లండన్ : డ్రాగన్‌కు బ్రిటన్ మంగళవారం భారీ షాక్ ఇచ్చింది. 5జీ నెట్‌వర్క్‌లో చైనా కంపెనీ హువాయికి పరిమిత పాత్ర ఇవ్వాలన్న నిర్ణయం నుంచి బ్రిటన్ ప్రభుత్వం వెనక్కుతగ్గింది. చైనా కంపెనీ హువాయి నుంచి వచ్చే ఏడాది ఆరంభం నుంచి 5జీ పరికరాలను కొనుగోలు చేయరాదని టెలికాం ప్రొవైడర్లను బ్రిటన్ ఆదేశించింది. హువాయి పరికరాల ద్వారా చైనా ప్రభుత్వం బ్రిటన్ నెట్‌వర్క్‌ల్లోకి చొరబడుతుందనే ఆందోళనతో ఇంటెలిజెన్స్ షేరింగ్ ఒప్పందం నుంచి వైదొలుగుతామని అమెరికా హెచ్చరించిన క్రమంలో 5జీ నెట్‌వర్క్ నుంచి హువాయిని బ్రిటన్ నిషేధించింది.
మరోవైపు పాలక కన్జర్వేటివ్ పార్టీలో చైనాను వ్యతిరేకించే రెబెల్స్ నుంచి ప్రధాని బోరిస్ జాన్సన్‌పై ఒత్తిడి ఎదురవుతోంది. చైనా ఇటీవల చేపట్టిన హాంకాంగ్ భద్రతా చట్టం, చైనా ప్రభుత్వంతో హువాయికి ఉన్న సంబంధాల నేపథ్యంలో డ్రాగన్ బ్రిటన్‌లో వ్యతిరేకత మూటకట్టుకుంది. దేశ 5జీ నెట్‌వర్క్ ప్రక్రియ నుంచి హువాయిని తొలగించాలని కోరుతూ పదిమంది కన‍్జర్వేటివ్ ఎంపీలు బోరిస్ జాన్సన్‌కు లేఖ రాశారు. మరోవైపు 5జీ ప్రక్రియలో తమపై బ్రిటన్ నిషేధం విధించడం నిరాశపరిచిందని, ఇది రాజకీయ నిర్ణయమని హువాయి వ్యాఖ్యానించింది. చదవండి : టిక్‌టాక్, వీచాట్‌లపై త్వరలోనే కఠిన చర్యలు!
Comments
Please login to add a commentAdd a comment