Las Vegas
-
అమెరికాలో వరుస దాడులు
వాషింగ్టన్: కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత తొలి 24 గంటల వ్యవధిలోనే అగ్రరాజ్యం అమెరికాలో మూడు భీకర దాడులు జరిగాయి. 16 మంది మరణించారు. పదులు సంఖ్యలో జనం క్షతగాత్రులుగా మారారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం న్యూ ఆర్లియన్స్‌లో జరిగిన దాడిలో 15 మంది మృతి చెందారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రేరణతో ఓ దుండగుడు జనంపైకి వాహనంపై దూసుకెళ్లాడు. తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని హతమార్చారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే లాస్ వెగాస్‌లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ సమీపంలో టెస్లా కారు పేలిపోయింది. ఒకరు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. తర్వాత బుధవారం రాత్రి న్యూయార్క్ నైట్‌క్లబ్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం వాటిల్లలేదు. అయితే, ఈ మూడు ఘటనలకూ పరస్పరం సంబంధం ఉందని, ఇవన్నీ ముమ్మాటికీ ఉగ్రవాద దాడులేనని ప్రజలు అను మానం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయాలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు రెండు ఘటనలను ఉగ్రదాడి కోణంలో విచారణ సాగిస్తుండడం గమనార్హం. జబ్బార్ ట్రక్కులో ఐసిస్ జెండా న్యూ ఆర్లియన్స్‌లోని బార్బన్ వీధిలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న జనంపైకి శంషుద్దీన్ జబ్బార్ అనే వ్యక్తి వాహనంతో దూసుకొచ్చాడు. ఫోర్డ్ ఎఫ్–150 అద్దె ట్రక్కుతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తర్వాత రైఫిల్‌తో జనంపైకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 15 మంది చనిపోగా, 35 మంది గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో జబ్బార్ హతమయ్యాడు. ట్రక్కులో ఐసిస్ జెండాను గుర్తించినట్లు ఎఫ్‌బీఐ అధికారులు చెబుతున్నారు. లాస్ వెగాస్‌లో ట్రంప్ హోటల్ వద్ద టెస్లా కారును పేల్చేసిన వ్యక్తి, జబ్బార్‌కు సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వారిద్దరూ గతంలో ఒకే మిలటరీ స్థావరంలో పనిచేశారు. న్యూ ఆర్లియన్స్ దాడిని ఉగ్రవాద దాడిగానే దర్యాప్తు అధికారులు పరిగ ణిస్తున్నారు. ఎక్కువ మందిని చంపాలన్న ఉద్దేశంతోనే జబ్బార్ దాడి చేశాడని అంటున్నారు. ఐసిస్ తో అతడికి సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో ఎఫ్‌బీఐ గుర్తించినట్లు తెలుస్తోంది. రెండు వాహనాలు ఒకే యాప్ నుంచి.. న్యూ ఆర్లియన్స్ దాడికి ఉపయోగించిన ట్రక్కును, లాస్ వెగాస్ దాడిలో ఉపయోగించిన టెస్లా కారును ‘టూరో యాప్’ నుంచే అద్దెకు తీసుకున్నారు. వాహనంలో బ్యాటరీ వల్ల ఈ పేలుడు జరగలేదని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ధ్రువీకరించారు. కారులో పేలుడు పదార్థాలను అమర్చడం వల్లే అది పేలిందని అన్నారు. కారులో లోపం ఏమీ లేదని స్పష్టంచేశారు. టెస్లా కారు పేలుడు వ్యవహారాన్ని సైతం అధికారులు ఉగ్రవాద దాడి కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. కొలరాడోలోని కొలరాడో స్ప్రింగ్స్‌లో ఈ వాహనాన్ని దుండగుడు అద్దెకు తీసుకున్నాడు. అక్కడ ఆధారాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే, సదరు దుండగుడి పేరును ఇంకా బయటపెట్టలేదు. కానీ స్థానిక మీడియా కథనం ప్రకారం... మాథ్యూ లివెల్స్బర్గర్ అనే ఈ దుండగుడు కొలరాడో స్ప్రింగ్స్ కారును అద్దెకు తీసుకున్నాడు. కారులో తొలుత నెవడాకు చేరుకున్నాడు. అందులో బాణాసంచా, మోర్టార్స్, గ్యాస్ క్యాన్లు అమర్చాడు. అనంతరం లాస్ వెగాస్‌లో ట్రంప్ హోటల్ ఎదుట పేల్చేశాడు.నైట్‌క్లబ్‌లో 30 రౌండ్ల కాల్పులు మూడో ఘటన విషయానికొస్తే న్యూ యార్క్‌లో క్వీన్స్ ప్రాంతంలోని నైట్‌క్లబ్ వద్ద కాల్పులు జరిగాయి. కనీసం 12 మంది గాయపడ్డారు. క్లబ్ బయట వేచి ఉన్న జనంపైకి దాదాపు నలుగురు వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. కనీసం 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి దుండుగులు పరారయ్యారు. -
అనిరుద్‌కు రజతం
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక లాస్ వేగస్ షూట్ అంతర్జాతీయ ఆర్చరీ టోర్నమెంట్లో భారత సంతతి కుర్రాడు పింజల అనిరుధ్ కల్యాణ్ రజత పతకంతో మెరిశాడు. హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ ప్రాంతానికి చెందిన అనిరుధ్ కుటుంబం అమెరికాలో నివసిస్తోంది. లాస్ వేగస్‌లో రెండు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో అమెరికాకు ప్రాతినిధ్యం వహించిన అనిరుధ్ రికర్వ్ కబ్ కేటగిరీ లో పోటీపడి రెండో స్థానంలో నిలిచాడు. అనిరుధ్ మొత్తం 547 పాయింట్లు స్కోరు చేసి రజతం నెగ్గాడు. ఇదే టోర్నీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ స్టార్ వెన్నం జ్యోతి సురేఖ 898 పాయింట్లతో పదో ర్యాంక్‌లో నిలిచింది. -
అబ్బురపరుస్తున్న గ్యాడ్జెట్స్.. ఎప్పుడైనా చూసారా!
లాస్ వేగాస్‌లో అట్టహాసంగా జరుగుతున్న 2024 సీఈఎస్ ఈవెంట్లో అత్యుత్తమ ఉత్పత్తులు కనివిందు చేస్తున్నాయి. ఈ ఈవెంట్లో సాధారణ ఉత్పత్తులకంటే కూడా కొత్త టెక్నాలజీతో అబ్బురపరిచే గ్యాడ్జెట్స్, వెహికల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ కథనంలో ఏఐ (AI) టెక్నాలజీ కలిగిన ఉత్తమ గాడ్జెట్లను గురించి వివరంగా తెలుసుకుందాం. బల్లీ (BALLIE) సీఈఎస్ వేదికపై కనిపించిన ఉత్తమ ఏఐ ఉత్పత్తులలో ఒకటి 'బల్లీ'. శామ్సంగ్ కంపెనీ లాంచ్ చేసిన ఈ గ్యాడ్జెట్ చూడటానికి చిన్న బాల్ మాదిరిగా ఉంటుంది. కానీ పనితీరులో మాత్రం దానికదే సాటి అని చెప్పాలి. నిజానికి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ డివైజ్ అయినప్పటికీ.. ఇంట్లో చాలా పనులు చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. నెల మీద, పైకప్పు మీద కూడా ప్రాజెక్ట్ చేయగల కెపాసిటీ కలిగిన బల్లీ.. ఈవెంట్లో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ గ్యాడ్జెట్ ధర, వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. (Image credit: Future) LG స్మార్ట్ హోమ్ ఏజెంట్ శామ్సంగ్ ఉత్పత్తులకు ఏ మాత్రం తీసిపోకుండా.. LG కంపెనీ కూడా ఓ స్మార్ట్ హోమ్ ఏజెంట్‌ను ఆవిష్కరించింది. లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన ఈ గ్యాడ్జెట్ ఒక స్మార్ట్ హబ్. ఇది ChatGPT వాయిస్‌తో కమ్యూనికేట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా మీ మానసిక స్థితిని పర్యవేక్షించడంలో కూడా ఇది చాలా సహాయపడుతుంది. ఈ ఏఐ రోబోటిక్ ధర కూడా సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. (Image credit: LG) సెగ్వే నవిమో (SEGWAY NAVIMOW) సెగ్వే నవిమో అనేది ఓ రోబోట్ లాన్‌మూవర్స్. నిజానికి రోబోట్ లాన్‌మూవర్స్ ఈ రోజు ఆలోచన కాదు. అయితే సీఈఎస్ వేదికపై కనిపించిన ఈ సెగ్వే నవిమో ఏఐ టెక్నాలజీ కలిగిన గ్యాడ్జెట్. ఇది బ్లేడ్హాల్ట్ సెన్సార్, రెయిన్ సెన్సార్, అల్ట్రాసోనిక్ సెన్సార్, విజన్ఫెన్స్ సెన్సార్ వంటి వాటిని కలిగి ఉంటుంది. అమెరికాలో ఈ గ్యాడ్జెట్ ధరలు అందుబాటులో లేదు కానీ.. యూరప్ మార్కెట్లో 1300 డాలర్ల ప్రారంభ ధర వద్ద లభిస్తోంది. (Image credit: Segway) ఓరో (ORO) శామ్సంగ్, LG గ్యాడ్జెస్ట్స్ కంటే కూడా ఓరో అనేది పెంపుడు జంతువులకు మరింత ఫ్రెండ్లీగా ఉంటుంది.పెద్ద పెద్ద కళ్ళు కలిగిం ఈ పరికరం బంతిని విసరడం, ఆహారాన్ని అందించడం వంటివి చేసేలా రూపొందించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూడా పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూసుకుంటుంది. దీని ధర 799 డాలర్లు. ఏప్రిల్ నుంచి విక్రయానికి రానున్నట్లు సమాచారం. ఇప్పుడు దీనిని 299 డాలర్ల డౌన్‌పేమెంట్‌తో ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. (Image credit: ORo) మొబిన్ (MOBINN) సాధారణంగా గ్యాడ్జెట్స్.. ఇంటి పరిసరాల్లో లేదా ఇంట్లో చదునుగా ఉన్న ప్రాంతాల్లో తిరగటానికి అనుకూలంగా ఉంటాయి. కానీ మొబిన్ అనేది మెట్లను కూడా ఎక్కగలదు. ఫ్లెక్సిబుల్ వీల్స్‌తో కూడిన ఈ రోబోట్ మనం ఆర్డర్ చేసిన వస్తువులను తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. LiDAR-బేస్డ్ మ్యాపింగ్ సిస్టమ్‌ను కలిగిన మొబిన్ వర్షం, మంచు, రాత్రి సమయంలో కూడా పని చేస్తుంది. సంస్థ ఈ గ్యాడ్జెట్ ధర, లాంచ్ డేట్ వంటి వాటిని అధికారికంగా వెల్లడించలేదు. (Image credit: MOBINN) లూనా (LOONA) సాధారణంగా ఎవరైనా తమను ఎంటర్టైన్ చేయడానికి పెంపుడు జంతువులను పెంచుకుంటారు. అయితే లూనా అనే రోబోట్ పెంపుడు జంతువులకు ఏ మాత్రం తీసిపోదు. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ.. ChatGPT ఆధారంగా పనిచేస్తుంది. ఇది కదిలే హోమ్ మానిటర్, ప్రోగ్రామింగ్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌గా పనిచేస్తుంది. దీని ధర 380 డాలర్ల వరకు ఉంటుంది. (Image credit: keyirobot) రోబోట్ వాక్యూమ్ రోబోట్ వాక్యూమ్ అనేది వాయిస్ అసిస్టెంట్, రోబోట్ ఆర్మ్, వీడియో కాలింగ్ ఫంక్షనాలిటీ వంటి వాటిని పొందుతుంది. CES 2024 వేదికగా కనిపించిన అద్భుతమైన గ్యాడ్జెట్లలో ఇది కూడా ఒకటి. మరొక పరికరం అవసరం లేకుండా దీనిని కంట్రోల్ చేయవచ్చు. ఈ పరికరం లోపల ఉండే కెమెరా యజమానికి కాల్ చేయగల కెపాసిటీ కలిగి ఉంటుంది. ఈ రోబోట్ వాక్యూమ్ ధర, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. -
షాకింగ్ ఘటన.. కోర్టులోనే జడ్జిపై దాడి చేసిన నిందితుడు
లాస్ వెగాస్: అమెరికాలోని కోర్టులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బెయిల్ నిరాకరించారన్న కోపంతో నిందితుడు తీర్పు చెబుతున్న జడ్జిమీదకు దూసుకెళ్లి దాడి చేశాడు. ఈ అనూహ్య పరిణామం లాస్ వెగాస్‌లోని కోర్టు హాలులో బుధవారం జరిగింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు కోర్టులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. యూఎస్ వార్తా పత్రిక న్యూయార్క్ పోస్టు ప్రచురించిన వివరాల ప్రకారం.. లాస్ వెగాస్‌లోని క్లార్క్ కౌంటీ డిస్ట్రిక్ కోర్టులో క్రిమినల్ కేసుపై విచారణ జరుగుతోంది. ఈ కేసులో నిందితుడు 30 ఏళ్ల డియోబ్రా రెడెన్కు బెయిల్ ఇచ్చేందుకు మహిళా జడ్జి మేరి కే హోల్ధస్ నిరాకరించారు. అతడిపై ఇప్పటికే అనేక కేసులు ఉన్న నేపథ్యంలో.. మళ్లీ మళ్లీ నేరం చేయకుండా సరైన శిక్ష పడాల్సిందేనని తెలిపారు. దీంతో రెచ్చిపోయిన నిందితుడు ఒక్కసారిగా జడ్జి బెంచ్ వద్దకు దూసుకొచ్చాడు. న్యాయమూర్తి వద్దకు దూకి దాడి చేశాడు. పిడికిలితో పదేపదే కొట్టడంతో సాయం కోసం ఆమె కేకలు వేసింది. Man assaults judge in Las Vegas after probation request denied. pic.twitter.com/Vw5emstedD — Great Clips (@Altaynova) January 3, 2024 ఆమె పక్కనే ఉన్న క్లర్క్, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి అతడిని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే నిందితుడి దాడిలో జడ్జి సహా ఆమె సహాయకుడికి స్పల్పంగా గాయాలయ్యాయి. ఇదంతా నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది. నిందితుడి చర్యతో అక్కడ భయానక పరిస్థితి ఏర్పడింది. అనంతరం నిందితుడిని అరెస్ట్‌చేసి అతడిపై కొత్త నేరారోపణలు మోపి జైలుకు తరలించారు. A man attacked a Clark County judge in court today after she denied his probation. 😬 pic.twitter.com/CkJXj7Tc5a — non aesthetic things (@PicturesFoIder) January 3, 2024 -
ది స్పియర్: 18 వేల మంది లైవ్‌లో సినిమా చూడొచ్చు!
సినిమాలు చూసేందుకు థియేటర్‌కు వెళ్తుంటాం.. 3డీలో చూసే సినిమాల కోసం స్పెషల్ 3డీ గ్లాసెస్ ఇస్తుంటారు. కానీ ఇక్కడ చెప్పుకునే ఓ థియేటర్‌లాంటి వేదికలో మాత్రం ఎటువంటి అద్దాల అవసరం లేకుండానే ఏకంగా 4డీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. లోపలే కాదు బయట కూడా ఈ వేదిక రంగులు వెదజిమ్ముతూ ఆకట్టుకుంటోంది. ప్రపంచంలోనే అతి పెద్ద గోళాకారంలో నిర్మించిన ఈ భవంతి పేరు ద స్పియర్. దీని పై, లోపలి భాగాల్లో విశాలమైన ఎల్ఈడీ స్క్రీన్లను ఫిక్స్ చేశారు. ఎల్ఈడీ స్క్రీన్ల వెలుగులతో భవంతి ఆకర్షణీయంగా కనిపిస్తోంది. లోపల ఏర్పాటు చేసిన తెరమీద ఏదైనా వీడియో ప్లే చేస్తుంటే మనం కూడా ఆ వీడియోలో ఉన్న ప్రదేశంలో ఉన్నామేమో అన్న అనుభూతి కలిగేలా స్క్రీన్ల అమరిక ఉంది. ఈ మధ్యే ఈ స్పియర్‌ను ప్రారంభించగా అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వేదిక అసలు పేరు ఎమ్ఎస్జీ స్పియర్. ఇది అమెరికాలో లాస్ వెగాస్‌కు సమీపంలోని ప్యారడైజ్‌లో ఉంది. ఏదైనా షోలు, కచేరీలు, ఈవెంట్లు జరుపుకోవడానికి ఇది ఎంతో అనువుగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఎంటర్టైన్మెంట్కు పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. స్పియర్‌కు సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు ► పాపులస్ అనే సంస్థ దీని రూపకల్పనకు నడుం బిగించింది. ► దీని ఎత్తు 366 అడుగులు, వెడల్పు 516 అడుగులు. ► 18,600 సీట్ల సామర్థ్యం కలదు. ► వేదిక వెలుపలి భాగంలో 5,80,000 చదరపు అడుగుల ఎల్ఈడీ స్క్రీన్లు ఉన్నాయి. ► వేవ్ఫీల్డ్, సింథసిస్ టెక్నాలజీతో ఉన్న స్పీకర్స్.. 16కె రిజల్యూషన్ స్క్రీన్ క్వాలిటీ, 4డీ ఎఫెక్స్ట్ దీని ప్రత్యేక స్పెషాలిటీ. ► ఈ వేదికను నిర్మించడానికి అయిన ఖర్చు 2.3 బిలియన్ డాలర్స్ (భారతదేశ కరెన్సీ ప్రకారం రూ.19 వేల కోట్ల పైమాటే) The inside of the Sphere is equally as impressive as the outside! 👏🏼😮🐟 pic.twitter.com/pmmzRXgvzX — H0W_THlNGS_W0RK (@HowThingsWork_) October 17, 2023 View this post on Instagram A post shared by U2 (@u2) View this post on Instagram A post shared by Sphere (@spherevegas) View this post on Instagram A post shared by Sphere (@spherevegas) చదవండి: శుభశ్రీ అవుట్.. రతిక రోజ్‌కు గోల్డెన్ ఛాన్స్.. ఎలా వాడుకుంటుందో.. -
అతిపెద్ద సినిమా స్క్రీన్.. ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ పోద్ది!
మనలో చాలామందికి సినిమా చూడటం వ్యసనం. మందు తాగేవాడికి మత్తు ఎక్కితే కిక్ వస్తుంది. సినిమా చూసేవాడికి స్క్రీన్ ఎంత పెద్దగా ఉంటే.. అంత కిక్ వస్తుంది. ఎందుకంటే ఓ యాక్షన్ సీన్ పెద్ద తెరపై చూస్తుంటే అప్పుడు వచ్చే మజా.. బయట ఎక్కడా దొరకదు కదా! అయితే ఐమాక్స్, సూళ్లురుపేటలోని వి-ఎపిక్ స్క్రీన్స్ ఇప్పటివరకు పెద్దవని అనుకున్నాం. కానీ వాటికి బాబు లాంటి స్క్రీన్ త్వరలో అందుబాటులోకి రానుంది. దీని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే మీకు ఫ్యూజులు ఎగిరిపోవడం గ్యారంటీ. ఈ స్క్రీన్ సంగతేంటి? సాధారణంగా సినిమా స్క్రీన్ ఓ గోడ ఆకారంలో అంటే స్క్వేర్ షేపులో ఉంటుంది. దాదాపు ఎక్కడ చూసినా సరే ఇలాంటివే ఉంటాయి. కానీ అమెరికాలోని లాస్ వెగాస్‌లో మాత్రం రౌండ్(గోళాకారం) షేపులో బంతిలా ఉండే స్క్రీన్‌ని సిద్ధం చేశారు. ప్రస్తుతం అందరూ దీన్ని రాకాసి స్క్రీన్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే దీని పొడవు, వెడల్పు అలాంటిది మరి. (ఇదీ చదవండి: బెండు తీసిన 'బిగ్‌బాస్'.. హౌసులో దొంగతనానికి స్కెచ్!) ఈ స్క్రీన్ ప్రత్యేకతలు మిగతా వాటి సంగతేమో గానీ ఈ స్క్రీన్ 366 అడుగుల పొడుగు, 516 అడుగుల వెడల్పుతో ఉంది. ఈ థియేటర్ లో ఏకంగా 18,600 మంది ఒకేసారి కూర్చుని సినిమా చూడొచ్చు. ఈ స్క్రీన్ కి తోడుగా 1,60,000 స్పీకర్లు(చిన్నా పెద్దా కలిపి) ఉన్నాయి. మన దగ్గర ప్రస్తుతం 4K రెజుల్యూషన్ ఉంది. ఈ స్క్రీన్‌లో 18K రెజుల్యూషన్‌తో ప్లే అవుతుంది. ఇందులో మూవీ వేయాలంటే.. ఆ ఫైల్ సైజు 5 లక్షల జీబీ(GB) ఉండాల్సిందే. ఫస్ట్ సినిమా అదే ఇకపోతే అక్టోబరు 6న 'పోస్ట్ కార్డ్ ఫ్రమ్ ఎర్త్' సినిమాని.. ఈ రాకాసి స్క్రీన్‌పై ప్లే చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీన్ని చూసిన నెటిజన్స్.. వామ్మో అనకుండా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి చోట సినిమా చూస్తే చాలు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి స్క్రీన్ రావాలంటే ఇప్పట్లో అస్సలు సాధ్యం కాదు! (ఇదీ చదవండి: గ్లామర్ డోస్ పెంచిన నిహారిక... తమన్నా ముద్దులే ముద్దులు) View this post on Instagram A post shared by Darren Aronofsky (@darrenaronofsky) -
హార్ట్ ఎటాక్ రెస్టారెంట్.. ఫుడ్ తింటే నిజంగానే గుండెనొప్పి వస్తుందేమో!
ఈమధ్యకాలంలో రెస్టారెంట్ బిజినెస్‌కి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో ట్రెండ్‌కు తగ్గట్లు కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు హోటల్ నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. డిఫరెంట్ థీమ్స్‌తో,క్యాచీ నేమ్స్‌తో వ్యాపారాన్ని బాగా విస్తరిస్తున్నారు. అయితే అమెరికాలోని ఓ రెస్టారెంట్ పేరు వింటే మాత్రం మీకు గుండెదడ వచ్చేస్తుంది. ఎందుకంటే, ఆ రెస్టారెంట్ పేరు హార్ట్ ఎటాక్. పేరుకు తగ్గట్లే హాస్పిటల్ థీమ్ మొత్తం హాస్పిటల్ మాదిరి ఉంటుంది. మరి ఈ వెరైటీ రెస్టారెంట్ ఎక్కడ ఉంది? ఎలాంటి వెరైటీ ఫుడ్ ఐటెమ్స్ అక్కడ దొరుకుతాయి అన్నది ఇప్పుడు చూద్దాం. ఇప్పటివరకు రకరకాల వెరైటీ రెస్టారెంట్ పేర్లను విన్నాం, చూశాం. కానీ ఈ రెస్టారెంట్ పేరు వింటేనే గుండెనొప్పి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ రెస్టారెంటపేరు హార్ట్ ఎటాక్ రెస్టారెంట్. అక్కడి ఫుడ్ ఐటెమ్స్ తింటే నిజంగానే మీకు హార్ట్ ఎటాక్ వస్తుందేమో. ఇక్కడ దొరికే బైపాస్ బర్గర్లు తింటే ఏకంగా 10వేల క్యాలరీల శక్తి లభిస్తుంది. బైపాస్ బర్గర్ అంటే ఒకదానిపై మరొకటి పెడుతూ వాటిలో ఉంచే పదార్థాల మోతాదును కూడా పెంచుకుంటూ పోతారు. కేవలం బర్గర్లు మాత్రమే కాదు, అక్కడ దొరికే ప్రతీ ఫుడ్ ఐటెంలో కొవ్వు అతిగానే ఉంటుంది. 2005లో జాన్ బాసో అనే వ్యక్తి ఈ ''హార్ట్ ఎటాక్ గ్రిల్'' రెస్టారెంట్‌ను ప్రారంభించగా వెరైటీగా ఉండటంతో కొద్ది నెలల్లోనే ఈ రెస్టారెంట్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక ఈ రెస్టారెంట్ లోపలికి వెళ్లగానే రెస్టారెంట్‌కి వచ్చామా? లేక హాస్పిటల్‌కి వచ్చామా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే కస్టమర్స్ పేషెంట్స్‌లా గౌనులు వేసుకొని వెళ్లాలనే రూల్ ఉంది. ఇక అక్కడి వెయిటర్స్ నర్సులు, డాక్టర్లుగా డ్రెస్ చేసుకుంటారు. అంతేకాకుండా కస్టమర్లు ఇచ్చే ఆర్డర్స్‌ను ‘ప్రిస్క్రిప్షన్’ అంటారు. ఒకవేళ ఆర్డర్ చేశాక ఫుడ్ ఐటెమ్స్ తినకపోతే మీకు శిక్ష కూడా ఉంటుంది. అదేంటంటే నర్సులు వచ్చి సరదాగా బెల్ట్‌తో కొడతారట. ఇవన్నీ వింటుంటే..పిచ్చోళ్ల గురించి వినడమే కాదు.. చూడటం ఇదే మొదటి సారి అన్నట్లు ఉంది కదా. ఈ రెస్టారెంట్లో మరో వింత ఏమిటంటే 350 పౌండ్ల కన్నా అధిక బరువున్న వాళ్లకు ఎంత తింటే అంత ఫుడ్ ఫ్రీగా పెడతారట. View this post on Instagram A post shared by Heart Attack Grill (@heartattackgrill) View this post on Instagram A post shared by Heart Attack Grill (@heartattackgrill) View this post on Instagram A post shared by Heart Attack Grill (@heartattackgrill) అయితే కస్టమర్ల ఆరోగ్యాన్ని హానిచేసేలా విపరీతమైన జంక్‌ను ఎంకరేజ్ చేసేలా ఈ రెస్టారెంట్ ఉందని పలువురు విమర్శిస్తున్నారు. దీంతో తరచూ ఈ రెస్టారెంట్ వార్తల్లో నిలుస్తుంది. అయితే అక్కడ తినడం వల్ల ఆరోగ్యానికి హానీ అని తెలిసినా కస్టమర్ల సంఖ్య మాత్రం రోజురోజుకీ పెరుగుతూనే ఉండటం మరో విశేషం. -
అతి పెద్ద గోళం.. మినుమిట్లు గొలిపే ఎల్ఈడీల మాయాజాలం (ఫొటోలు)
-
ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ ఆవిష్కారం: ఎక్కడో తెలుసా? వైరల్వీడియో
లాస్ వెగాస్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఈడీ గోళం ఆకర్షణీయంగా నిలుస్తోంది. వేగాస్ స్కైలైన్‌లో ఎల్ఈడీ లైట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో స్క్రీన్ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఎంఎస్‌జీ స్పియర్ అని పిలుస్తున్న ఈ కొత్త ఆవిష్కారం సిన్ సిటీకి కొత్త అందాలతోపాటు సరికొత్త కీర్తిని తెచ్చిపెట్టింది. కొత్త పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది. పర్యాటకులు 366 అడుగుల ఎత్తైన గోళాన్ని విస్మయంతో వీక్షించారు. లాంతరు, భూమి సహా భారీ ఐబాల్, బాస్కెట్‌బాల్, స్నో గ్లోబ్, జాక్-ఓ వంటి అనేక మెస్మరైజింగ్ డిస్ప్లేలు ఉన్నాయి. The new sphere in Las Vegas is the coolest building I’ve ever seen. It features 580K square feet of fully-programmable LED lighting to produce life-like images visible from miles away. And the story behind it is wilder than the videos it creates: A THREAD 1/16 pic.twitter.com/UO7FPJK2CN — Aakash Gupta 🚀 Product Growth Guy (@aakashg0) July 9, 2023 బౌల్-ఆకారంలో 366 అడుగుల పొడవు , 516 అడుగుల వెడల్పుతో ప్రపంచంలో అత్యధిక రిజల్యూషన్ ర్యాప్‌రౌండ్ ఎల్ఈడీ స్క్రీన్‌ను రూపొందించారు. దాదాపు 1.2 మిలియన్ LED పుక్లతో రూపొందించబడిం 580,000-చదరపు అడుగులతో ప్రోగ్రాం చేసిన ఈ ఎక్సోస్పియర్ గ్లోబులో 48 వ్యక్తిగత LED డయోడ్లు ఉంటాయి. ఇది 256 మిలియన్ విభిన్న రంగులను ప్రదర్శిస్తుంది. అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఈడీ డిస్ప్లే భూమి, మార్స్ చంద్రుడిగా మారిపోతుంది. స్పేస్షిప్లాగా, అంతరిక్షం నుండి భూమిలా మెరిసిపోతుంది. గ్లోబల్ ఆర్కిటెక్చర్ సంస్థ ఎంఎస్‌జీ దీన్ని తయారు చేసింది. ఈ బిగ్గెస్ట్ ఐ బాల్ కోసం ఎంఎస్‌జీ 2.3 బిలియన్ డాలర్లను ఖర్చు చేసిందట. తన 40 ఏళ్ల సర్వీసులోఇంతటి అద్భుతాన్ని చూడలేదని స్పియర్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ రిచ్ క్లాఫీ కెప్పారు. నెవాడాలోని లాస్ వెగాస్‌లో( జూలై 04, 2023న) స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా ఇది సందడి చేసింది. సెప్టెంబర్ 29న అధికారికంగా లాంచ్‌కానుందని భావిస్తున్నారు. -
'లైగర్' సినిమా ఎమ్ఎంఏ ఫైట్.. క్రూరమైన క్రీడ నుంచి ఆదరణ దిశగా
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా సినిమా ''లైగర్'' ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమా ఫలితం సంగతి పక్కనబెడితే.. ఈ సినిమా ఎంఎంఏ ఫైట్(మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్) నేపథ్యంలో తెరకెక్కింది. మన దేశంలో చాలా మంది ఎంఎంఏ అంటే తెలిసి ఉండకపోవచ్చు. మార్షల్ ఆర్ట్స్ తెలిసినవాళ్లకు మాత్రమే ఈ క్రీడపై కాస్త అవగాహన ఉంటుంది. చాలా మందికి తెలియని ఎంఎంఏ క్రీడ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. -సాక్షి,డెబ్డెస్క్ photo credit : Getty Images ఎంఎంఏ ఫైట్(మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్) అనేది ఒక హైబ్రిడ్ యుద్ధ క్రీడ. బాక్సింగ్, రెజ్లింగ్, జడో, కరాటే, థాయ్ బాక్సింగ్ వంటి క్రీడల నుంచి తీసుకున్న కొన్ని టెక్నిక్స్‌తో ఎంఎంఏను రూపొందించారు. అయితే ఎంఎంఏ రూపొందించిన తొలి రోజుల్లో ఎలాంటి నిబంధనలు పెట్టకపోవడంతో అత్యంత క్రూరమైన క్రీడగా చాలా మంది పేర్కొన్నారు.కానీ కాలక్రమంలో ఎంఎంఏ ఆ చెడ్డ పేరు నుంచి బయటపడి ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక మంది ప్రేక్షకులు వీక్షిస్తున్న క్రీడగా ఆదరణ పొందుతుండడం విశేషం. photo credit : Getty Images చరిత్ర తిరగేస్తే క్రీస్తూ పూర్వమే ఎంఎంఏ గేమ్‌ను ఒలింపిక్స్‌లో ఆడారని ప్రచారంలో ఉంది. ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు. మనకు తెలిసి 20వ శతాబ్దంలో బ్రెజిల్ లోని వాలే ట్యూడో ద్వారా ఎంఎంఏ గేమ్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. కార్లో, హెలియో అనే ఇద్దరు సోదరులు నార్త్ అమెరికాలో ఈ గేమ్‌కు బాగా పాపులారిటీ తీసుకొచ్చారు. వాళ్లే ఈ టోర్నమెంట్ కు యూఎఫ్‌సీ(UFC)-అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ షిప్ అని పేరు పెట్టారు.అయితే ఈ ఎంఎంఏ(మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్)పై అమెరికా సహా చాలా దేశాల్లో ఆంక్షలు ఉన్నాయి. ఎంఎంఏ మ్యాచ్‌ల్లో విజయాలను సబ్మిషన్, నాకౌట్, టెక్నికల్ నాకౌట్, న్యాయనిర్ణేతల ద్వారా నిర్ణయిస్తుంటారు. photo credit : Getty Images ఎంఎంఏ ఆట.. కఠిన నిబంధలు ►దశ దిశ లేకుండా సాగుతున్న ఎంఎంఏ ఆటకు యూఎఫ్‌సీ(అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్) కొన్ని స్థిరమైన నిబంధనలు, రూల్స్ తీసుకొచ్చింది. ఆ నిబంధనలు, రూల్స్ ఏంటనేవి ఇప్పుడు చూద్దాం ►రింగ్‌లోకి వెళ్లే ఆటగాళ్లు ప్యాడ్స్ ఉన్న ఫింగర్‌లెస్ గ్లౌజులతోనే పోరాడాలి ►బూట్లు వేసుకోకూడదు.. తలకు ఎటుంటి సేఫ్‌గార్డ్స్ పెట్టుకోకూడదు. ►ప్రత్యర్థి ఆటగాడి కంట్లో పొడవడం, కొరకడం, జట్టు లాగడం, తలతో కొట్టడం వంటివి పూర్తిగా నిషేధం. photo credit : Getty Images ఎంఎంఏలో యూనిఫైడ్ రూల్స్ కింద ఒక్కో రౌండు ఐదు నిమిషాల చొప్పున మూడు రౌండ్లు పోరాడాల్సి ఉంటుంది. ఒక్కో రౌండు ముగిసిన తర్వాత ఒక నిమిషం విశ్రాంతినిస్తారు. అదే చాంపియన్‌షిప్ బౌట్స్‌లో ఐదు రౌండ్లు ఉంటాయి. ప్రత్యర్థిని నాకౌట్ చేయడం, సబ్మిషన్(ప్రత్యర్థిని ఓటమి ఒప్పుకునేలా చేయడం) ద్వారా గెలుపును నిర్ణయిస్తారు. ఒకవేళ ఇద్దరు ఆటగాళ్లు సమంగా పోరాడితే మాత్రం.. ఇద్దరిలో విజేత ఎవరనేది ప్యానెల్ నిర్ణయిస్తుంది. photo credit : Getty Images ఇక అమెరికాలోని నెవడా రాష్ట్రంలోని లాస్వేగాస్లో ఉన్న యూఎఫ్‌సీ ఎంఎంఏకు ప్రధాన సంస్థ. ప్రతీ ఏడాది వివిధ స్థాయిల్లో యూఎఫ్‌సీ ఎంఎంఏ విభాగంలో ఈవెంట్లు నిర్వహిస్తూ వస్తోంది. అందుకే విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా సెకండాఫ్ మొత్తం లాస్వేగాస్లో షూటింగ్ జరుపుకుంది. చదవండి: 'లైగర్' బాక్సాఫీస్ కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ పడిన మౌత్ టాక్ Stuart Broad: ముప్పతిప్పలు పెట్టి తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు.. -
విడాకులు కావాలని అడిగిన భార్య.. కత్తితో 30 సార్లు పొడిచిన భర్త
వాషింగ్టన్: అమెరికా లాస్ వేగాస్‌లో ఓ వ్యక్తి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. విడాకులు కావాలని అడిగిన భార్యపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. కత్తితో 30 సార్లు పొడిచి కిరాతక చర్యకు పాల్పడ్డాడు. శనివారం ఈ ఘటన జరిగింది. నిందితుడు క్లిఫర్డ్ జాకబ్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం కోర్టులో హాజరుపరుచనున్నారు. భార్య వచ్చి విడాకులు కావాలని అడిగిన తర్వాత తన మైండ్ బ్లాంక్ అయిందని నిందితుడు చెప్పాడు. ఏం చేశానో కూడా తనకు గుర్తులేదని పేర్కొన్నాడు. తాను మళ్లీ తేరుకునే సరికి ఆమె రక్తపుమడుగులో ఉన్నట్లు పోలీసులకు వివరించాడు. నిందితుడి ఇంట్లో ఐదు కత్తులు, రక్తపు మరకలు ఉన్న కత్తెర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. క్లిఫర్డ్ తన భార్యను పొడిచానని, ఆమె చనిపోయిందేమోనని మాట్లాడటం విన్నట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. ఈ ఘటనలో భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె మొహం, మెడపై కత్తిపోట్లున్నాయి. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయంపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు. టెక్సాస్‌లో మే నెలలోనూ విడాకులు అడిగిందని ఉగ్రవాదిలా మారాడు ఓ భర్త. కోర్టు ఆవరణలోనే భార్య, కూతురు, అత్తను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చదవండి: ఆప్ కౌన్సిలర్‌ను అతి సమీపం నుంచి కాల్చి చంపిన దుండగుడు.. జిమ్ చేస్తుండగా దాడి.. -
Las Vegas: రన్ వేపై రెండు విమానాలు ఢీ.. నలుగురు మృతి
వాషింగ్టన్: అమెరికాలోని ఉత్తర లాస్ వేగస్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. రన్‌వే పై రెండు చిన్న విమానాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో విమానాల్లోని మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం సమయంలో జరిగినట్లు ఫెడరల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. సింగిల్ ఇంజిన్ పైపర్ పీఏ-46, సింగిల్ ఇంజిన్ సెస్నా 172లు ఢీకొన్నాయని తెలిపారు. 'ప్రాథమిక సమాచారం ప్రకారం.. సింగిల్ ఇంజిన్ పైపర్ పీఏ-46 విమానాశ్రయంలో దిగేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే రన్ వేపై సెస్నా 172ను ఢీకొట్టింది. దాంతో పైపర్ పీఏ 46 రన్ వే 30కి తూర్పు వైపు పడిపోయింది. సెస్నా సమీపంలోని నీటి కుంటలో పడింది.' అని ఎఫ్ఏఏ ఓ ప్రకటన విడుదల చేసింది. ఒక్కో విమానంలో ఇద్దరు ఉండగా.. మొత్తం మంది మరణించినట్లు సిటీ అగ్నిమాపక విభాగం తెలిపింది. ఇదీ చదవండి: America Indiana City: ఇండియానా షాపింగ్ మాల్లో కాల్పులు.. ముగ్గురి మృతి.. దుండగుడి హతం -
మిసెస్ వరల్డ్ 2022 కంటెస్టెంట్
అందాల పోటీలు పెళ్లికాని యువతులకే అనే పేరుంది. కానీ, పెళ్లయి, బిడ్డలున్నా తమ ఘనతను చాటేలా మిసెస్ ఇండియా, మిసెస్ వరల్డ్ పోటీలూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 15న అమెరికాలోని లాస్ వెగాస్‌లో ‘మిసెస్ వరల్డ్–2022’ వివాహిత మహిళల కోసం సరికొత్త శైలిలో జరగనుంది. 80 దేశాల నుంచి అందమైన శ్రీమతులు ఈ పోటీలో పాల్గొనబోతున్నారు. భారత దేశం నుంచి నవదీప్ కౌర్ ప్రాతినిధ్యం వహిస్తోంది. మిసెస్ ఇండియా వరల్డ్ (2020–21లో) విజేతగా నిలిచిన 38 ఏళ్ల నవదీప్ కౌర్ ఒడిశాలోని సుందర్‌గడ్ జిల్లా స్టీల్ హబ్‌లో పుట్టి పెరిగింది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. స్టీల్ హబ్ నుండి మిసెస్ ఇండియా వరల్డ్‌గా మారే వరకు నవదీప్ ప్రయాణం వివాహిత మహిళలను చైతన్యపరిచే దిశగా కొనసాగుతోంది. వ్యక్తిత్వ వికాస కోచ్ నవదీప్ కౌర్‌కి పెళ్లయి ఏడేళ్లు. ఐదేళ్ల కూతురు ఉంది. ఆరేళ్లుగా పాఠశాల స్థాయి విద్యార్థులకు చదువులో శిక్షణా తరగతులు తీసుకుంటుంది. కొటక్‌మహీంద్రా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించింది. అటు తర్వాత హెచ్ఆర్, మార్కెటింగ్ గ్రాడ్యుయేషన్ కోసం మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేయడం ప్రారంభించింది. ప్రస్తుతం వ్యక్తిత్వ వికాస కోచ్‌గా ఎంతోమందిని ప్రభావితం చేస్తోంది. దేశం గర్వించేలా కృషి కిందటేడాది మిసెస్ ఇండియా వరల్డ్ టైటిల్‌ను గెలుచుకున్నప్పటి నుండే నవదీప్ మిసెస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘నా చిన్ననాటి నుంచి ప్రపంచపటంలో మన దేశాన్ని నేను సైతం గొప్పగా చూపించాలనుకునేదాన్ని. అందుకోసం ప్రతి విభాగంలో పనిచేయడానికి ప్రయత్నిస్తూ వస్తున్నాను’ అని తన జీవిత కల గురించి వివరిస్తుంది నవదీప్ కౌర్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లేడీస్ సర్కిల్ ఇండియా, రూర్కెలా సిటీ లేడీస్ సర్కిల్‌తో అనుబంధం కలిగి ఉన్న నవదీప్ కౌర్ ఈ ప్రపంచాన్ని అందరూ జీవించడానికి మెరుగైన ప్రదేశంగా మార్చలన్న ఆకాంక్షనూ వెలిబుచ్చుతుంది. మిసెస్ వరల్డ్ పోటీలలో పాల్గొనడానికి వెళ్లిన నవదీప్ కౌర్‌కు ఈ సందర్భంగా ఆల్ ద బెస్ట్ చెబుదాం. గ్రాండ్ ఫినాలేను భారత కాలమానప్రకారం జనవరి 16న ఉదయం 6:30 గంటలకు ఆన్లైన్ ద్వారా చూసి, తెలుసుకోవచ్చు. -
సోనీ సంచలన ప్రకటన.. ఇక ఈవీ కార్లు కూడా!
జపాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆటోమొబైల్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ప్రకటించింది. అదీ ప్రపంచంలో శరవేగంగా వృద్ధిచెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి అడుగుపెడుతున్నట్లు పేర్కొంది. ఇంతకాలం ఎంటర్టైన్మెంట్ రంగంతో అలరించిన సోనీ కంపెనీ.. ఇప్పుడు ఈవీ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. అమెరికా లాస్‌వెగాస్‌లో బుధవారం నుంచి(జనవరి 5 నుంచి 8వ తేదీ వరకు) సీఈఎస్ టెక్నాలజీ ట్రేడ్ ఫెయిర్ జరగనుంది. ఈ నేపథ్యంలో న్యూస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన సోనీ గ్రూప్ చైర్మన్-ప్రెసిడెంట్ కెనిచిరో యోషిదా స్వయంగా ఈవీ ఎంట్రీ ప్రకటన చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ఓ కొత్త కంపెనీతో ముందుకు రానున్నట్లు.. ఆ కంపెనీ పేరును ‘సోనీ మొబిలిటీ ఇన్కార్పోరేషన్’గా ప్రకటించారు. అంతేకాదు Vision-S 02 పేరుతో ఎస్‌యూవీల ప్రొటోటైప్‌ను సైతం ప్రదర్శించారు. ఈ కంపెనీని ఆలస్యం చేయకుండా ఈ ఏడాదిలోనే లాంఛ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈవీ వెహికిల్స్ ప్రకటన తర్వాత సోనీ షేర్ల ధరలు 4 శాతం పెరిగాయి. ఇదిలా ఉంటే సోనీ ఇదివరకే తర్వాతి తరం వాహనాల తయారీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో ఆడియో, వినోదాత్మక వ్యవస్థలను అందిస్తోంది కూడా. ఇప్పటికే పలు టెక్ దిగ్గజ కంపెనీలు ఈవీ మార్కెట్ ప్రకటనలు చేయగా.. Sony ఏకంగా నమునా మోడల్స్‌ను ప్రదర్శించడంతో పాటు ఆలస్యం చేయకుండా Sony Ev కంపెనీ పనులు మొదలుపెడుతుండడం విశేషం. చదవండి: కొత్త రకం టెస్ట్‌డ్రైవ్.. మన దేశంలోనే! -
అవునంటారా? దెయ్యంగారేనంటారా!
