స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమదైన ఫీచర్లతో కస్టమర్లను మరింత ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా చైనాకు చెందిన హువావే కంపెనీ పి20 పేరుతో ఓ స్మార్ట్ ఫోన్ తీసుకొస్తోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఎత్తున్న అంచనాలు వెలువడుతున్నాయి. ట్రిపుల్ రియర్ కెమెరాతో రాబోతుందని ఇప్పటికే కొన్ని రిపోర్టులు పేర్కొనగా.. తాజాగా మరో ఆసక్తికర వార్త ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 512 జీబీ స్టోరేజీ సామర్థ్యం ఉంటుందని తెలుస్తోంది. ఈ స్థాయి స్టోరేజీతో వస్తున్న తొలి ఫోన్ ఇదే. ఇంత వరకు ఈ కంపెనీ గరిష్టంగా 250 జీబీ సామర్థ్యంతోనే స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అవుతూ ఉన్నాయి. 512 జీబీ సామర్థ్యం అంటే కంప్యూటర్ తో సమానం.
6జీబీ ర్యామ్ ఇందులో ఉంటుందని టీనా లిస్టింగ్ రివీల్ చేసింది. త్వరలోనే ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఒకవేళ ఈ స్థాయి స్టోరేజీ సామర్థ్యం, ఫీచర్లతో పి20ని కంపెనీ మార్కెట్లోకి తీసుకొస్తే.. మిగిలిన ప్రధాన కంపెనీలు సైతం ఈ తరహా ఫోన్లను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 512జీబీ స్టోరేజ్‌తో యూజర్లు 4కే వీడియోలను, మూవీలను, బుక్స్‌ను, మ్యూజిక్‌ను రికార్డు చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment