పదహారేళ్ల పెంపకం
సాంకేతికత జపాన్ ప్రజల్లో ఎంతగా భాగమైందో తెలుసుకోవాలంటే ఈ దృశ్యాన్ని పరిశీలిస్తే చాలు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో పిల్లినో, కుక్కపిల్లనో పెంచుకోవడం జరుగుతుంది. అయితే జపాన్ జనులు మాత్రం జంతువులతో గాక యంత్రాలతోనే సావాసం చేస్తున్నారు. 1999లో సోనీ కంపెనీ వాళ్లు పెంపుడు రోబోలను తయారుచేసి మార్కెట్‌లోకి వదిలారు. చిత్రంలో కనిపిస్తున్నది అలాంటి వాటిలో ఒకటి. దానికి ‘ఐబో’ అనే పేరు పెట్టుకొని పెంచుకొంటున్నావిడ పేరు హిడేకోమోరీ. దాదాపు పదహారేళ్ల నుంచి ఆమె దాన్ని ఆడిస్తూ.. దాంతో ఆడుకొంటూ వినోదాన్ని పొందుతోంది!