అనగనగా లాస్ వేగస్‌లో (యూఎస్)లో ఒక బామ్మ. ఈ బామ్మకు ఒక కొడుకు. అతడికి ఇద్దరు పిల్లలు. ఇప్పటివరకు బానే ఉంది. అయితే బామ్మ మనవడు, మనవరాలు తమ గదిలో అర్ధరాత్రి దాటిన తరువాత నిద్రలోనే ఎవరితోనో మాట్లాడుతున్నారట. మొదట కల కావచ్చు అనుకున్నారట. కానీ పదే పదే పిల్లలు నిద్రలో మాట్లాడుతుండడంతో ఆ గదిలో మోషన్ యాక్టివేటెడ్ కెమెరాను సెట్ చేశారు. రెండు మూడురోజుల తరువాత ఈ కెమెరాను పరిశీలించగా తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఒక ఆకారం కనిపించింది. పిల్లలు ఎవరో ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నట్లే మాట్లాడుతున్నారట గానీ భయపడడం లేదట. ఒకరోజు అయితే ఈ ఆకారం ‘బయటికి వెళ్లండి’ అని పిల్లలను గట్టిగా గద్దించిందట. బామ్మ ఈ అనుభవాన్ని ఫొటోతో సహా ఫేస్బుక్లో షేర్ చేసింది. సలహా ఇవ్వమని అడిగింది. ‘మూఢనమ్మకాలను వదలండీ’ ‘మీరేదో భ్రమల్లో ఉన్నారు’ ‘ఫేక్ ఇమేజ్’ లాంటి తిట్లతో పాటు– ‘ఇల్లు అమ్మేసి వేరే ఇంట్లోకి మారండి. 20 సంవత్సరాల ఇంట్లోకి దెయ్యాలు రావడం కొత్తేమీ కాదు’ లాంటి సలహాలు కూడా వచ్చాయి. ఒక ఆకారం ఏదో కనిపిస్తున్న ఫొటో గురించి ప్రస్తావన వస్తే–‘ఫేక్ ఫొటోలు సృష్టించే టెక్నికల్ నాలెడ్జ్ నాకు లేదని ఎవరిని అడిగినా చెబుతారు. పబ్లిసిటీ కోసం పాకులాడాల్సిన ఖర్మ నాకేమిటి!’ అంటోంది బామ్మ. నిజం దెయ్యమెరుగు! చదవండి: విమానంలో పిచ్చి చేష్టలు.. 20 ఏళ్ల జైలు, 2 కోట్ల జరిమానా! -
ఆస్తి 5 మిలియన్ డాలర్లు.. కానీ తినేది..
వాషింగ్టన్: ఎడమ చేత్తో కాకిని తోలరు... పిల్లికి బిచ్చం కూడా వేయరు.. సాధారణంగా పిసినారుల గురించి చెప్పేటప్పుడు ఇలాంటి సామెతలు వాడతారు. కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయే మహా పిసినారి.. పిల్లికి బిచ్చం వేయదు సరికదా ఆ పిల్లి తినే ఆహారాన్నే తాను తింటుంది. అంతేకాదు ఇంటికి వచ్చిన అతిథులకు సైతం అదే వడ్డిస్తుంది. పాపం.. ఆమె పేదవారేమో అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఆమె ఒక మల్టీ మిలియనీర్. ఆస్తి విలువ సుమారు 5.3 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 38 కోట్లు). కానీ ఒక్క పైసా కూడా వృథా చేయడం ఆమెకు ఇష్టం ఉండదు. వెయ్యి డాలర్లతో నెల మొత్తం గడిపేస్తుంది. వాషింగ్ స్క్రబ్ పీలికలు అయ్యేంత వరకు ఉపయోగిస్తుంది. వంటగదిలో ఒక్క కత్తి మాత్రమే వాడుతుంది. తనను తాను చీపెస్ట్ మల్టీ మిలియనీర్‌గా చెప్పుకొనే అమీ ఎలిజబెత్ వ్యవహారశైలి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘‘22 నిమిషాలు కాగానే వాటర్ హీటర్‌ను ఆఫ్ చేసేస్తా. అంతకు మించి క్షణం కూడా ఆలస్యం చేయను. ఎందుకంటే నీళ్లు ఎంత వేడెక్కితే నా స్నానానికి సరిపోతాయో నాకు బాగా తెలుసు. దీంతో నాకు 80 డాలర్లు ఆదా అవుతాయి. అంతేకాదు నేను క్యాట్ ఫుడ్ తీసుకుంటాను. నా ఇంటికి వచ్చేవారికి కూడా అదే పెడతాను. తద్వారా కిరాణా బిల్లు తగ్గిపోతుంది. ’’ అని అమెరికాలోని లాస్ వేగాస్‌కు చెందిన అమీ టీఎల్సీతో మాట్లాడుతూ తన జీవన విధానం గురించి చెప్పుకొచ్చారు.(చదవండి: పాతిపెట్టిన పిల్లిని తీసి కూర వండేసింది!) అంతేకాదు పాత వస్తువులతోనే కాలం నెట్టుకొస్తానని, తద్వారా కొత్తవి కొనేందుకు ఏటా అవసరమయ్యే సుమారు 2 లక్షల డాలర్లు ఆదా అవుతాయని పేర్కొన్నారు. ఇక అమీ మాజీ భర్త మైఖేల్ ముర్రే ఇంటి పనులన్నీ చేస్తారు. దీంతో పనిమనిషికి ఇవ్వాల్సిన 400 డాలర్లు ఆమెకు మిగిలిపోతున్నాయట. ఇక ఉద్యోగరీత్యా తరచుగా ప్రయాణాలు చేసే అమీ, 17 ఏళ్ల కాలం నాటి కారునే వాడతారు. డబ్బు పొదుపు చేసేందుకే తాను ఈ మార్గాలు ఎంచుకున్నానని, ఎవరు ఏమనుకున్నా తను అసలు పట్టించుకోనని ఆమె చెప్పుకొచ్చారు. అమీకి సంబంధించిన ఇంటర్వ్యూపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. -
నటుడు, అతడి ప్రియురాలు మృతి
లాస్‌వెగాస్: హాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. నటుడు గ్రెగొరీ టైరీ బోయ్స్(30), అతడి ప్రియురాలు నటాలీ అడెపోజు(27) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. లాస్వెగాపస్లోని గ్రెగొరీ టైరీ బోయ్స్ నివాసంలో వీరిద్దరి మృతదేహాలను గుర్తించారు. వీరు ఆత్మహత్య చేసుకున్నారా, మరేదైనా కారణం ఉందా అనేది తెలియరాలేదు. వీరిద్దరి మృతదేహాలు పక్కపక్కనే ఉన్నాయి. ఘటనా స్థలంలో పౌడర్ లాంటి తెల్లటి పదార్థం దొరికిటనట్టు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే ఇది క్రిమినల్ సంఘటన కాదని పోలీసులు పేర్కొన్నారు. టాక్సికాలజీ నివేదిక కోసం తాము ఎదురు చూస్తున్నామని తెలిపారు. వీరిద్దరూ ఏడాది కాలంగా కలిసివుంటున్నారని సమాచారం. బోయిస్‌కు పదేళ్ల కుమార్తె, అడెపోజుకు కొడుకు ఉన్నాడు. 2008లో వచ్చిన ట్విలైట్ సినిమాలో గ్రెగొరీ టైరీ బోయ్స్ తొలిసారిగా నటించాడు. ఈ సినిమాలో టైలర్ క్రౌలీ పాత్రలో అతడు కనిపించాడు. బోయిస్ మృతి పట్ల అతడి కుటుంబ సభ్యులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నన్ను ఎందుకు వదిలి వెళ్ళావు? అంటూ బోయిస్ తల్లి లిసా వేన్ తల్లడిల్లారు. బోయిస్, అడెపోజు వెస్ట్ కోస్ట్ రాపర్స్ పేరిట చికెన్ వింగ్స్ వ్యాపారాన్ని ప్రారంభించే పనిలో ఉన్నారని ఆమె వెల్లడించారు. బోయిస్ మృతి పట్ల ట్విలైట్ అభిమానులు సంతాపం తెల్పుతున్నారు. -
లాస్ వెగాస్ ‘అవతార్’ షో!
