జూలై 4న నుంచి జూలై 7వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. 'యోనో సూపర్ సేవింగ్ డేస్' సేల్‌లో భాగంగా టైటన్‌పేపై 20 శాతం తగ్గింపు పొందే అవకాశం లభిస్తుంది. అలాగే అపోలో 24/7లో 20 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఈజీమైట్రిప్‌లో 10 శాతం వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది. ఇక ఓయో ద్వారా ఏకంగా 50 శాతం తగ్గింపు పొందే అవకాశం ఎస్బీఐ మీకు కల్పిస్తోంది. టాటా క్లిక్‌లో అయితే రూ.300 వరకు బెనిఫిట్ పొందవచ్చు అని తెలిపింది. వేదాంతులో 50 శాతం వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. అయితే ఎస్బీఐ యోనో యాప్ ద్వారా జరిపే చెల్లింపులకు మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయని తెలిపింది. "తన వినియోగదారులకు అంతిమ షాపింగ్ ఆనందాన్ని అందించడానికి యోనో వేదాంతు, అపోలో 24ఐ7, ఈస్ మైట్రిప్, ఓయో వంటి అగ్ర శ్రేణి వ్యాపారులతో భాగస్వామ్యం కలిగి ఉంది" అని ఎస్బీఐ తెలిపింది. Super deals. Super savings. Upto 50% off* on big brands like Titan Pay, Apollo 24|7, EaseMyTrip, OYO, Tata CLiQ & Vedantu. Download now: https://t.co/YibUVRB2OS#SuperSavingDays #YONOSBI #YONO #Shopping #Saving pic.twitter.com/JuvUreadRO — State Bank of India (@TheOfficialSBI) July 4, 2021 -
ఎస్బీఐ : యోనో బంపర్ ఆఫర్లు
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘యోనో సూపర్ సేవింగ్ డేస్’ పేరుతో స్పెషల్ షాపింగ్ కార్నివాల్‌ను ప్రకటించింది. తన బ్యాంకింగ్, లైఫ్‌స్టైల్ ప్లాట్‌ఫాం యోనో యాప్ ద్వారా షాపింగ్ చేసిన కస్టమర్లకు ప్రత్యేక డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ అందించనుంది. ఇందుకోసం అమెజాన్, ఓయో, పెప్పర్ఫ్రై, శాంసంగ్, యాత్రతో సహా 100కి పైగా ఇ-కామర్స్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు మంగళవారం ఎస్బీఐ ప్రకటించింది. యోనో సూపర్ సేవింగ్ డేస్ అమ్మకం ఫిబ్రవరి 4న ప్రారంభమై ఫిబ్రవరి 7వరకు కొనసాగుతుంది. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, ట్రావెల్, హాస్పిటాలిటీ, అమెజాన్‌తో ఆన్లైన్ షాపింగ్, ఇతర ప్రముఖ విభాగాలలో యోనో సూపర్ సేవింగ్ డేస్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఓయో హోటల్ బుకింగ్‌పై 50 శాతం తగ్గింపు, యాత్రా.కామ్ ద్వారా ఫ్లైట్ బుకింగ్‌పై 10శాతం తగ్గింపు, శాంసంగ్ మొబైల్స్, టాబ్లెట్లు గడియారాలపై 15శాతం తగ్గింపుతో పాటు ఇతర ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. దీంతోపాటు పెప్పర్ఫ్రై ఫర్నిచర్ కొనుగోలు చేస్తే 7 శాతం మినహాయింపు లభించనుంది. అమెజాన్‌లో ఎంపిక చేసిన వస్తువులపై షాపింగ్‌పై 20 శాతం క్యాష్‌బ్యాక్ లభ్యం. ఈ కొత్త ఏడాదిలో తమ వినియోగదారులకు మరింత సంతోషాన్ని అందించేందుకు యోనో సూపర్ సేవింగ్ డేస్ ప్రకటించడం ఆనందంగా ఉందని ఎస్బీఐ ఎండీ (రిటైల్ & డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ శెట్టి తెలిపారు. బ్యాంకింగ్, జీవనశైలి అవసరాల దృష్ట్యా అదనపు షాపింగ్ అవసరాలను తీర్చే క్రమంలో మెగా షాపింగ్ ఈవెంట్ ఒక ప్రత్యేక అడుగు అని ఆయన అన్నారు. Save the dates! YONO Super Saving Days brings exclusive discounts on top brands like Amazon, Samsung, Yatra, OYO & Pepperfry. Stay tuned!#SuperSavingDays #YONOSBI #YONO pic.twitter.com/DCA02P60kW — State Bank of India (@TheOfficialSBI) February 1, 2021 -
ఫ్లిప్‌కార్ట్ ‘సూపర్ర్ సేల్’ : ఆకర్షణీయమైన డీల్స్
బెంగళూరు : బిగ్ ఫ్రీడం సేల్ ముగిసిన రెండు వారాల్లోనే దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో సేల్కు తెరలేపబోతుంది. ‘సూపర్ర్ సేల్’ పేరుతో ఫ్లిప్‌కార్ట్ దీన్ని నిర్వహిస్తోంది. లోయల్టి ప్రొగ్రామ్ ‘ఫ్లిప్‌కార్ట్ ప్లస్’ లాంచ్ చేసిన తర్వాత నిర్వహిస్తున్న తొలి సేల్ ఇదే. ప్లస్ సభ్యులకు ఈ సేల్ త్వరగా అందుబాటులోకి రానుంది. ఆగస్టు 25 నుంచి ఈ సేల్ లైవ్‌లోకి వస్తుండగా.. ప్లస్ సభ్యులకు ఆగస్టు 24వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఈ సేల్ అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ పాపులర్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపై, టీవీలపై, ల్యాప్‌టాప్‌లపై, రిఫ్రిజిరేటర్లపై ఆకర్షణీయమైన డీల్స్‌ను ప్రకటిస్తుంది. రెడ్మి 5ఏ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 25న మధ్యాహ్నం 12 గంటలకు సేల్కు వస్తుంది. టెలివిజన్ సెట్లపై, హెచ్‌పీ, ఆసుస్, డెల్, ఏసర్ వంటి ల్యాప్‌టాప్ బ్రాండ్లపై డిస్కౌంట్లను అందిస్తుంది. ల్యాప్‌టాప్‌లపై కొనుగోలుదారుడు అదనంగా 2వేల రూపాయల తగ్గింపును పొందవచ్చు. శాంసంగ్, ఎల్జీ, వర్పూల్ బ్రాండ్ల రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్లపై 30 శాతం తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీతో ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఈ భాగస్వామ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వినియోగదారులకు 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్‌ను అందిస్తుంది. ఈఎంఐ ద్వారా జరిపే పేమెంట్లకు మాత్రమే ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్యాషన్, ఫర్నీచర్ వస్తువులపై కూడా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు కాస్త ముందుగా ఈ సేల్ అందుబాటులోకి రావడమే కాకుండా.. ఉచితంగా, త్వరగా డెలివరీ చేసే సామర్థ్యం, ప్రియారిటీ కస్టమర్ సపోర్టు లభించనున్నాయి. తన వెబ్‌సైట్‌పై వెచ్చించే ప్రతి 250 రూపాయలకు ఒక కాయిన్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేయనుంది. ఒక్క లావాదేవీల్లోనే 2500 రూపాయల వరకు డిస్కౌంట్ పొందడానికి ఫ్లిప్‌కార్ట్ సభ్యులు ఈ 10 కాయిన్లను వాడుకోవచ్చు. ప్లస్ సభ్యులకు పలు ఉచిత ఆఫర్లను కూడా కంపెనీ అందిస్తుంది. ఈ ఆఫర్లలో గానా ప్లస్‌కు 6 నెలల సబ్స్క్రిప్షన్, ఐక్సిగోలో విమాన టిక్కెట్లను బుక్ చేసుకునే వారికి రూ.550 ఇన్స్టాంట్ డిస్కౌంట్, బుక్‌మైషో ద్వారా సినిమా టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి వంద రూపాయల తగ్గింపు ఉన్నాయి. -
సూపర్ సేల్ : రూ.1కే హానర్ 8 ప్రొ
హానర్ ఇండియా భారతీయ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. హానర్ సూపర్ సేల్‌లో తన 8 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 14 తేదీన కేవలం 1 రూపాయికే అందించింది. హానర్ ఆన్లైన్ స్టోర్ ద్వారా ఈ రోజు (మంగళవారం) ఉదయం 11.30 నిమిషాలకు ఈ సూపర్ సేల్ మొదలు కానుందని ప్రకటించింది. స్టాక్ ఉన్నంత వరకే ఈ అవకాశంమని తెలిపింది. హానర్ 8 ప్రొ వాస్తవ ధర రూ.29,999 అంటే రూ.29,998ల భారీ డిస్కౌంట్ అన్నమాట. హానర్ అధికారిక వెబ్సైట్లో సూపర్ సేల్ మొదలైన కొన్ని నిమిషాల్లోనే ‘సోల్డ్ అవుట్’ అన్న డైలాగ్ కస్టమర్లను వెక్కిరించడం గమనార్హం. ఈ స్వల్ప వ్యవధిలో ఎన్ని స్మార్ట్ఫోన్లను తమ కస్టమర్లకు అందించిందనే లెక్కలను సంస్థ అధికారికంగా ప్రకటించాల్సివుంది. -
ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: విమానసంస్థల్లో ధరల యుద్ధం మరింత జోరుగా సాగుతోంది. విమానయాన సంస్థలు ఆకర్షణీయమైన చార్జీల తగ్గింపుతో ప్రయాణీకులకు ఆకట్టుకోవడానికి భారీ ఆఫర్లు అందిస్తున్నాయి. మొన్న స్సైస్ జెట్, ఇండిగో వరుసగా అతి తక్కువ చార్జీలను ఆఫర్ చేయగా ఇపుడు ఎయిర్ ఇండియా వంతువచ్చింది. పరిమిత కాలానికి గాను సూపర్ సేల్ ఆఫర్ ను ప్రవేశపెట్టింది. తన దేశీయ నెట్ వర్క్ లో రూ 1,499 (అన్ని కలుపుకొని)ప్రారంభ ధరతో వినియోగదారులకు టికెట్లను అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సూపర్ సేల్ ఆఫర్ కింద ఈ శనివారం నుంచి మే 25 లోగా టిక్కెట్లు బుక్ చేసుకోవాలని తెలిపింది. ఇవి జూలై , సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణ కాలానికి వినియోగించుకోవాలని పేర్కొంది. jexe మిగిలిన సమయంతో పోలిస్తే జూలై-సెప్టెంబర్, జనవరి-మార్చి త్రైమాసికాల్లో డిమాండ్ తక్కువగా ఉంటుంది. ఈ కాలాన్ని లీన్ సీజన్ భావిస్తారు. ఈ నేపథ్యంలో స్సైస్ జెట్ , ఇండిగో, ఎయిర్ ఆసియా ఇండియా భారీ ఆఫర్ ప్రకటించింది. స్పైస్‌జెట్ టికెట్ రూ 511 ఇండిగో రూ .800 ఆఫర్ వచ్చింది. అటాగే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎయిర్ ఏసియా పలు మార్గాల్లో సగానికి దాని టికెట్ ధరలు తగ్గించిన సంగతి తెలిసిందే.