సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని లాస్ వేగాస్‌లో సంగీత విభావరిలో కాల్పులు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. సంగీత విభావరిలో పాల్గొన్నవారు లక్ష్యంగా సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతిచెందారు. దాదాపు 24 మందికి గాయాలయ్యాయి. దేశీయ సంగీత ఉత్సవంలో ఆనందంగా తేలిపోతున్న ఆహూతులను ఈ ఘటన ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. సాయుధుడి కాల్పుల మోతతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ప్రాణాలు దక్కించుకునేందుకు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. తీవ్ర భయోత్పాతాన్ని రేకెత్తించిన ఈ ఘటనపై టాలీవుడ్ యువహీరో నిఖిల్ సిద్ధార్థ్ ట్విట్టర్‌లో స్పందించాడు.
'ఓ మై గాడ్ లాస్ వేగాస్. ఆనందదాయకమైన నగరంలో ఇలా జరగడం భావ్యం కాదు. అమాయకులపై ఇలా కాల్పులకు తెగబడుతున్న రాక్షసులను అడ్డుకొని శిక్షించాలి' అని నిఖిల్ ట్వీట్ చేశాడు. 'వందలాది తుపాకీ గుళ్లు పేలాయి. లాస్ వేగాస్‌లోని ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాను' అని పేర్కొన్నాడు.
Omg Las Vegas... u city of happiness.. This isn't fair... monsters who r shooting like this at innocent ppl need to be stopped nd punished https://t.co/fbx3E09qZd
— Nikhil Siddhartha (@actor_Nikhil) 2 October 2017
Hundreds and hundreds of shots being fired.. Praying for everyone in Vegas tonight... https://t.co/bvRCk8oxON
— Nikhil Siddhartha (@actor_Nikhil) 2 October 2017