లాస్ వెగాస్: అమెరికాలోని కోర్టులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బెయిల్ నిరాకరించారన్న కోపంతో నిందితుడు తీర్పు చెబుతున్న జడ్జిమీదకు దూసుకెళ్లి దాడి చేశాడు. ఈ అనూహ్య పరిణామం లాస్ వెగాస్‌లోని కోర్టు హాలులో బుధవారం జరిగింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు కోర్టులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
యూఎస్ వార్తా పత్రిక న్యూయార్క్ పోస్టు ప్రచురించిన వివరాల ప్రకారం.. లాస్ వెగాస్‌లోని క్లార్క్ కౌంటీ డిస్ట్రిక్ కోర్టులో క్రిమినల్ కేసుపై విచారణ జరుగుతోంది. ఈ కేసులో నిందితుడు 30 ఏళ్ల డియోబ్రా రెడెన్‌కు బెయిల్ ఇచ్చేందుకు మహిళా జడ్జి మేరి కే హోల్ధస్ నిరాకరించారు. అతడిపై ఇప్పటికే అనేక కేసులు ఉన్న నేపథ్యంలో.. మళ్లీ మళ్లీ నేరం చేయకుండా సరైన శిక్ష పడాల్సిందేనని తెలిపారు. దీంతో రెచ్చిపోయిన నిందితుడు ఒక్కసారిగా జడ్జి బెంచ్ వద్దకు దూసుకొచ్చాడు. న్యాయమూర్తి వద్దకు దూకి దాడి చేశాడు. పిడికిలితో పదేపదే కొట్టడంతో సాయం కోసం ఆమె కేకలు వేసింది.
Man assaults judge in Las Vegas after probation request denied. pic.twitter.com/Vw5emstedD
— Great Clips (@Altaynova) January 3, 2024
ఆమె పక్కనే ఉన్న క్లర్క్, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి అతడిని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే నిందితుడి దాడిలో జడ్జి సహా ఆమె సహాయకుడికి స్పల్పంగా గాయాలయ్యాయి. ఇదంతా నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది. నిందితుడి చర్యతో అక్కడ భయానక పరిస్థితి ఏర్పడింది. అనంతరం నిందితుడిని అరెస్ట్‌చేసి అతడిపై కొత్త నేరారోపణలు మోపి జైలుకు తరలించారు.
A man attacked a Clark County judge in court today after she denied his probation. 😬 pic.twitter.com/CkJXj7Tc5a
— non aesthetic things (@PicturesFoIder) January 3, 2024
Comments
Please login to add a commentAdd a comment