big screen
-
‘మల్టీ’ఫుల్
–సినీ వీక్షణం.. కొత్త పుంతలు–అత్యాధునిక సాంకేతికత..–సీట్ వద్దకే ఫుడ్.. మొబైల్ ఛార్జింగ్–అతిపెద్ద తెరలు.. అదిరే సౌండ్నగరంలోని మాల్స్‌లో బిగ్ స్క్రీన్స్.. బిగ్ జోష్టికెట్స్ ఉన్నాయా? ఇప్పుడెళ్తే దొరుకుతాయా? తీరా థియేటర్ దగ్గరకు వెళ్లాక టెకెట్లు లేకపోతే..సమయం, ట్రాన్స్పోర్ట్ ఖర్చు అంతా వృథా.. ఇలాంటి సందేహాలు... ఇది ఒకప్పటి పాత జనరేషన్. ప్రస్తుత జనరేషన్ ఉన్నచోట నుంచే అంతా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవడంతో మొదలుపెట్టి అన్నీ తామున్న చోటకే రావాలనేది ఆధునికుల బాట. అంతేకాదు థియేటర్ తెర సైజ్ దగ్గర నుంచి ఆడియో సౌండ్ క్వాలిటీ దాకా ప్రతిదీ అద్భుతంగా ఉండాలని వారు ఆశిస్తున్నారు. ఓటీటీల యుగంలో హోమ్ థియేటర్ల నుంచి ఆడియన్స్‌ని సినిమా థియేటర్లకు రప్పించడానికి మల్టీఫ్లెక్స్‌లు వారి ఆకాంక్షల్ని తీర్చడానికి కాదేదీ మార్పునకు అనర్హం అన్నట్టుగా రోజుకో కొత్త ఫెసిలిటీనీ పరిచయం చేస్తున్నాయి. దేశంలోని ప్రధాన మల్టీఫ్లెక్స్ సంస్థలన్నీ ఇప్పటికే పెద్ద సంఖ్యలో సిటీకి రాగా మేము సైతం అంటూ స్థానిక సంస్థలు కూడా పోటీకి తెరలేపాయి. ఈ నేపఽథ్యంలో మహా నగరంలో 2 దశాబ్ధాల మల్టీఫ్లెక్స్ జర్నీపై ప్రత్యేక కథనం..జొమాటోతో భాగస్వామ్యం...👉 త్వరలో జొమాటోతో భాగస్వామ్యం ద్వారా థియేటర్లలో ఉండే ఫుడ్ ఆర్డర్ చేసుకునే సౌలభ్యాన్నీ కొన్ని మల్టీప్లెక్స్‌లు కల్పించనున్నట్లు సమాచారం.👉 మరింత లగ్జరీ సీటింగ్, లేజర్ ప్రొజెక్షన్, 4డిఎక్స్ ఫార్మేట్స్ వంటివి జోడించనున్నారు.👉 4డిఎక్స్, మైక్రో ఎక్స్ఈ...లతో పాటు ఐసీఈ థియేటర్ కాన్సెప్ట్‌ను పరిచయం చేయనున్నట్టు ఓ ప్రముఖ మల్టీప్లెక్స్ గ్రూప్‌కు చెందిన దేవాంగ్ సంపత్ అంటున్నారు.👉 పాకశాస్త్రంలో చేయి తిరిగిన చెఫ్స్తో పీవీఆర్–ఐనాక్స్ చేతులు కలిపాయి.భాగ్యనగరంలో మల్టీప్లెక్స్ ట్రెండ్ నడుస్తోంది... ఎప్పటికప్పుడు నగరవాసులను ఆకర్షించేందుకు కొత్త మార్పులు చేస్తున్నారు. వినోదం, షాపింగ్, గేమింగ్, ఫుడ్‌కోర్ట్స్ వంటి అనేక హంగులను ఒక చోటే కల్పిస్తున్నారు..ఓటీటీల రాకతో వెలవెలబోతున్న వెండితెరలకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నారు. అనేక పోటీలను తట్టుకుని అత్యాధునిక హంగులతో వీక్షకులకు అపురూప అనుభూతిని కల్పిస్తున్నారు.తొలి మల్టీప్లెక్స్...దేశంలో తొలి మల్టీప్లెక్స్‌ను 1997లో పీవీఆర్ సినిమాస్ ఆధ్వర్యంలో సౌత్ ఢిల్లీలో నెలకొల్పారు. కాగా దేశంలో మూడో అతిపెద్ద ఐమ్యాక్స్ థియేటర్‌ను నగరంలో ప్రసాద్స్ మల్టీప్లెక్స్ పేరిట 2003లో నెలకొల్పారు. ఎయిర్‌పోర్ట్స్‌లో తొలి మల్టీప్లెక్స్‌ను చైన్నెలో గతేడాది పీవీఆర్ ఏర్పాటు చేయగా, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనూ అందుబాటులోకి తేనున్నట్టు సమాచారం.113 నగరాల్లో..దేశపు అతిపెద్ద మల్టీప్లెక్స్ గ్రూప్స్ అయిన పీవీఆర్, ఐనాక్స్ 2022లో చేతులు కలిపి పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్‌గా మారాయి. వీరికి దేశవ్యాప్తంగా 113 నగరాల్లో 1,715 స్క్రీన్స్ ఉన్నాయి. ఇందులో దక్షిణాదిలో 550, కేవలం తెలంగాణలో 106 ఉన్నాయి. నగరంలో 11 చోట్ల 62 స్క్రీన్స్ ఉన్నాయి. దేశపు తొలి అంతర్జాతీయ, ప్రపంచపు అతిపెద్ద మూవీ థియేటర్ సర్క్యూట్‌గా పేరొందిన సినీపోలీస్కి అత్తాపూర్‌లోని మంత్ర మాల్లో ఆరు స్క్రీన్ల మల్టీఫ్లెక్స్, మంజీరా ట్రినిటీ మాల్లో ఐదు, సిసిపిఎల్ మాల్లో ఐదు చొప్పున స్క్రీన్స్ ఉన్నాయి.నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌తో...ఓటీటీ తరహాలో మల్టీప్లెక్స్కూ నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్రవేశపెడుతున్నారు నిర్వాహకులు. ప్రస్తుతం రూ.699 చెల్లించి 10 సినిమాలు చూసే స్కీమ్‌ను పీవీఆర్ ప్రవేశపెట్టింది.‘భారీ’ మార్పులు...దాదాపు రెండు దశాబ్దాల ప్రయాణంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు జతచేస్తూ..నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నాయి. ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో తొలి స్క్రీన్ 29 మీటర్ల వెడల్పు, 21.93 మీటర్ల ఎత్తు కాగా...స్క్రీన్ 6లో గత డిసెంబర్లో 64 అడుగుల ఎత్తు, 101.6 అడుగుల వెడల్పుతో అతిపెద్ద స్క్రీన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఎండిఎ స్క్రీన్ దేశంలోనే పెద్దదిగా సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. మల్టీప్లెక్స్ మార్పుల్లో ఇదో ‘భారీ’ ఉదాహరణ.సరికొత్త టెక్నాలజీ...స్క్రీన్ల దగ్గర నుంచి ప్రొజెక్టర్ల వరకూ చివరికి సీటింగ్‌లోనూ సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. సీట్ల మధ్య స్పేస్ పెంచి.. రిక్లెయినర్స్ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 4కే–60 ఎల్ స్క్రీన్, 3డీ ప్రొజెక్టర్, డాల్బీ క్యూఎస్సీ ఆడియో, 53 స్పీకర్ల డాల్బీ సీపీ 950 వంటి ఎన్నో సౌకర్యాలు వీక్షకులకు కొత్త అనుభూతిని పంచుతున్నాయి. ఇక 7.1 సరౌండ్ సౌండ్ పేరిట కొత్త సాంకేతికతను త్వరలోనే పరిచయం చేయనుంది. ప్రతీ చిన్న శబ్దాన్ని ప్రేక్షకుల వీనులకు విందు చేసేలా ఈ ఆడియో పనిచేస్తుంది. మరికొన్ని రోజుల్లో ఈ అప్‌గ్రేడేషన్ పూర్తవనుంది. గచ్చిబౌలిలోని ఆట్రియమ్ మాల్లో ఏర్పాటు చేసిన పీవీఆర్ స్క్రీన్స్‌లో 4కె ప్రొజెక్టర్స్, డాల్బీ అట్మోస్ సౌండ్ ప్రత్యేకత.బటన్ నొక్కితే చాలు..అపర్ణా మల్టీప్లెక్స్‌లో సరికొత్తగా ఎంట్రీని ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 1208 సీటింగ్ కాగా ఇందులో 135 గోల్డ్ క్లాస్ సీట్స్ ఏర్పాటు చేశారు. వేరే మల్టీప్లెక్స్‌లో లేని విధంగా సీట్‌కే ఛార్జింగ్ పోర్ట్ ఏర్పాటు చేశారు. ఇక బటన్ నొక్కితే సొంత కిచెన్‌లో వండిన ఫుడ్ సర్వ్ చేసే సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అడ్వాన్స్డ్లేజర్ ప్రొజెక్టర్ బార్కో సిరీస్ 4ను జత చేశారు. లెగ్ స్పేస్ కూడా మిగిలిన మల్టీప్లెక్స్‌లతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉండేలా సెట్ చేశారు.కాఫీ షాప్స్...తొలి అంతర్జాతీయ, ప్రపంచపు అతిపెద్ద మూవీ థియేటర్ సర్క్యూట్‌గా పేరొందిన సినీపోలీస్కి అత్తాపూర్ మంత్ర మాల్లో 6, మంజీరా ట్రినిటీ మాల్లో 5, సీసీపీఎల్ మాల్లో 5 చొప్పున స్క్రీన్స్ ఉన్నాయి. నగరంలో మొత్తం 16 స్క్రీన్స్ కలిగిన సినీపోలిస్ డిజిటల్ ప్రొజెక్షన్స్, డి3డీ టెక్నాలజీ అందిస్తోంది. కాఫీషాప్స్, కాఫీ ట్రీ వంటివి ఈ గ్రూప్స్ ప్రత్యేకత అని డైరెక్టర్ ఆశిష్ శుక్లా తెలిపారు. కాగా మల్టీప్లెక్స్ టిక్కెట్ ధరలు అత్యాధునిక టెక్నాలజీ, విలాసవంతమైన అనుభవాలను అందుబాటులోకి తేవడంలో అడ్డంకిగా మారాయని మిరాజ్ సినిమాస్ ప్రతినిధి అమిత్ శర్మ చెబుతున్నారు.బ్రాండ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా..నిర్మాణ రంగంలో అగ్రగామి సంస్థ అపర్ణ తొలిసారిగా మల్టీప్లెక్స్‌లో అడుగుపెట్టింది. నల్లగండ్లలోని అపర్ణా మాల్లో ఏడు స్క్రీన్స్ అందుబాటులోకి తెచ్చాం. సంస్థ బ్రాండ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని థియేటర్స్‌లో అత్యాధునిక హంగులకు పెద్ద పీట వేశాం. అత్యుత్తమమై స్క్రీన్స్, ఆడియో సిస్టమ్స్.. వీటితో పాటు విశాలమైన సీటింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చాం. రిక్లెయినర్ సీట్లలో మొబైల్ ఛార్జింగ్, సీట్ వద్దకే ఫుడ్ ఆర్డర్, డెలివరీ తీసుకొచ్చాం. దీని కోసం చేయి తిరిగిన చెఫ్స్తో ఓ అత్యాధునిక కిచెన్ ఏర్పాటు చేశాం. మరిన్ని మల్టీప్లెక్స్‌లను రాష్ట్రవ్యాప్తంగా సంస్థ ఏర్పాటు చేయనుంది. – మధుకర్, మేనేజర్, అపర్ణా సినిమాస్ మల్టీప్లెక్స్ -
హైదరాబాద్ బిగ్ స్క్రీన్‌పై పాక్-భారత్ మ్యాచ్.. సందడి చేసిన శ్రియా శరణ్ (ఫొటోలు)
-
అతిపెద్ద సినిమా స్క్రీన్.. ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ పోద్ది!
మనలో చాలామందికి సినిమా చూడటం వ్యసనం. మందు తాగేవాడికి మత్తు ఎక్కితే కిక్ వస్తుంది. సినిమా చూసేవాడికి స్క్రీన్ ఎంత పెద్దగా ఉంటే.. అంత కిక్ వస్తుంది. ఎందుకంటే ఓ యాక్షన్ సీన్ పెద్ద తెరపై చూస్తుంటే అప్పుడు వచ్చే మజా.. బయట ఎక్కడా దొరకదు కదా! అయితే ఐమాక్స్, సూళ్లురుపేటలోని వి-ఎపిక్ స్క్రీన్స్ ఇప్పటివరకు పెద్దవని అనుకున్నాం. కానీ వాటికి బాబు లాంటి స్క్రీన్ త్వరలో అందుబాటులోకి రానుంది. దీని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే మీకు ఫ్యూజులు ఎగిరిపోవడం గ్యారంటీ. ఈ స్క్రీన్ సంగతేంటి? సాధారణంగా సినిమా స్క్రీన్ ఓ గోడ ఆకారంలో అంటే స్క్వేర్ షేపులో ఉంటుంది. దాదాపు ఎక్కడ చూసినా సరే ఇలాంటివే ఉంటాయి. కానీ అమెరికాలోని లాస్ వెగాస్‌లో మాత్రం రౌండ్(గోళాకారం) షేపులో బంతిలా ఉండే స్క్రీన్‌ని సిద్ధం చేశారు. ప్రస్తుతం అందరూ దీన్ని రాకాసి స్క్రీన్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే దీని పొడవు, వెడల్పు అలాంటిది మరి. (ఇదీ చదవండి: బెండు తీసిన 'బిగ్‌బాస్'.. హౌసులో దొంగతనానికి స్కెచ్!) ఈ స్క్రీన్ ప్రత్యేకతలు మిగతా వాటి సంగతేమో గానీ ఈ స్క్రీన్ 366 అడుగుల పొడుగు, 516 అడుగుల వెడల్పుతో ఉంది. ఈ థియేటర్ లో ఏకంగా 18,600 మంది ఒకేసారి కూర్చుని సినిమా చూడొచ్చు. ఈ స్క్రీన్ కి తోడుగా 1,60,000 స్పీకర్లు(చిన్నా పెద్దా కలిపి) ఉన్నాయి. మన దగ్గర ప్రస్తుతం 4K రెజుల్యూషన్ ఉంది. ఈ స్క్రీన్‌లో 18K రెజుల్యూషన్‌తో ప్లే అవుతుంది. ఇందులో మూవీ వేయాలంటే.. ఆ ఫైల్ సైజు 5 లక్షల జీబీ(GB) ఉండాల్సిందే. ఫస్ట్ సినిమా అదే ఇకపోతే అక్టోబరు 6న 'పోస్ట్ కార్డ్ ఫ్రమ్ ఎర్త్' సినిమాని.. ఈ రాకాసి స్క్రీన్‌పై ప్లే చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీన్ని చూసిన నెటిజన్స్.. వామ్మో అనకుండా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి చోట సినిమా చూస్తే చాలు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి స్క్రీన్ రావాలంటే ఇప్పట్లో అస్సలు సాధ్యం కాదు! (ఇదీ చదవండి: గ్లామర్ డోస్ పెంచిన నిహారిక... తమన్నా ముద్దులే ముద్దులు) View this post on Instagram A post shared by Darren Aronofsky (@darrenaronofsky) -
విద్యార్థుల్లో చంద్రయాన్ విజయోత్సాహం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : అంతరిక్షంలో సరికొత్త శకాన్ని ఆవిష్కరించి, ప్రపంచంలో చిరస్థాయిగా గుర్తుండిపోయే విజయాన్ని అందుకున్న చంద్రయాన్–3 ప్రయాణాన్ని ఆద్యంతం వీక్షించిన వి ద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సాహంలో ము నిగితేలారు. ఈ ఘనతను పాఠశాలల్లో విద్యార్థులు వీక్షించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో బుధవారం సాయంత్రం అన్ని ప్ర భుత్వ పాఠశాలల్లోను అందుకు అవసరమైన ఏర్పాట్లుచేశారు. ఇటీవల ఉన్నత పాఠశాలలకు ప్రభు త్వం అందించిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లపై చంద్రయాన్ మిషన్‌లో భాగమైన ల్యాండర్ మాడ్యుల్ ప్రయాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో పాటు పలుచోట్ల సాధారణ ప్రజలు సైతం సమీప పాఠశాలల్లో బిగ్ స్క్రీన్స్‌పై ఆద్యంతం వీక్షించారు. చంద్రుని దక్షిణ ధృవంపై ల్యాండర్ మాడ్యూల్ దిగిన వెంటనే సంబరాలు జరుపుకున్నారు. జయహో భారత్ అంటూ నినాదా లు చేశారు. విద్యార్థుల కోసం ప్రత్యక్ష ప్రసార ఏర్పా ట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు విద్యా ర్థులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపా రు. చంద్రుని దక్షిణ ధృవానికి చేరిన మొదటి దేశం మనదైనందుకు గర్విస్తూ, ఇందుకు కృషిచేసిన శాస్త్రవేత్తలకు వారంతా అభినందనలు తెలిపారు. అలాగే.. ♦ చంద్రయాన్–3 విజయోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఏలూరు జిల్లా గణపవరానికి చెందిన స్వర్ణకారుడు పేరూరి కృష్ణ కేవలం 700 మిల్లీగ్రాముల బంగారంతో చంద్రయాన్–3 విక్రమ్ రోవర్‌ను తయారుచేసి జాతికి అంకితమిచ్చారు. ♦ చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టడం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారని హోంమంత్రి తానేటి వనిత కొనియాడారు. దేశ పౌరులుగా ప్రతీ ఒక్కరు గర్వించదగిన రోజని కీర్తించారు. ఈ అద్భుత ఆవిష్కరణ చేసిన శాస్త్రవేత్తలందరికీ ఆమె అభినందనలు తెలిపారు. ♦ తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్లో ఏర్పాటుచేసిన ఎల్ఈడీ స్క్రీన్‌పై చంద్రయాన్–3 ల్యాండింగ్ ప్రక్రియను నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు, పెద్ద సంఖ్యలో హాజరై ఆసక్తితో తిలకించారు. తిరుపతిలోని మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలోనూ ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించిన విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఎస్వీ యూనివర్సిటీ, కేంద్రీయ సంస్కృత విద్యాలయం, వెటర్నరీ విశ్వవిద్యాలయం, అగ్రికల్చరల్ కళాశాలల్లోనూ విద్యార్థులు ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. ఇస్రో శాస్త్రవేత్తలకు సలామ్ అంటూ పెద్దఎత్తున అభినందనలు తెలిపారు. ♦ ఇస్రోకి శుభాకాంక్షలు తెలుపుతూ బుధవారం కృష్ణాజిల్లా అవనిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ‘కంగ్రాట్యులేషన్స్ ఇస్రో’ ఆకారంలో చేసిన విద్యార్థుల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. చంద్రుడిపై చంద్రయాన్–3 దిగిన దృశ్యాలను 860 మందికి పైగా విద్యార్థులు వీక్షించారు. ♦మరోవైపు.. భారతదేశ ఖ్యాతిని విశ్వాంతరాలలో సుస్థిరం చేసిన ఇస్రో శాస్త్రవేత్తల కృషిని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అభినందించారు. చంద్రయాన్–3 విజయవంతం అవ్వడంపట్ల బుధవారం తన క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకంతో ఆయన ఆనందం వ్యక్తంచేస్తూ ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుుమడింప చేసిందని కొనియాడారు. ఈ విజయానికి కృషిచేసిన శాస్త్రవేత్తలకు రాష్ట్ర ప్రజలు తరఫున మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ♦ ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. చంద్రయాన్–3 విజయవంతం కావడం ఖగోళ చరిత్రలో భారతదేశం పేరు సువర్ణాక్షరాలతో లిఖించతగ్గ విషయమన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు జాతిని తలెత్తుకునేలా చేశారని ఆయన కొనియాడారు. ♦ భారతదేశం అంతా ఈ రోజు గర్వించదగ్గ రోజని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అభివర్ణించారు. యావత్ ప్రపంచం భారతదేశ వైపు చూస్తోందని ఆయన కొనియాడారు. ఈ విజయాన్ని అందించిన ఇస్రో శాస్త్రవేత్తలు అందరికీ మంత్రి శుభాభినందనలు తెలిపారు. -
సిటీలో క్రికెట్ జోష్.. మల్టీప్లెక్స్ థియేటర్స్‌లో..
సాక్షి, హైదరాబాద్: సిటీలో క్రికెట్ జోష్ పెరిగింది. ఎక్కడ చూసినా టీ20 ఫీవర్ కన్పిస్తోంది. సుదీర్ఘకాలం తరువాత ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం భారత జట్టు పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో నగర క్రికెట్ అభిమానుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌ను వీక్షించడం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. భారీ స్క్రీన్స్‌పై... అభిమానులు ఫ్రెండ్స్‌తో కలిసి క్రికెట్‌ను చూడటానికి ఎక్కువ ఇష్టపడతారు. అందుకే వీరిని ఆకర్షించడానికి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో ఈసారి అత్యధిక సంఖ్యలో లైవ్ టెలికాస్ట్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మల్లీప్లెక్స్ థియేటర్స్‌లోనూ క్రికెట్ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా భారీ తెరలపై ప్రదర్శించడానికి కొందరు యజమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొండాపూర్, కోకాపేట్లాంటి ప్రాంతాల్లోని కొన్ని లగ్జరీ విల్లాల్లో కమ్యూనిటీ స్క్రీనింగ్‌లో మ్యాచ్‌ను తిలకించడానికి ఏర్పాట్లు చేశారు. జోరుగా బెట్టింగ్... ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్‌కు పెద్ద ఎత్తున బెట్టింగ్ కార్యకలాపాలు సాగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. కొన్ని మొబైల్ యాప్స్ ద్వారా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ కేంద్రంగా జరుగుతున్న ఈ బెట్టింగ్ రాకెట్లో ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పెద్ద సంఖ్యలో నిందితులను అరెస్ట్ చేశారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కావటంతో రూ.1,000 బెట్టింగ్‌పై రూ.20, 30 వేలకు పైగానే పందెం సాగుతుందని నిపుణులు చెబుతున్నారు. యువత, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఈ బెట్టింగ్‌లో పాల్గొంటున్నారని పోలీసులు తెలిపారు. బెట్టింగ్‌లకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 94906 17444 వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. చదవండి: ఖండాంతరాలు దాటిన ప్రేమ.. పెళ్లితో ఒక్కటి -
ఆ మ్యాజిక్ అలాగే ఉంటుంది
డిజిటల్ ఎంటర్టైన్ స్పేస్‌లో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ హవా వల్ల నటీనటులకు, దర్శకులకు అవకాశాలు పెరుగుతున్నాయని అంటున్నారు రకుల్ ప్రీత్‌సింగ్. ఈ విషయంపై రకుల్ ఇంకా మాట్లాడుతూ – ‘‘కోవిడ్ కారణంగా థియేటర్స్‌లో ఎంటర్టైన్మెంట్ అందుబాటులో లేకపోవడంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోని కంటెంట్ వైపు ప్రేక్షకులు దృష్టి పెట్టారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోని మన సినిమాలను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూస్తున్నారు. మంచి కంటెంట్‌ను ప్రశంసిస్తున్నారు. పెద్ద తెరపై సినిమాలను చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేసే ప్రేక్షకులు చాలామందే ఉన్నారు. అలానే ఇప్పుడు ఓటీటీ కంటెంట్‌ను కూడా ఇష్టపడే ప్రేక్షకులు ఉన్నారు. అయితే ఒక్కటి మాత్రం ఒప్పుకోవాల్సిందే. ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్స్ ఎన్ని ఉన్నా బిగ్ స్క్రీన్ సినిమా మ్యాజిక్ అలాగే ఉంటుంది. అయితే సినిమాలతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అభివృద్ధి దిశగా ముందడుగులు వేస్తే చాలా గొప్పగా ఉంటుంది. అటు సినిమాలతో పాటు ఇటు డిజిటల్ వల్ల అవకాశాలు పెరుగుతున్నాయి’’ అన్నారు. -
ఆసియాలో అతి పెద్ద స్క్రీన్
దేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే తొలిసారిగా.. ప్రపంచంలో మూడో భారీ స్క్రీన్‌ని ప్రేక్షకులు చూడబోతున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా సూళ్లూరుపేట పట్టణం సమీపంలోని పిండిపాళెంలో యూవీ క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ ‘వీ’ సెల్యూలాయిడ్ మల్టీ సినీ కాంప్లెక్స్‌ను నిర్మించారు. ఈ శుక్రవారం విడుదల కానున్న ‘సాహో’ సినిమాతో ఈ మల్టీప్లెక్స్ ఆరంభం కానుంది. అత్యున్నత సాంకేతిక విలువలతో మూడు సినిమా థియేటర్లను ఈ కాంప్లెక్స్‌లో నిర్మించారు. ఇందులో ఒక థియేటర్లో మాత్రం భారతదేశంలోనే ఎక్కడా లేనంత స్క్రీన్‌ను ఏర్పాటు చేయడం విశేషం. ప్రపంచస్థాయిలో తీసుకుంటే ఇది మూడో భారీ స్క్రీన్ అని ప్రచారం జరుగుతోంది. ఆసియా ఖండంలో కూడా ఇదే మొదటి స్క్రీన్ అని సమాచారం. 106 అడుగులు వెడల్పు, 94 అడుగులు నిలువు స్క్రీన్ ఏర్పాటుతో పాటు 670 సీట్లు కెపాసిటీతో త్రీడీ సౌండ్ సిస్టమ్‌తో అత్యంత అ«ధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. మిగిలిన రెండు థియేటర్లు 180 సీట్లు కెపాసిటీతో నిర్మించారు. సుమారు 7 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో ఈ గ్రూప్ థియేటర్స్‌ను నిర్మించారు. ఈ మల్టీ సినీ కాంప్లెక్స్ ప్రభాస్ చేతుల మీదుగా ప్రారంభం కానుందని సమాచారం. -
వివో : బిగ్ బ్యాటరీ, బిగ్ స్క్రీన్, బడ్జెట్ ధర
సాక్షి,ముంబై: చైనా మొబైల్ మేకర్ వివో వై సిరీస్‌లో కొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది. వై 91 ఐ పేరుతో బడ్జెట్ ధరలో తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ బేసిక్ ధరను రూ. 7,990గా నిర్ణయించింది. 32జీబీ వేరియంట్ ధరను రూ. 8490గా ఉంచింది. వివో వై91ఐ ఫీచర్లు 6.22 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 520×720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 2 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 13 ఎంపీ బ్యాక్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 4030 ఎంఏహెచ్ బ్యాటరీ -
అద్భుత ఫీచర్లతో ‘నోవా 2ఎస్’
బీజింగ్: హువావే మిడ్ రేంజ్ సెగ్మెంట్లో v సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. భారీ స్క్రీన్, 18:9 బెజెల్ లెస్ డిస్ప్లే, నాలుగు కెమెరాలు(డబుల్ రియర్, సెల్పీ కెమెరా) లాంటి అద్భుత ఫీచర్లతో 'నోవా 2ఎస్' పేరుతో తాజా స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. 4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లలో ఈ డివైస్‌ను అందుబాటులోకి తెచ్చింది. 4జీబీ వేరియంట్ ధర సుమారు రూ.26,300గాను, 6జీబీ ధరను సుమారు రూ.29, 300గాను ఉండనుంది. అంతేకాదు రూ.33,100 ధరలో మరో స్పెషల్ ఎడిషన్‌ను కూడా లాంచ్ చేసింది. త్వరలోనే భారత్‌లోనూ ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తేనుంది. హువావే నోవా 2ఎస్ ఫీచర్లు 6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 4/6 జీబీ ర్యామ్ 64/128 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 16+20 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20+2 మెగాపిక్సెల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు 3340 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ -
వెండితెరకు యూట్యూబ్ టీమ్
తమిళసినిమా: సాధారణ చిత్రాలతో నేటి యువతను మెప్పించడం అంత సులభమైన విషయం కాదు. కారణం సాంకేతిక పరిజ్ఞానంలో అభివృద్ధితో పాటు, యువతలో మారుతున్న అభిరుచి, అంచనాలను రీచ్ అవ్వాలంటే కచ్చితంగా కొత్తదనం అవసరం అవుతోంది. ఇటీవల యూట్యూబ్‌లో సరికొత్త కాన్సెప్ట్స్‌తో యువత లఘు చిత్రాలతో విపరీతంగా అలరిస్తున్నారు.అలా ఎరుమ్ సాణి లాంటి షార్ట్ ఫిలింస్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న యూట్యూబ్ టీమ్ తాజాగా వెండితెరపై తమ సత్తా చాటుకోవడానికి రెడీ అవుతున్నారు. ఆ టీమ్‌లో రమేశ్ వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతూ ఓడవుమ్ ముడియాదు ఒళియవుమ్ ముడియాదు పేరుతో ఒక వినోదభరిత కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. దీన్ని క్లాప్ బోర్డు పతాకంపై వి.సత్యమూర్తి నిర్మిస్తూ, కథానాయకుడిగా పరిచయం కానున్నారు. విజయ్, హారిజ, ఆర్జే.విక్కీ, గోపీసుధాకర్, షారాఅగస్టియన్ ముఖ్యపాత్రల్లో నటించనున్నారు.ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, కథానాయకుడు మాట్లాడుతూ తన టీమ్‌పై చాలా నమ్మకం ఉందన్నారు. ఓడవుమ్ ముడియాదు ఒళియవుమ్ ముడియాదు చిత్రంతో విజయం సాధిస్తామినే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. చిత్రాన్ని డిసెంబర్లో ప్రారంభించనున్నామని, సమ్మర్ స్పెషల్‌గా చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నామని తెలిపారు. దీనికి కౌశిక్ రవి సంగీతాన్ని, జోశ్వా జే.ఫిరోజ్ ఛాయాగ్రహణం అందించనున్నారని ఆయన తెలిపారు. -
ఒక్క..చాన్స్!!
♦ షార్టఫిల్మ్స్ మేకింగ్‌లో రాణిస్తున్న యువత ♦ సొంతంగా చిట్టి చిత్రాల రూపకల్పన ♦ యూట్యూబ్‌లో అప్లోడింగ్ సినిమాలకు దీటుగా నిర్మాణం ♦ సినీ ప్రముఖులను ఆకట్టుకునే ప్రయత్నం వెండితెర అవకాశాలే లక్ష్యం వాళ్లంతా యువతరం.. వెండితెరలో అవకాశం కోసం ‘ఒక్క ఛాన్స.. ఒకేఒక్క ఛాన్స’ అంటూ అన్నపూర్ణ స్టూడియో.. పద్మాలయ స్టూడియో గేటు వద్ద కాపాలా కాయడం లేదు. ఏ దర్శ కుడి వద్దకో.. నిర్మాత వద్దకో వెళ్లి బతిమిలాడుకోవడం లేదు. భిన్నమైన ఆలోచ నలతో శరవేగంగా విస్తరిస్తున్న సామాజిక మాధ్యమాల్లో తమ సృజనను చాటు తున్నారు. చిన్న చిన్న డాక్యుమెంటరీ చిత్రాలతో వెండితెర అవకాశాలు వెతుక్కుంటూ రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఖర్చుకు సైతం వెనుకాడకుండా తమ భావనలకు అద్దం పట్టేలా చిట్టి చిత్రాలను రూపొందిస్తున్నారు. సృజనాత్మకతకు అద్దం పడుతూ నేటి..మేటి చిత్రాలు తీస్తున్న ఈ నవతరంపై ఆదివారం ప్రత్యేకం -శంషాబాద్ ఒకరికొకరు చేయికలిపితే కొండంత లక్ష్యమైనా చిన్నదై పో తుంది. అదే తలంపుతో చిత్రాల్లో కనిపించాలనే తపనతో శం షాబాద్‌లోని కొందరు యువకులు కలిసి చిన్న చిత్రాలు (షార్ట్ ఫిల్మ్స్) తీసి యూట్యూబ్‌లో పెడుతున్నారు. కాస్త ఆర్థిక వనరులున్న వారు నిర్మాతగా మారితే.. సృజనాత్మకత కలిగిన వారు దర్శకులుగా మారి కెమెరాల్లోకి ఎక్కిస్తున్నారు. నటలో తమ సత్తా చాటుకునేందుకు నటీనటులు కూడా ఉ న్నారు. ఇలా ఆయా రంగాల్లో వారివారి అభిరుచులకు అను గుణంగా ఓ బృందంగా ఏర్పడి సినిమాలు తీస్తూ ఔరా అని పిస్తున్నారు. శంషాబాద్ పట్టణానికి చెందిన కల్యాణ్శ్రీ వర్మ దర్శకుడిగా ఇప్పటికే యూట్యూబ్‌లో ఐదు చిత్రాలకు పైగా చేశాడు. అతని తోడుగా స్థానికంగా ఉండే శివదత్త సాయి సాయి ఐసిరి పేరిట నిర్మాతగా మారి ఆర్థిక వనరులు సమ కూరుస్తూ యూట్యూబ్ సినిమాల నిర్మాణం చేపడుతున్నారు. వీరితో పాటు సాయికిరణ్ దేశాయి, విక్రమ్ తలసీల, అభినవసాగర్ తదితరులు తమ నటనాకౌశలంతో ఇప్పటికే పలు చిత్రాల్లో మెప్పించారు. ప్రేమ భావనతో కూ డిన చిత్రా లే కాకుండా సామాజిక మార్పులకు సంబంధిం చిన చిత్రా లు సైతం రూపొందించారు. ఇటీ వల సాయి ఐసిరి ప్రొడ క్షన్‌పై శివదత్త సాయి నిర్మాతగా ‘ క్యామాన్’ పేరిట తీసిన చిత్రాన్ని ప్రసాద్ ల్యాబ్‌లో కూడా ప్రదర్శించి పలువురు సినీ ప్రముఖుల చేత శభాష్ అనిపించుకున్నారు. స్థానిక లొకేషన్లు.. అద్దె కెమెరాలు.. వీరు తమ స్నేహితుల ఇళ్లు.. స్థానికంగా ఉన్న చక్కటి లొకే షన్లను ఎంచుకొని షార్ట్‌ఫిల్మ్‌లను పూర్తి చేస్తున్నారు. కెమెరా విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ప్రతిరోజు మూడు, నాలుగు వేల రూపాయల అద్దెకు సైతం వెనుకా డకుండా మంచి కెమెరాలను వినియోగిస్తున్నారు.స్టూడియోల్లో డబ్బిం గ్, గ్రాఫిక్ వర్క్స్ కూడా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. సినిమాల నిడివి చిన్నదైనా పెద్దవాటికి ఏమాత్రం తీసి పోకుండా తీస్తున్న షార్ట్‌ఫిల్మ్స్ మేకింగ్ ఇప్పుడు యువత రానికి క్రేజీగా మారుతోంది. అంతిమ లక్ష్యం వెండితెరే.. షార్ట్ ఫిల్మ్స్‌తో హోరెత్తిస్తున్న యువత చివరి లక్ష్యం వెండితెర కు పరిచయం కావడమే. చిన్న చిత్రాలతో వెండితెరకు పరి చయమైన వారిని ఆదర్శంగా తీసుకుని ఇలా యూట్యూబ్ వేదికగా తమ సృజనాత్మకతను బయపెడుతున్నారు. సృజనాత్మకతకు వేదిక.. వెండి తెరపై దర్శకుడిగా మారాలన్న తపనకు ఈ షార్ట్‌ఫిల్మ్స్ ఎంతగానో దోహదం చేస్తున్నాయి. ఈ వేదికగా మాలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయగలుగుతున్నాం. యూట్యూబ్‌లో మేం చేసిన సినిమా లను చూసి చాలామంది ప్రశంసించ డంతో ఉత్సాహం రెట్టింపవుతోం ది. అభిరుచి కలిగిన రంగం లో భవిష్యత్తును వెతుక్కోడానికి ఇదో వేదిక. - కల్యాణ్శ్రీ వర్మ, షార్ట్‌ఫిల్మ్ దర్శకుడు యువతకు ప్రోత్సాహం.. నటనా రంగంలో యువతలో ఉన్న ఉత్సాహానికి నా వంతు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాను. షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి ఎంతో కొంత ఆర్థిక వనరులు అవసరం. అందుకే సారి ఐసిరి ప్రొడక్షన్‌పై పలు షార్ట్‌ఫిల్మ్స్ నిర్మాణం చేపట్టాను. అనేకమంది యువత తమ సృజనాత్మకతను బయటపెట్టుకుంటున్నారు. - శివదత్తసాయి, నిర్మాత, సాయి ఐసిరీ ప్రొడక్షన్ -
వెండితెరపై చూసేది తక్కువే..!
బంపర్‌హిట్ అయినా చూసేది 2శాతమే టీవీల్లో వస్తే మాత్రం ఆ సంఖ్య రెట్టింపు 50% మందికి స్క్రీన్లు అందుబాటులో లేవు చిన్న పట్టణాల్లో థియేటర్లు పెరగాలి మల్టీఫ్లెక్స్ సీఈఓల మాట కొచ్చి: ఒకప్పుడు... సినిమా ఎన్ని రోజులు ఆడితే అంత పెద్ద హిట్ అయినట్లు. మరిప్పుడు...! ఎన్ని రోజులు ఆడిందని కాదు... ఎన్ని సెంటర్లలో ఆడింది... ఎంత వసూలు చేసిందన్నదే కమర్షియల్ హిట్‌కు కొలమానం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే... తొలి వీకెండ్ షేర్‌ను ఏ సినిమా అయితే అధికంగా రాబడుతుందో అది ఇండస్ట్రీ హిట్ల జాబితాలో చేరిపోతోంది. అయితే ఇక్కడొక బేసిక్ విషయాన్ని మరచిపోకూడదు. పెట్టిన పెట్టుబడిని వెనక్కు తీసుకొచ్చి, లాభాలను ఇచ్చే సినిమానే హిట్ సినిమాగా పరిగణిస్తారు. అదీ కథ. నిజానికి సినిమా ఫలితాన్ని నిర్ణయించే అంశాలు క్రమంగా మారుతున్నాయి. ప్రస్తుతం కలెక్షన్లే ఫలితాన్ని శాసిస్తున్నాయి. కాకపోతే ఆ కలెక్షన్లను అందించే ప్రేక్షకులు సినిమా హాళ్లకు వెళ్లి చూస్తున్నది తక్కువేనని, టీవీల్లోనే బాగా చూస్తున్నారనేదే తాజా వార్త. దీనికి ప్రధాన కారణం వారికి అందుబాటులో థియేటర్లు లేకపోవటమేనన్నది మల్టీప్లెక్స్ చైన్ల సీఈఓల మాట. అందుబాటులో ఉంటే వారు కూడా హాళ్లలోనే చూస్తారంటున్నారు కూడా. టీవీల్లో ప్రీమియర్ షోకు రెట్టింపు... ఇటీవల కాలంలో ‘భజరంగీ భాయీజాన్’ సినిమా మంచి హిట్‌ను సొంతం చేసుకుంది. భారత్‌లో రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కానీ ఆ సినిమాను థియేటర్లలో చూసిన ప్రేక్షకుల సంఖ్య మన దేశ జనాభాలో కేవలం 2 శాతమేనని (3.21 కోట్ల మంది) థియేటర్ చైన్ కార్నివాల్ సీఈఓ పి.వి.సునీల్ చెప్పారు. ఇదే సినిమా టీవీలలో గత నెలలో ప్రీమియర్ షోగా వస్తే 7.45 కోట్ల మంది వీక్షించారు. థియేటర్లలో 2 శాతం మంది చూస్తేనే రూ.300 కోట్లు వచ్చిందని, ఈ సంఖ్యను 5 శాతానికి పెంచగలిగితే భారతీయ సినీ పరిశ్రమ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని కార్నివాల్ సినిమాస్‌కు డెరైక్టరుగా కూడా ఉన్న సునీల్ అభిప్రాయపడ్డారు. మార్కెట్ ఉన్నా.. రాబడి అంతంతే.. సినిమాల పంపిణీకి భారత్‌లో భారీ మార్కెట్టే ఉందని కూడా సునీల్ అభిప్రాయపడ్డారు. ‘‘మార్కెట్టే కాదు. ఇక్కడ నిర్మిస్తున్న సినిమాల సంఖ్య కూడా ఎక్కువే. కానీ అధిక వసూళ్లను రాబట్టడంలో మాత్రం మనం విఫలమౌతున్నాం. దీనిక్కారణం ప్రస్తుతం దేశంలో 50 శాతం మంది ప్రజలకు సినిమాలు చూసే సదుపాయాలు అందుబాటులో లేకపోవడమే’’ అని సునీల్ వివరించారు. ‘దేశంలోని మొత్తం థియేటర్లలో మల్టీప్లెక్స్‌ల వాటా కేవలం 15 శాతం. మిగిలినవన్నీ సింగిల్ థియేటర్లే. అమెరికాలో 10 లక్షల మంది జనాభాకు 100 స్కీన్లు అందుబాటులో ఉంటే.. అదే మన దేశంలో 7 స్కీన్లు అందుబాటులో ఉన్నాయి’ అని చెప్పారాయన. చిన్న పట్టణాలే టార్గెట్.. టైర్-2, టైర్-3, టైర్-4 పట్టణాలను లక్ష్యంగా చేసుకుంటే.. ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించవచ్చని సినీపోలిస్ ఇండియా బిజినెస్ హెడ్ దేవాంగ్ సంపత్ అభిప్రాయపడ్డారు. దీంతో సినీ పరిశ్రమ ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. తాము ఇటీవల పాట్నాలో 4 తెరల మల్టీప్లెక్స్‌ను ప్రారంభించామని, ప్రేక్షకుల ఆదరణ బాగుందని తెలియజేశారు. ‘‘చిన్న పట్ట ణాల్లోని ప్రజలు కూడా సినిమా చూడటం కోసం బాగానే వెచ్చిస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ప్రజలు సినిమా చూడాలంటే 50 కిలోమీటర్లమేర ప్రయాణించాల్సి వస్తోంది. వారి దగ్గరికే సినిమా థియేటర్‌ను తీసుకెళ్తే పరిస్థితిలో మార్పు వస్తుంది. ఎందుకంటే భారతీయులు సినిమా చూసేది కేవలం వినోదం కోసమే కాదు. అది వారి సంస్కృతిలో భాగం’’ అన్నారాయన. ప్రేక్షకులను ఆకర్షిస్తున్న టెక్నాలజీ ప్రజలను థియేటర్లకు రప్పించడంలో టెక్నాలజీ కూడా కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు ఏరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈవో, ఏరీస్‌ప్లెక్స్ ఎస్ఎల్ సినిమాస్ చీఫ్ ప్రమోటర్ సోహన్ రాయ్. ‘‘ఈ విషయాన్ని ఇటీవల విడుదలైన బాహుబలి సినిమా నిజం చేసింది. ఈ సినిమా మా 4కే ప్రొజెక్షన్ థియేటర్లలో వరుసగా 15 వారాలు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడిచింది. ప్రేక్షకులు సినిమా చూడటంలో థియేటర్ కూడా తన వంతు పాత్రను పోషిస్తుంది’’ అని వివరించారాయన. -
క్రీడా‘తారలు’
నగరానికి చెందిన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించడం... వీరిలో కొందరి జీవిత విశేషాలు ఒక పూర్తి స్థాయి సినిమాను తలపించే రీతిలో ఉండడం మనకు తెలిసిందే. రన్నింగ్‌లో నేషనల్ ఛాంపియన్ మిల్కాసింగ్ కథతో వచ్చిన ‘భాగ్ మిల్కా భాగ్’తో పాటు బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన హిందీ చిత్రం కూడా విజయవంతమయ్యాయి. దీంతో నగరం వేదికగా ఎదిగిన క్రీడాకారులు కూడా తమ ‘జీవితం’తెరకెక్కాలని కోరుకుంటున్నారు. వీరిలో కొందరిని సినిమా రూపకర్తలే సంప్రదిస్తుండగా... కొంతమంది తామే చొరవ తీసుకుని లైఫ్‘షో’కి సై అంటున్నారు. దీంతో స్పోర్ట్స్స్టార్స్ బయోపిక్స్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. - బయోపిక్స్‌పై స్పోర్ట్స్స్టార్ల ఆసక్తి - ‘అజహర్’ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల - తెరపైకి మరికొందరి జీవితాలు? వెండితెర ఇప్పుడు క్రీడాకారుల జీవిత విశేషాలకు వేదికవుతోంది. క్రీడాతారల జీవిత విశేషాలతో రూపొందిన కథలకు ఆదరణ లభిస్తుండడంతో... మరికొన్ని చిత్రాలు వరుసలోకి వస్తున్నాయి. దీనికి స్టార్ ఆటగాళ్లు సైతం పచ్చజెండా ఊపుతున్నారు. కొందరైతే ఓ అడుగు ముందుకేసి తమ పాత్రలలో ఏ హీరో, హీరోయిన్లు తెరపై కనిపిస్తే బాగుంటుందో సూచిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ క్రికెట్ క్రీడాకారుడు అజహరుద్దీన్ జీవితం తెరపైకి వస్తున్న నేపథ్యంలో...మిగిలిన కథలూ ‘క్యూ’లో ఉన్నాయి. జయాపజయాల సంగతి పక్కన పెడితే ఈ క్రీడాతారల జీవితంలోని ఘట్టాల గురించి తెలుసుకునే అవకాశం ప్రేక్షకులకు దక్కుతోంది. సానియా... ఎవరయా? నగరంలో పుట్టి నాజర్ స్కూల్లో చదివి... తెలుగు రాష్ట్రాల్లో టెన్నిస్ క్రీడకు వెలుగు తెచ్చిన అసమాన క్రీడాకారిణి సానియా మీర్జా. ఆటలో అంతర్జాతీయ కీర్తి గడించిన ఈ సిటీ స్టార్... అందం... ఫ్యాషన్ స్టైల్స్‌తోనూ అందరినీ ఆకట్టుకుంటారు. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్మాలిక్తో ప్రేమ పెళ్లి ద్వారా మీడియాకు కావాల్సినంత మసాలా అందించిన సానియా జీవితం కూడా విశేషాల మయమే. ఎంతో మంది సినిమాల్లో నటించాలనిఅడిగినా ‘నో’ చెప్పిన సానియా... తన జీవిత చరిత్రను సినిమాగా తీయడానికి మాత్రం ఇటీవలే ఓకే చెప్పారు. మరుక్షణం నుంచి తన బయోపిక్ రూపొందించేందుకు టాలీవుడ్, బాలీవుడ్ నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని వినికిడి. సానియా కథతో తీసే సినిమాలో హీరోయిన్గా నటించేందుకు పలువురి పేర్లు ప్రస్తావనకు వస్తుంటే... తన పాత్ర పోషించాలంటే ప్రస్తుత నటీమణుల్లో దీపికా పదుకొనెమాత్రమే సరైన ఎంపిక అని... తన భర్త షోయబ్ పాత్రకు సల్మాన్‌ఖాన్‌ను సూచించడం ద్వారా సానియా ఈ సమస్యకు పరిష్కారం చూపారు. ఇక ఈ బయోపిక్ తెరకెక్కడమే తరువాయి. వెండితెర ‘చంద్’మామ అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చిన బయోపిక్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ది. నగర వాసిగా బ్యాడ్మింటన్ రంగంలో రాణించడం మాత్రమే కాకుండా సైనా నెహ్వాల్ లాంటి నెంబర్‌వన్ క్రీడాకారిణిని తీర్చిదిద్ది... నగరానికి మరిన్ని క్రీడారంగ విజయాలు దక్కేలా చేసిన గోపీచంద్ బయోపిక్ ఇప్పుడు వార్తల్లో అంశం. సూపర్ స్టార్ కృష్ణ మేనల్లుడు, హీరో సుధీర్‌బాబు (ప్రేమ కథా చిత్రం ఫేం) ఈ సినిమాలో గోపీచంద్ పాత్రలో నటి స్తున్నారు. వ్యక్తిగతంగా గోపీచంద్‌కి స్నేహితుడైన సుధీర్‌బాబు... ఈ సినిమా పట్ల అత్యంత ఆసక్తిగా ఉన్నాడని సమాచారం. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం త్వరలోనే పట్టాలకెక్కనుంది. సై... అంటూ.. బ్యాడ్మింటన్ స్టార్‌గానూ, గ్లామర్, స్టైల్స్నూ పండిస్తూ... మన సిటీ వేదికగా రాణిస్తున్న నగర క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సైతం తన బయోపిక్ రూపకల్పనపై ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం వరల్డ్ నెంబర్ వన్‌గా వెలుగొందుతున్న ఈ సిటీ స్టార్... గతంలో బ్యాడ్మింటన్ ఆడిన అనుభవమున్న దీపికా పదుకొనె తన పాత్ర పోషిస్తే బాగుంటుందని... హీరోగా షారూఖ్ తన ఛాయిస్ అంటున్నారు. వ్యక్తిగతంగా తనను కాక బ్యాడ్మింటన్‌ను ప్రమోట్ చేసేలా ఆ సినిమా ఉండాలంటున్న సైనా.. మిగలిన క్రీడా నేపథ్యాల నుంచి వచ్చిన సినిమాల్లా కాక... తన సినిమా తీసేవారికి ఆటలో సాంకేతిక అంశాలపై కూడా పట్టుంటేనే... అది లక్ష్యాన్ని చేరుకుంటుందని అభిప్రాయపడుతున్నారు. అజహర్గా ఇమ్రాన్ మహ్మద్ అజహరుద్దీన్. క్రికెట్ ప్రేమికులు ముద్దుగా అజ్జూ అని పిలుచుకునే మన నగరవాసి. క్రికెట్ క్రీడాకారుడిగా, భార త టీమ్ కెప్టెన్‌గా సాధించిన విజయాలు సాధారణమైనవి కావు. ఇక్కడే పుట్టి... ఇక్కడే చదువుకుని... ఇక్కడే ఎదిగిన ఈ హైదరాబాదీ...ప్రస్తుతం పొలిటీషియన్‌గానూ రాణిస్తున్నారు. టాప్ ఫీల్డర్‌గా ప్రశంసలు... మ్యాచ్ ఫిక్స్‌ర్‌గా ఆరోపణలతో అటు క్రీడా జీవితంలో... పెళ్లి... విడాకులు... సినీ నటితో ప్రేమ... పెళ్లి... మళ్లీ.. విడాకులు... ఎదిగిన కొడుకు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం... ఇలా వ్యక్తిగత జీవితంలోనూ రకరకాల సవాళ్లను ఎదుర్కొన్న అజహర్ కథ... ఒక కలర్‌ఫుల్ సినిమాకు అవసరమైన అద్భుత ముడిసరుకు. ప్రస్తుతం ఏక్తాకపూర్ నిర్మాతగా ‘అజహర్’ పేరుతో రూపొందుతున్న బయోపిక్‌లో హిందీ హీరో ఇమ్రాన్హీష్మి నటిస్తున్నాడు. సంగీతా బిజిలానీతో ప్రేమ వ్యవహారానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ దీన్ని రూపొందిస్తున్నారని సమాచారం. ఇటీవలే దీని ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. -
రికార్డ్ షేక్స్!
రొమాంటిక్ సన్నివేశాలు, కిక్కెక్కించే కథనంతో విడుదలైన ‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో వేడెక్కిస్తోంది. రిలీజైన నాటి నుంచి రికార్డులు బద్దలూ కొడుతూ బాక్సాఫీస్ పంట పండిస్తోంది. ఇదే పేరుతో ఈఎల్ జేమ్స్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఓ కాలేజీ గ్రాడ్యుయేట్, యంగ్ బిజినెస్మ్యాన్ల మధ్య సాగే రిలేషన్‌షిప్‌ను శృంగారభరితంగా బిగ్స్క్రీన్పై ఆవిష్కరించాడు శామ్ టేలర్ జాన్సన్. డకోటా జాన్సన్, జామి డారెన్ నటించిన ఈ సినిమా ఇప్పటి వరకు మొత్తం కలిపి 502 మిలియన్ యూఎస్ డాలర్లు వసూలు చేసిందట. ఇందులో డొమెస్టిక్ 150 మిలియన్ డాలర్లు, అంతర్జాతీయంగా 352 మిలియన్ డాలర్లు కలెక్షన్లు రాబట్టిందట. ఇందుకు ప్రధాన కారణం తారలిద్దరి మధ్యా సూపర్‌గా వర్కవుట్ అయిన కెమెస్ట్రీ. ఎవరికెకరూ తీసిపోనంతగా రొమాంటిక్ సన్నీవేశాల్లో జీవించేశారన్నది సినీ జనుల టాక్. కామెడీ సినిమా ‘టెడ్’ రెండో స్థానంలో కొనసాగుతుంది.