మనలో చాలామందికి సినిమా చూడటం వ్యసనం. మందు తాగేవాడికి మత్తు ఎక్కితే కిక్ వస్తుంది. సినిమా చూసేవాడికి స్క్రీన్ ఎంత పెద్దగా ఉంటే.. అంత కిక్ వస్తుంది. ఎందుకంటే ఓ యాక్షన్ సీన్ పెద్ద తెరపై చూస్తుంటే అప్పుడు వచ్చే మజా.. బయట ఎక్కడా దొరకదు కదా! అయితే ఐమాక్స్, సూళ్లురుపేటలోని వి-ఎపిక్ స్క్రీన్స్ ఇప్పటివరకు పెద్దవని అనుకున్నాం. కానీ వాటికి బాబు లాంటి స్క్రీన్ త్వరలో అందుబాటులోకి రానుంది. దీని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే మీకు ఫ్యూజులు ఎగిరిపోవడం గ్యారంటీ.
ఈ స్క్రీన్ సంగతేంటి?
సాధారణంగా సినిమా స్క్రీన్ ఓ గోడ ఆకారంలో అంటే స్క్వేర్ షేపులో ఉంటుంది. దాదాపు ఎక్కడ చూసినా సరే ఇలాంటివే ఉంటాయి. కానీ అమెరికాలోని లాస్ వెగాస్‍లో మాత్రం రౌండ్(గోళాకారం) షేపులో బంతిలా ఉండే స్క్రీన్‌ని సిద్ధం చేశారు. ప్రస్తుతం అందరూ దీన్ని రాకాసి స్క్రీన్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే దీని పొడవు, వెడల్పు అలాంటిది మరి.
(ఇదీ చదవండి: బెండు తీసిన 'బిగ్‌బాస్'.. హౌసులో దొంగతనానికి స్కెచ్!)
ఈ స్క్రీన్ ప్రత్యేకతలు
మిగతా వాటి సంగతేమో గానీ ఈ స్క్రీన్ 366 అడుగుల పొడుగు, 516 అడుగుల వెడల్పుతో ఉంది. ఈ థియేటర్ లో ఏకంగా 18,600 మంది ఒకేసారి కూర్చుని సినిమా చూడొచ్చు. ఈ స్క్రీన్ కి తోడుగా 1,60,000 స్పీకర్లు(చిన్నా పెద్దా కలిపి) ఉన్నాయి. మన దగ్గర ప్రస్తుతం 4K రెజుల్యూషన్ ఉంది. ఈ స్క్రీన్‌లో 18K రెజుల్యూషన్‌తో ప్లే అవుతుంది. ఇందులో మూవీ వేయాలంటే.. ఆ ఫైల్ సైజు 5 లక్షల జీబీ(GB) ఉండాల్సిందే.
ఫస్ట్ సినిమా అదే
ఇకపోతే అక్టోబరు 6న 'పోస్ట్ కార్డ్ ఫ్రమ్ ఎర్త్' సినిమాని.. ఈ రాకాసి స్క్రీన్‌పై ప్లే చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీన్ని చూసిన నెటిజన్స్.. వామ్మో అనకుండా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి చోట సినిమా చూస్తే చాలు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి స్క్రీన్ రావాలంటే ఇప్పట్లో అస్సలు సాధ్యం కాదు!
(ఇదీ చదవండి: గ్లామర్ డోస్ పెంచిన నిహారిక... తమన్నా ముద్దులే ముద్దులు)
Comments
Please login to add a commentAdd a comment