లాస్వెగాస్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టం ఫైనల్ రౌండ్ డిబేట్ హోరాహోరీగా సాగింది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్లు ఈ బిగ్ డిబేట్లో మాటలు తూటాలు పేల్చుకున్నారు. అమెరికాలోని మిలియన్ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రత్యర్థులకు ఇదే చివరి అవకాశం. దీంతో ప్రత్యర్థులిద్దరూ తమదైన శైలిలో దూసుకెళ్లారు. ఈ ఫైనల్ డిబేట్ కార్యక్రమంలో ట్రంప్, హిల్లరీలు కొన్ని కొన్ని సందర్భాల్లో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
ప్రధానంగా మహిళలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, రష్యాను సమర్థించిన విషయం, తన కంపెనీల్లో చైనా ఉద్యోగులను అధిక సంఖ్యలో నియమించుకోవడం, విదేశాంగ విధానం తదితరాలపై ప్రశ్నలు సంధించినప్పుడు ట్రంప్ కాస్త ఇబ్బంది పడగా, హిల్లరీ క్లింటన్ ఈ మెయిల్స్ వ్యవహారం, క్లింటన్ ఫౌండేషన్ నిధులు, రహస్య వ్యవహారాలు వంటి వాటిపై సమాధానం చెప్పినప్పుడు ఇద్దరూ కాస్త అసహనంగా కదిలారు. ఫైనల్ డిబేట్లో ప్రత్యర్థుల హామీలు, ఆరోపణలు కొన్ని...
జీడీపీపైన :
ట్రంప్ హామీలివీ.. అమెరికాలోనూ నేను ఉద్యోగవకాశాలను విపరీతంగా సృష్టిస్తాను. ప్రస్తుతమున్న జీడీపీని 1శాతం నుంచి 4శాతానికి తీసుకెళ్తా. ఆ శాతాన్ని 5 శాతం నుంచి 6 శాతానికి మేము పెంచగలమని నేను భావిస్తున్నా. మన ఉద్యోగాలను మళ్లీ వెనక్కి తీసుకురావడమే నా లక్ష్యం.
క్లింటన్ హామీలివీ.... కార్పొరేషన్లు న్యాయంగా వేతనాలు చెల్లించాలని మేము ఆదేశిస్తాం. ఆర్థికవేత్తలు నిరంతరం చర్చించే మిడిల్ అవుట్గ్రోత్ను మేము సాధిస్తాం. మధ్య తరగతి ప్రజలు వృద్ధిలోకి వస్తే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది.
అలెప్పోపై...
ట్రంప్ ఆరోపణలు.. అలెప్పో ఓ భయంకరమైన విపత్తు. ఏదైతే జరిగిందో అది చాలా విచారించదగినది. హిల్లరీ క్లింటన్ వల్లే అదంతా జరిగింది. ఆమె దానిలో తలదూర్చకుండా ఉంటే, అంతా మంచి జరిగి ఉండేది.
క్లింటన్ హామీలు... మేము లక్షల కొలది ప్రజలను సిరియాలనోనూ వదిలిపెట్టాం.మేము ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని చూస్తున్నాం. ఆ ఒప్పందం సిరియాకు సాయం చేయడానికి ఓ మంచి డీల్గా ఉండాలని భావిస్తున్నాం. అది రష్యా, సిరియా ఇరు దేశాల ప్రజలకు స్పష్టంగా అర్థమవ్వాలి.
ఐఎస్ఐఎస్పై...
ట్రంప్.. ఎప్పుడైతే క్లింటన్ వెళ్లిపోతారో, అప్పుడు ఆమెతోనే అన్నీ ఐఎస్ఐఎస్ కార్యచరణలు వైదొలుగుతాయి. మోసుల్ను ఐఎస్ఐఎస్ నుంచి మళ్లీ ఆధీనంలోకి తెచ్చుకోలుగుతాం.. మోసుల్ మళ్లీ ఇరాన్ స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి అమెరికా ప్రమేయం చాలా ప్రయోజనకరం.
క్లింటన్ ...ఇరాక్ ముట్టడిని ఆయన సమర్థించడం లేదని మరోసారి స్పష్టమైంది. కానీ మూలాల్లో పరిశీలిస్తే ట్రంప్ దాడులకు అనుకూలమంటూ తేలుతుందని ఆరోపించారు.
లైంగిక దుష్ఫచరణ ఆరోపణలపై...
ట్రంప్ : నేను మహిళలను గౌరవించినంతగా ఎవరూ గౌరవించలేరు.(ఈ మాటలతో డిబేట్లో పాల్గొన్న ప్రేక్షకులు ఓసారిగా గట్టిగా నవ్వారు). నాపై వచ్చిన లైంగిక ఆరోపణల కథనాలన్నీ అవాస్తవం. కనీసం నా భార్యకు కూడా క్షమాపణ చెప్పలేదు. ఎందుకంటే నేను తప్పేమీ చేయలేదు.
క్లింటన్ : మహిళలను అవమానించడం డోనాల్డ్ ట్రంప్ ఓ పెద్ద విజయంగా భావిస్తున్నారు. ట్రంప్ మహిళల కోసం ఏం చేశారో వింటూనే ఉన్నాం. పలువురు మహిళలు ఇప్పటికే ముందుకు వచ్చి ట్రంప్ చర్యలు గురించి వాపోతున్నారు. కనీసం వారికి ఆయన క్షమాపణ కూడా చెప్పలేదు.
ఉద్యోగాలపై :
ట్రంప్.. ఒకవేళ హిల్లరీ క్లింటన్ అధ్యక్షురాలు అయితే, దేశం గజిబిజి గందరగోళంలో పడిపోతుంది.
క్లింటన్.. ప్రస్తుత అధ్యక్షులు ఒబామా ఆర్థికవ్యవస్థను కాపాడినట్టు విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు.
ట్రంప్ : క్లింటన్ పన్నుల ప్రణాళిక ఓ విపత్తు. హిల్లరీ ప్రణాళిక కింద భారీగా పన్నులు పెరిగాయి. పన్నులు తగ్గించడానికి నేను కొత్త ఒప్పందాలను తీసుకొస్తా.
క్లింటన్ : ట్రంప్ ప్రణాళికేమిటో తెలుసా.. మరోసారి అమెరికాను ఆర్థిక సంక్షోభంలో సృష్టించడమే.
చివరి ప్రకటనలు:
క్లింటన్ .. మన దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడంలో ప్రతిఒక్కరి సహాయం మాకు అవసరం. చిన్నారులు, కుటుంబాల కోసం నా జీవితాంతం కృషిచేస్తా.
ట్రంప్...ఆఫ్రికన్ అమెరికన్లకు, లాటిన్లకు నా శాయాశక్తుల కృషి చేస్తా. అమెరికాను మళ్లీ గ్రేట్గా నిరూపిస్తా.