
సరికొత్త టెక్నాలజీతో బీఎండబ్ల్యూ ఐ3 ఎలక్ట్రిక్ కార్
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ కంపెనీ సరికొత్త టెక్నాలజీతో ఐ3ఎలక్ట్రిక్ కార్ ప్రోటో టైప్‌ను అమెరికాలోని లాస్‌వేగాస్ ఆటోషోలో డిస్‌ప్లేకు ఉంచింది. 4 లేజర్ సెన్సార్స్, స్కానర్స్‌తో ఈ సిస్టమ్ వర్క్ చేసే విధంగా టెక్నాలజీని అఫ్‌గ్రేడ్ చేశారు. తనకు తానే ఆటో పార్కింగ్ చేసుకునేవిధంగా ఈ కారును రూపొందించారు. ఈ కారులో రూపొందించిన ఆక్టివ్ ఆసిస్ట్ టెక్నాలజీతో స్మార్ట్ వాచీ ద్వారా వెహికిల్‌ను కంట్రోల్ చేయవచ్చు.
అంతేకాదు యాక్సిడెంట్స్ కాకుండా ఉండే విధంగా సెన్సార్స్ ఏర్పాటు కూడా ఉంది. ఈ సెన్సార్స్ ద్వారా కారు 360 డిగ్రీలతో చుట్టూ పరిక్షించే విధంగా కెమెరాలు కూడా ఉన్నాయి. అంతేకాదు సెల్ప్ నెట్ కనెక్టివిటీ ద్వారా జిపిఎస్ సిస్టమ్తో రోడ్డుపైన ఉండే బ్యాంకులు, రెస్టారెంట్స్ వివరాలను కూడా క్షుణ్ణంగా తెలుసుకునే వీలును కల్పిస్తోంది బిఎమ్డబ్ల్యూలోని ఐ3 టెక్నాలజీ.