జపాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆటోమొబైల్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ప్రకటించింది. అదీ ప్రపంచంలో శరవేగంగా వృద్ధిచెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నట్లు పేర్కొంది.
ఇంతకాలం ఎంటర్‌టైన్‌మెంట్ రంగంతో అలరించిన సోనీ కంపెనీ.. ఇప్పుడు ఈవీ మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. అమెరికా లాస్‌వెగాస్‌లో బుధవారం నుంచి(జనవరి 5 నుంచి 8వ తేదీ వరకు) సీఈఎస్ టెక్నాలజీ ట్రేడ్ ఫెయిర్ జరగనుంది. ఈ నేపథ్యంలో న్యూస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన సోనీ గ్రూప్ చైర్మన్-ప్రెసిడెంట్ కెనిచిరో యోషిదా స్వయంగా ఈవీ ఎంట్రీ ప్రకటన చేశారు.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ఓ కొత్త కంపెనీతో ముందుకు రానున్నట్లు.. ఆ కంపెనీ పేరును ‘సోనీ మొబిలిటీ ఇన్‌కార్పోరేషన్’గా ప్రకటించారు. అంతేకాదు Vision-S 02 పేరుతో ఎస్‌యూవీల ప్రొటోటైప్‌ను సైతం ప్రదర్శించారు.
ఈ కంపెనీని ఆలస్యం చేయకుండా ఈ ఏడాదిలోనే లాంఛ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈవీ వెహికిల్స్ ప్రకటన తర్వాత సోనీ షేర్ల ధరలు 4 శాతం పెరిగాయి. ఇదిలా ఉంటే సోనీ ఇదివరకే తర్వాతి తరం వాహనాల తయారీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో ఆడియో, వినోదాత్మక వ్యవస్థలను అందిస్తోంది కూడా. ఇప్పటికే పలు టెక్ దిగ్గజ కంపెనీలు ఈవీ మార్కెట్ ప్రకటనలు చేయగా.. Sony ఏకంగా నమునా మోడల్స్‌ను ప్రదర్శించడంతో పాటు ఆలస్యం చేయకుండా Sony Ev కంపెనీ పనులు మొదలుపెడుతుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment