అద్భుత ఫీచర్లతో ‘నోవా 2ఎస్‌’ | Huawei Nova 2s arrives with Android Oreo | Sakshi
Sakshi News home page

అద్భుత ఫీచర్లతో ‘నోవా 2ఎస్‌’

Published Sat, Dec 9 2017 3:35 PM | Last Updated on Sat, Dec 9 2017 3:37 PM

Huawei Nova 2s arrives with Android Oreo - Sakshi



బీజింగ్‌: హువావే  మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌లో v సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను  లాంచ్‌ చేసింది. భారీ స్క్రీన్‌, 18:9 బెజెల్‌ లెస్‌ డిస్‌ప్లే,  నాలుగు కెమెరాలు(డబుల్‌ రియర్‌, సెల్పీ కెమెరా) లాంటి అద్భుత ఫీచర్లతో 'నోవా 2ఎస్‌'  పేరుతో  తాజా స్మార్ట్‌ఫోన్‌ను  చైనా మార్కెట్‌లో విడుదల చేసింది.  4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లలో ఈ డివైస్‌ను అందుబాటులోకి తెచ్చింది. 4జీబీ వేరియంట్‌  ధర సుమారు రూ.26,300గాను, 6జీబీ ధరను సుమారు రూ.29, 300గాను ఉండనుంది. అంతేకాదు రూ.33,100 ధరలో  మరో స్పెషల్‌ ఎడిషన్‌ను కూడా  లాంచ్‌ చేసింది. త్వరలోనే భారత్‌లోనూ ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తేనుంది.


హువావే నోవా 2ఎస్ ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
4/6 జీబీ ర్యామ్
64/128 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
16+20 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,
20+2 మెగాపిక్సెల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు
3340 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement