sony company
-
సోనీ సంచలన ప్రకటన.. ఇక ఈవీ కార్లు కూడా!
జపాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆటోమొబైల్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ప్రకటించింది. అదీ ప్రపంచంలో శరవేగంగా వృద్ధిచెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి అడుగుపెడుతున్నట్లు పేర్కొంది. ఇంతకాలం ఎంటర్టైన్మెంట్ రంగంతో అలరించిన సోనీ కంపెనీ.. ఇప్పుడు ఈవీ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. అమెరికా లాస్‌వెగాస్‌లో బుధవారం నుంచి(జనవరి 5 నుంచి 8వ తేదీ వరకు) సీఈఎస్ టెక్నాలజీ ట్రేడ్ ఫెయిర్ జరగనుంది. ఈ నేపథ్యంలో న్యూస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన సోనీ గ్రూప్ చైర్మన్-ప్రెసిడెంట్ కెనిచిరో యోషిదా స్వయంగా ఈవీ ఎంట్రీ ప్రకటన చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ఓ కొత్త కంపెనీతో ముందుకు రానున్నట్లు.. ఆ కంపెనీ పేరును ‘సోనీ మొబిలిటీ ఇన్కార్పోరేషన్’గా ప్రకటించారు. అంతేకాదు Vision-S 02 పేరుతో ఎస్‌యూవీల ప్రొటోటైప్‌ను సైతం ప్రదర్శించారు. ఈ కంపెనీని ఆలస్యం చేయకుండా ఈ ఏడాదిలోనే లాంఛ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈవీ వెహికిల్స్ ప్రకటన తర్వాత సోనీ షేర్ల ధరలు 4 శాతం పెరిగాయి. ఇదిలా ఉంటే సోనీ ఇదివరకే తర్వాతి తరం వాహనాల తయారీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో ఆడియో, వినోదాత్మక వ్యవస్థలను అందిస్తోంది కూడా. ఇప్పటికే పలు టెక్ దిగ్గజ కంపెనీలు ఈవీ మార్కెట్ ప్రకటనలు చేయగా.. Sony ఏకంగా నమునా మోడల్స్‌ను ప్రదర్శించడంతో పాటు ఆలస్యం చేయకుండా Sony Ev కంపెనీ పనులు మొదలుపెడుతుండడం విశేషం. చదవండి: కొత్త రకం టెస్ట్‌డ్రైవ్.. మన దేశంలోనే! -
అధిక డేటా.. మరింత వేగం
సాక్షి, అమరావతి: మరింత వేగంగా అధిక డేటాను అందించే విధంగా ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) బేసిక్ ప్లాన్‌లో మార్పులను చేసింది. ఇప్పటివరకు ప్రతి నెలా 100 జీబీగా ఉన్న డేటా వినియోగ సామర్థ్యాన్ని 150 జీబీకి పెంచడంతో పాటు ఇంటర్నెట్ వేగాన్ని 15 ఎంబీపీఎస్ నుంచి 20 ఎంబీపీఎస్‌కు పెంచినట్లు ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పి.గౌతమ్‌రెడ్డి ప్రకటించారు. విజయవాడలో ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రధాన కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వీటితో పాటు సోనీ గ్రూపునకు చెందిన స్పోర్ట్స్ చానల్స్, సీఎన్‌బీసీ, జీ గ్రూపునకు చెందిన మొత్తం 10 చానల్స్‌ను అదనంగా అందిస్తున్నట్లు తెలిపారు. కేబుల్ టీవీతో పాటు ఉచితంగా టెలీఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్న బేసిక్ ప్లాన్ చార్జీని రూ.300 నుంచి రూ.350కి సవరించినట్లు తెలిపారు. రూ.449, రూ.599 ప్లాన్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏపీఎస్ఎఫ్ఎల్ 9.2 లక్షల కనెక్షన్లను కలిగి ఉందని, వీటికి అదనంగా మరో 10 లక్షల కనెక్షన్లు అందించే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడం కోసం విశాఖ, విజయవాడ, తిరుపతిలలో సెట్‌టాప్ బాక్స్‌ల మరమ్మతుల కోసం సర్వీసు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం అక్రమాల కారణంగా నష్టాల్లోకి జారుకున్న సంస్థను తిరిగి లాభాల్లోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వం టెరా సాఫ్ట్ పేరుతో జరిపిన కుంభకోణంపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, ప్రస్తుతం ఈ కేసును సీఐడీ వేగంగా విచారణ జరుపుతోందని పేర్కొన్నారు. -
ఆపిల్, నైక్, సోని ఆఫీసుల మూసివేత
బ్రిటన్‌లో బుధవారం ఒక్క రోజే 36 కరోనా (కొవిడ్–19) వైరస్ కేసులు బయటపడ్డాయి. ఇక్కడ ఒక్క రోజే ఇంతమందికి వైరస్ సోకడం ఇదే మొదటిసారి. దీంతో అక్కడ ఇప్పటివరకు వైరస్ బాధితుల సంఖ్య 87కు పెరిగింది. అత్యంత ప్రమాదకరమైన ఈ వ్యాధి వల్ల మృత్యువాత పడే అవకాశం ఉందంటూ ఇంగ్లండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ క్రిస్ విట్టీ గురువారం దేశ పౌరులను హెచ్చరించారు. వైరస్ విస్తరించకుండా సరైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. (కరోనా దెబ్బకు కుప్పకూలిన ‘ఫ్లైబీ’) ఈ నేపథ్యంలో లండన్‌లోని తమ ప్రధాన కార్యాలయాలను నైక్, సోని పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ కంపెనీలు మూసివేశాయి. ఇంటి నుంచి పనిచేయాల్సిందిగా సోని కంపెనీ తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. బెల్ఫాస్ట్లోని ఆపిల్ స్టోర్‌లో ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో బుధవారం కార్యాలయాన్ని, ఆ కార్యాలయం ఉన్న మైఫేర్ భవనాన్ని పూర్తిగా శుద్ధి చేశారు. ఇవాళ్టి (గురువారం) నుంచి కొంతకాలంపాటు తమ స్టోర్‌ను మూసివేస్తున్నట్లు ఆపిల్ ప్రకటించింది. (అమెజాన్, ఫేస్‌బుక్‌కు కరోనా సెగ ) లండన్‌లోని డిలాయిట్ ఉద్యోగికి, గోల్డ్స్మిత్స్ యూనివర్శిటీలో ఓ విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్లు తాజా వార్తలు తెలియజేస్తున్నాయి. ఎవరైనా కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లయితే వారు వెంటనే సంబంధిత ఆస్పత్రిని సంప్రతించాలని, మొదటి రోజు నుంచే సిక్ లీవుకు పూర్తి వేతనాలు చెల్లిస్తామని కూడా బ్రిటన్ అధికారులు ప్రకటించారు. సాధారణంగా ఉద్యోగులు నాలుగు రోజులు జబ్బు పడితేనే నాలుగవ రోజు నుంచి మాత్రమే సిక్ లీవుకు చెల్లింపులు అమలు చేస్తారు. (పడకేసిన పర్యాటకం..కుదేలైన వాణిజ్యం) -
సోనీ సంచలన నిర్ణయం, యూజర్ల పరిస్థితేంటి?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో సోనీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది సోనీ మొబైల్స్. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ నుంచి వైదొలగుతున్నామంటూ సోని జపాన్ ఎలక్ట్రానిక్ మేజర్ సోనీ అనూహ్యంగా ప్రకటించింది. ఇక్కడి మార్కెట్లో నష్టాలు, ఇతర లాభదాయకమైన మార్కెట్లపై దృష్టి కేంద్రీకరించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోనీ తెలిపింది. 2020ను కంపెనీకి లాభాల ఆర్థిక సంవత్సరంగా మార్చుకోవాలని సోనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం నిర్వహణ వ్యయాలను 50 శాతం వరకు తగ్గించాలని చూస్తోంది. అలాగే 5జీసేవలను దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి మేము జపాన్, యూరప్, హాంగ్‌కాంగ్, తైవాన్ దేశాల్లో మార్కెట్‌ను పెంచుకునే దిశగా అడుగులు వేస్తామని, ఇప్పటికే సెంట్రల్, సౌత్ అమెరికాలో అమ్మకాలు నిలిపివేశామని, అదే విధంగా దక్షిణాసియా దేశాల్లో పరిస్థితులను బట్టి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తామని సోనీ తెలిపింది. భారత స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో ఉన్న పోటీ మరే ఇతర మార్కెట్లలో లేదంటే అతిశయోక్తికాదు. అయితే భారత్‌లో చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజాల హవా భారీగా నడుస్తోంది. వీటి దెబ్బకి శాంసంగ్, యాపిల్ లాంటి దిగ్గజాలు కూడా వణుకుతున్న పరిస్థితి. సోనీ లాంటి బ్రాండెడ్ కంపెనీలపై కూడా మరింత ప్రభావం పడుతోంది. ఈ పోటీలో నష్టాల పాలైన సోనీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. అంటే ఇక నుంచి భారత్‌లో సోనీ స్మార్ట్ ఫోన్లు వుండవు. సోనీ వినియోగదారుల పరిస్థితి ఏంటి? ఇప్పటికే తమ స్మార్ట్ ఫోన్‌ను వినియోగిస్తున్న వారికి మాత్రం కంపెనీ తరఫున సేవలు అందిస్తామంటూ దేశీయ సోనీ వినియోగదారులకు భారీ ఊరటనిచ్చింది. విక్రయాలు ఆపేసినా తమ ఫోన్లు వాడే యూజర్లకు సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. సాఫ్ట్వేర్ అప్‌డేషన్స్‌తో సహా అన్ని రకాలుగా వినియోగదారులకు అండగా ఉంటామని తెలిపింది. కాగా ఆర్థిక సంవత్సరం ముగింపు మార్చి నాటికి సోనీ మొబైల్స్ 97.1 బిలియన్ యెన్ (879.45 డాలర్లు) నష్టపోయింది. అదే సమయంలో ఆపిల్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ లాభాల్లో ఉన్నాయి. -
పండుగ అమ్మకాల్లో 25% వృద్ధి!
సోనీ ఇండియా ఎండీ కెనిచిరో హిబి సాక్షి, విశాఖపట్నం: ఈ పండుగల సీజన్లో గత ఏడాదితో పోలిస్తే అమ్మకాల్లో 25 శాతం వృద్ధిని సాధిస్తామని సోనీ సంస్థ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. గత సంవత్సరం ఆగస్టు నుంచి నవంబర్ వరకు పండుగల సీజన్లో దేశవ్యాప్తంగా రూ.325 కోట్ల విలువైన సోనీ ఉత్పత్తుల్ని విక్రయించినట్లు సంస్థ ఇండియా ఎండీ కెనిచిరో హిబి చెప్పారు. 2016 ఆర్థిక సంవత్సరం మొత్తమ్మీద 20 శాతం వృద్ధి సాధించినట్టు చెప్పరాయన. గురువారం రాత్రి విశాఖ శంకరమఠం రోడ్డులోని సోనీ షోరూమ్‌ను ఆయన సందర్శించి... విలేకరులతో మాట్లాడారు. ఈ సీజన్లో తమ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లతో పాటు తేలికపాటి రుణ సదుపాయాన్ని కూడా కల్పించామని, ఈ ఆఫర్లు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 19 వరకు కొనసాగుతాయని కెనిచిరో హిబి తెలియజేశారు. సోనీ సంస్థకు ఆంధ్రప్రదేశ్ అత్యంత కీలకమైనదంటూ... ఏపీలోని విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాలు తమకు కీలమన్నారు. దేశవ్యాప్తంగా తమ కు 12 వేలకు పైగా డీలర్లు, పంపిణీదార్లు, 250కి పైగా ఎక్స్‌క్లూజివ్ అవుట్లెట్లు, 349 సర్వీస్ అవుట్లెట్లు ఉన్నట్లు తెలియజేశారు. తమ సంస్థ మొబైల్ ఫోన్ల వ్యాపారం కూడా పెరుగుతోందన్నారు. జీఎస్టీ వల్ల తమకు సానుకూల ఫలితా లే వస్తున్నాయని, రికవరీ శాతం కూడా పెరిగిందని చెప్పారాయన. విలేకరుల సమావేశంలో విశాఖ షోరూం మేనేజింగ్ పార్టనర్లు జగదీష్, చైతన్య, బ్రాంచి హెడ్ సంగమేష్ తదితరులు పాల్గొన్నారు. -
టోక్యోలో ఐటీ సంస్థలతో మంత్రి పల్లె భేటీ
సాక్షి, హైదరాబాద్: జపాన్ రాజధాని టోక్యో పర్యటనకు వెళ్లిన ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గురువారం పలు సంస్థల ప్రతినిధులను కలిశారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ సోనీ కంపెనీ ప్రతినిధి బృందం మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా రాష్ర్టంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి గల అవకాశాలను అధికారులు వివరించారు. నవ్యాంధ్రలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అపార అవకాశాలున్నాయని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలిపారు. దీంతో సోనీ ప్రతినిధులు రాష్ట్రంలో తమ కార్యకలాపాలను విస్తరింపచేసేందుకు సానుకూలతను వ్యక్తం చేశారు. ఎన్టీటీ డాటా, బీపీవో, టెలికమ్యూనికేషన్ వంటి ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులతోనూ ఆయన భేటీ అయ్యారు. విశాఖపట్నంలో తమ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆయా సంస్థలు పేర్కొన్నాయి. టోక్యోలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఐటీ వారం, ప్రదర్శనను పలు కంపెనీల ప్రతినిధులు సందర్శించినట్లు సమాచార శాఖ మంత్రి పీఆర్వో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
సోనీ కంపెనీకి ఏపీ ప్రభుత్వం ఆహ్వానం
జపాన్: విదేశాల్లో కంపెనీల పెట్టుబడులను తెలుగు రాష్ట్రాలకు ఆహ్వానించే క్రమంలో ఉభయ రాష్ట్రాల నేతలు తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ , తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లు అమెరికా పర్యటనలో ఉండగా.. ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి జపాన్ లో పర్యటిస్తున్నారు. టోక్యోలోని సోని కంపెనీని సందర్శించిన పల్లె,, ఆ సంస్థ వైస్ చైర్మన్ కాంబేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీని కాంబేకు మంత్రి వివరించారు. ఏపీలో పెట్టుబడులు పెడితే ప్రభుత్వం పూర్తిగా తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఆయనకు పల్లె స్పష్టం చేశారు. -
పదహారేళ్ల పెంపకం
సాంకేతికత జపాన్ ప్రజల్లో ఎంతగా భాగమైందో తెలుసుకోవాలంటే ఈ దృశ్యాన్ని పరిశీలిస్తే చాలు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో పిల్లినో, కుక్కపిల్లనో పెంచుకోవడం జరుగుతుంది. అయితే జపాన్ జనులు మాత్రం జంతువులతో గాక యంత్రాలతోనే సావాసం చేస్తున్నారు. 1999లో సోనీ కంపెనీ వాళ్లు పెంపుడు రోబోలను తయారుచేసి మార్కెట్లోకి వదిలారు. చిత్రంలో కనిపిస్తున్నది అలాంటి వాటిలో ఒకటి. దానికి ‘ఐబో’ అనే పేరు పెట్టుకొని పెంచుకొంటున్నావిడ పేరు హిడేకోమోరీ. దాదాపు పదహారేళ్ల నుంచి ఆమె దాన్ని ఆడిస్తూ.. దాంతో ఆడుకొంటూ వినోదాన్ని పొందుతోంది!