లాస్ వెగాస్: అమెరికాలోని లాస్ వెగాస్‌లో ‘2020 కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)’ అదరగొట్టే ఆవిష్కరణలతో అట్టహాసంగా ప్రారంభమైంది. పలు దిగ్గజ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సంస్థలు తమ కొంగొత్త ఉత్పత్తులను ఇందులో ప్రదర్శనకు ఉంచాయి. మెర్సిడెస్ బెంజ్ ’ఏఐ’ కాన్సెప్ట్ సూపర్ హిట్ హాలీవుడ్ సినిమా అవతార్ ప్రేరణతో రూపొందించిన ఏవీటీఆర్ కాన్సెప్ట్ కారును మెర్సిడెస్ బెంజ్ ఆవిష్కరించింది. పర్యావరణానికి చేటు చేయని విధంగా మనిషి, యంత్రాలు సమన్వయంతో జీవనం సాగించవచ్చని తెలియజెప్పే రీతిలో ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని డిజైన్ చేసింది. ఈ అటానమస్ వాహనంలో స్టీరింగ్ వీల్, పెడల్స్ వంటివి ఉండవు. సెంటర్ కన్సోల్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. బ్యాటరీ సహా ఇందులో అన్ని భాగాలను పూర్తిగా రీసైక్లబుల్ ఉత్పత్తులతో రూపొందించారు. హ్యుందాయ్ ఎయిర్ ట్యాక్సీ దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ కొత్తగా రూపొందిస్తున్న ఎయిర్ ట్యాక్సీలను ఎస్–ఏ1 పేరిట ఆవిష్కరించింది. విద్యుత్‌తో నడిచే ఈ ఎయిర్ ట్యాక్సీ గరిష్టంగా గంటకూ 290 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. సుమారు 100 కి.మీ. దూరంలో, అరగంట ప్రయాణం ఉండే ప్రాంతాలకు నడిపే ట్యాక్సీ సర్వీసుల కోసం వీటిని వినియోగించేందుకు హ్యుందాయ్తో ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ ఒప్పందం కుదుర్చుకుంది. శాంసంగ్ ‘డిజిటల్ అవతార్’ దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తాజాగా కృత్రిమ మేథతో (ఏఐ)తో పనిచేసే ‘డిజిటల్ మనిషి’(డిజిటల్ అవతార్)ని ఆవిష్కరించింది. ఇది అచ్చం మనుషుల్లాగే సంభా షించడం, భావాలను వ్యక్తపర్చడం వంటివి చేయగలదని సంస్థ పేర్కొంది. నియోన్ అనే ఈ టెక్నాలజీతో డిజిటల్ అవతార్లను సృష్టించవచ్చని, డిస్ప్లేలు లేదా వీడియో గేమ్స్‌లో ఉపయోగించవచ్చని శాంసంగ్ తెలిపింది. అవసరానికి తగ్గట్లుగా టీవీ యాంకర్లుగా, సినిమా నటులు, అధికార ప్రతినిధులుగా లేదా స్నేహితులుగానూ వీటిని తీర్చిదిద్దుకోవచ్చని సంస్థ పేర్కొంది. శాంసంగ్ డిజిటల్ మనిషి -
బెంజ్ కంపెనీ ‘అవతార్’ కారు లాంచ్
-
చిలీ సింగర్ అర్ధ నగ్నంగా....
-
చిలీ సింగర్ అర్ధ నగ్నంగా.......
చిలీలో మానవ హక్కులకు కాలరాసి ప్రజలను హింసిస్తున్న భద్రతా దళాలకు వ్యతిరేకంగా ప్రముఖ చిలీ–మెక్సికన్ గాయనీ మాన్ లఫ్తార్టే గురువారం నాడు లాస్ వెగాస్‌లో జరిగిన 20వ లాటిన్ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అర్ధనగ్నంగా నిరసన ప్రదర్శన జరిపారు. నిరసనగా గుర్తుగా నల్లటి ప్యాంట్, నల్లటి కోటు ధరించిన ఆమె రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వేదికపైకి ఎక్కి కోటును కిందకు జారవిడిచి తన వక్షోజాలను బయట పెట్టారు. తన చిలీ ప్రజలను హింసించి, రేప్ చేసి, చంపుతున్నారన్న మెడ మీదు నుంచి వక్షోజాల కింది వరకు రాసుకున్నారు. ఆ తర్వాత చిలీ ప్రజల పోరాటానికి మద్దతుగా ఆమె చిలీ కవి రాసిన కవిత్వాన్ని వినిపించారు. ఆ తర్వాత పోరాటానికి మద్దతుగా పాటను కూడా పాడి వినిపించారు. మాన్ లఫ్తార్టే తన పాటలకు వచ్చిన రెండో ‘గ్రామీ అవార్డు ట్రోపీ’ని అందుకోవడానికి అక్కడికి వెళ్లారు. ఆ తర్వాత ఆమె తెల్లటి గౌను ధరించి నవ్వుతూ ట్రోపీతో ప్రేక్షకుల ముందు కనిపించి ఆకట్టుకున్నారు. మంచి పింఛన్లు ఇవ్వాలంటూ మంచి ఆరోగ్య భద్రతను కల్పించాలంటూ, విద్యావకాశాలను పెంచాలంటూ లక్షలాది మంది చిలీ ప్రజలు వీధుల్లోకి వచ్చి గత కొంతకాలంగా నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. వారి ఆందోళనలను అణచి వేసేందుకు చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పియనెరా, అక్టోబర్ 19వ తేదీన దేశంలో అత్యయిక (ఎమర్జెన్సీ) పరిస్థితిని విధించారు. నాటి నుంచి చిలీ భద్రతా దళాలు ప్రజలను నిర్బంధించి హింసిస్తున్నాయి. కొంత మంది మహిళలను రేప్‌లు చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. భద్రతా దళాలు పేల్చిన పెల్లెట్స్ వల్ల నెల రోజుల్లో దాదాపు 200 మంది అంథులయ్యారు. -
ఫుట్‌పాత్‌లపై పడుకోవడం నేరం!
సాక్షి, న్యూఢిల్లీ : లాస్ వెగాస్ నగరంలో ఫుట్‌పాత్‌లపై ప్రజలెవరూ పడుకోకుండా నగర పాలక మండలి కొత్త చట్టం తీసుకొచ్చింది. రాత్రి. పగలు తేడా లేకుండా అన్ని వేళల్లో ఫుట్‌పాత్‌లపై టెంట్లు వేసుకొని గానీ, నిద్రపోతూ ఎవరైనా కనిపిస్తే దాన్ని నేరంగా పరిగణించి వెయ్యి డాలర్ల జరిమానా విధిస్తారు. అమెరికాలో ఇలాంటి చట్టాన్ని అమలు చేస్తున్న మొదటి నగరంగా కూడా లాస్ వెగాస్‌కు గుర్తింపు ఉంది. గతంలో బాయిస్, ఇదాహో నగరాలు ఇలాంటి చట్టాలను తీసుకరాగా అమెరికా సర్క్యూట్ కోర్టులు కొట్టివేశాయి. ఈసారి ఇక్కడ అలా జరగదని సిటీ అలార్నీ బ్రాడ్ జెర్బిక్ చెప్పారు. ‘ప్రభుత్వ షెల్టర్లలో పడకలు ఖాళీగా ఉన్నప్పుడు’ అనే క్లాజ్ చట్టంలో తీసుకొచ్చామని ఆయన తెలిపారు. పేద ప్రజలకు ఉద్దేశించిన ప్రభుత్వ షెల్టర్లలో పడకలు ఖాళీగా ఉంటున్నాయని కూడా ఆయన చెప్పారు. లాస్ వెగాస్‌లో పేద ప్రజలే కాకుండా, డ్రగ్స్‌కు అలవాటు పడిన వాళ్లు, ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లు ఫుట్‌పాత్‌లపై పడుకుంటున్నారు. నగరంలో అద్దెలు ఎక్కువ అవడం వల్ల కూడా చాలా మంది ఫుట్‌పాత్‌లను ఆశ్రయిస్తున్నారు. పర్యాటకుల రద్దీ ఎక్కువ ఉన్న చోట్ల ఈ చట్టాన్ని మినహాయించినట్లు అటార్నీ తెలిపారు. బుధవారం నాడే ఈ చట్టాన్ని తీసుకొచ్చిన నగర పాలక మండలి తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. వెయ్యి డాలర్లు కట్టలేని వాళ్లను జైళ్లకు పంపిస్తామని చెబుతున్నారుగానీ ఎన్ని రోజులు పంపిస్తారన్నది చట్టంలో స్పష్టంగా పేర్కొనలేదు. -
విమానంలో లైంగిక దాడి : భారతీయుడికి జైలు శిక్ష
న్యూయార్క్ : విమానంలో నిద్రిస్తున్న మహిళను లైంగికంగా వేధించిన భారతీయుడికి గురువారం తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ ఏడాది జనవరిలో స్పిరిట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో లాస్‌వెగాస్ నుంచి డెట్రాయిట్ వెళుతున్న ప్రభు రామమూర్తి తన పక్కనున్న 23 ఏళ్ల యువతి నిద్రిస్తుండగా అసభ్యకరంగా వ్యవహరించాడు. తాను మెలుకవ వచ్చి చూడగా నిందితుడు తన దుస్తులు తొలగించి తనను తాకరాని చోట తాకుతూ అమర్యాదకరంగా ప్రవర్తించాడని బాధితురాలు వెల్లడించారు. నిందితుడు తీవ్ర తప్పిదానికి పాల్పడినందున 11 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరగా, అమెరికా జిల్లా జడ్జి టెరెన్స్ బెర్గ్ 9 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతరులు ఈ తరహా నేరాలకు పాల్పడకుండా ఇలాంటి శిక్షలు ఉపకరిస్తాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఆగస్టులో న్యాయస్ధానం రామమూర్తిని దోషిగా తేల్చింది. జైలు శిక్ష పూర్తయిన అనంతరం రామమూర్తిని అమెరికా అధికారులు భారత్‌కు తరలిస్తారు. కాగా శిక్ష ఖరారు చేసే సమయంలో వృత్తిరీత్యా మోడల్ అయిన బాధితురాలు న్యాయస్ధానంలో మాట్లాడేందుకు నిరాకరించారు. ముందువరుసలో తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కూర్చుని తీర్పును వీక్షించారు. విచారణ సందర్భంగా ధైర్యంగా తనకు ఎదురైన లైంగిక వేధింపులను వివరించిన బాధితురాలిని అమెరికన్ అటార్నీ మ్యాథ్యూ స్కెండిర్ ప్రశంసించారు. విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు సురక్షితంగా ఉండే హక్కు ప్రతిఒక్కరికీ ఉందని పేర్కొన్నారు. 2015లో వర్క్ వీసాపై అమెరికా వచ్చిన రామమూర్తి తన భార్యతో కలిసి లాస్‌వెగాస్ విమానంలో డెట్రాయిట్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. -
వైరల్ : చాలా అరుదైన సంఘటన
వాషింగ్టన్ పోస్ట్ : పోగోట్టుకున్న వస్తువులను తిరిగి పొందడం చాలా చాలా కష్టం. పోయిన వస్తువు కాస్తా ఏ పర్సు లాంటిదో అయితే మరిక దాని గురించి మర్చిపోవాల్సిందే. ఒకవేళ అదృష్టం బాగుండి దొరికినా.. అందులో డబ్బులుండటం మాత్ర కల్ల. కానీ అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి మాత్రం వీటన్నింటికి కాస్తా భిన్నమైన అనుభవం ఎదురయ్యింది. పోయిన పర్సు దొరకడమేకాక.. దానిలో ఉన్న సొమ్ముకు మరికాస్తా జోడించి మరి చాలా భద్రంగా పార్శిల్ చేశాడు వివరాలు తెలియని ఓ వ్యక్తి. నమ్మడానికి కాస్తా కష్టంగా ఉన్నా ఇది మాత్రం వాస్తవం. వివరాలు.. హంటర్ షమత్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి లాస్ వెగాస్‌లో జరుగుతున్న తన సోదరి వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లాడు. అయితే తన పర్స్‌ను విమానంలోనే మర్చిపోయాడు. దానిలో 40 డాలర్ల సొమ్ముతో పాటు, 400 డాలర్ల విలువ చేసే చెక్, అన్నింటికంటే ముఖ్యమైన అతని ఐడీ కార్డ్ ఉన్నాయి. లాస్ వెగాస్‌లో దిగిన తరువాత తన పర్స్ మర్చిపోయినట్లు గుర్తించిన హంటర్ ఈ విషయం గురించి ఎయిర్‌లైన్స్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చాడు. కానీ ఎటువంటి లాభం లేకపోయింది. పెళ్లికెళ్లి బాగా ఎంజాయ్ చేయాలని భావించిన హంటర్.. తన పర్స్ పోగోట్టుకుని విషాదంలో మునిగి పోయాడు. కనీసం ఐడీ కార్డ్ దొరికిన బాగుండేదనుకున్నాడు హంటర్. ఎందుకంటే అది లేకపోతే అతని తిరిగి తన ఇంటికి వెళ్లలేడు. దాంతో ఈ విషయం గురించి తెగ ఆందోళన పడ్డాడు. వివాహనంతరం కుటుంబంతో కలిసి వెగాస్ నుంచి తన ఇళ్లు దక్షిణ డకోటాకు ప్రయాణమయ్యాడు హంటర్. ఎయిర్‌పోర్టులో దాదాపు ఓ గంటసేపు విచారించిన తరువాత ఎట్టకేలకు హంటర్ని లోనికి అనుమతించారు. గండం గడిచిందంటూ ఇంటికి చేరుకున్న హంటర్కోసం అప్పటికే ఓ సర్ఫ్రైజ్ ఎదరు చూస్తోంది. అదేంటంటే తాను విమానంలో పొగోట్టుకున్న పర్సు. హంటర్‌తో పాటే విమానంలో ప్రయాణించిన ఓ వ్యక్తి ఈ పర్సును గమనించి తిరిగి దాన్ని హంటర్‌కు చేర్చాడు. పర్సుతో పాటు ఓ ఉత్తరాన్ని కూడా పెట్టాడు సదరు వ్యక్తి. ‘హంటర్ ఈ పాటికే నువ్వు నీ పర్సు కోసం తెగ వెతికి ఉంటావని నాకు తెలుసు. ఈ పర్స్‌ని నువ్వు ఒమాహ నుంచి డెన్వర్‌కు ప్రయాణించిన విమానంలో.. 12 వరుసలో.. సీట్ ఎఫ్(F) వద్ద జారవిడుచుకున్నావ్. దీని కోసం నువ్వు వెతికి ఉంటావనే భావిస్తున్నాను. ఇక మీదటైన దీన్ని జాగ్రత్తగా ఉంచుకో ఆల్ ది బెస్ట్’ అంటూ హితవు పలికాడు. అంతేకాక పర్స్‌లో ఉన్న 40 డాలర్లకు మరో 60 డాలర్లను కలిపి మొత్తం 100 డాలర్లను హంటర్కిచ్చాడు. పర్స్ దొరికినందుకు గాను పార్టీ చేసుకునేదకు నేను మరి కొంత సొమ్మును ఇందులో ఉంచుతున్నానంటూ తెలిపాడు సదరు వ్యక్తి. పార్శల్‌ని చూసిన హంటర్ తొలుత నమ్మలేదు. కానీ తరువాతం సంతోషంతో ఉప్పొంగిపోయాడు. తనకు పార్శల్ పంపిన వ్యక్తి వివరాలు తెలుసుకునేందుకు హంటర్ ప్రయత్నం చేశాడు. కానీ లాభం లేకపోయింది. దాంతో తమకు సాయం చేసిన మంచి వ్యక్తి గురించి నలుగురికి తెలియాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు హంటర్ తల్లి. దాంతో ఈ విషయం కాస్తా వైరల్ అవ్వడమే కాక.. సదరు ఆగంతకుడికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
చనిపోయినా ఎన్నికల్లో గెలిచాడు
లాస్‌వేగాస్ : అమెరికాలోని నెవడాలో జరిగిన ఎన్నికల్లో గత నెల మరణించిన ఓ వ్యక్తి భారీ మెజార్టీతో గెలుపొందాడు. 36వ అసెంబ్లీ డిస్ట్రిక్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసిన వేశ్య గృహాల యజమాని, టీవీ రియాలిటీ షో స్టార్ డెన్నిస్ హోప్ (72) విజయం సాధించాడు. అయితే హోప్ గత నెల 16నే మరణించాడు. చనిపోయిన కొద్ది రోజుల ముందే ఆయన 72వ జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. హోప్ మరణించినా ప్రత్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థి లెసియా రామనోవ్పై భారీ ఆధిక్యం లభించింది. నెవడా చట్ట ప్రకారం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థి మరణించినా ఓటింగ్ జరుగుతుంది. ఒక వేళ చనిపోయిన వ్యక్తి గెలిస్తే .. ఆ పార్టీకి చెందిన మరో వ్యక్తితో ఆ స్థానాన్ని భర్తీ చేస్తారు. దీంతో అతని స్థానాన్ని మరొకరితో భర్తీ చేయాలని కౌంటీ అధికారులు రిపబ్లికన్ పార్టీకి సూచించారు. కేవలం ఈ రాష్ట్రంలోనే వ్యభిచారానికి అధికారికంగా అనుమతుండగా.. హోప్ 5 వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నాడు. హెచ్‌బీవో ఛానెల్ అడల్ట్ కంటెంట్ క్యాథ్హౌస్ సిరీస్‌లో కూడా హోప్ నటించాడు. ‘ది ఆర్ట్ ఆఫ్ ది పింప్’ , ది ఆర్ట్ ఆఫ్ ది డీల్’ పేరుతో పుస్తకాలు రాశాడు.