
ఒకవైపు కరోనా కేసులు పెరిగిపోతున్నా... మరోవైపు జపాన్ ప్రజలు నిరసనలు చేస్తున్నా... టోక్యో ఒలింపిక్స్ క్రీడలు ఆగిపోవని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధికార ప్రతినిధి మార్క్ ఆడమ్స్ స్పష్టం చేశాడు. ‘మీకు మరోసారి స్పష్టంగా చెబుతున్నా. టోక్యో గేమ్స్ ఈ ఏడాది జరిగేలా ఐఓసీ ఇప్పటికే తీర్మానం చేసింది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు’ అని ఆడమ్స్ వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment