మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ మేట్ 20 ప్రొను భారత్‌లో నేడు( నవంబరు27) విడుదల చేసింది. కింగ్ ఆఫ్ స్మార్ట్‌ఫోన్స్‌గా చెబుతున్న హువావే మేట్ 20ప్రొ (హయ్యర్ ఇంటిలిజెన్స్)ను న్యూఢిల్లీలో లాంచ్ చేసింది. ప్రధానంగా తమ డివైస్‌లోని మూడు కెమెరాలు అల్ట్రా వైడ్ యాంగిల్‌తో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌లా పనిచేస్తాయని కంపెనీ తెలిపింది. ఇప్పటికే లండన్‌లో విడుదలైన ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా అమెజాన్‌లో విక్రయించనున్నారు. డిసెంబరు 3 అర్థరాత్రి నుంచి ప్రైమ్ సభ్యులకు, డిసెంబరు 4 అర్థరాత్రి నుంచి సాధారణ సభ్యులకు అందుబాటులో ఉంటుంది. మూడు రంగుల్లో లభ్యం. ధర : రూ.69,990
హువావే మేట్ 20 ప్రొ ఫీచర్లు
6.39 ఇంచ్ క్యూహెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే
3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
హువావే కైరిన్ 980 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 9.0 పై
6/8 జీబీ ర్యామ్
128/256 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
40 +20+8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4200 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్‌లెస్ చార్జింగ్, సూపర్ చార్జ్
ఇంకా ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3డీ ఫేస్ అన్‌లాక్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, డ్యుయల్ స్పీకర్స్ ప్రత్యేక ఫీచర్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment