విద్యార్థుల్లో చంద్రయాన్‌ విజయోత్సాహం  | Live broadcast on IFP screens in government schools | Sakshi
Sakshi News home page

విద్యార్థుల్లో చంద్రయాన్‌ విజయోత్సాహం 

Published Thu, Aug 24 2023 3:54 AM | Last Updated on Thu, Aug 24 2023 3:54 AM

Live broadcast on IFP screens in government schools - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌ :  అంతరిక్షంలో సరికొత్త శకాన్ని ఆవిష్కరించి, ప్రపంచంలో చిరస్థాయిగా గుర్తుండిపోయే విజయాన్ని అందుకున్న చంద్రయాన్‌–3 ప్రయాణాన్ని ఆద్యంతం వీక్షించిన వి ద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సాహంలో ము నిగితేలారు. ఈ ఘనతను పాఠశాలల్లో విద్యార్థులు వీక్షించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో బుధవారం సాయంత్రం అన్ని ప్ర భుత్వ పాఠశాలల్లోను అందుకు అవసరమైన ఏర్పాట్లుచేశారు.

ఇటీవల ఉన్నత పాఠశాలలకు ప్రభు త్వం అందించిన ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్లపై చంద్రయాన్‌ మిషన్‌లో భాగమైన ల్యాండర్‌ మాడ్యుల్‌ ప్రయాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో పాటు పలుచోట్ల సాధారణ ప్రజలు సైతం సమీప పాఠశాలల్లో బిగ్‌ స్క్రీన్స్‌పై ఆద్యంతం వీక్షించారు. చంద్రుని దక్షిణ ధృవంపై ల్యాండర్‌ మాడ్యూల్‌ దిగిన వెంటనే సంబరాలు జరుపుకున్నారు.

జయహో భారత్‌ అంటూ నినాదా లు చేశారు. విద్యార్థుల కోసం ప్రత్యక్ష ప్రసార ఏర్పా ట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు విద్యా ర్థులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపా రు. చంద్రుని దక్షిణ ధృవానికి చేరిన మొదటి దేశం మనదైనందుకు గర్విస్తూ, ఇందుకు కృషిచేసిన శాస్త్రవేత్తలకు వారంతా అభినందనలు తెలిపారు. అలాగే.. 

♦ చంద్రయాన్‌–3 విజయోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఏలూరు జిల్లా గణపవరానికి చెందిన స్వర్ణకారుడు పేరూరి కృష్ణ కేవలం 700 మిల్లీగ్రాముల బంగారంతో చంద్రయాన్‌–3 విక్రమ్‌ రోవర్‌ను తయారుచేసి జాతికి అంకితమిచ్చారు. 

♦  చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టడం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారని హోంమంత్రి తానేటి వనిత కొనియాడారు. దేశ పౌరులుగా ప్రతీ ఒక్కరు గర్వించదగిన రోజని కీర్తించారు. ఈ అద్భుత ఆవిష్కరణ చేసిన శాస్త్రవేత్తలందరికీ ఆమె అభినందనలు 
తెలిపారు. 

♦ తిరుపతి రీజనల్‌ సైన్స్‌ సెంటర్‌లో ఏర్పాటుచేసిన ఎల్‌ఈడీ స్క్రీన్‌పై చంద్రయాన్‌–3 ల్యాండింగ్‌ ప్రక్రియను నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు, పెద్ద సంఖ్యలో హాజరై ఆసక్తితో తిలకించారు.

తిరుపతిలోని మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలోనూ ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించిన విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.  ఎస్వీ యూనివర్సిటీ, కేంద్రీయ సంస్కృత విద్యాలయం, వెటర్నరీ విశ్వవిద్యాలయం, అగ్రికల్చరల్‌ కళాశాలల్లోనూ విద్యార్థులు ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. ఇస్రో శాస్త్రవేత్తలకు సలామ్‌ అంటూ పెద్దఎత్తున అభినందనలు తెలిపారు.  

♦ ఇస్రోకి శుభాకాంక్షలు తెలుపుతూ బుధవారం కృష్ణాజిల్లా అవనిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ‘కంగ్రాట్యులేషన్స్‌ ఇస్రో’ ఆకారంలో చేసిన విద్యార్థుల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. చంద్రుడిపై చంద్రయాన్‌–3 దిగిన దృశ్యాలను 860 మందికి పైగా విద్యార్థులు వీక్షించారు.  

మరోవైపు.. భారతదేశ ఖ్యాతిని విశ్వాంతరాలలో సుస్థిరం చేసిన ఇస్రో శాస్త్రవేత్తల కృషిని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అభినందించారు. చంద్రయాన్‌–3 విజయవంతం అవ్వడంపట్ల బుధవారం తన క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకంతో ఆయన ఆనందం వ్యక్తంచేస్తూ ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం  ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుుమడింప చేసిందని కొనియాడారు. ఈ విజయానికి కృషిచేసిన శాస్త్రవేత్తలకు రాష్ట్ర ప్రజలు తరఫున మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.  

♦  ప్రపంచం మొత్తం భారత్‌ వైపు చూస్తోందని వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. చంద్రయాన్‌–3 విజయవంతం కావడం ఖగోళ చరిత్రలో భారతదేశం పేరు సువర్ణాక్షరాలతో లిఖించతగ్గ విషయమన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు జాతిని తలెత్తుకునేలా చేశారని ఆయన కొనియాడారు. 

♦ భారతదేశం అంతా ఈ రోజు గర్వించదగ్గ రోజని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అభివర్ణించారు. యావత్‌ ప్రపంచం భారతదేశ వైపు చూస్తోందని ఆయన కొనియాడారు. ఈ విజయాన్ని అందించిన ఇస్రో శాస్త్రవేత్తలు అందరికీ మంత్రి శుభాభినందనలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement